Showing posts with label Cosmologies. Show all posts
Showing posts with label Cosmologies. Show all posts

Thursday, January 25, 2018

On Cosmologies – New Series – 10


V V S Sarma
నరకములు
ఇట్లు అధోలోకములను గురించి వివరించిన శ్రీశుక మహర్షి, పరీక్షిత్తుని, మహారాజా, ఇక ఏమి చెప్పను? అని అడుగుతాడు. జంతుజాలముల శ్రద్ధలు త్రిగుణాత్మకములు గావున ఆయా జీవులు కర్మ వశముగా అనేకజన్మలలో వేర్వేరు లోకములలో సంచరిస్తారు. అధోలోకములలో సుఖాపేక్ష, భోగలాలసత ఉంటాయి కాని మోక్ష విచారము ఉండదు. జీవులకు ఎక్కువగా ఆసురీసంపత్తి ఉంటుంది. అధర్మ వర్తన గల జీవుల కర్మఫలము కూడా విపరీతముగానే ఉంటుంది. అధర్మ వర్తన వలన, కామాది వికారముల వలన కలిగిన కర్మ ఫలములను నీకు వివరిస్తాను. --- శుకునితోఁ బరీక్షిన్నరేంద్రుం డి ట్లనియె.
“మునివరేణ్య! నరకములు ముజ్జగంబుల
యందొ? యంతరాళమందొ? వెలినొ?
యదియుఁ గాక దేశమందుండు భూవిశే
షముల యందొ? తెలుపు సంతసమున." ------------- (భాగవతము)
దానికి శుకుడు ఇలా బదులుచెబుతాడు. "రాజా మూడులోకములకు అవతల భూమ్యాకాశాల మధ్యన దక్షిణదిశలో ఈ నరకాలు ఉంటాయి. అంటే భూలోకానికి ద్యులోకానికి మధ్యాంతరాళంలో యమలోకానికి సమీపముగా దక్షిణ దిశను నరకములుంటాయి. ఆగ్నిష్వత్తాది పితృ గణములుండే పితృలోకము కూడా దక్షిణ దిశలోనే ఉంటుంది. దాని అధిపతికూడా యముడే. అతడు తనవద్దకు వచ్చిన జీవుల పాపకర్మలకు వానికి తగినఫలములనిచ్చి శిక్షిస్తాడు. ప్రధానముగా 21 నరకములను చెబుతారు - వాటిలో కొన్నిటి పేర్లు తామిస్రము, అంధతామిస్రము, రౌరవము, మహారౌరవము, కుంభీపాకము, కాల సూత్రము, అసిపత్రవనము, సూకరముఖము, అంధకూపము, వైతరిణి, క్రిమిభోజనము,మొదలైనవి, అలాగే సూచీముఖము వంటి మరొక ఏడు మొత్తము 28 నరకముల పేర్లు భాగవతము చెబుతున్నది. కలియుగంలో అధిక సంఖ్యాకులకు ఇదేమార్గముగా కనుపిస్తుంది. ఈ పేర్లు అక్కడ శిక్షల ప్రాతిపదికగా కనుపిస్తాయి. కుంభీపాకం అంటే వంటపాత్రలో ఉడికించుట - అంత దుఃఖాన్ని కలిగించే నరకం, రౌరవం అంటే వేదనతో దుఃఖంతో ఆర్తనాదాలుచేసే నరకం, సూచీముఖం అంటే సూదులతో గుచ్చి ఏడిపించే నరకం - మృత్యుబాధ వేయి వృశ్చికములు ఒకేసారి కుట్టినట్లు ఉంటుందట. దానికి వాచవి ముందే లభిస్తుంది. ఆసుపత్రి ICU లో భూమిమీదే అనుభవానికి వస్తుంది.

