https://www.facebook.com/vallury.sarma/posts/506739959363422
https://www.facebook.com/vallury.sarma/posts/507131505990934
https://www.facebook.com/vallury.sarma/posts/507424952628256
మనం వాయువ్యంనుండి, పశ్చిమంనుండి ఇస్లాం మనదేశంలో అడుగుపెట్టినదని తెలుసుకున్నాము. మరి తూర్పున బెంగాల్ లోనికి ఎప్పుడు అడుగుబెట్టినది? నలందా, విక్రమశిలా విశ్వవిద్యాలయాలను ధ్వంసంచేసిన భక్తియార్ ఖిల్జీ ఎవరు? మహమ్మద్ ఘోరీ తరువాత అతడి బానిస, తరువాత అతని సేనాపతి, ఐన ఖుత్బుద్దీన్ ఐబక్ మొదటిసుల్తాన్ అయ్యాడు. అతడి వంశాన్ని ఘులాం (బానిస) వంశం అన్నారు. ఇతని సైన్యాధికారి భక్తియార్ ఖిల్జి. ఆఫ్గనిస్తాన్ లొ స్థిరపడిన ఒక తురుష్క (Turkish) తెగవారు ఖిల్జీలు. అయోధ్యనవాబు అతనిని సేనాపతి చేశాడు. బీహారు తరువాత అతని దృష్టి బెంగాల్ పై పడినది. మొదట నవద్వీపము, (ఇప్పటి నాడియా) తరువాత గౌర్ పట్టణాలను (ఇది గంగా తీరాన ఉన్న గౌడదేశ రాజధాని) అక్రమింఛాడు. (గౌడదేశము అంటే పశ్చిమ బెంగాల్, వంగదేశమంటే తూర్పు బెంగాల్). (గౌడీయ మఠము పేరు ప్రసిద్ధము.) హిందూ ధర్మపరంగా ఆకాలంలో మొదట బీహార్ లోని మిథిలను, తరువాత బెంగాల్ లోని నవద్వీపాన్ని చెప్పుకోవాలి. భారతీయ (హిందూ) న్యాయ, తర్కాలు, బౌద్ధ జైన తర్కాలను అధిగమించి నవ్యన్యాయము అనే కొత్త తర్కాన్ని ఆకాలంలోనే ప్రవేశ పెట్టాయి. మిథిలలో గంగేశ ఉపాధ్యాయుని ప్రమాణతత్త్వ చింతామణి దీనికి మూలగ్రంధం. తరువాత నవద్వీపములోని రఘునాథ శిరోమణి విఖ్యాతుడు. చైతన్య మహాప్రభు మొదట తర్కాన్ని నవద్వీపంలోనే అభ్యసించాడు. ఇస్లాం పరంగా బెంగాలీలలో అధిక సంఖ్యాకులను ముస్లిములుగా మార్చిన ఘనత భక్తియార్ ఖిల్జీదే. అల్ మహ్మద్ అనే బంగ్లాదేశకవి 1990లలో "భక్తియారేర్ ఘోడే " (భక్తియార్ అశ్వాలు) అనే తన కావ్యంలో బంగభూమిపై ఇస్లాం విజయాన్ని కీర్తించాడు. 13వ శతాబ్దంలో ఈ సంఘటన 1905లో కర్జన్ చేత బెంగాల్ మొదటి విభజనకు, 1947లో తూర్పు పాకిస్తాన్ వేర్పాటుకు, 1971 లో బంగ్లా అనే మరొక ముస్లిం దేశపు జన్మకు కారణమైంది. చైతన్య మహాప్రభు(1486-1534) తన కృష్ణభక్తి మార్గంతో బెంగాల్లో ఇస్లాం ఉప్పెనను కొంత వరకు ఎదుర్కొన్నాడు. వాయువ్య దిశన అరబిక్, పారశీక భాషలూ, ఇక్కడ పుట్టిన ఉర్దూ కలసి ఏర్పడిన మిశ్రమ భాష వాయువ్య రాష్ట్రాలనుండి బీహార్ వరకు పనికి వచ్చింది. బెంగాల్ లో పనికిరాలేదు. మతం మీద మమకారం తూర్పు పాకిస్తాన్ గా రూపు దిద్దుకుంటే, భాష పై మమకారం బంగ్లాదేశాన్ని సృష్టించింది.
