Showing posts with label Hinduism. Show all posts
Showing posts with label Hinduism. Show all posts

Thursday, January 25, 2018

షిర్డీ సాయిమందిరాలు హిందూ దేవాలయాలు కావు

https://www.facebook.com/vallury.sarma/posts/598821680155249

నాగార్జున కావూరి - నేను పర మత ద్వేషిని కాను. కాని హిందూ మతమంటే అభిమానం. మీరు చూస్తున్న ఈ చిత్రం మాస్కో నగరం లోని ఒక హిందూ దేవాలయం. ఒక విదేశీ వనిత ఓ హిందూ యువకునికి శటగోపం పెడుతుంది. నేనైతే దీన్ని ఆహ్వానిస్తాను. అలాగే మంచి చెడులు చెప్పే గంటల పంచాంగంలో, కొంతమంది పురుషులకు కొన్ని మాసాల్లో స్త్రీ సౌఖ్యం ఉంటుందని(ఎక్కువ, తక్కువ) రాస్తారు. మరి మహిళలకు పురుష సౌఖ్యం గురించి ఎందుకు రాయరూ? ఇలాంటి సౌఖ్య ప్రస్తావన అనవసరం అని నా భావన. గ్రామాల్లోన్నూ పూజారులు కరవయ్యారు. కనుక ఇకనుండి గర్భగుడి కాకుండా భక్తుడు సరాసరి దేవుని దగ్గర కొబ్బరి కాయ కొట్టుకుని, దణ్ణం పెట్టుకుని వచ్చేట్లు దేవాలయాలు ఉండాలి (షిర్డీ సాయి మందిరాల్లాగా). హేతుబద్దంగా ఆలోచించి కొన్ని నమ్మకాలకు తప్పనిసరిగా పాతరేయాలి. అపుడే హిందూ మతం ప్రజ్వలిస్తుంది. కొసమెరుపు ప్రశ్న:- LIC పాలసీ మంచి ముహూర్తంలో చేయాలా? దుర్ముహూర్తంలో చేయాలా? 



V V S Sarma

మీకు హిందూ మతం అంటే అభిమానం ఉన్నది. హిందూ మతసంస్థలు బాగు పడాలనీ కాలానుగుణంగా మారాలనీ తపన ఉన్నది. కాని చాలామంది ఆధునికుల వలెనే మీకు సనాతన ధర్మంపై అవగాహనలేదు. మీరు వ్రాసినదానిలో ఏవాక్యమూ హేతుబద్ధంగా లేదు.

1. నేను పర మత ద్వేషిని కాను. ----- మీ రాగద్వేషాలు, అభిప్రాయాలు మీ ఇష్టం. మిగతావిషయానికి దీనికి సంబంధంలేదు.

2. మీరు చూస్తున్న ఈ చిత్రం మాస్కో నగరం లోని ఒక హిందూ దేవాలయం. ఒక విదేశీ వనిత ఓ హిందూ యువకునికి శటగోపం పెడుతుంది. నేనైతే దీన్ని ఆహ్వానిస్తాను. --- --- మీరుచెప్పిన విదేశీ వనిత గుడిలో అర్చకత్వం నిర్వహిస్తూంది. విదేశీ అనేది ప్రశ్నయే కాదు. ఆమె హిందూ స్త్రీ. ఇది మనదేశంలోనూ ఈనాడు జరుగుతున్నది. మహారాష్ట్రలో స్త్రీలు పౌరోహిత్యం చేస్తున్నారు. కాథొలిక్ గా జన్మించిన అమెరికన్, పండిత వామదేవశాస్త్రి (డేవిడ్ ఫ్రాలే) సద్బ్రాహ్మణుడే! ఋగ్వేదము, ఆయుర్వేదము, జ్యోతిషము, యోగ శాస్త్రము చదువుకున్నాడు. నా ఫేస్ బుక్ మిత్రుడు కూడా. జిల్లేళ్ళమూడీ ఆలయంలో మహిళలు రుద్రంతో అమ్మకు అభిషేకం చేస్తారు. శివరాత్రినాడు తిరువణ్ణామలైలో అర్థరాత్రి అభిషేకంలో అనేక విదేశీయులు ఉంటారు. ఇస్కాన్ లో అనేకులు విదేశీయులే. భారతదేశంలో కంటె విదేశాలలోనే ఇప్పుడు సంస్కృత విద్యకు ఎక్కువ ప్రోత్సాహం ఉంది. 

3. గ్రామాల్లోన్నూ పూజారులు కరవయ్యారు. కనుక ఇకనుండి గర్భగుడి కాకుండా భక్తుడు సరాసరి దేవుని దగ్గర కొబ్బరి కాయ కొట్టుకుని, దణ్ణం పెట్టుకుని వచ్చేట్లు దేవాలయాలు ఉండాలి (షిర్డీ సాయి మందిరాల్లాగా). హేతుబద్దంగా ఆలోచించి కొన్ని నమ్మకాలకు తప్పనిసరిగా పాతరేయాలి. అపుడే హిందూ మతం ప్రజ్వలిస్తుంది. ---- -- షిర్డీ సాయిమందిరాలు హిందూ దేవాలయాలు కావు. షిర్డీ సాయిబాబా హిందూదేవతకాదు. షిర్డీ సమాధిమందిరంలో ఉదయం హారతి వినండి. సద్గురు సాయినాథాయ నమః అంటారు. ఆయన మానవుడు. సద్గురువు. శిష్య ప్రశిష్యులకు మార్గదర్శకుడు. భక్తులపై అనుగ్రహం వర్షిస్తాడు. మత సామరస్యం బోధించాడు కాని మహమ్మదీయులు సాయి మందిరాలకు నమాజుకు రావడంలేదు. ఆయనే శివుడు ఆయనే అల్లాహ్ అని అనుకోవడం భక్తుల లక్షణం. ఇతరులకు అది భాషలో రూపకాలంకారము. వేదాలలో దేవాలయాల ప్రసక్తి ఉండదు. అక్కడ దేవతారాధన అగ్నిముఖంగా యజ్ఞకర్మలో జరుగుతుంది. దానికి చాలా నియమాలు విధి నిషేధాలు ఉన్నాయి. దేవాలయ వ్యవస్థ దీనినే మూర్తిపూజగామార్చి అందరి అందుబాటులోకి తెచ్చినది. మీకు బదులుగా మీరు మమ అని నమస్కారంపెట్టుకుంటే అర్చకుడు మీకు అధివక్తగా భగవంతునికి వేద సూక్త విధానంతో అర్చన చేస్తాడు.ఆలయ నిర్మాణానికి పాంచరాత్ర, వైఖానసము వంటి వైష్ణవ ఆగమాలు, పాశుపతం వంటి శైవాగమాలు ఉన్నాయి. భగవంతుడు విగ్రహం కాదు. దానికి ప్రాణ ప్రతిష్ఠ చేస్తేనే అది శాస్త్రోక్త భగవదారాధన ఔతుంది. దేవాలయాని షిర్డీ సాయిమందిరంగా చేస్తే అది దేవాలయం అవదు. ప్రార్ధనా మందిరమౌతుంది. అక్కడ విగ్రహమైన, చిత్రపటమైనా, శిఖ్ఖులవలే గ్రంధమైనా ఒకటే. నిగమాగమాలు లేకపోతే హిందూమతంలేదు. అనేక ప్రవక్తలమతమౌతుంది. క్రైస్తవ ఇస్లాం మతాలు ప్రపంచంలో అధికసంఖ్యాకులు అనుసరిస్తారు. అవి క్రమశిక్షణతో, సామాజిక ఐక్యతతో ప్రపంచవ్యాప్తిపొందిన మతాలు. పైగా వారు ఇతరులను అహ్వానిస్తారు. అదికూడా ఒక హేతుబద్ధమైన పరిష్కారమే.   