On Cosmologies – New Series – 9 Avataaram involves - avatarati - that is coming down.

https://www.facebook.com/vallury.sarma/posts/599076406796443

On Cosmologies – New Series – 9
V V S Sarma
శ్రీకృష్ణచరిత్రములో విష్ణువు దశావతారములలో శ్రీకృష్ణుడు ఉన్నాడా? అనే వివాదం ఉన్నది. రామో రామశ్చ రామశ్చ - అనివాడుక. శ్రీరాముడు, పరశురాముడు, బలరాముడు అని అర్థం. శ్రీకృష్ణుడు సకల దేవతాత్మయైన పరమాత్ముడే.
బలరామావతార సమాప్తిలో బలరాముడు అనంతునిలో ఐక్యమవడం భాగవతములోను, భారతములోనూ కనుపిస్తుంది. భాగవతంలో క్లుప్తముగా చెప్పబడినది ఏకాదశ స్కంధములో "నీలాంబరుడైన బలరాముడు యోగమార్గమున అనంతుని కలసె" అని ఉంటుంది. మహాభారత మౌసలపర్వంలో అనంతుని నాగలోక ప్రస్థానం విపులముగా ఉన్నది.
తదనంతరంబ యద్దామోదరుడు రాము
వదన సరోజంబు వదల నెడల
గనియె మహాభుజంగము నరుణచ్ఛాయ
మైపొల్చు వక్త్ర సహస్రకంబు
మణుల వెలిగెడి ఫలంబులు దెలుపారి
పర్వత భోగ నిభంబునైన
మేలిపెంపుగలదాని పట్లా బల
భద్రుండు నిజయోగ బలముపేర్మి
దనదు తనువు విడిచి చనియె వియద్వీధి
నంబునిధికి నమ్మహాత్మునెదురు
కొనియె వరుణు డధిక నీయమంబుతో నాగ
కులములెల్ల వచ్చె కొలచె భక్తి ---- (మహాభారతము, మౌసల పర్వము)
బలరాముని నిర్వాణ సమయంలో ఆయన తనువు విడువ గానే ఆయన ముఖమునుండి వేయిపడగల మహాభుజంగము ఆకాశ మార్గమున సముద్రమునకు వేడలినది. వరుణుడు మర్యాదపూర్వకముగా ఆయనకు ఎదురువచ్చి స్వాగతం పలికాడు. అహికులాగ్రణ్యుడైన వాసుకి అన్య నాగ ప్రముఖులు ఆయనను ఆహ్వానించారు. (బలరాముని నిర్వాణ స్థానము ప్రభాస తీర్థము (సోమనాథ్) సమీఫములోని వేరవల్.) భూమి మీద సర్ప జాతికి ఇవి దేవతలు. అందుకే నాగుల చవితికి (దీపావళి అమావాస్య తరువాత వచ్చే కార్తీక శుద్ధ చతుర్థి) భూమిపై పాములకు పాలు పోస్తే ఆ పాతాళ/మహాతల నాగదేవతల అనుగ్రహం కలుగుతుంది. ఆ ఆరాధన