Showing posts with label పంచాంగ శ్రవణం. Show all posts
Showing posts with label పంచాంగ శ్రవణం. Show all posts

Sunday, January 21, 2018

పంచాంగ శ్రవణం - రాజకీయ పార్టీలు, నాయకులు

https://www.facebook.com/vallury.sarma/posts/509477412423010

రాధాకృష్ణగారు 2010 ఉగాదివ్యాసాన్ని ఉగాది సందర్భంగా మనముందుంచారు. అప్పుడదియెంత ముఖ్యమో, అవసరమో ఇప్పుడూ 2013లోనూ అంతే.దేశ పరిస్థితులూ మారలేదు. చంద్రుడు, సహస్ర కిరణుడు సూర్యుడు, పంచాంగం వినడం అనే కార్యక్రమం అవసరమే. అది దేశ సంస్కృతిని నిలబేట్టడం. నలుగురు పురోహితులకు దక్షిణలూ మంచిదే. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం, లోకాః సమస్తాః సుఖినో భవంతు. అందరికీ మంచిదే. 2013 సామాన్య శకం కాలెండరును పనికట్టుకు వినం. 2013 ఏప్రిల్ 11 అనే దినానికి ఏలాంటి ప్రాముఖ్యమూలేదు. ఆ కాలెండరులో కాస్త ఒకటోతారీకు మంచి రోజు. జీతాలో, పెన్షనులో వస్తాయి. లక్ష్మీ కటాక్షం. డిసెంబరు 31 అర్థ రాత్రి అమృతఘడియలు. తాగి తందనాలాడి Happy New Year చెప్పుకోవచ్చు.
అసలు పంచాంగం అంటే ఏమిటి? కాల గణన. తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణం, ... ఇవి ఎలా వస్తున్నాయి, సూర్యుడు చంద్రుడు, భూమి గమనం వలన, సూర్యుడు మేషాది రాశులలోకి వచ్చినప్పుడు సంక్రమణాలు, ఏప్రిల్ 14న మేష సంక్రమణం వస్తున్నాయి. చాంద్రమాన మాసానికి 27 రోజులే అందుకే 13 నెలలు వస్తున్నాయి. రెండు నక్షత్రాలు (సూర్యుడు, చంద్రుడు) 5 గ్రహాలు ( బుధ,కుజ, గురు, శుక్ర, శని) రెండు ఛాయాగ్రహాలు (రాహు, కేతు) - వీటి చలనం భూమిపైనున్న జీవుల మీద ప్రభావం చూపిస్తుందని మన విశ్వాసం. అవి కాలమే తానైన పరమేశ్వరాధీనంలో ఉండి, వ్యక్తులకు, ప్రాంతాలకు, దేశలకు ఫలాల నిస్తాయి. ఆఫలాలు నిజంగా వ్యక్తుల, సమాజాల, ప్రాంతాల పూర్వ కర్మ ఫలాలు. వానిని నిర్ణయించేది దైవం. పంచాంగం ఆధారంగా ఆఫలాలను గుర్తించిచెప్పేవాడు దైవజ్ఞుడు. దైవం అంటే destiny. పరమేశ్వరుడు కాడు. ఈ కర్మ ఫలాలు ఎక్కడ రాసిపెట్టి ఉంటాయి? చిత్రగుప్తుడి చిట్టా అనేది కథ, పురాణ కథ మనకి నచ్చేటట్లు చెప్పడానికి. DNA ఎక్కడ ఉంటుంది? మన శరీరంలోనే కదా. అలాగే శరీరం జీవుణ్ణి (జీవాత్మను) అధారంచేసుకొని ఉంటుంది. ఈ కర్మ ఫలాలు దాని memoryలో ఉంటాయి. అవి శాశ్వతాలు. మళ్ళీ జన్మెత్తినప్పుడు కూడా వెంట వస్తాయి. దుష్ట గ్రహాలు. శుభగ్రహాలు అంటాం. నిజంగా అవి మన పూర్వ కర్మలకిచ్చే ఫలాలు. గ్రహాలకు, వాటి అధిదేవతలకు మనమీద ప్రత్యేక ప్రేమా లేదు, ద్వేషమూలేదు. దేవుని 33 కోట్ల దేవతల establishmentలో అవినీతి లేదు,బంధుప్రీతి లేదు. పంచాంగం కాలగణనం. దాన్ని గుణించడం శాస్త్రం. వ్యక్తులకు, పార్టీలకు, ఫలితాలు చెప్పడం కళ. పిలిచి చెప్పించుకున్నవారికి ప్రియంగా ఉండేటట్లు చెప్పడం జ్యోతిష్కుని శక్తి-యుక్తులను బట్టి ఉంటుంది. మెప్పించడం ఒక కళ. Mundane Astrology గ్రహ గతులను బట్టి దేశస్థితిని ఉహించడం. దేశ పాలన అనే రంగస్థలం మీద రాజకీయనాయకులందరికీ పాత్ర ఉంటుంది.ఇప్పుడు తెదేపా, వైకాపా చూడండి ఇంకా ఉన్నాయికదా! తెలంగాణా భవిష్యత్తుస్థితిని గురించి పదేళ్ళనుండి జోస్యాలు వింటున్నాము. ఏమో నందోరాజా భవిష్యతి అన్నట్లు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కావచ్చును. ఆంధ్ర ప్రదేశ్ నాలుగు రాష్ట్రాలు కావచ్చును. సంభావ్యతను (possibility, probability) చెప్పెది జ్యోతిషం.రోగి ఎంతకాలం బతుకుతాడు, ఆంధ్ర ప్రదేశ్ ఎంతకాలం బతుకుతుంది? - అన్నీ జ్యోతిష్కులకు ఉచితమైన ప్రశ్నలే.


