Showing posts with label Sri Rama. Show all posts
Showing posts with label Sri Rama. Show all posts

Thursday, January 25, 2018

శ్రీరాముని తరువాత అయోధ్యను ఎవరు పాలించారు?

https://www.facebook.com/vallury.sarma/posts/562957263741691

https://www.facebook.com/vallury.sarma/posts/563687410335343

https://www.facebook.com/vallury.sarma/posts/564352846935466

అయోధ్య శ్రీరాముని రాజధాని.జన్మభూమి. నాడు (ఉత్తర) కోసల దేశానికి ముఖ్యనగరం. సూర్య వంశీయులు బహుకాలం పాలింఛారు. 400 ఏళ్ళనాడు బాబర్ సేనాని మీర్ బాకీ ముఖ్య దేవాలయాన్ని ధ్వంసంచేసి మసీదుకట్టాడు. అది జన్మభూమి మసీదు అనే వ్యవహారింపబడేది. లక్నో ఉత్తర ప్రదేశ ముఖ్య పట్టణం. లక్ష్మణునిచేత నిర్మింపబడిన లక్ష్మణపురి అది. లఖనపురి, లఖనవూ, లక్నో. బహుకాలం నవాబుల పాలనలో ఉంది. అయోధ్య ఫైజాబాద్ జిల్లాలోది. రామజన్మభూమికి కొద్దిమంది సన్యాసుల యాత్రను ములాయం, అఖిలేష్ ల ప్రభుత్వం అడ్డుకుంటూంది. ఇది లేని సమస్యను సృష్టించడం. అయోధ్యలో ఇదివరకు కరసేవకులపై ములాయం సర్కారు విచక్షణా రహిత కాల్పులు తెలిసినవే. దాని పరిణామాలు కూడా అందరికీ తెలుసు.రామ లక్ష్మణులను రెండు రాష్ట్రాలలో ఉంచడం క్షేమం. శ్రీరాముని దయచేతను ఉత్తరప్రదేశ్ కు విభజన తక్షణ అవసరం.

Krishna Mohan Mocherla ఉత్తరప్రదేశ్ కు విభజన తక్షణ అవసరం. .రామ లక్ష్మణులను రెండు రాష్ట్రాలలో ఉంచడం క్షేమం
Satyanarayana Piska "ఉత్తరాఖండ్" ఆవిర్భవించినది ఉత్తరప్రదేశ్ విభజన వల్లనే కదా!Krishna Mohan Mocherla .రామ లక్ష్మణులను రెండు రాష్ట్రాలలో ఉంచడం క్షేమం
శ్రీరాముని తరువాత అయోధ్యను ఎవరు పాలించారు?
ఈ ప్రశ్నకు సమాధానం కాళిదాసు రఘువంశంలోనే దొరుకుతుంది. శ్రీ రాముడు తన అవతార సమాప్తికి ముందే తన కుమారులైన కుశ లవులకు, తమ్ములకుమారులకు చిన్న చిన్న రాజ్యాలు ఇచ్చాడని చూచాము. వారంతా రాముడు జీవించియుండగానే ఆ యా రాజ్యాల పాలనను స్వీకరిస్తారు. అందులో కుశునికి కుశావతి అనే నగరం కేంద్రముగా చిన్న రాజ్యం లభిస్తుంది. ముందు లక్ష్మణుడు తరువాత శ్రీరాముడు తమ మానవదేహాలను త్యజించి వైకుంఠవాసులౌతారు. అయోధ్యానగర పౌరులు అనేకులు కూడా శ్రీరామునితోబాటుగా సరయూనదిలో జలప్రవేశం చేస్తారు. అయోధ్య కళావిహీనమౌతుంది. కొంతకాలానికి కుశావతిలో రాజభవనంలో నిద్రిస్తున్న కుశునికి ఒక రాత్రి ఒక కల వస్తుంది. అయోధ్యానగర అధిదేవత దర్శనము ఇచ్చినది. అయోధ్యకు తిరిగివచ్చి పాలనను చేపట్టమని, పూర్వవైభవం చేకూర్చమని ఆదేశిస్తుంది.
ఆమెకోరికను శిరసావహించి కుశుడు అయోధ్యకు తిరిగి వస్తాడు. సింహాసనం అధిష్ఠిస్తాడు. కొన్ని రోజులలోనే అయోధ్య తిరిగి కళకళలాడుతుంది. ప్రజలు ఆనందంగాఉంటారు. ఒక దినం కుశుడు సరయూనదిలో జలక్రీడలు సలుపుతుండగా అతడి కేయూరమనే ఆభరణం నదిలో పడిపోతుంది. వెదకినా దొరకదు. ఆనదిలో నివాసం ఏర్పరచుకున్న నాగవంశీయుడు కుముదుడు ఆ ఆభరణాన్ని తీసి ఉంటాడని అనుమానించి కుశుడు అస్త్రప్రయోగం చేయబోతాడు. కుముదుడు ఆభరణంతో నది వెలుపలికి వాచ్చి తాను కేవలం కుతూహలంతో దానిని తీసినట్లు చెబుతాడు. తరువాత తన సోదరి కుముద్వతిని వివాహంచేసుకొమ్మని అడుగుతాడు. కుశుడు అంగీకరించి ఆమెను తన రాణిగా చేసుకుంటాడు. వారికి అతిథి అనే కుమారుడు కలుగుతాడు. కుశుని తరువాత అతడు అయోధ్యను పాలిస్తాడు.. గొప్ప రాజనీతికోవిదుడు. కాని దుర్జయుడనే అసురునిచేతిలో మరణిస్తాడు.
తరువాత 21 రాజుల పేర్లు రఘువంశం చెబుతుంది. 21వ తరము రాజు సుదర్శనుడు. అతడికుమారుడు అగ్నివర్ణుడు. స్త్రీలోలుడు. క్షయ వ్యాధితో మరణిస్తాడు. తరువాత ఆవంశంలో గుర్తుంచుకోవలసిన వారులేరు. మహాభారత కాలంలో వారి వంశీయుడు కౌరవులతరఫున యుద్దంచేసి మారణిస్తాడు. అయోధ్య సప్త పుణ్యనగరాలలో ఒకటిగా కీర్తి పొందింది. బాబరు అయోధ్యపై దాడిచేసిన ఆధునిక అసురుడు.