పాముకాటు వంటి ప్రమాదాలనుండి రక్షిస్తుంది. ఈ నాగదేవతల ఆరాధన గర్భస్థ శిశువులను రక్షిస్తుంది. పిల్లలు లేనివారు నాగ ప్రతిష్ఠలు చేయడం అందుకే. ఈ మానవ శరీరమనే పుట్టకు తొమ్మిది రంధ్రాలు ఉంటాయి. మానవ శరీరంలో నాడులతో నిండివున్న వెన్నెముకను ' వెన్నుబాము' అని అంటారు. కుండలినీశక్తి మూలాధారచక్రంలో "పాము" ఆకారమువలెనే వుంటుందని "యోగశాస్త్రం" చెబుతోంది.
రాహువు మొదట ఈలోక వాసియే . అమృతపానము వలన రాహులోకమనే ఊర్ధ్వలోకము సంపాదించుకున్నాడు. యోగసూత్రకర్తయైన పతంజలి మహర్షి ఆదిశేషుని అవతారమే. ఊర్ధ్వలోకములు దేవతాశక్తులు మూలాధారము పైన ఉంటే శరీరమనే క్షుద్రబ్రహ్మాండములో అధోలోకాలు మూలా ధారానికి దిగువగా పాదముల వరకు ఉంటాయి.
కర్ణాటకలో తుళునాడులో నివసించే బంటు అనే తెగ వారు వాసుకిని కులదైవంగా కొలుస్తారు. కేరళ సరిహద్దులలోని కర్ణాటక జిల్లాలైన దక్షిణ కన్నడ, ఉడుపి జిల్లాలలో భాగమే ఈ తుళు భాషీయుల తుళునాడు. సుబ్రహ్మణ్యేశ్వరుని ఈ నాగజాతి వారి అధిదేవతగా కొలుస్తారు. కర్ణాటకలో కుక్కె సుబ్రహ్మణ్య క్షేత్రం పశ్చిమ కనుమలో దక్షిణ కన్నడ జిల్లాలో ఉన్నది. అనేక చోట్ల సుబ్రహ్మణ్యుని సర్పముగా ఆరాధించడం తెలిసినదే. నాగదోషములు కలవారు సుబ్రహ్మణ్యుని ఆరాధిస్తారు. నాగ అని పేరులో పెట్టుకోవడం, సుబ్బారాయుడు, పాపయ్య వంటి తెలుగు పేరుల వెనుక ఈ నాగారాధన సాంప్రదాయం ఉంది. శివుడు నాగభూషణుడైతే విష్ణువు భోగీంద్ర శయనుడు.
ఆపద వచ్చినప్పుడు ఆర్తితో ఆదిశేషుని తలచుకుంటే తక్షణమే పాపకర్మ ఫలము నశించి శ్రేయస్సు కలుగుతుంది. ముముక్షువులు శేషుని ఆశ్రయిస్తే భవబంధములు తొలిగి విముక్తులౌతారు. బ్రహ్మండనాయకునికి శయ్యగానున్న శేషుని శిరస్సులమీద భూమి ఆయనకు అణువులా ఉంటుంది. పాతాళలోకమునుండి బ్రహ్మాండము వెలుపల క్షీరసముద్రము వరకు వ్యాపించిన శేషుడు సకలలోకహితార్థము భూమిని శిరమున ధరిస్తాడు.