4. అలాగే మంచి చెడులు చెప్పే గంటల పంచాంగంలో, కొంతమంది పురుషులకు కొన్ని మాసాల్లో స్త్రీ సౌఖ్యం ఉంటుందని(ఎక్కువ, తక్కువ) రాస్తారు. మరి మహిళలకు పురుష సౌఖ్యం గురించి ఎందుకు రాయరూ? ఇలాంటి సౌఖ్య ప్రస్తావన అనవసరం అని నా భావన. -------- ధర్మార్థ కామ మోక్షాలు పురుషార్థాలు. గృహ యజమానికి వ్రాస్తే ధర్మపత్నికీ వర్తిస్తుంది. కాని గంటల పంచాంగంలో రాసుల ఆధారంగా వ్రాసిన వ్యక్తిగత సంవత్సర ఫలాలు అనవసరమని నాఉద్దేశ్యంకూడా. ఎవరి జాతకం వారు చూపించుకోవాలి. పంచాంగం ఈ జాతక ఫలాలకు ఉద్దేశ్యింపబడినది కాదు. Mundane Astrology అంటే దేశము, రాష్ట్ర పరిస్థితి వ్రాస్తే బాగుంటుంది. అది అందరికి వర్తిస్తుంది. అలాగే ప్రకృతి ఉత్పాతాలు, వరదలు, తుఫానులు, వర్షపాతం గురించి కూడా. 2010లో నేను ఒక అంతర్జాతీయ జ్యోతిష సదస్సుకు వెళ్ళాను. ఎవరో రాష్ట్ర విభజన గురించి అడిగారు. ఆ ప్రఖ్యాత జ్యోతిష్కుడు 2012,13లలో విభజింపబడాలి. 90శాతం అవకాశం ఉన్నది. అప్పుడు జరగకపోతే ఎప్పటికి జరగదు.అనిచెప్పారు

5. LIC Policy - నా అనుభవం చెబుతాను. 1967 లో నేను లెక్చరర్ గా చేరినప్పుడు. నా నెలజీతం 600. రోజూ ఒక ఇన్సూరెన్స్ ఏజంట్ వచ్చి పాలసీ తీసుకోమని బలవంతంచేసేవాడు. నెలకు 100 తేలికగా కట్టగలరు. ఒక 25 వేలకి తీసుకోండి. రిస్క్ కవర్ చేస్తుంది అన్నాడు. నాకు ఏదన్నా అయితే 25 వేలకి కుటుంబానికి ఏమి ఒరుగుతుంది? అన్నాను. మరి ఎంతకు కడతారు. అంటే ఒక కోటి చూసుకో, నేను రిటైర్ అయేసరికి ఒక ఇల్లు వస్తుంది అన్నాను. కాని ప్రీమియం కట్టడానికి నాజీతం సరిపోదు. నేను ఏనెలజీతం ఆనెల ఖర్చుపెట్టుకుంటాను. అన్నాను. LIC పాలసీ దండగబేరం ముహూర్తంచూసుకునే Scene లేదు.

What is Hinduism?

https://www.facebook.com/vallury.sarma/posts/601727869864630

What is Hinduism?
• One of the oldest religions of humanity
• The religion of the Indian People
• Gave birth to Buddhism, Jainism and Sikhism
• Tolerance and Diversity “Truth is one, paths are many”
• Many deities but a single impersonal reality
• A philosophy and a way of life – focussed both on this world and beyond.
V V S Sarma
I do not agree with any of the statements above. They are naïve, simplistic and are responsible for all the problems Hinduism and Hindus are facing in today’s world. 
Discussion

1. What are the other oldest religions in the world which have any measurable following today? It is the only oldest living religion and its name is not Hinduism. A correct description is Sanatana Dharma and it is a recent name for several religions, viewpoints, philosophies (darsanas) lumped together with a single name – Saiva, Vaishnava, Sakteya, Ganapatya, Kaumara, Saura – being the shanmatas, at least six astika and six nastika darsanas, which are different; many existing today also and evolving in the framework even today. 

2. Even in a lumped form, it is only one of the religions of the many inhabiting Republic of India, Pakistan, Nepal, Bangladesh, Bali in Indonesia, Sri Lanka, and the rest of the world. 

3. A religion does not give birth to other religions. Just as Abrahamic religions Judaism, Christianity of very many churches, and Islam of its own divisions are religions with the same roots, Buddhism, Jainism and Sikhism or for that matter the more recent Brahmo-samaj, ISKCON, are various viewpoints or ways of life evolved from Sanatana dharma and some of them may not even consider themselves as Hindus. Some similarity to Protestantism may be relevant. If Buddhism rejects pramana of Veda it is that much farther from the source. Same is true of Marxists with Hindu names. It is Western Historians and the English rulers who widened these gaps as part of their divide and rule policy. (Division of Bengal in 1905 and 1947)

4. Tolerance and diversity – Tolerance is not accepted by major Indian religions like Christianity. Christian Evangelism is intolerance promoted by hundreds or thousands of missionaries and church hierarchy. It is peaceful coexistence – like LOC in Kashmir – that is the goal. Hindus when they say - “Truth is one, paths are many”- They say in blissful ignorance of other paths. This is bad translation of “Ekam sat vipraa bahudhaa vadanti.” What is the truth of each one of the many religions and where does each path lead to? Who are the wise men who say this about this? In fact, I have seen bill boards proclaiming “I am the only truth and the only path” in this city. 

5. Many deities but one reality. … The worship is that of many deities with name and form – saguna form – the realization of nirguna may not be attainable in one life time. Reality and Truth are different notions. God is not more logical than gods, because it is the divinity that exists. The reality should be understood at the back of mind. Each deity has its own role in worship. 

6. Hinduism is principally materialistic. Belief in God helps you to face samsara with courage and strength. Dharma, Artha, Kama are for happy living in this world. Yajna is for the happiness of svarga and good rebirth in the next life. The religion is mostly for this. Moksha is to be a strong desire that is to be cultivated at some point in the gati. The illusionary nature of the world should naturally be felt and experienced as one goes along. The concept of Guru is unique to Hinduism in this Kali Yuga. Siva, Krishna, Subrahmanya, Maitreya, Dattatreya, several maharshis etc. 