ఈ చరిత్ర ఎందుకు చదవాలి? ఆనాటి బెంగాల్ లో ఇస్లాం ప్రచారంకావడానికి, నేటి అంధ్రలో క్రైస్తవానికి ప్రచారం రావడానికి కొన్ని పోలికలు ఉన్నాయి. ఆనాటి భక్తియార్ అశ్వాలు, నేటి అమెరికా డాలర్లుగా మారిఉండవచ్చును. మతం, పౌరసత్వం, సంస్కృతి, భాష ఇవన్నీ జేబులో పెట్టుకునే ఆధారప్రమాణాలు (ID Cards) కావు. ఈ దినం భక్తితో పూజించిన విగ్రహాలను మరునాడు పనికి మాలినవి గా నిర్ణయించుకోవడం, తిరుపతిలో పవిత్రతను మక్కాకో, బెథెల్ హాంకో మార్చుకోవడం వెనుక కొంత ఘర్షణ ఉంటుంది. అమెరికా పౌరసత్వం తీసికొని, అమెరికా వెళ్ళడానికి పనికివచ్చిన భారత పాస్ పోర్ట్ ని జ్ఞాపిక గా చేసుకోవడం అలాంటిదే. చిన్నప్పుడు చదివిన "చేత వెన్న ముద్ద, చెంగల్వ పూదండ" గుర్తుకు తెచ్చుకుంటూ, మనుమరాలో. మనుమడో చదువుతున్న " Solomon Grundy, Born on a Monday, Christened on Tuesday,.. Buried on a Sunday" విని ఆనందిస్తున్నట్లు నటించడం కష్టమే.
Nandiraju Radhakrishna "అమెరికా పౌరసత్వం తీసికొని, అమెరికా వెళ్ళడానికి పనికివచ్చిన భారత పాస్ పోర్ట్ ని జ్ఞాపిక గా చేసుకోవడం అలాంటిదే.....ఈ చరిత్ర ఎందుకు చదవాలి?" అద్భుతంగా చెప్పారు. అసలు ఇవి చదివేందుకు ఎంతమందికి ఆసక్తి ఉంది సార్? ఆసక్తి వున్నా అసలు తెలిసిన వాళ్లేరీ చెప్పేవాళ్లేరీ? ధన్యులం.P Mallikarjuna Rao Well said Sarma garu. Many are converting for the sops they offer and a few show caste as a reason for this conversion. This lot is more dangerous than the former. Further, as Gurugi said on some occasion, the muslims targeted the body while the Christians, the soul. Hence establishment of schools and hospitals.
మన నాటి, నేటి చరిత్రల పునశ్చరణలో "సృష్టి" వలెనే, చరిత్ర కూడా పునరావృత్తం అవుతుందని తెలుసుకున్నాం. అది గమనించకపోతే కలిగే నష్టాలను, నేటి పరిస్థితులనూ పోలుస్తూ ముందుకు సాగుతున్నాము. ఢిల్లీ సుల్తానులవద్ద ఢిల్లీని వదలి దక్షిణ భారతానికి వద్దాం. మన చరిత్ర పుస్తకాలు పట్టించుకోని భాగాలలో ఇది ఒకటి. ఇంత కంటే అన్యాయం, ఈశాన్య భారతం చరిత్ర. సిక్కిం, అరుణాచల్, అసోం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, త్రిపుర, మిజోరాం గురించి సగటు భారతీయునికి ఏమీ తెలియదు అనే చెప్పాలి. కాశ్మీర్ వివాదం గురించి, కార్గిల్ యుద్ధంగురించి తెలియవచ్చును గాని సనాతన ధర్మంలో కాశ్మీరుకు ఉన్న స్థానం గురించి తెలియక పోవచ్చును.కాని జమ్మూ సమీపంలోని వైష్ణోదేవి ఆలయం ప్రసిద్ధము.ఇంకా కొందరు అమర్ నాథ్ గుహలోని మంచులింగమును కూడా చూసి ఉండవచ్చును.