Acharya Sadananda Shree Krishna sampurna avataaramu and is jagt guru since he taught B. Geeta, anu Geeta and Uddhava Geeta. However He was born and died naturally too. Hence he is avataarama only unless you are Hare Krishna devotee. For them Heven is Brindavanam not vaikuntam as for vaishanavaites. Hari Om!
Vvs Sarma In Bhagavatam Vyasa states that Krishnastu Bhagavam Svayam, where Vyasa himself was listed as one of eka-vimsati avataras. He I believe is Vishnu + more. Brahma Vaivarta is the basis for the words Srikrishna ParabrahmanE namah, He is Vamsi Mohana, like Siva, Vamsa Mohana as in Siva sahasram, In Kali I believe he is more than Vishnu;s Avatara. This what I feel In Gita itself he appears in two forms - Paramatma Krishna in the body of Vaasudeva Krishna, At least that is how I understood. I may be wrong.
Acharya Sadananda avataaram involves - avatarati - that is coming down. The param brahman - which is infinite consciousness comes down to solve a local problem taking maaya as a means - prakRitim swaam adhiShTaaya sambhavaami - here prakRiti is same as maaya. He comes down when there is a request to comedown by the samashTi vaasanaas - picturized in Bhagavatam as devas and earth going to Vishnu and pitting a petition to come down to solve a local problem. How he comes down depends on the problem at hand. Me in the sloka refers to nirguna brahman - Krishna identifiying himself with the totality which is naama ruupa vilakshaNam - Hence later he says - all beings are in Me and in the next statement he says no beings are in Me. The first statement is with maaya sahita Brahaman as Iswara and the second statement for nirvikaara Brahman. Vishwaruupa darshanam is only Iswara darshanam in the form of vishvam o world of plurality- the very first name in Vishnusahasra naamaavali - essentially vishvam is saarkaara brahman as he shows. The pramabrahmna being nirguna and niraakaara cannot be seen or perceived but to be understood as pointed by Vedanta. Any just for discussion. I will be writing soon on the 11th ch. of Geeta for my own education. Hari Om!
On Cosmologies – New Series – 9

