Showing posts with label ఇస్లాం. Show all posts
Showing posts with label ఇస్లాం. Show all posts

Sunday, January 21, 2018

మత మార్పిడిలో క్రైస్తవమంతగా ఇస్లాం ప్రలోభాలకు గురిచేసిన దాఖలాలు ఉన్నాయంటారా?

https://www.facebook.com/vallury.sarma/posts/511113652259386

Question of Nandiraju Radhakrishna garu : మత మార్పిడిలో క్రైస్తవమంతగా ఇస్లాం ప్రలోభాలకు గురిచేసిన దాఖలాలు ఉన్నాయంటారా?

Reply: క్రైస్తవ మతవ్యాప్తికి ఇస్లాం మత వ్యాప్తికీ కొన్ని పోలికలు, కొన్ని భేదాలు ఉన్నాయి. ఇస్లాం మతం వలెనే, క్రైస్తవ మతం కూడా రాజకీయ బలంతోటే, ఖడ్గ శక్తి తోటే మధ్యయుగాల వరకు వ్యాప్తిచెందినది. పోప్ మొదట్లో రాజకీయ శక్తియే. దాని ప్రతిఘటన మార్టిన్ లూథర్ నాయకత్వంలో 16వ శతాబ్ద ప్రారంభంలో జరిగినది. పోప్ యొక్క అధికారం కాథొలిక్కులకే పరిమితమైనది.ఇంగ్లండ్, స్విట్జర్లాండ్ వంటిదేశాలలోని చర్చిలు కూడా రోమ్నుండి బయటకు వచ్చాయి.రాజకీయ బలంతో దండయాత్రలతో క్రైస్తవమతం వ్యాపింపచేసినది స్పెయిన్. ఇది దక్షిణ, మధ్య అమెరికాల్లో జరిగింది. అక్కడ ఉన్న ఇన్కా, మాయా, యజ్ టెక్ నాగరికతలను, మతాలనూ ధ్వంసం చేసినఘనత స్పెయిన్ దేశానికి, రోమన్ కాథొలిక్ మతానికీ చెందుతుంది.ప్రపంచమంతా ఐరోపావాసుల చేతికి రావడం, పారిశ్రామిక విప్లవం, వ్యాపార దృక్పథం, అర్థశాస్త్ర ఆవిష్కరణను క్రైస్తవ చర్చి వ్యవస్థ ఉపయోగించుకుంది.ప్రలోభాలతో, ప్రచారంతో వ్యాప్తిచెందే శక్తిగా ప్రపంచ క్రైస్తవ సంఘాలు ఎదిగాయి. చర్చి ఒక మల్టీ నేషనల్ వ్యవస్థ.మత ప్రచారం అంతిమ లక్ష్యంగా అది ఆరోగ్యం, విద్య, సమాజ సేవ వంటి రంగాలలో దిగింది. మార్కెటింగ్, ప్రచారంతో మతాన్నీ, దేవుణ్ణీ అంగట్లో పెట్టవచ్చు అనే సత్యాన్ని నిరూపించింది. వారిది దీర్ఘకాలిక ప్రణాళిక.
The Petro-dollars of Gulf countries gave similar opportunity to the spread of Islam to some extent.

మరి మన లాంటి పేద దేశాలలొ మతస్థులను డబ్బు తో కొనుక్కుంటున్నారు కదా! మరి వెస్ట్ లో చాలా మంది క్రైస్తవాన్ని వదలి నాస్తికులు అవుతున్నారు లేదా ఇస్లాం ని స్వీకరిస్తున్నారు ? వీటికి కారణాలు ఏమి వుండవచ్చు?
జవాబు - క్రైస్తవమతం వేరు చర్చి వ్యవస్థ వేరు. చర్చిని వదిలేస్తే క్రీస్తునీ, దేవుణ్ణీ వదిలేసినట్లు కాదు. వారికి అన్నివిధాలా సారూప్యమైన, సామీప్యమైన మతం, అదే మూలాలు కల ఇస్లాం. విశ్వాసాలు ఒకలాంటివే. హేతువాదం, వైజ్ఞానిక దృష్టి ఉంటే సహజంగా నాస్తికత్వం వైపో, చాలా సనాతనమూ,ముక్తిదాయకము ఐన బౌద్ధం వైపో వెళ్తారు. ఇదే ప్రస్తుతం జరుగుతున్న కథ.

The Structure of the Universe (Vedic) - Viswaroopa - K. Sivananda Murty Preface 2

https://www.facebook.com/vallury.sarma/posts/616984388338978 The Puranas speak of individuals going up and down between these proximate...