దక్షిణభారత చరిత్రలో సనాతనధర్మ పరంగా గుర్తుంచుకోవలసిన మొదటి వ్యక్తి ఆదిశంకరాచార్యుడు. బౌద్ధ, జైనాలు వ్యాపించిన దక్షిణభారతంలో సనాతన ధర్మాన్ని పున: ప్రతిష్ఠించిన వ్యక్తి. బుద్ధుడు "దు:ఖానికి కారణం కోరికలు" అంటే కోరికలకు కారణమేమని ప్రశ్నించాడు. "విశ్వం పశ్యతి కార్య కారణతయా .." అని వర్ణిస్తూ కోరికలకు కూడా కారణం ఉంటుందనిచెప్పారు (అవి జన్మతః సంక్రమించిన సంస్కారాలు). మళ్ళీ ప్రపంచాన్ని "విశ్వం దర్పణదృశ్యమాన నగరీతుల్యం నిజాంతర్గతం" అని వ్యావహారిక సత్యంగా గోచరించే జగత్తును గురించి చెప్పారు. "అద్వైతామృత వర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం" అని నమస్కరిస్తూ గీతకు , ఉపనిషత్తులకు, బ్రహ్మ సూత్రాలకూ భాష్యాలు వ్రాశారు.భజగోవిందం భజగోవిందం గోవిందమ్ భజ మూఢమతే అంటూ నారాయణ నామ స్మరణనూ, కృష్ణ పరమాత్మకు శరణాగతిని బోధించారు. నేటి కేరళలో పెరియార్ (పూర్ణా) నదీ తీరాన కొచ్చి, ఆల్వేయి సమీపంలోని కాలడి గ్రామంలో జన్మించారు. ఈ ద్రావిడ శిశువు 32 సం. జీవితకాలం లోపలనే కాశ్మీరు, నేపాలు తో సహా భారతదేశమంతా కాలినడకన తిరిగి ద్వారక, శృంగేరి, జ్యోతిర్మఠ్, పురీలలో అద్వైతబోధకు శంకరమఠాలను స్థాపించి కృష్ణుని తరువాత తిరిగి జగద్గురువైనారు. కేవలం తర్క, వాద పటిమ వలననే వారు జైనులనూ, బౌద్ధులను, మీమాంసికులను ఓడించగలిగారు. ఈయన బోధించిన అద్వైతానికి మూలం ఈయన పరమ గురువు గౌడపాదాచార్యుని మాండూక్యకారికలు. నర్మద సమీపంలో తన గురువైన గోవిందపాదుని కలుసుకొని ఆయన వద్ద మాండుక్య కారికలు గ్రహించారు. కాశ్మీరు శ్రీనగరంలో దాల్ సరస్సుకు ఎదుట గల శంకారాఛార్య గిరి పై మొదటి శివాలయాన్ని నిర్మించారు. (1987లో నాకు దర్శించే అదృష్టం కలిగినది)

మన భారత దేశంలోని నేటి పరిస్థితుల మూలాలు శతాబ్దాల, లేదా సహస్రాబ్దాల క్రితం జరిగిన సంఘటనలపై అధారపడి ఉండవచ్చు. 1950 లో We, the people of India వ్రాసుకున్న రాజ్యాంగం, దాని ఆధారంగా ఏర్పడిన ప్రభుత్వాలు, మన అసలు సమస్యలను గుర్తించడంలోనూ, పరిష్కరించడంలోను విఫలమయ్యాయని చెప్పవచ్చును. 