On Cosmologies – New Series – 8 అథోలోకములు - 2

https://www.facebook.com/vallury.sarma/posts/598558610181556

V V S Sarma
వితలమునకు క్రిందిలోకము సుతలము. ప్రహ్లాదుని పౌత్రుడు, విరోచనుని పుత్రుడు బలి చక్రవర్తి నివాసము ఈలోకమే. విష్ణుభక్తుడు. స్వర్గాన్ని ఆక్రమించిన కారణం వలన వామనుని రూపములో హరి ఇతనిని సుతలానికి పంపివేస్తాడు. అక్కడ సుఖభోగాలు అనుభవిస్తూ హరి రక్షణలోనే ఉంటాడు. తరువాత మన్వంతరములో అతడి పుణ్యఫలంగా స్వర్గములో దేవేంద్రపదవికి అర్హుడౌతాడని శ్రీహరి వరము. విష్ణువు గదాధారియై, శంఖచక్రాలు ధరించి బలిచక్రవర్తి నగర ద్వార రక్షణ భారం వహిస్తాడు. కోరికలులేని హరి ఇంద్రుని కోరిక వలన బలి నడిగి మూడడుగుల నేల దానము పుచ్చుకొనిన దానికి ఇది ప్రతిఫలం .
సుతలమునకు క్రిందిలోకము తలాతలము. ఈలోక పాలకుడు మయాసురుడు.
తలాతలము క్రిందమహాతలము ఇది అనేక సర్పములు కద్రువ తనయుల నివాసము. అనేక పడగల మహాసర్పములవి. గుహకుడు, తక్షకుడు, కాళీయుడు, సుషేణాది నాగముల నివాసము ఇది. వీరికి వినతా సుతుడు గరుత్మంతుడంటే భయము.
ఆక్రింద రసాతలంబున దైత్యులు దానవులు నగు నివాత కవచ కాలకేయు లను హిరణ్యపుర నివాసులగు దేవతాశత్రువులు మహా సాహసులును దేజోధికులును నగుచు సకల లోకాధీశ్వరుండైన శ్రీహరితేజంబునం బ్రతిహతులై వల్మీకంబునందునడంగియున్న సర్పంబుల చందంబున నింద్ర దూత యగు సరమచేఁజెప్పబడెడు మంత్రాత్మక వాక్యంబులకు భయంబు నొందు చుండుదురు. --------- (భాగవతము)
పాతాళము
అధోలోకములలో కడపటిదైన పాతాళములో ఉత్తమ నాగ కులము ఆనందముతో కాలము గడుపుతూ ఉంటుంది. ముఖ్య నగరం భోగవతి. వైభవములో అమరావతిని మించినది.
వాసుకి, శంఖ, కుళిక, మహాశంఖ, శ్వేత, ధనంజయ, ధృతరాష్ట్ర. శంఖచూడ, కంబళ, అశ్వతర, దేవదత్త నామములు కలిగిన మహా నాగాలు ఇక్కడ జీవులు. ఐదు, ఏడు, పది, నూరు, వేయి శిరస్సులు కలిగిఉంటాయి. వాటి శిరోమణుల కాంతులలో పాతాళము కాంతిటొ నిండి ఉంటుంది. వాసుకి నాగ కులానికి రాజు. దేవదానవులు క్షీరసాగర మధనం చేసినప్పుడు వాసుకిని రజ్జువుగా ఉపయోగించారు. విష్ణులోకములో మహావిష్ణువు శయనించి ఉన్న ఆదిశేషువు చుట్టలుగా బ్రహ్మాండమంతా నిండి పాతాళము వరకు వ్యాపించిఉంటుంది. అనంత సంకర్షణ నామములు ఈ మహానాగమునకే వర్తిస్తాయి. ఈ అనంతమూర్తినుండే విశ్వసంహార కార్యమునకు కర్తలైన ఏకాదశ రుద్రులు సృజింపబడ్డారు. వారంతా త్రినేత్రులు, శూలపాణులు. అనంతునిసేవిస్తూఉంటారు. ఈ అనంతుడే హలధరుడు బలరాముడు. లోక క్షేమముకోరుతూ సురాసుర సిద్ధ గంధర్వ విద్యాధర మునిగణములు నిరంతరమూ ఈయన సన్నిధిలో ద్యాన మగులై ఉంటారు. తుంబురు నారద ప్రభృతులు స్వామిని స్తుతిస్తూ ఉంటారు.
ఓలిమై నెవ్వని లీలావినోదముల్
జన్మ సంరక్షణ క్షయములకును
హేతువు లగుచుండు, నెవ్వని చూపుల
జనియించె సత్త్వరజ స్తమంబు
లెవ్వని రూపంబు లేకమై బహువిధం
బులను జగత్తులఁ బ్రోచుచుండు,
నెవ్వని నామంబు లెఱుఁగక తలఁచిన
యంతన దురితంబు లఁడఁగుచుండు,
నట్టి సంకర్షణాఖ్యుండు నవ్యయుండు
నైన శేషుని వినుతి జేయంగఁ దరమె?
తలఁప నెప్పుడు వాఙ్మనంబులకు నింక
మూఁడు లోకంబులందును భూతతతికి.


