Showing posts with label సృష్టి కథ. Show all posts
Showing posts with label సృష్టి కథ. Show all posts

Friday, January 19, 2018

పరిశుద్ధగ్రంధం - ఆదికాండము - సృష్టి కథ

మతాలను తులనాత్మకముగా చూడండి. ఉదాహరణకు బైబిలు లోను, ఒక పురాణంలోను సృష్టి వృత్తాంతాలను చూడంది.

పరిశుద్ధ గ్రంధపు ఆదికాండములో మొదటి, రెండవ వాక్యములు - ఆదియందు దేవుడు భూమ్యాకాశములను సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను; చీకటి అగాధ జలము పైన కమ్మియుండెను; దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను... ..................... దేవుడు నేలమట్టితో ఆదాము అనే నరుని సృష్టిస్తాడు. అతని సహచరియైన హవ్వయనే స్త్రీని ఈ విధముగా సృష్టిస్తాడు. “దేవుడైన యెహోవా ఆదామునకు గాఢనిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చి వేసెను. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీగా నిర్మించి ఆమెను ఆదామునొద్దకు తీసికొనివచ్చెను.” వారి సంయోగము వలన పుట్టిన పిల్లలతో నరజాతి ఆవిర్భవిస్తుంది.
దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను; స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. దేవుడు వారిని ఆశీర్వదించెను; ఎట్లనగా మీరు ఫలించి, అభివృద్ధిపొంది, విస్తరించి, భూమిని నిండించి దానిని లోపరచుకొనుడి; సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమిమీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను.
మత్స్య పురాణము - సృష్టి
అమరులలో ప్రథముడు బ్రహ్మ. ఆయనను పితామహుడు అంటారు. జీవకోటి అంతా ఆయనకు పుత్రసములైన మనువుల, ప్రజాపతుల సంతానం. సృష్టికి ముందు బ్రహ్మ ధ్యానములో నిమగ్నుడైనాడు. బ్రహ్మ ముఖంనుండి మొదట సాంగోపాంగంగా వేదాలు, తరువాత పురాణాలూ, శాస్త్రాలూ, ప్రత్యక్షాది అష్ట ప్రమాణాలు ఆవిర్భవించాయి. పూర్వసృష్టి స్ఫురణతో పునః సృష్టి చేయదలచిన బ్రహ్మ వలన మరీచి, అత్రి, అంగీర, పులస్త్య, పులహ, ప్రచేత, క్రతు, వశిష్ఠ, భృగు, నారదులనే పది మంది ఋషులు ఆయన మనస్సు నుండి ఉత్పన్నమైనారు. ఆయన దక్షిణ అంగుష్ఠమునుండి దక్షుడనే ప్రజాపతి, ఛాతీనుండి ధర్ముడు, హృదయమునుండి కుసుమాయుధుడు ఉద్భవించారు. అరచేతి నుండి భరతుడనే రాజు, తరువాత అంగజ అనే రాజకన్య ఉద్భవించారు. వీరిద్దరిని బ్రహ్మ-సూనుడు, బ్రహ్మ-సుతా అన్నారు. అలాగే పెదవులనుండి లోభము, కనుబొమలనుండి క్రోధము వచ్చాయి. బుద్ధి నుండి మోహము, అహంకారమునుండి మదము, కంఠము నుండి ప్రమోదము, కనులనుండి మృత్యువు బహిర్గతమయ్యాయి.
ఈబుద్ధి, అహంకారము వంటివి బ్రహ్మ వద్దకు ఎలావచ్చాయని మనువు మత్స్యరూపములోని విష్ణువును అడిగాడు. మత్స్య రూపములోని హరి సమాధానముగా మూల ప్రకృతిలో సత్త్వరజోతమో గుణాలు సమంగా ఉంటాయి. సృష్టికి సంకల్పం జరిగినప్పుడు ప్రకృతి మహత్ అనే బుద్ధిగా, అది అహంకారంగా, పంచ తన్మాత్రలుగా, పంచభూతములుగా ఇంద్రియములుగా మొత్తము 24 తత్త్వాలుగా పరిణామం చెందుతున్నదని చెప్పే సాంఖ్యదర్శనాన్ని బోధిస్తాడు. ఈ పురాణం అదనపు తత్త్వాలుగా పురుషుడు (జీవాత్మ), శరీరములను చెబుతుంది.
మానసపుత్రులు సంతానోత్పత్తికి విముఖులై తపస్సుకు వెళ్ళిపోతారు. అప్పుడు సృష్టికి ప్రకృతి అవసరము గుర్తించి లోక సృష్టి కై బ్రహ్మసావిత్రిని మనసులో ధరిస్తాడు. తనను తాను స్త్రీ పురుష రూపములు గల అర్థభాగములుగా విభజించుకుంటాడు. (స్త్రీ రూపమర్ధం కరోత్ అర్ధం పురుష రూపవత్) అప్పుడు శతరూప, సావిత్రి, సరస్వతి, గాయత్రి, బ్రహ్మాణి పేర్లుగల స్త్రీమూర్తి ఉద్భవిస్తుంది

ఒక మహాత్ముని నూరేళ్ళక్రితం ఉవాచ - ఈ విశ్వాన్ని ఒక భగవంతుడు సృష్టిస్తే, ఆయనకు సృష్టిలోని అందరిపై సమభావం ఉంటే, వేదాలు మనుష్యులు వ్రాసినవి కాక దేవుని వాక్కులైతే, ఆయన ఇప్పుడు ఎవరికీ అర్థం కాని సంస్కృతంలో ఎందుకు వ్రాశాడు? - ఆయన పేరు అనవసరము. కాని ఆరోజుల్లో సామాన్య శ్రోతలు చప్పట్లు కొట్టి ఉంటారు. మత గ్రంధాలు పురోహితవర్గం యొక్క మనుగడకై వ్రాయ బడ్డాయి. అని ఆయన సిద్ధాంతం. ఇది ఒకరి సిద్ధాంతం కాదు. చాలా పూర్వం చార్వాకుడనే మహర్షి ఈ విధంగా చాలా ఆలోచించాడు. సాయణ మాధవాచార్యుని సర్వదర్శన సంగ్రహంలో ఇది మొదటి దర్శనం. భారతీయ వేదాంతంలో మొదటి మెట్టు. వేదకర్మలను నిరసించిన వారిలో గౌతమబుద్ధుడు ఒకడు. వేదకర్మలను నిరసించి, వేదాంతాన్ని, యోగాన్ని బోధించాడు ఆయన. ఇది రెండవమెట్టు. ఇలా అన్ని దర్శనాలనూ చర్చించాక ఆఖరున వచ్చేది భారతీయ దర్శనాలలో శిరోమణి ఐన శంకరా ద్వైతం.

The Structure of the Universe (Vedic) - Viswaroopa - K. Sivananda Murty Preface 2

https://www.facebook.com/vallury.sarma/posts/616984388338978 The Puranas speak of individuals going up and down between these proximate...