https://www.facebook.com/vallury.sarma/posts/510442595659825
శివయోగి శివాచార్యుని సిద్ధాంత శిఖామణి మొదటి శ్లోకం చూదాం. దీని వివరణ వీరశైవ సిద్ధాంత అవగాహనకు తోడ్పడుతుంది
ఓం నమః శివాయ
శ్రీ జగద్గురు పంచాచార్యా ప్రసీదంతు
త్రైలోక్య సంపదాలేఖ్య సముల్లేఖన భిత్తయే,
సచ్చిదానంద రూపాయ శివాయ బ్రహ్మణే నమః.
. శివునికి ఐదు ముఖాలు - సద్యోజాత, వామదేవ, అఘోర, తత్పురుష, ఈశాన. ఈ ఐదుగురి అంశలలో ఉద్భవించినవారు పంచాచార్యులు. వారు చారిత్రక వ్యక్తులో, కాదో తెలియదు. స్వయంభువులుగా చెప్పబడుతారు. వారిపేర్లు రేణుకాచార్య, మరుళారాధ్య, ఏకోరామారాధ్య, పండితారాధ్య, విశ్వారాధ్య అనేవారు.వారి అనుగ్రహాన్ని కోరుదాం. ఈ సిద్ధాంత శిఖామణి రేణుకాచార్య, అగస్త్య సంవాదంగా చెప్పబడుతుంది. ఈ వీరశైవ సామ్రాజ్యానికి ఐదు ముఖ్య పీఠాలున్నాయి. వానిని మొదట పాలించినది పంచాచార్యులు. అవి బాళేహెణ్ణూరు, ఉజ్జయిని (ఉజ్జిని)(కర్ణాటక), కేదారనాథ్ (ఉత్తరాఖండ్) , శ్రీశైలం, కాశీ.
మొదటి శ్లోకం మంగళాచరణం. అందులోనే తత్త్వం నిక్షిప్తమైఉంది. భిత్తి అంటే గోడ. అంటే పరమేశ్వరుణ్ణి ఒక గోడతో పోలుస్తున్నాడు. ఆ గోడ మీద రచింపబడినది (చిత్రించబడినది) త్రైలోక్యసంపదగా చెప్పబడే జగత్తు. ఆగోడ శాశ్వతం, దానిమీద చిత్రాలు మాత్రం కాలగమనంతో మారిపోతూ ఉంటాయి. కాని ఆగోడ సాక్షిగా, నిర్లిప్తంగా, శాశ్వతంగా ఉండనే ఉంటుంది. గోడలేక పోతే చిత్రమేలేదు. సంపద అంటే ఐశ్వర్యం. ఐశ్వర్యం ఈశ్వరలక్షణం. జగత్తులోని త్రిలోకాలే సంపద. అద్వైతులు జగత్తు మిథ్య అంటారు. సత్ పదార్థామైన ఈశ్వరుడు సత్యమైతే ఆయన సృష్టించి, సర్వదా వ్యాపించిఉన్న జగత్తు అసత్యము, మిథ్య ఎలాగ అవుతుందని శైవుల వాదం. పరమేశ్వరుడు ఒక గోడవలే స్థాణువుకాదు. శక్తితోకూడిన చైతన్య స్వరూపుడు. చైతన్య స్వరూపమే సచ్చిదానందము అవుతుందని రెండవ పాదములో నిరూపింపబడుతూంది.
సత్ అనేది శాశ్వతమైన ఉనికిని సూచించే పదము. ఆ ఉనికి ఎలా తెలుస్తుంది? చిత్ (చిత్తము వలన). ఇంద్రియాలు, మనస్సు ఈ చిత్ కి ఈ ఉనికికి సంబంధించిన జ్ఞానాన్ని ఇస్తాయి. చిత్ ఉంటేనే ఆనందము. లోకంలో ఉండగలగడమే ఆనందం. అనంతమైన సచ్చిదానంద స్వరూపమే ఈశ్వరుడు. ఈ సందర్భాన్నే రమణమహర్షి సినిమాతెరమీద చలనచిత్రంతో పోలుస్తారు. మరిదుఃఖమో. అదితెరమీద పాత్రలది. జీవుడు శరీరాన్ని తాను అనుకోవడం వలన క్షణికమైన సుఖ దుఃఖాల అనుభవం ఊహించుకుంటాడు. తెరకు దీనితో సంబంధం లేదు. ఈ కాలంలో మనం Facebook Wall కూడా ఉపమానంగా తీసుకోవచ్చును. జీవుడు శివోహం అనేస్థితికి వస్తే అంతా ఆనందమే, దుఃఖం దరికిజేరదు. ఈ చిత్ అనేది పరమేశ్వరుని శక్తి. జీవునికికూడా చిత్తము ఉంటుంది. కాని నిద్రపోయినపుడు అది పనిచేయుటలేదు. జీవుని శక్తి పరిమితము. పరమేశ్వరుని చిచ్ఛక్తి అపరిమితము. అదియే ఆది పరా శక్తి. సచ్చిదానంద స్వరూపుడు, పరబ్రహ్మ తత్త్వ స్వరూపుడు, ఐన శివునికి నమస్కారము అనిచెబుతుంది ఈశ్లోకం. శైవులది యోగ మార్గం. మూలాధారస్థితుడైన గణపతినుండి ప్రారంభించి, కుండలినిజాగృతిపొంది చేసే సాధనా మార్గమే యోగము. (ఆధారం - సద్గురు శివానందమూర్తిగారి ప్రవచనం.)
https://www.facebook.com/vallury.sarma/posts/510869712283780

శైవ మతంలో శివ పంచాక్షరీ మంత్రాన్ని దేవీస్వరూపంగా భావిస్తారు: "ఓంకార వదనా దేవీ, వా య కార భుజద్వయీ, శికార దేహ మధ్యా, న మ కార పద ద్వయీ, పంచాక్షరీ పరావిద్యా.." మంత్రం దేవీస్వరూపం. తదర్థం పరమేశ్వరుడు.