The need today for Hindu society is to understand that there is need for recognition of a bond between all of us, understand the religion more correctly, and look at the social and political issues of Hindus collectively. Hindus have to realize that religion is more important than caste.

Padmini Priyadarsini ప్రతీ వాక్యాన్ని చాలా బాగా వివరించారండీ. ప్రస్తుతం 'సనాతన ధర్మం' ఉన్న స్థితిలో మరికొన్ని తప్పుడు భావాలు ఇలా ప్రచారం కావటం మంచిది కాదు. అందుకే, ఆ స్టేటస్ డిలీట్ చేసాను పెదనాన్న గారు. ధన్యవాదాలు.

Tuesday, January 23, 2018

మనం చేసిన పాపాలను బట్టి శిక్ష వేస్తాడు అంటారు కదా

https://www.facebook.com/vallury.sarma/posts/561840853853332

Abhiram Kondepudi

1.మనం మరణించాక యమధర్మరాజు మనం చేసిన పాపాలను బట్టి శిక్ష వేస్తాడు అంటారు కదా.
2.ఇంకో పురాణంలో ఏ జన్మలో చేసిన పాపాలకు పరిష్కారం ఇదే జన్మలో శిక్షగా వస్తుంది అంటారు.
3.గత జన్మలో చేసిన పాపాలు ఈ జన్మలో కూడా ఉంటాయి. దాన్ని ప్రకారమే కష్టం సుఖం ఉంటాయి అంటారు. మరి ఎన్నో జన్మల పుణ్యం వల్ల మానవ జన్మ వస్తుంది అంటారు.. అప్పుడు నం.3 తప్పు అవుతుంది కదా.
4. పరమేశ్వరుని ఆజ్ఞ లేనిదో చీమ అయినా కదలదని అంటారు.అందువల్ల మనం చేసిన పాప పుణ్యాలు ఈశ్వరుడే నిర్ణయిస్తాడుకదా. అటువంటప్పుడు మనకు శిక్షలు ఎందుకు?

V. V. S. Sarma
1. నా సమాధానాలు
మీ ప్రశ్నలు చూస్తే మీకు ఒక అవగాహనలేదనిపిస్తుంది.
1.మనం మరణించాక .. అంటే .. ఒకవ్యక్తి మరణించాక, అతని మృత శరీరం అగ్నిలోనో, భూమిలోను వేయబడి తిరిగి పంచ భూతాలలో జేరుతుంది. మరి యమునివద్దకు వెళ్ళేది ఎవరు? జీవుడు, జీవాత్మ, అంగుష్ఠమాత్ర పురుషుడు. అంటే ఒక దేహాంతర్గతమైన తేజోరూపుడు. దానిలోని కేంద్రబిందువు పరమాత్మ స్థానం.సుఖదుఃఖాలు అనుభవించేది జీవుడే.పరమాత్మ సాక్షి. అపూర్వమనే సంబంధముతో పుణ్యపాపాలు జీవునితోబాటుగా ఉంటాయి. పుణ్యాలకు స్వర్గం, పాపాలకు నరకం నిర్ణయించి ఆ యా సమయాలలో ఆలోకాలలో జీవాత్మ ఆసుఖ దుఃఖ భావనలను పొందుతుంది. స్వర్గానికి భోగ శరీరం, నరకానికి యాతనా శరీరం ధరించి ఉంటాడు. జీవుని స్థితి సంవత్సర కర్మ వరకూ ప్రేతస్థితి. 

2. మనుష్యజన్మ అనేక పూర్వజన్మల పాప పుణ్యాల మిశ్రమము వలన కలుగుతుంది. ఇక్కడ సంచిత, ప్రారబ్ధ, ఆగామి కర్మలని ఉంటాయి. మనిషి కర్మబంధం ఒక జన్మలో తీరేది కాదు. బాంక్ లోన్ వలె తీర్చడానికి అనేక instalments (జన్మలు) పట్టవచ్చు. ఈ లోపల ఈ జన్మలో పాపాలు కూడా వస్తాయి. పుణ్యం కూడా బంధమే. ఉదాహరణకు ఒకడు పుణ్యఫలం వల్ల ఈ జన్మలో ధనవంతుడై మంత్రియై అవినీతి పరుడయ్యాడనుకోండి. వాడి కర్మకు నరకంలో శిక్ష చాలదు. దుర్భరమైన జన్మలు అనేకం ధరించవలసి వస్తుంది. సుఖాలు అంటే మీఅక్కౌంట్ లో పుణ్యం ఖర్చవడం, కష్టాలు అంటే మీకు పాపకర్మ క్షయం అవడం అన్నమాట. ఇది సరియైన attitude. 

3. మరణించిన తరువాత ఎంతకాలానికి తిరిగి జన్మ వస్తుందో తెలియదు. ప్రేత రూపంలో ఉన్నజీవునికి తన పాప కర్మల memory ఉంటుంది కాని అవిక్షయం అయే మార్గం ఉండదు. సరియైన జన్మకూడా వస్తుందో తెలియదు. అందుకే మానవజన్మ దుర్లభం. ఆస్వల్పకాలాన్ని పాపాలుచేయకుండా గడపాలి. కష్టాలు తన పూర్వకర్మ వలన వచ్చినవే, కాని ఈశ్వరుని వల్ల వచ్చాయని అనుకోకూడదు. అసలు మీ ప్రశ్నే సరిగాలేదు. మానవ జన్మ అంటేనే సుఖ దుఃఖాల మిశ్రమం. అది పూర్వ జన్మల పుణ్య పాపాల వలన వస్తుంది. పుణ్యం అధికంగా ఉంటే మంచికుటుంబంలో మంచి పరిస్థితులలో పుడతారు.   

4. పరమేశ్వరుడు ప్రతి చీమను కదలమని ఆజ్ఞాపిస్తూ కూర్చోడు. పాపాలు చేయవద్దని అడ్డు పెట్టడు. పుణ్యాలు చేయమని ప్రోత్సహించడు. నాస్తికులకు తాను ఉన్నట్లు నిరూపించుకోడు. జీవితంలో సంఘటనలు కర్మ ఫలాలుగా జరుగుతాయి. నడుస్తోంటే కారువేగంగావచ్చి పేవ్ మెంటెక్కి ఒకరిని ఢీకోవడం దైవికం. కాని దొంగతనమో, హత్యో, ప్రభుత్వాధికారి లంచం తీసుకోవడమో వ్యక్తి స్వేచ్ఛతో జరుగుతాయి. వాటి ఫలంగా వచ్చే శిక్షలను అమలుజరిపేవాడు యముడు. ప్రధాన మంత్రి జీవుడు, ముష్టివాని జీవుడూ అని ఉండవు. యమధర్మరాజు వద్ద VIP బ్రేక్ దర్శనాలు, సిఫారస్ లేఖలు ఉండవు. అందుకే ఆయన సమవర్తి.