20 వ శతాబ్దపు నూతన సమస్యలు, 1947 భారత దేశ విభజన, 1956 భాషా రాష్ట్రాలు, 1962 చైనాయుద్ధం తెచ్చిన నూతన సమస్యలు, 1971 పాకిస్తాన్ విభజన, నానాటికీ పెరిగి దేశానికి నూతన గుర్తింపు తెస్తున్న అవినీతి ప్రకరణం, "గరీబీ హటావో" లాంటి ఎన్నికల ప్రచార మంత్రాలతో పారిపోని బీదరికం, భారతీయతను విస్మరిస్తున్న మధ్య తరగతి ప్రజానీకం, దేశాన్ని దోచుకుంటున్న నేతలు .. ఇవన్నిటి మధ్య అదనంగా సృష్టించుకొని రాష్ట్రాన్ని వెనుకకు నడిపిస్తున్న రాష్ట్రవిభజన వంటి హాస్యాస్పద ఉద్యమాలు - మన దేశం ఏ సమస్యనూ పరిష్కరించుకోలేదన్న సత్యాన్ని పదేపదే ఋజువుచేస్తాయి. ఒక ప్రాంతాన్ని ప్రత్యేక రాష్ట్రముగా చేయడానికి యజ్ఞాలు, హోమాలు చేయడం, నాయకులు కాని సామాన్య ప్రజలు ఆత్మహత్యలు చేసుకున్నారన్న వార్తలూ మన ధర్మచ్యుతిని చెప్పకనే చెబుతున్నాయి. మత మార్పిడులు మతాన్నీ దేవుణ్ణీ అంగట్లో సరుకులు గా మారుస్తున్నాయి.
Nandiraju Radhakrishna "1950 లో We, the people of India వ్రాసుకున్న రాజ్యాంగం, దాని ఆధారంగా ఏర్పడిన ప్రభుత్వాలు, మన అసలు సమస్యలను గుర్తించడంలోనూ, పరిష్కరించడంలోను విఫలమయ్యాయని చెప్పవచ్చును."---- మన అసలు సమస్యలను నేలమాళిగలొ పూడ్చిపెట్టి వాటిని అవసరమైనప్పుడు పైకితెచ్చి రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవడంలో ప్రభుత్వాలన్నీ విజయవంతమయ్యాయి. సంబంధం లేని అంశాలతొ ముడిపెట్టి సామాన్యులు, బీద బిక్కి ఆత్మహత్యలు చేసుకున్నారని అసత్య ప్రచారం చేసి ప్రజలను కనికట్టు చేయడంలో ప్రసార సాధనాలు తమకు తాము తాకట్టు పెట్టుకుని వందిమాగద బృందాలై డబ్బుకులోకం దాసోహమంటున్నాయిరాజరాజ నరేంద్రుడు - నన్నయ - ఆంధ్రమహాభారతము
మన చరిత్ర పుస్తకాలలో లో రాజరాజ నరేంద్రుని పేరు కనిపించదు. ఉత్తరభారతంలో ఘజనీ మహమ్మదు 17 పర్యాయములు దండెత్తి ముఖ్యదేవాలయాలు విధ్వంసం చేసే సమయంలో దక్షిణభారతంలో సనాతన ధర్మ ప్రతిష్ఠాపన జరుగుతూంది. ఆది శంకరుల అడుగుజాడలలో, దేశభాషలకు ప్రచారమిచ్చిన బౌద్ధ జైనాలకు దీటుగా, సనాతన ధర్మ గ్రంధాలను దేశభాషలలోనికి తీసుకొని రావలసిన అవసరం వచ్చింది.వేంగి దేశాన్ని పాలించిన తూర్పు చాళుక్య ప్రభువు, రాజరాజ నరేంద్రునిచేత (సా.శ.1019–1061) ఆ కార్యక్రమం ప్రారంభింపబడినది. రాజమండ్రి అనే రాజమహేంద్రవరాన్ని స్థాపించి, పాలించినవాడాయన. తన మంత్రి, గురువు ఐన నన్నయ భట్టారకుని పిలిచి లక్ష శ్లోకాల సంస్కృతభారతమును తెనిగించమని కోరాడు. నన్నయ జన్మస్థలం తణుకు అని చెబుతారు. ఆయన భారతాంధ్రీకరణం మొదలుపెట్టి తన జీవిత కాలంలో ఆది, సభా పర్వాలను, ఆరణ్యపర్వంలో కొంత భాగాన్ని అనువదింఛాడు.