శివాయ నమః, శివాయైనమః, శివాభ్యాం నమః
శివాయ నమః, శివాయైనమః, శివాభ్యాం నమః
తెలుగువారి చరిత్రలో ఒకముఖ్యఘట్టం కాకతీయ సామ్రాజ్యం. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ప్రాంతాన్ని ఒకతాటిమీదకు తెచ్చినది. ప్రభువులది శైవమతమైనా అందరినీ సమానంగా చూచినది. సా.శ. 1000 నుండి 1323 వరకు సుమారు పదితరాల ప్రభువుల ధర్మ పాలనను అందించింది. వారి కేంద్రము వరంగల్ల్లు అనిచెప్పుకున్నాము. వారి కథ నేటి మహారాష్ట్రలోని నాందేడ్ నుండి ప్రారంభం నాందేడ్ బీదర్కు 140కి.మీ, హైదరాబాదుకు 280కి.మీ. తరువాత ఒకనాడు నాందేడ్ ఔరంగజేబు సామ్రాజ్యంలో తెలంగాణా జిల్లాకు రాజధాని. ఈ జిల్లాలోని మహూర్, గోదావరీ తీరంలోని రేణుకాదేవి శక్తి పీఠం. ఇది శతాబ్దాల చరిత్రగల నగరం. మౌర్యుల కాలంనాటికే ఉన్నది. పూర్వపు పేరు నందితటం. ఆంధ్ర భృత్యవంశం, శాతవాహనవంశం పరిపాలించిన చోటు. సిఖ్ఖుల ఆఖరిగురువు గురుగోవిందసింగ్ మరణించినచోటు.ఆతరువాత నైజాం రాష్ట్రంలోనికి వచ్చినది.నాందేడ్ జిల్లాలోని కంధర్ దుర్గం రాష్ట్రకూట ప్రభువుకోట. తరువాత చాళుక్యపాలనలోకి వచ్చింది. అదే కాకతిపురం. కాకతి అక్కడ దేవత. తరువాత వారి సామంతులు కాకతీయ వంశం వారు. వారు ఆదిలాబాద్ వరకు పాలించారు. వారి వంశస్థుడైన మొదటిబేతరాజు హనుమకొండ పాలకునిగా నియమించబడ్డాడు. ఇతడికుమారుడు ప్రోలరాజు -1 సామ్రాజ్యాన్ని విస్తరింపచేశాడు. ఇతనికుమారుడు రుద్రదేవుడు, చాళుక్యులు బలహీనమవడంతో వీరు స్వతంత్రులయ్యారు. ఈ కాకతియే జైనదేవత యక్షేశ్వరి. హనుమకొండలోని ఇప్పటి దేవీ ఆలయం (పద్మాక్షి ఆలయం) మొదట జైన ఆలయమని చెబుతారు. కాకతీయవంశ పాలనా కాలంలోనే కాకతీయ ప్రభువుల వంశానికే చెందిన మనుమసిద్ధి నెల్లూరు పాలకుడు. ఆయన ఆస్థాన కవి తిక్కన నన్నయ వద్ద ఆగిన భారత రచన ఈయన 15 పర్వాలు పూర్తి చేశాడు.
Suryanarayana Murthy Dharmala సర్వ శుభములను, విభూతి(ఐశ్వర్యము)ని ప్రసాదించగలిగే, సకల నిష్కల(సగుణనిర్గుణ)ములుగా అర్చించబడే ఏకైక దేవతా మూర్తి శివుడు. నాకు అట్టి పరమ ప్రీతికరమైన పరమేశ్వరునియొక్క దేవీరస్వరూపమును కూడ తెలియపరచినందులకు సర్వథా శతథా కృతజ్ఞుడను. మీకు అనుజులు నాకు ప్రాణ స్నేహితులు ఐన వల్లూరి సీతారామారావుగారు నేను ఒక సందర్భములో ఈ దేవీస్వరూపమును గూర్చి ప్రస్తావించుకొనుట జరిగినది. మీ పోస్టులు చదువుతూ ఉంటే సీతారామారావుతో ప్రత్యక్షంగా మాట్లాడుతున్నట్టే అనిపిస్తుంది. మీద్వారా కూడ అతను నాకు పదే పదే గుర్తుకురావడం విశేషం. ధన్యోస్మి.
Koundinya Raghavan Knowing the history is the need of hour.Thank you sir for doing good service.Guruji always insists us to read history.
Vvs Sarma I was trying to write historical essays as the history of Sanatana Dharma. I ran into criticism when I went into the phase of Ghazni, to Aurangzeb and discontinued the writing then.Koundinya Raghavan Please continue.It is must for hindus to know the real history.