Monday, January 22, 2018

హిందువుల సృష్టి క్రమం ఏమిటి?

https://www.facebook.com/vallury.sarma/posts/533372383366846

హిందువులలో, క్రైస్తవులలో, ఇతర మతాలవారిలో భగవంతుని స్ఫురణ, ఆధ్యాత్మిక అనుభవాలు కలిగినవారు ఉంటారు కదా! మరి మీరే మంటారు? నరకాలు, స్వర్గాలు (hells and heavens)- Are they different for different religions? - ఇది గీతా శర్మగారి పోస్ట్ 
  
ఈ పోస్ట్ నాకు నచ్చింది. నా సమాధానం ఇది. నరకాలు స్వర్గాలు మాత్రమే కాదు దేవుడు కూడా ఎవరిదేవుడు వారికే అన్నాను. దీనికి వచ్చిన అనేకవ్యాఖ్యలు, స్పందనలూ చూస్తే ఒకటి అర్థం అవుతుంది. ఎవరికీ కొన్ని ఊహలు తప్ప consistent thought process and reasoning లేదు. 


1. కొందరి దృష్టిలో ఇవన్నీ కథలు. (అంటే కల్పితాలు). "అనగా అనగా ఒక రాజుకి ముగ్గురు కొడుకులు. ఆయన ఐదో కూతురు పేరు సుబ్బారావు." ఇది సరిగా ఉన్నదా? నాదృష్టిలో సరిగానే ఉన్నది. ముగ్గురు కొడుకులు అన్నానుకాని, కూతుళ్ళెంతమందో, ఉన్నారోలేదో, చెప్పలేదు.అమ్మాయిపేరు సుబ్బారావు ఎందుకౌతుంది? అంటే ఎందుకు కాకూడదు? అన్నది కౌంటర్. ఆపేరు ఉన్న ఒక అమ్మాయి నాకు తెలుసుకూడా. 

2. చర్చ లో ప్రశ్న అడిగిన ఆవిడ ప్రశ్నకు సమాధాన ఇవ్వాలి. ఆవిడకు స్వర్గ నరకాల మీద నమ్మకం ఉన్నది. క్రైస్తవులకు ముస్లిములకు కూడా అలాటి విశ్వాసాలున్నాయని విన్నది. అవి ఒకటేనా? వేరు వేరా? అని అడిగారు ఆమె. 

3. ఆమె ప్రశ్నకు సరిగా సమాధానం ఇవ్వాలంటే అసలు మతాలు ఎందుకు వేరు, ఆ మతస్థుల నమ్మకాలు ఎందుకు వేరు? అనేది తెలుసుకోవాలి. 
   
A) హిందువుల నమ్మకాలు ఏమిటి? దీనికి చాలామంది హిందువులే సమాధానం చెప్పలేరు.
క్రైస్తవులకు ఒకరే దేవుడు. ఇంగ్లిషులో గాడ్ అంటారు.స్వర్గం (హెవెన్)లో ఉంటాడు. ఆయనపేరు యెహోవా. ఆయన భార్య ప్రసక్తి ఎక్కడా లేదు. మరి ఆయన ఉన్నట్లు అందరికీ ఎలా తెలిసినది. మోజెస్ అనే ఆయన దేవుని మాటలు విన్నాడు. నేను ఆయన మాటలు మీకు అందజేస్తున్నాను అన్నాడు. అవి ఒక పుస్తకంలో వ్రాసుకున్నారు. ఆమాటలు విన్న ఆయనను ప్రవక్త (ప్రోఫెట్) అన్నారు. ఆయన మాటలుగా ఈయన చెప్పినది యూదుమతం అనిపిలువబడినది. చాలా ఏళ్ళకి జాషువా అనే ఆయన పుట్టాడు. జోసెఫ్, మేరీల కొడుకు. ఈయననే తరువాత యేసుక్రీస్తు అన్నారు. దేవుని ఏకైక కుమారుడన్నారు. ఈ రెండో అయన బోధలు దేవుని వాక్యాలే అన్నారు. అది బైబిల్. దేవదూతలు, సైతాను, స్వర్గం, నరకం, భూమి, ఏర్పడి సృష్టి జరిగింది. చనిపోయినవారు సమాధిలో నిద్రపోతారు. కూడా ఉన్న ఆత్మకూడా అక్కడె సేద తీరుతుంది.(RIP) క్రీస్తు చెప్పినది ఆయన మతం, ఆకథ ఆయన పుస్తకం. కొన్నాళ్ళకు మహమ్మదు అనే ఆయన అరేబియాలో పుట్టాడు. ఆయనను దేవుని దూత అన్నారు ఆయనకు కూడా దేవునితో సంభాషణ జరిగినది. నాతరువాత దేవుడు మరెవరితో మాట్లాడదు అన్నాడు. ఆయన అనుయాయులు ముస్లిములు. ఈ మతస్థులందరూ ఎప్పటికో దేవుని న్యాయ స్థానానికి వెళ్ళి శాశ్వత స్వర్గానికో నరకానికో పోతారు. యూదులకు మోజెస్, క్రైస్తవులకు మోజెస్, జీసస్, ముస్లిములకు మొజెస్ (మూసా), జీసస్ (యీసా) మహమ్మదు ప్రవక్తలయ్యారు. వారి వలన తెలిసిన సృష్టి సమాచారం వారి పుస్తకాలలో వ్రాసుకుని దానిని నమ్ముతారు. 

B) ఇక హిందువుల సృష్టి క్రమం ఏమిటి? ప్రపంచంలో ఒకటే సత్యవస్తువు ఉన్నది. అది నిరాకారం, నిర్గుణం, నిరంజనం, అనిర్వచనీయం. అది స్థాణువుకూడా. అది బ్రహ్మ వస్తువు (నపుంసక లింగం) దానిలో చైతన్యం (movement, perturbation) వస్తే అది రెండు అవుతున్నది. ఒకటి రెండవడమే పరిణామం, వివర్తం కూడా. Change- real or apparent. (పురుషుడు, ప్రకృతి, శక్తి లేదా పురుషుడు, మాయ). సృష్టి సంకల్పం ఎరిగిన వాడు మహావిష్ణువు. సాంకేతికంగా పాలకడలి (cosmos) లో పవళించిన వాడు, ఆదిశేషువు శక్తికి సంకేతం. వేదంలో పురుషసూక్తంలో వర్ణించిన పరమపురుషుడు ఇతడే. ఇతడు సృష్టించినదే బ్రహ్మాండము. (can be imagined as being analogous to Milky Way galaxy). అనేక బ్రహ్మాండాలున్నాయి. ప్రతిబ్రహ్మాండములోను వారి వారి శక్తులతోకూడిన త్రిమూర్తులుంటారు. బ్రహ్మ ప్రతిసృష్టి చేస్తాడు. మన బ్రహ్మాండములో 14 లోకాలు సృష్టించాడు. భూలోకముపైన ఉన్న ఆరుతొ కలిపి ఏడు ఊర్ధ్వలోకములు, ఏడు అధోలోకములు. తరువాత ఆయాలోకములలోని జీవులను సృష్టించాడు. విష్ణువు స్థితినీ, రుద్రుడు లయాన్నీ కలిగిస్తారు. భూలోక జీవులు తమకర్మల ఫలంగా పరిణామంచెంది క్రమంగా ఊర్ధ్వముఖంగా ప్రయాణము చేస్తారు. అంతిమంగా జీవుడు జనన మరణ చక్రం నుంచి విముక్తి చెందుతాడు. హిందూ మతానికి ప్రవక్తలు లేరు. మన దేవతలు ఋషులూ అందరూచేసినది తపస్సు. Pointed inquiry and meditation. వారికి శ్రుతిగా వేదము వినిపించినది. కొన్ని వందల మహర్షులు గ్రహించిన విజ్ఞానము సనాతన ధర్మం. క్రైస్తవ మహమ్మదీయ మతాలు ఒక ప్రవక్త చెప్పిన బోధనలు. ఈ లోకాలు, దేవతలు ఉన్నట్లు ఎలాతెలిసింది? యోగ సాధనలో శరీర చైతన్యాన్ని సాధనతో ఉద్దీపనం చేసుకుంటే, ఈ లోకాల జ్ఞానాన్ని అంతర్ముఖుడై చేసిన తపస్సు ద్వారా తెలుసుకోవచ్చు, దర్శించవచ్చుకూడా. 
  