1. కావ్యారంభం
శ్రీ వాణీ గిరిజాశ్చిరాయ దధతో వక్షోముఖాఙ్గేషు యే
లోకానాం స్థితి మావహంత్య విహతాం స్త్రీపుంస యోగోద్భవాం
తే వేదత్రయమూర్తయ స్త్రీపురుషా స్సంపూజితా వస్సురై
ర్భూయాసుః పురుషోత్తమాంభుజభవ శ్రీకంధరా శ్శ్రేయసే
లక్ష్మీ దేవిని వక్షస్థలాన ధరించిన విష్ణువూ, సరస్వతిని ముఖమున ధరించిన బ్రహ్మ, పార్వతిని తన అర్ధ భాగంగా కలిగిన మహేశ్వరుడు - ఈ త్రిమూర్తులూ లోకాలను రక్షించేవారు. అవిహితమైన స్త్రీ, పురుష యోగోద్భవమైన లోకముల స్థితి వారు కలిగించుచున్నారు. వేదస్వరూపులు, దేవతాపూజ్యులు, పురుషోత్తములు, అట్టి ముమ్మూర్తులు మీకు శ్రేయస్సు కలుగజేతురు గాక. -- మహాభారతాంధ్రీకరణలో మొదటిగా నన్నయ చెప్పిన సంస్కృత శ్లోకం ఇది. తెలుగు సాహిత్యానికి శ్రీకారం.
2. మహా భారత ప్రాశస్త్యం
ధర్మ తత్త్వజ్ఞులు ధర్మ శాస్త్రంబని | యధ్యాత్మవిదులు వేదాంతమనియు
నీతివిచక్షుణుల్ నీతి శాస్త్రంబని | కవివృషభుల్ మహాకావ్యమనియు
లాక్షణికులు సర్వలక్ష్య సంగ్రహమని | యైతిహాసికులితిహాసమనియు
బరమ పౌరాణికుల్ బహుపురాణ సముచ్చ| యంబని మహా గొనియాడుచుండ
వివిధవేద తత్త్వవేది వేదవ్యాసు | డాదిముని పరాశరాత్మజుండు
విశ్వసన్నిభుండు విశ్వజనీనమై | పరగుచుండ జేసె భారతంబు
3. సభలో ఎలా మాట్లాడాలి?
మనమునకుఁ బ్రియంబును హిత
మును బథ్యముఁ దథ్యమును నమోఘము మధురం
బును బరిమితమును నగు పలు
కొనరఁగ బలుకునది ధర్మయుతముగ సభలన్
తెలుగు మహాభారతం ఆంధ్రదేశమంతా బహుళ ప్రచారం పొందినది. "వింటే భారతం వినాలి" అనిపించింది. నేటి వరకు దీనిని మించినదిలేదు. గత వేయి సంవత్సరాలలో అభివృద్ధిచెందిన తెలుగు భాషకు, దానికి కారణమైన ఆంధ్రమహాభారత గ్రంధానికీ నిరాదరణ వస్తుందా? అనే అనుమానం 21వ శతాబ్దపు భారతదేశ లక్షణం. ఇప్పుడు 25-45 సం. వయస్సులోనివారు ఎందరికి కవిత్రయం భారతంతో పరిచయంఉంది? ఈ ప్రశ్నకు సమాధానం, నన్నయగారి శిలా ప్రతిమ కంటే ముఖ్యం. 5000 ఏళ్ళనాటి మహాభారతగాధను తెలుగు భారతం సామాన్యులకు అందించింది. దేశమంతా రామాయణము ప్రసిద్ధము,లోకప్రియము. కేవలము ఆంధ్రులకు భారతం అత్యంత ప్రియమైన గ్రంధం. 21వ శతాబ్దంలో భారతాన్ని చదువుకుంటే, శ్రీకృష్ణుని పూజిస్తే, భారతీయ సంస్కృతిని, భారతదేశాన్ని రక్షించుకోగలము. మహాభారతానికి, భారతదేశానికి మధ్య ఉన్నది అవినాభావ సంబంధం.