https://www.facebook.com/vallury.sarma/posts/598681563502594
Monika Sethuraman Reddy writes - I tried to believe that there is a God, who created each of us in His own image and likeness, loves us very much, and keeps a close eye on things. I really tried to believe that, but I gotta tell you, the longer you live, the more you look around, the more you realize, something is fucked up. ---- Your frustration is due to the fact that the story of God and creation you heard is unsatisfactory. There are better accounts of creation. In fact Hindu Puranas give a much more convincing theory of creation.

జాజి శర్మ తమకు తెలిసిన భాష ను ఎలా ఉపయోగించాలో తెలియని వాళ్ళు 'వాచామాగోచరుండైన" మన స్వామిని ఎలా తెలుసుకోగలరు?Monika Sethuraman Sir, for me God is energy .. and Hinduism says there is no matter without energy .

That quote was George carlin slamming those who believe in God the father the creator.
Monika Sethuraman Thank u Sir ..

Don enlighten me when u get time ..(.but in english sir)
జాజి శర్మ ఆదిశంకరులు తమ సౌఉదర్యలహరి ప్రారభించినదే "శివ శక్త్యాయుతో " అని శక్తి లేకుండా ఏమి జరగదు. మీరు పెద్దలకు వ్రాసేటప్పుడు భాషా ప్రయోగం సరిగా చెయ్యలేదు అనేది నా వినతి.జాజి శర్మ In fact, Adi Sankara started "Soundarya Lahari" thus, "Sivasaktyayuto", explaining that without Energy (Shakti), there is no Shiva . MY submission is that the youngsters should learn how to write to elders when they want to attain good knowledge. That is Called PARIPRASNA" in Sanatana Dharma.Sumalini Soma GOD is ultimate truth that each individual experiences him / herself. It is such a truth, it reaches you when you are ready. When you know GOD, you will be awestruck!!!! It is the most beautiful thing you experience. Seeking the right answers from right people, in a right way shows you are in the right direction.Sumalini Soma Vvs Sarma Sarmagaru, because of his background, & depth of knowledge has an innate talent, in explaining the incomprehensible stuff, in a simple way. I loved his explanation of "universe" so much. Sarmagaru, We are so very thankful for everything you do. Pranams.Acharya Sadananda There are supposed to 80 theories of creation even in Hindu scriptures depending on who is asking the question. In the ultimate analysis there is no creation since Brahman being infinite and infinite cannot undergo modification creation is modification. Our scriptures tell us creation is creation-less creation or transformation-less transformation - give 3 example illustrate the creation - just as gold becoming many ornaments, just as mud becoming many mud pots, just as iron becoming iron tools. It is what is called vaachaarambhanam vikaaro naamadheyam - or to tell in short - namkevaste creation. Scriptures point out a beautiful example - just one creates the dream world - for a dreamer the creation is real but the reality is negated when one wakes up. Similarly the waking world is also an apparent creation until one wakes up to the god-like status. Hari Om!
Sumalini Soma @acharya sadananda - I feel like, I understand partially & partially I don't. We know the world is midya. We are perceivings the way we do, because we are made that way. Yes, when we understand ultimate consciousness, everything doesnot make any sense. But, to understand the physical world, the way we experience, the way curiosity is built in to us, we would like to know everything? What are those 80 theories of creation. Pranavam & pralayam theory, goes so well with the modern day big bang theory. It amazes me, how our sages, even thought about a theory, so close to what is confirmed scientifically? How even they had grasp of those long distances? It looks like, you know more. Can you please shed some light on this?
Vvs Sarma Thanks all of you. I agree with what Sadananda garu explained. We are part of one Brahmanda, there are many brahmandas. It is impossible to know the ultimate Truth, Brahman by our location, We can not even know fully about the physics of Milky Way. Each darsana has a theory of creation. The point is eaxh Darsana is observer's perception and inference
Acharya Sadananda Sumalini - PraNAms . I am giving below an article I wrote few years ago on the concept of creation. I am providing a reference below. Actually Big Bang theory has lot of problems - Space and time forms with the bang only - mathematically speaking it is a singularity. Where did big bang occurred, cannot be asked. What was there before big band also cannot be asked. It occurred everywhere even though everywhere is a concept of space. In fact it occurred where the questions is or where conscious enquirer is since big band is extrapolation of the time-space scale backwards where all the expanding galaxies meet. The meet at the point of the observer who is doing the extrapolation. Here is the article and many others also. http://forum.advaitaforum.com/index.php?topic=218.0