It is not logical to say God is different for different religions and heaven and hell are different. But logic does not lead to absolute truth. Earth is one concept, Bhuloka is different. Man is one concept, Atman is another. Lokas and God are not physical entities – which can be perceived by senses. In the elephant and blind men story what each person saw is true and that is his perception. Each religion is a well and the believer is a frog in that well. Each world seen by each frog is true as far as the particular frog is considered. For Hindus the well is the Brahmanda.

Sunday, January 21, 2018

లోపాముద్ర -అగస్త్యుడు – 3



బ్రహ్మ దేవుడు కవేరముని తపస్సు, తండ్రి విముక్తికై కావేరి తపస్సు, ఈ విశేషాలు అగస్త్యునకు వివరిస్తాడు. “కావేరి ఎవరో కాదు, నీభార్య లోపాముద్ర వలెనే విష్ణుమాయ. అమెకు తగ్గ వరునివి నీవే. నీవు దక్షిణానికి వెళ్ళినప్పుడు ఈ కార్యం జరుగుతుంది.” అనిచెబుతాడు. ఇది అగస్త్యుడు ఉత్తరభారతం లో ఉన్నప్పుడు జరిగినది. తరువాత కొంత కాలానికి దేవకార్యం నిమిత్తం అగస్త్యుడు దక్షిణానికి వస్తాడు. కావేరి తపస్సు ఫలిస్తుంది. కవేరుడు ఆమెను అగస్త్యునకు ఇస్తాడు. ఆమె అగస్త్యునితో ఇలా అంటుంది. నా తపస్సు ఫలించింది. విష్ణువు నన్ను నదీ రూపంతో దక్షిణ దేశంలో ఉండిపొమ్మన్నాడు. మిమ్మలని స్త్రీగా వివాహం చేసుకొని మీకు ఏమి చేయగలను? అంటుంది. అగస్త్యుడు ఆమెతో నా కమండలములో జలరూపం లోనే ఉండిపో. అవసరం వచ్చినప్పుడు నిన్ను నదీరూపంలో దక్షిణ భారతంలో వదలుతాను. అని చెబుతాడు. గంగను పరమేశ్వరుడు శిరసున దాల్చి గంగోత్రిలో వదలినట్లే, గౌతముడు గంగను గోదావరిగా దక్షిణదేశానికి తెచ్చినట్లే, అగస్త్యుడు భూమిపై కావేరి ఉత్పత్తికి కారణమౌతాడు. నేడు బెంగుళూరుకు నీరు ఇచ్చేది ఆకావేరీ మాతయే.
అగస్త్యముని గంగాద్వారం విడిచి, భార్యతో కలసి కాశీలో నివాసం ఏర్పరచుకున్నాడు. అప్పుడు దేవతలకు ఆయనను దక్షిణదేశం పంపవలసిన పని వచ్చినది. దేవతలు మునులు ఆయనను వెదకుతూ కాశీవెళ్ళారు.
శ్రీనాథుడు తన కాశీఖండములో అగస్త్యమునిని ఇలా కీర్తించాడు:-
పంచాక్షరీ మంత్ర పారాయణమునకు, నెవ్వాని మానసం బేడుగడయు
దర్పోద్ధతులగు వాతాపీల్వలుకును, వధశిలాస్థానమెవ్వానికుక్షి
ఆదినెవ్వాని దివ్యావతారమునకు బూర్ణంబు భాండంబు పురిటి ఇల్లు
మెరసి లోపాముద్ర మెరుగు బాలిండ్లపై, బవళించునెవాని భవ్యమూర్తి
కసరి ఎవ్వాని కంఠ హుంకారరవము,
కొండచిలువల కులములో కూల్చెనహుషు
నట్టి పరమ మహాతేజు నలఘుతేజు
వెదకిరానందవనములో విబుధమునులు
ఆనందవనమంటే కాశీ. దేవతలు, మునులు ఆయన ఆశ్రమాన్ని దర్శించి ఆయనను స్తుతించారు. ఆయన చేస్తూన్న శివ స్తోత్రం విన్నారు. బృహస్పతి ఆయనతో ఇల్లా అన్నాడు. ఓ మహర్షీ, నీవు ప్రణవ స్వరూపుడవు. ఓంకారమేనీవు. ఈ లోపాముద్రాదేవి వేదరాశి. నీవు మూర్తీభవించిన తపస్సువే. ఆతపస్సు వలన లభించే శాంతి ఆ లోపాముద్రాదేవి. నీవు సూర్యుడవు.సూర్య స్తోత్రాలను ప్రజలకు ఇచ్చినవాడివి. ఈమెయే ఆతేజస్సు. నీవు బ్రహ్మ తేజస్సువు ఐతే ఆమే నిన్నసురించే బ్రహ్మ జ్ఞాన స్వరూపిణి. మిమ్ములనిద్దరను ఒకేసారి దర్శించుకోవడంవలన మేమంతా ధన్యులమయ్యాము" "మీరందరూ నన్ను వెతుక్కుంటూ ఎందుకు వచ్చారు?" అని అగస్త్యుడు వారిని అడిగాడు. ఆనందవనమంటే కాశీ. దేవతలు, మునులు ఆయన ఆశ్రమాన్ని దర్శించి ఆయనను స్తుతించారు. ఆయన చేస్తూన్న శివ స్తోత్రం విన్నారు. బృహస్పతి ఆయనతో ఇల్లా అన్నాడు. ఓ మహర్షీ, నీవు ప్రణవ స్వరూపుడవు. ఓంకారమేనీవు. ఈ లోపాముద్రాదేవి వేదరాశి. నీవు మూర్తీభవించిన తపస్సువే. ఆతపస్సు వలన లభించే శాంతి ఆ లోపాముద్రాదేవి. నీవు సూర్యుడవు.సూర్య స్తోత్రాలను ప్రజలకు ఇచ్చినవాడివి. ఈమెయే ఆతేజస్సు. నీవు బ్రహ్మ తేజస్సువు ఐతే ఆమే నిన్ను అనుసరించే బ్రహ్మ జ్ఞాన స్వరూపిణి. మిమ్ములనిద్దరను ఒకేసారి దర్శించుకోవడంవలన మేమంతా ధన్యులమయ్యాము"
"మీరందరూ నన్ను వెవెతుక్కుంటూ ఎందుకు వచ్చారు?" అని అగస్త్యుడు వారిని అడిగాడు. ఒకప్పుడు వింధ్య పర్వతం పెరిగిపోవడం మొదలు పెట్టింది. మేరు పర్వతం చుట్టూ తిరిగే సూర్యుని, తన చుట్టూ తిరిగేలా చేసుకోవాలని దాని ఊహ. అపుడు వింధ్య పర్వతం ఉత్తర, దక్షిణ భారతాలకు మధ్య అడ్డగోడలా తయారవుతున్నదని, దానిని నిరోధించమని దేవతలు, మునులు అగస్త్యుని అడిగారు.