రాముని తరువాత అతనిరాజ్యం శత్రుఘ్నునికి, అతడి పుత్రునికి వచ్చినది. ఈ వాక్య నిర్మాణంలో పొరబాటు ఉంది. రాముని జీవితకాలంలోనే రాజ్యం విభజింపబడి, లవ కుశులకు, తమ్ముల కుమారులకు పంచబడినది. అయోధ్య శత్రుఘ్నునకు రాలేదు. అతనికి, కుమారులకు వచ్చినది మధుర. అయొధ్యకు తరువాత పాలకుడైన వాడు కుశుడు. తరువాత అతని కుమారుడు అతిథి. రఘువంశ గాథను ఇంకొక చోట చెప్పాను.


శ్రీ రాముని వంశపు వారు

https://www.facebook.com/vallury.sarma/posts/562238717146879

https://www.facebook.com/vallury.sarma/posts/562748893762528

https://www.facebook.com/vallury.sarma/posts/562876203749797

seshu bandaru - supplementary information to that given by Rammohan rao garu

కాళిదాస మహాకవి రఘు వంశము శ్రీ రాముని పూర్వజులను, తరువాత వారిని గురించి చెబుతుంది. రఘు మహారాజు విశాల సామ్రాజ్యాన్ని సంపాదించాడు. సింధునది, గాంధారముపైన కూడా అతని రాజ్యమే. దక్షిణ, తూర్పు, భారతదేశంలో పశ్చిమ ప్రాంతాలకు కూడా రాజ్యం విస్తరింపచేశాడు. రామ లక్ష్మణ భరత శత్రుఘ్నుల సంతానాన్ని చూదాము. నలుగురు అన్నదమ్ములకు ఒకొకరికి ఇద్దరు కుమారులు.
శత్రుఘ్నుదు - భార్య శ్రుతకీర్తి, పుత్రులు - బహుశ్రుతుడు, మథుర రాజు, సుబాహు విదిశా రాజు మధురను మధువు అనే శివభక్తుడైన రాజు నిర్మించాడు. అతనిపేరే నగరానికి వచ్చింది. అతను శివునివరంగా ఒక త్రిశూలాన్ని పొందాడు. మధువుభార్య కుంభిని, రావణుని సోదరి. వారికుమారుడు లవణాసురుడు. ఆ త్రిశూలాన్ని చూచుకొని దుష్టశక్తిగా పరిణమించాడు. శత్రుఘ్నుడు అతడిని జయించాడు. రాముని తరువాత అతనిరాజ్యం శత్రుఘ్నునికి, అతడి పుత్రునికి వచ్చినది.
భరతుడు - భార్య మాండవి,పుత్రులు - తక్షుడు, పుష్కలుడు, కేకయ దేశపు రాజైన భరాతుని మేనమామ కేకయ రాజు కోరికపై భరతునికి సింధుదేశం ఇచ్చారు. తక్షుడు నిర్మించిన పురం తక్షశిల (నేటి టాక్సిలా) , పుష్కలునిది పుష్కల (పురుషపురం, నేటి పెషావర్. ఇదంతా నేటి పాకిస్తాన్. వారు గాంధార దేశాన్నికూడా జయించారు.(నేటి కాందహార్). వారే గంధర్వులని ఒక విశ్వాసం ఉన్నది. వారి ఆయుధాలను వశపరచుకుని వారిని సంగీత వాద్యాలు ధరించ మన్నారుట. కేకయ బెలూచిస్తాన్, బోలను కనుమలు దాటాక కాస్పియన్ సముద్రతీరానికి వెళ్ళే మార్గంలోని దేశము. (నేటి కజక్ స్తాన్) కావచ్చును.
లక్ష్మణుడు - భార్య ఊర్మిళ, పుత్రులు అంగదుడు, చంద్రకేతువు, కరపథ రాజ్యం వారికి వచ్చినది. అది నేటి మధ్య ప్రదేశ్ లో ఒక గ్రామం.
ఇక సీతారాముల పుత్రులైన లవ కుశులకు శరావతి, కుశావతి అనే రాజ్యాలు వచ్చాయి.కుశావతి వింధ్య సమీపంలో ఉన్నది. శరావతి ఇదమిద్ధంగా తెలియక పోయినా, లవుడు నిర్మించిన నగరంగా పాకిస్తాన్ - పంజాబ్ లోని లాహోరును చెబుతారు. ఇది పూర్వం లవపురి అనిపిలువబడేది. నేటికీ లాహోర్ విశ్వవిద్యాలయంలో అత్యుత్తమ సంస్కృత భాండా గారము ఉంది. విదేశీయులు వాడుతున్నారు. మనం విస్మరించిన భాష. తిరుమల రామచంద్ర గారు (హంపీనుండి - హరప్పా దాకా వ్రాసిన వారు) అక్కడ పనిచేశారు.శిఖ్ఖు ప్రభువు రంజిత్ సింగ్ రాజధాని.