Sumalini Soma Acharya Sadananda PraNAms Acharyagaru. I will ready once I am back home today. Thank you so much for the material provided. Vvs Sarma PraNAms Sarma garu. Are we made not to know the ultimate truth? Why our thirst for knowledge is unstiating?

On Cosmologies – New Series – 7 అథోలోకములు

https://www.facebook.com/vallury.sarma/posts/597934676910616



మామిత్రుడు ఆచార్య ప్రసాద్ గారు "మీరు 14 భువనములలో ఊర్ధ్వలోకములను గురించి చెప్పారు. అధోలోకములను గురించి మనకు అంతగా తెలియదు. వాటి వివరాలు ఏమిటి? మనకు అవి అవసరమా?" అని అడిగారు. మానవ జన్మ చాలా పరిణామము పొందిన జీవులది. ఊర్ధ్వలోక గమనము ఇక్కడనుండే సామాన్యంగా సాధ్యము. అథోలోకాలు కూడా బ్రహ్మ సృష్టిలోనివే. అక్కడా ప్రజాపతుల సంతానమైన జీవులు ఉన్నారు. దేవతల ప్రభావము అక్కడా ఉంటుంది. అనేక పురాణాలలో ఈ లోకాల వివరాలు ఉన్నాయి. ఉదహరణకు మనకు బాగా తెలిసిన భాగవతము, పంచమ స్కంధము చూదాము.
అతల, వితల, సుతల, రసాతల, తలాతల, మహాతల, పాతాళలోకములు అధోలోకములు
ఊర్ధ్వలోకమైన స్వర్గలోకముకంటే ఎన్నోరెట్లు అధిక సుఖాభోగాలు అనుభవించే అవకాశంఉన్నవి అధోలోకాలు. వనాలు, ఉద్యానవనాలు, క్రీడా విహారాలు, ఐశ్వర్యం, ఆనందం అక్కడి జీవుల స్వంతం. ఆ జీవులుకూడా దేవయోనులే. ప్రజాపతుల సంతానమే. దితి పుత్రులైన దైత్యులు, దనువు పుత్రులైన దానవులు, కద్రువ పుత్రులైన కాద్రవేయులు (నాగ జాతి వారు) అక్కడ సతులు, సంతానము, ఐశ్వర్యములతో తులతూగుతూఉంటారు.
అట్టి పాతాళంబులందును మయకల్పి
తములగు పుటభేదనముల యందు
బహురత్ననిర్మిత ప్రాకార భవన గో
పుర సభా చైత్య చత్వరవిశేష
ముల యందు నాగాసురుల మిథునములచే
శుక పిక శారికానికర సంకు
లముల శోభిల్లు కృత్రిమ భూములను గల
గృహములచే నలంకృతము లగుచు
కుసుమచయ సుగంధి కిసలయ స్తబక సం
తతులచేత ఫలవితతులచేత
నతులరుచిర నవలతాంగనాలింగిత
విటపములను గలుగు విభవములను. (భాగవతము)
------- అధోలోక వాసులు కలిగి ఉంటారు.
దేవతల శిల్పి విశ్వకర్మ అయితే అధోలోకవాసుల శిల్పి మయాసురుడు. ఒకప్పుడు భూమిమీద నివసించేవాడు. మహాభారతములో ఇంద్రప్రస్థములో పాండవులకు మయ సభ నిర్మించిన వాడితడే. భూమిపై ఇతడి నగరం నేటి మీరట్ (మయారాష్ట్ర). త్రిపురాలను రాక్షసాత్మలతో నిర్మించినవాడితడే. కాని శివుడు వాటిని ధ్వంసంచేశాడు. ఇతడు మాత్రం గొప్ప శివ భక్తుడు. సూర్య సిద్ధాంతమనే జ్యోతిష గ్రంథానికి కర్త ఇతడే. ఆదిశేషుని నాగలోకమే పాతాళం. సూర్యకాంతి అధోలోకములకు చేరకపోయినా అనంతుడైన ఆదిశేషుని శిరోమణితో అధోలోకాలన్నీ కాంతివంతములుగా ఉంటాయి. ఆలోకములోని జీవులు అమృతం బదులుగా దివ్యౌషధులు , రస రసాయనములు అన్నపానాలుగా స్వీకరిస్తారు. అక్కడ ప్రజలకు ఆధివ్యాధులు, ముసలితనము, శరీరము రంగు మారుట, స్వేదము, దుర్గంధము ఉండవు. వారికి మృత్యుకారణము, భయదాయకము విష్ణువు సుదర్శనమొక్కటే. మయాసురుని కుమారుడు బలాసురుడు. అతని ఆవులింతలనుండి స్వైరిణులు, కామినులు, పుంశ్చలు అనే మూడు స్త్రీ గణాలు ఉద్భవించాయి. వారి శరీరాలు పంచభూతాత్మకాలు కావు. దేవతలవలెనే స్త్రీలో సద్యోగర్భధారిణులు.
వితలమనే అధోలోకములో శివుని భూతగణాలు నివసిస్తాయి, వానిలో హాటకి అనేశక్తి అగ్నిభక్షణముచేసే శక్తికలది. దాని ఉచ్చిష్టము బంగారమువంటి లోహము. అక్కడ స్త్రీలు ఆభరణాలుగా ఉపయోగిస్తారు.
V V S Sarma