లోపాముద్ర -అగస్త్యుడు - 2

https://www.facebook.com/vallury.sarma/posts/520375871333164


శృతర్వుడు అనే రాజు వద్దకు అగస్త్యుడు వెళ్ళి, "రాజా నాకు కొంచెంధనము కావాలి" అని అడుగుతాడు. రాజుకు ఆశ్చర్యం, భయం కూడా వేశాయి. ఈ మహర్షి కనక వర్షం కురిపించగల తపశ్శాలి. నన్ను అడుగుతున్నాడు. ఆయనకు ఎంత కావాలో నేను ఈయగలనో లేదో అని సంకోచిస్తాడు. ఇద్దరు ముగ్గురు రాజులు ఆయనకు ఇవ్వడానికి వెనుకాడారు. అప్పుడు ఇల్వలుడు అనే రాక్షసాంశ లో పుట్టిన రాజు వద్దకు వెడతాడు. ఆరాజుకో తమ్ముడున్నాడు. వానిపేరు వాతాపి. వాళ్ళిద్దరికీ రాక్షసమాయలున్నాయి. కామరూపధారణ వంటి కొన్ని శక్తులున్నాయి. వారికి ఒక మునితో జరిగిన అనుభవం ఒకటి ఉంది. ఆమునిని వారు ఆశ్రయించి "మాకు కోరికలు తీరే మంత్రము ఉపదేశించండి" అని అడుగుతారు. ఆ ముని మీకు రాక్షసాంశ ఉన్నది.మీరు మంత్రాన్ని దురుపయోగంచేస్తారని భయం. మీకు ఈయను అంటాడు. ఇల్వలుడు వినయంగా "పోనీ వదిలేయండి. మాఇంట్లో పితృ కార్యం ఉన్నది.రేపు మాయింటికి భోక్తగా రండి" అని ఆహ్వానిస్తారు. వాతాపిని అన్నగారు మేకగా మార్చి, చంపి ఆమాంసాన్ని ఆ బ్రాహ్మణునికి పెడతాడు. తరువాత "వాతాపీ రా " అని మంత్రిస్తే వాడు బ్రతికి, ఆ ముని పొట్టచీలుచుకొని, బయటకు వస్తాడు.ఈ ప్రకారంగా వాళ్ళు వీలైనప్పుడల్లా బ్రాహ్మణ మాంస భక్షణ చేస్తున్నారు. అగస్త్యుడు ఇల్వలుని యొద్దకు ధనమడగటానికి వెడతాడు. అగస్త్యునికి అదే సత్కారం చేదామని ఇల్వలునికి అనిపిస్తుంది. ధనానికి ఏముంది. మీకు ఎంత కావాలంటే అంత ఇస్తాము. ముందు మా ఇంటిలో భోజనం చేయండి అని ఆహ్వానిస్తాడు. మామూలుగానే వాతాపిని మేకగా మార్చి వండి వడ్డిస్తాడు. భోజనమవగానే అగస్త్యుడు "వాతాపి జీర్ణం" అని మూడు సార్లు అంటాడు. వాతాపీ రా!రా! అని ఇల్వలుడు ఎన్నిసార్లు పిలిచినా లాభంలేక పోయింది. సముద్రజలమంతటినీ త్రాగిన అగస్త్యునికి వాతాపి ఒక లెక్కా? ఇల్వలుడు భయంతో వణికి పోయాడు తన దగ్గరున్న బంగారమంతా ఆయనకే ఇచ్చాడు. ఈ లోకోపకార కృత్యం ఆయన వలన జరగటానికే ఈ సంఘటన జరిగినది. నేటికీ మన దేశంలో తల్లులు పసిపిల్లలకు ఆహారమిచ్చినప్పుడు "జీర్ణం, జీర్ణం, వాతాపి జీర్ణం" అనడం వింటాము. అది అగస్త్య మునిని తలచుకోవడమే.
ఆయన బంగారం, ధనం తెచ్చి భార్యకు నగలు చేయించి, ఆమె కోరిన విధంగా ఉండి ఆనంద పేట్టాడు. కొన్ని రోజుల తర్వాత భార్యతో, "నీకు శక్తి, తేజస్సు కలిగిన నూరుగురు కొడుకులు కావాలా? దానికి పదిరెట్లు శక్తి, తేజస్సు కలిగిన, పది మంది పుత్రులు కావాలా? అందరి శక్తి తేజస్సు కలిగిన ఒక్క కొడుకు కావాలా? అని అడుగుతాడు. ఆమె ఆలోచించి ఒక్కడు చాలు అంటుంది. కొడుకు పుట్టాక వానికి తేజస్వి అని పేరు పెడతారు. ఎన్నో తరాలకు సరిపడ పుణ్యంచేసి పిత్రుదేవతలను వారి లోకానికి పంపించాడు. వాళ్ళకు ఉత్తమగతులు కలిపించడంకోసం అగస్త్యుని లీల ఇది. నిజానికి ఇది అగస్త్యుని ఋణం కాదు. తరువాత మళ్ళీ లోపాముద్ర, అగస్త్యుడు ఆశ్రమవాసానికి వెళ్ళిపోతారు.
ఒక సారి బ్రహ్మ దేవుడు వారి ఆశ్రమానికి వస్తాడు. "వేల సంవత్సరాలు తపస్సు చేస్తేకాని అవని బ్రహ్మ దర్శనం ఎందుకు కలిగినదని అగస్త్యునకే సందేహం వచ్చినది. "భూలోకంలో మనుష్యులు అనేక అధర్మాలు, పాపాలు చేస్తూ ఉంటారు. వాళ్ళ పాపాలే వాతాపి వలే నీఆహారం. నీలాంటి వాళ్ళ ఉనికి వల్లనే భూమి ధర్మ బద్ధంగా నడుస్తూంది. నీవే వాటిని జీర్ణం చేసుకోగలవు. మహర్షులే మానవ జాతికి ప్రాతః స్మరణీయులు. ఈ మాట నీతో చెప్పడానికే వచ్చాను" అని బ్రహ్మ అంటాడు.
దక్షిణ దేశంలో కవేరుడనే ముని బహుకాలం ముక్తి కొరకు శివుని గురించి తపస్సుచేస్తాడు. శివుడు ప్రత్యక్షమై నీవు ఇంకా ముక్తికి అర్హుడవు కావు. బ్రహ్మను గురించి తపస్సుచేయి. ఆయన నీకు జ్ఞానాన్ని ఇచ్చి ముక్తి మార్గాన్ని సూచిస్తాడు అని శివుడు చెప్పగా కవేర ముని అలాగే చేస్తాడు. బ్రహ్మ ప్రత్యక్షమై “ నీకు జన్మాతరంలోని తీరనికోరిక ఒకటి మిగిలి పోయింది. అది పూర్తి ఐతేగాని నీకు ముక్తి రాదు. నీవు గృహస్థాశ్రమం స్వీకరించి ఒక బాలికకు తండ్రి కావాలి. ఆ కన్యను తగిన వరునికి ఇచ్చి వివాహం చేస్తే నీవు బంధవిముక్తుడవౌతావు అనిచెబుతాడు.కవేరుడు గృహస్థుడౌతాడు. కుమార్తె జన్మిస్తుంది. ఆమె కారణజన్మురాలు. ఆమెయే విష్ణుమాయ. ఆమె తండ్రి ముక్తి కోసం తపస్సు ప్రారంభిస్తుంది.కవేరుని కుమార్తె గా ఆమె పేరు కావేరి.
(సశేషం)