Nandiraju Radhakrishna నేను పంచాగాన్ని, దాని ప్రాశస్త్యాన్ని ప్రశ్నించలేదు. ప్రశ్నించను కూడా.. అయితే పండితులన్న వారు, సిద్ఢాంతులన్నవారు సంభావనలకు ఆశపడి, ప్రచారానికి పాకులాడి మార్కెట్ పెంచుకునే ధొరణిలో శాస్త్రాన్ని పదిమందిలో చులకన చేస్తున్నారని మాత్రమే ఆవేదన. నిజమే మీరన్నట్లు 2010 కి 2013కు తేడాలేదు. అప్పుడదియెంత ముఖ్యమో, అవసరమో ఇప్పుడూ 2013లోనూ అంతే.దేశ పరిస్థితులూ మారలేదు. అదేమాదిరి పంచాంగ పఠన పండితుల్లోను మార్పులేదు. నిన్నటికి నిన్న చూడండి ప్రభుత్వ పంచాగం, కాంగ్రెస్ పంచాగం, వైకాపా పంచాంగం, తెలుగుదేశం పంచాంగం, బిజేపి పంచాంగం.. అనీ ఎవరికి వారికి వంతపాడి భజన చేశారు.ఈ సారి మరి ఎందుకో తెరాస పంచాంగం విప్పలేదు. కమ్యూనిస్టుల "పంచ అంగాలు" వేరు. అందుకే అవి ఈ ప్రక్రియలో పాలుపంచుకోలేదు. పత్రికలు, చానళ్ళు తమకు అనుకూలంగా రాసుకుంటాయి దినవారీ పంచాంగాలు . ఈ రాజకీయ పంచాంగాలు వింటుంటే పూర్వం ఆకాశవాణిలో "వాతావరణం", గుర్తొస్తున్నది."ఆకాశం మేఘావృతమై ఉరుములతొ కూడిన జల్లులు కురుస్తాయి." అనిచెబుతుంటుంది, ఆరోజల్లా ఎండలు మండిపోయేవి. వాతావరణం వింటూ జనాలు కిటికీల్లోనుంచి చేతులు బయటపెట్టి చూసి నవ్వుకునేవారు. .. అలాగే దిన, వార, మాస పత్రికల్లో జ్యోతిష ఫలాలు కూడా. శాస్త్రాలను తప్పుపట్టడంలేదు. వాటిని తాకట్టుపెట్టడాన్ని గురించి మాట్లాడుతున్నాను.నాకు తెలిసి గతంలొ దేశ, రాష్త్ర అంశాల్లొ సూచన ప్రాయంగ మార్పులు, విపత్తులు వివరించి హెచ్చరికలు చేసేవారు.

The Structure of the Universe (Vedic) - Viswaroopa - K. Sivananda Murty Preface 2

https://www.facebook.com/vallury.sarma/posts/616984388338978 The Puranas speak of individuals going up and down between these proximate...