Satyanarayana Piska శ్రీరాముని తర్వాత అయోధ్యానగరం శత్రుఘ్నుని పాలనలోనికి రావడం ఆశ్చర్యంగా ఉంది. ఎందువల్ల అలా జరిగింది?Vvs Sarma రాముని తరువాత అతనిరాజ్యం శత్రుఘ్నునికి, అతడి పుత్రునికి వచ్చినది. ఈ వాక్య నిర్మాణంలో పొరబాటు ఉంది. రాముని జీవితకాలంలోనే రాజ్యం విభజింపబడి, లవ కుశులకు, తమ్ముల కుమారులకు పంచబడినది. అయోధ్య శత్రుఘ్నునకు రాలేదు. అతనికి, కుమారులకు వచ్చినది మధుర. అయొధ్యకు తరువాత పాలకుడైన వాడు కుశుడు. తరువాత అతని కుమారుడు అతిథి. రఘువంశ గాథను ఇంకొక చోట చెప్పాను.Satyanarayana Piska శర్మగారూ! మన్నించాలి. పైన చివరి పేరాలో కుశునికి కుశావతి అనే రాజ్యం వచ్చిందని చెప్పబడింది. మరి, ఇప్పుడు కుశుడు అయోధ్యకు పాలకుడైనాడని చెప్తున్నారు...... ఈ తికమకను కాస్త స్పష్టం చేయ మనవి.https://www.facebook.com/vallury.sarma/posts/562748893762528
చాలా సంవత్సరాల క్రితం టీవీలో రామానంద సాగర్ టీవీ సీరియల్ ప్రసారమయ్యే రోజులలో కర్ణాటక తమిళనాడులలో ఒక వాదన వినిపించింది. ఉత్తరభారతీయులు కన్నడిగులను వానరులుగాను, తమిళులను రాక్షసులుగా చిత్రిస్తున్నారు. మనం టీవీ స్టూడియోలముందు ప్రదర్శనలు చేయాలని కొందరు పౌరులు ఉత్సాహ పడ్డారు. కాని కొందరు పెద్దలు "దీని వలన ప్రయోజనం ఏముంది? మన ఊహాపోహలను మనమే బలపరచినట్లు ఔతుంది కదా" అన్నారు. ఆనాటి ప్రజలు అర్థంచేసుకొని వెనుదిరిగారు.
ఇప్పుడు ఇది ఎందుకు అవసరం వచ్చినది? నాకు అప్పుడే అనుమానం వచ్చినది, రామాయణకాలంలో ఆంధ్ర ప్రదేశంలోని ప్రజలు ఎవరా? అని. అప్పుడు ఈ రాష్ట్రాలు లేవు కదా! రామాయణ కాలంనాటి ప్రజానీకమే ఇప్పుడూ ఉంది, వేషము మార్చెను,భాషను మార్చెను ఐనా మనిషి మారలేదు. నాయకులూ గోల్కొండలో ఐనా హస్తినలో ఐనా కూడా ప్రజలోనివారేకదా.https://www.facebook.com/vallury.sarma/posts/562876203749797

గీత, బైబిలు, ఖురాను లనుండి ఒకొక వాక్యంతీసుకుని ఆలోచిస్తే ఈ వాక్యాల నుండి అన్ని మతాలూ ఒకటే అన్న సిద్ధాంతం రాదు. పుస్తకాలకు స్థాలీ-పులాక న్యాయం వర్తించదు. దీనినుండి తర్క సమ్మతంగా వచ్చే నిర్ధారణ ఇదే - అన్ని పుస్తకాలలోనూ ఒకటైనా మంచివాక్యం ఉంటుంది. ఇది మాత్రం చెప్పగలము. ఈలాజిక్ ప్రమాదకరం.

The Structure of the Universe (Vedic) - Viswaroopa - K. Sivananda Murty Preface 2

https://www.facebook.com/vallury.sarma/posts/616984388338978 The Puranas speak of individuals going up and down between these proximate...