ఋషి మిథునం - లోపాముద్ర-అగస్త్యుడు

https://www.facebook.com/vallury.sarma/posts/520015874702497


యుగాల పర్యంతం వ్యాపించిన చరిత్ర అగస్త్య మహర్షిది. ఆదిత్యహృదయం, సూర్యస్తోత్రం వంటి స్తోత్రరాజాలకు ఆయన ఋషి. దేవాంశ సంభూతుడు.ఆయన మిత్రుడు (సూర్యుడు), వరుణుడు - వీరికి అప్సరస ఊర్వశిపై గల మోహంతో, ఆ దేవతలు తమ మోహాన్ని (తేజస్సుని) ఒక కుండలో ఉంచివెడితే పుట్టినవాడు. అందుచేత ఆయనను కుంభసంభవుడంటారు. ఆయనను మైత్రావరుణుడు అంటారు. ఆయనలో అగ్నివాయువుల అంశలు కూడా ఉన్నాయి. పురూరవుడు ఊర్వశిని వివాహంచేసుకొని భూమి మీద ఉన్నప్పుడే ఇది జరిగింది.. ఊర్వశికి ఈకథ కూడా తెలియదు. అందుచేత అగస్త్యుడు భూమి మీద జన్మించినా దైవాంశ సంభూతుడు. దేవతలే ఆయనకు సంస్కారాలు చేశారు, పేరు పెట్టారు. అగ+ అస్తి నుండి అగస్త్యుడనే పదం వచ్చినది. అగ అంటే జలమునింపిన కుంభమని ఒక అర్థం ఉన్నది, సూర్యుడు అని ఒక అర్థం ఉన్నది. అగస్త్యుడు గొప్ప శివ భక్తుడు.
అతడొక సారి ఒక అరణ్యంలో తిరుగుతుంటే, ఒక వృక్షానికి కాళ్ళతో తలక్రిందుగా వ్రేలాడుతో తపస్సుచేస్తున్న ఋషులు కనబడతారు. అగస్త్యుడు వారిని ఎందుకు తపస్సుచేస్తున్నారని అడిగిటే వారు పితృదేవతలమనీ భూలోకంలో వారిని సరిగా ఆరాధింపడంలేదనీ చెబుతారు. అగస్త్యుని పిల్లలను కని, వారిని తండ్రులుగా భావించి, అరాధించమని అడుగుతారు. అగస్త్యుడు అంగీకరిస్తాడు. ఇప్పుడు ఆయనకు వధువు కావాలి. ఎవరూ ఆయనకు తగిన వారిగా కనుపించలేదు. అప్పుడు ఆయన విదర్భ దేశం వెడతాడు. అక్కడ రాజుకు పిల్లలులేక తన బాధ ఈయనతో చెప్పుకుంటాడు. అగస్త్యుడు తనకు ఎలాంటి భార్య కావాలో ఊహించుకొని, రాజా! నీకు ఆడపిల్ల పుడుతుంది. యుక్త వయస్సు వచ్చాక తనకు ఇచ్చి పెళ్ళి చేయమని అడుగుతాడు. రాజు అంగీకరిస్తాడు. అలాగే జరుగుతుంది. అమ్మాయి కలుగుతుంది. లోపాముద్ర ఆమె పేరు. మహా సౌందర్యవతి. "ఇంత అందమైన రాజకుమారిని ఒక జడధారియైన ఋషికి ఈయడమా?" లేకపోతే ఆయనకు కోపం వచ్చి శపిస్తాడేమో అని భయం కలుగుతుంది.కాని ఆమె కారణ జన్మురాలు. ఈ కథ తల్లిదండ్రుల వలన విని, అగస్త్యుని వివాహ మాడుతుంది. అగస్త్యుడు లోపాముద్రను వివాహంచేసుకున్న స్థలం నేటి విదర్భలో, నాగపూర్ సమీపంలో, సిద్ధతీర్థంగా పిలువబడుతూంది. యువతీ యువకులకు అక్కడ స్నానంచేస్తే అత్య్త్తమమైన వరుడు కాని, వధువుకాని లభిస్తారని మహార్ష్ట్ర ప్రంతపు ప్రజల విశ్వాసం. వివాహం అవగానే అగస్త్యుడు ఆమె రాజోచిత దుస్తులను అలంకారాలాను వదలి, ఒక తాపసి భార్యకు ఉచితమైన నార చీరలు ధరింపమని చెబుతాడు. అప్పుడు ఆమెను గంగా ద్వార ప్రాంతానికి (నేటి హరిద్వార్) తీసుకొని వెళ్ళీ ఆశ్రమ జీవితం ప్రారంభిస్తాడు. ఆశ్రమ జీవితం చక్కగా గడిచిపోతున్నది. కొన్ని దినాలకు ఆయనకు పితృదేవతలకిచ్చిన వాగ్దానం గుర్తుకు వస్తుంది. భార్యకు చెబుతాడు. ఆమె భర్తతో ఇలా అంటుంది."ఆశ్రమవాస జీవితం బాగానే ఉంది. ఇప్పుడు పిల్లలు అంటే మనము ఇప్పుడు ఉన్న స్థితిలో శొభించదు. నాకు మంచి దుస్తులు కట్టుకుని, ఆభరణాలు ధరించి మీతో స్వేచ్ఛగా విహరించి కొన్నాళ్ళతరువాత పిల్లలు మనకు కలిగితే బాగుంటుంది. మీరు నాకు ఇంతవరకు ఏమిచ్చారు? గృహస్థ జీవితం గడపడానికి ధనం, స్వర్ణం కావాలి" కావాలంటే తమ రూపాలను మార్చుకొని, కనక వర్షం కురిపింపగల తపః శక్తి ఆయనకు ఉన్నది. కాని ఆయనకు తన తపస్సును కర్చుపెట్టాలనిపించలేదు. భార్యతో " సంపాదన కష్టమేమీ కాదు.ఏరాజు ఏరాజునడిగినా ఇస్తాడు. అని సమీపంలోని ఒక రాజ సభకు వెళ్తాడు.
(సశేషం)