On Cosmologies – New Series – 6


తైత్తిరీయోపనిషత్ - ఆనందవల్లి
ఉపనిషత్తు ఈ భాగం విషయం ఆనందము యొక్క మీమాంస.
ఒక యువకుడు, సజ్జనుడు, వేద పురాణ సాహిత్యాన్ని అధ్యయనం చేసినవాడు, పండితుడు, దృఢచిత్తం కలవాడు,ఆరోగ్యము బలము కలవాడు, ఐశ్వర్యవంతుడు అట్టి వ్యక్తి యొక్క ఆనందమును పరిపూర్ణ మనుష్యానందముయొక్క ప్రమాణముగా భావించవచ్చును.ఇది పరిపూర్ణ లౌకికానందము.
అట్టి ఆనందము యొక్క నూరు రెట్లు మనుష్య గంధర్వానందము. ఇది గంధర్వలోకములోని జీవులకు వర్తించును. ఈ జీవులు తమ పుణ్యమువలన గంధర్వలోకమునకు వెళ్లినవారు.అదే ఆనందం భూమిపై వేదాధ్యయనముచేసి, కామాది వికారములను జయించిన శ్రోత్రియునికి లభిస్తుంది.
దీనికి వందరెట్లు ఆనందము దేవగంధర్వానందము. ఇది శాశ్వత గంధర్వలోకములోని జీవులకు, భూమిపై వేదార్ధము తెలిసి ఆరు అంతఃశత్రువులను జయించిన పరిపూర్ణవేద పండితునకు లభిస్తుంది. దీనికి నూరురెట్లు ఆనందం పితృలోకములోని పితృ దేవతలకు ఉంటుంది. దీనికి శతాధికం ఆజానజ దేవతలకు ఉంటుంది. వీరికి శతాధికమైన ఆనందం కర్మ దేవతలకు ఉంటుంది. వీరికి నూరురెట్లు ఆనందం దేవరాజైన ఇంద్రుని ఆనందం. దానికి శతాధికం దేవగురువైన బృహస్పతిది. దీనికి నూరురెట్లు ప్రజాపతులది. దానికి నూరురెట్లు బ్రహ్మ యొక్క ఆనందము. ముక్తజీవులు, బ్రహ్మజ్ఞానులు పొందిన ఆనందము దీనికి సమానము.
యతోవాచో నివర్తంతే అప్రాప్య మనసా సహ
ఆనందం బ్రహ్మణో విద్వాన్ న బిభేతి కదాచనేతి
అని ఈ ఉపనిషద్వాక్యము.
మాటలకు దొరకనిది, మనసులోని ఊహలకందనిది అయిన ఆ బ్రహ్మానందానుభవమును పొందిన విద్వాంసుడు ఎవరివలనను, దేనివలనను భయమును పొందడు.

Acharya Sadananda Besides all that said, he is also the owner of the enter earth - his ananda is one unit. mukhyamainadi - shrotiyasya akaamaya tasya - This is repeated at every level of ananda. One who has dispassion for all that in that level of happiness also enjoys the same level of happiness without possessing anything. In essence he is happy with himself. Hari Om!Vvs Sarma Thank you Acharya Sadananda - I observed it but could not find proper Telugu terms for describing it distinctly at each level. Do you read Telugu?Acharya Sadananda Sarma gaaru - maa naanagaaru telugu-samskRitamulo mahaa vidvansulu. We are still publishing his works. Allasani peddna Manucharitra, Krishadevarayala AmuktaMallada samskRitiikaranamu chesinaaru. Modatidi Andhra Sahitamu samshta, rendavadi TTD publish cesinaaru. Nenu padita puttunni! Vedanta Deshikas Rahasyatra saara (original in Tamil) pi 14 volume of commentary vrasinaaru. avi inkaa publish ceya prayatnistunnnamu. Hari Om! Sada
Vvs Sarma చాలా సంతోషం. మా నాన్నగారికి, తాత గారికి, సాహిత్యాభిమానము ఉన్నది కాని పాండిత్యములేదు. మా పూర్వజుడు వల్లూరి నరసకవి నాగ్నజితీ పరిణయమని మంచి ప్రబంధాన్ని రచించారు. దాని తాళపత్ర ప్రతి తిరుపతి లో దొరికినది. మా తమ్ముని కుమారుడు దానిని ప్రచురించే పనిలో ఉన్నాడు. నా అభిరుచి మాగురువుగారు శివానందమూర్తిగారి సాన్నిహిత్యముతో బలపడినది. గత ఇరవై సంవత్సరములుగా నేను విన్నవీ, చదివినవి నలుగురితో పంచుకునే ప్రయత్నం చేస్తున్నాను. నా జ్ఞానం కేవలం చదివితెలుసుకోవడం వలన అభించినది. చాలా దోషాలు ఉండవచ్చు.

The Structure of the Universe (Vedic) - Viswaroopa - K. Sivananda Murty Preface 2

https://www.facebook.com/vallury.sarma/posts/616984388338978 The Puranas speak of individuals going up and down between these proximate...