మన తెలుగు మన సంస్కృతి -

https://www.facebook.com/vallury.sarma/posts/519702368067181

మన తెలుగు మన సంస్కృతి - ఈ సృష్టిని ఏదో శక్తి మాత్రం నడిపిస్తుంది అని మాత్రం పూర్తిగా విశాసిస్తాను సర్ పురాణాలు లోనే కొన్ని సందేహాలు ఉదా : నారదుడు అన్ని యుగాలలోను వుంటాడు హరిశ్చ్చంద్రుడి కాలం నుండి కలియుగం వరకు కనిపిస్తాడు . ఒక్క గ్రహం చేరాలి అంటే కొన్ని కోట్ల కిలోమీటర్ల ప్రయాణం మరి ఒక లోకం నుండి ఇంకో లోకం కి సునాయాసంగా ప్రయాణం చేసేవారు అంటారు వారి శక్తి యుక్తులు తపోమయ శక్తులు వలన అంటారా?
మీది చిన్నప్రశ్న. చిక్కు ప్రశ్న కాదు. మనం చూసే, ఊహించే విశ్వము (universe), సృష్టి వ్యవస్థ (cosmos), బాహ్యాంతరిక్షము (Outer Space) ఇవన్నీ సుమారు సమానార్థకాలుగా వాడుతున్నాము. ప్రపంచము(world) వేరు పదము. భూమి, భూలోకము, భూదేవి, భూగోళము, జగత్తు ఇవన్నీకూడా సమానార్థకాలు కావు. కారు భూమిమీద వెడుతుంది. విమానం ఆకాశంలో వెడుతుంది. అది భూలోకమే. PSLV బాహ్యాకాశంలో వెడుతుంది. అదీ భూలోకపు బాహ్యాకాశమే. చంద్రుడు అనే భూమి తాలూకు ఉపగ్రహం భూలోక బాహ్యాకాశంలోనే ఉన్నది. అక్కడే నీల్ ఆర్మ్స్ట్రాంగ్ పాదంమోపాడు. అది చంద్రలోకం కాదు. భూలోక వ్యవస్థలోనిదే. Planets, Planetary system ఖగోళ శాస్త్రములోని అంశాలు. అవి సూర్యమండలములోని భాగాలు. కంటికి కనపడేవి.
ఊర్ధ్వలోకాలలోని జీవులు ప్రకృతి బద్ధులు కారు. వారిదేహము పంచభూతాత్మకము కాదు. వారు ఒకలోకమునుండి మరియొకలోకమునకువెళ్ళుట క్షణమాత్రములోనే. ఉదాహరణకు నారదుడు సత్యలోక వాసి అనుకుందాం. వారు కల్పాంతం వరకూ ఉంటారు. ఇక్కడ దూరమూలేదు, కాలమూ లేదు. చాలా క్రిందుగానున్న స్వర్గములోనే జీవులకు ముసలితనము, మరణము లేదు. వారు 30 సం వయసులోనే ఉంటారు. కాలమానం వేరుగా ఉంటుంది. ఇప్పుడు మనమున్నది వైవస్వతమన్వంతరం. 14 మన్వంతరాలు బ్రహ్మకు ఒకదినం. మనకు సమీపములోని లోకము పితృలోకము. అక్కడ మన సంవత్సరము వారికి ఒకదినము. సంవత్సరమునకు ఒక సారి శ్రాద్ధకర్మ చేయడం ఉద్దేశ్యం ఇదే. 14 మన్వంతరాలలో సగము పూర్తి ఐతేకాని భూలోక జీవులు సృష్టించ బడలేదు. ఈ మన్వంతరం ప్రారంభములోనే పార్వతీ పరమేశ్వరుల కల్యాణము భూమి మీద జరిగినది. అప్పటికి భూమి మీద జీవులు లేరు. అంతకుముందు దక్ష ప్రజాపతి కథ. అది చాక్షుష మన్వంతరంలో జరిగినది. అంతకు ముందు ఒక రైవత మన్వంతర కథ భాగవతంలో ఉన్నది. బలరాముని భార్య రేవతి. రేవతి రైవత మనువు కుమార్తె. ఆమెకు వరాన్వేషణకై తండ్రీ, కుమార్తె బ్రహ్మలోకం వేడతారు.అక్కడ కొన్ని నిముషాలు ఆలస్యమౌతుంది. వారు తిరిగి వచ్చేటప్పటికి వైవస్వతమన్వంతరం వచ్చేసింది. ఈ కథలు అర్థం చేసుకోడానికి అనంత కాల చక్రం, సర్గ, ప్రతిసర్గల అవగాహన కావాలి.
మీప్రశ్నలకు సూటి సమాధానాలు.
1. సృష్టిలో సృష్టికర్త, అతడి శక్తి ఉన్నారు (ఉన్నాయి).
2. నారదుడు భూలోక కాలమానంలో అనేక యుగాలు, మన్వంతరాలు ఉంటాడు. అతడి లోకంలో అవి నూరేళ్ళే.
3. లోకాల మధ్య సంచార సమయం కోట్లకిలోమీటర్లలో, కాంతి సంవత్సరాలలో ఉండదు. అదితత్ క్షణమే జరుగుతుంది.
4. ఆ ప్రయాణం యోగమార్గం. అదే తపో మార్గం.
5. సిద్ధిపొందిన యోగులు అన్నిలోకాలనూ దర్శింపవచ్చు.
6. శరీరంతో స్వర్గము కాని, యమలోకం కాని ఎవరూ వెళ్ళరు. త్రిశంకుడి గతి తెలిసినదే. విశ్వామిత్రుడు తపస్సు వృధా చేసుకున్నాడు.
నేను చెప్పినది పురాణాల విషయం. Cosmology కాదు. కాని Modern Cosmology లోని expanding universe, many galaxies వంటివి సృష్టిలోని అనేక బ్రహ్మండముల వంటి ఊహలతో సమన్వయము చేసుకొన వచ్చును. space-time అనేది కూడా అవసరము. Worm holes అనే concept తో Time-travel కొంతవరకు అర్థం చేసుకోవచ్చును.
To quote Stephen Hawking - "We are just somewhat an advanced breed of monkeys on a minor planet of a very average star in the cosmos". Still, whether it is Puranas or Cosmology, you can see the level of human intellect at work. I, of course, do not accept Hawking’s view “God no longer has any place in theories on the creation of universe”. It shows his limited understanding of God based on his Christian background.

మన మతము - మన సంస్కృతి

https://www.facebook.com/vallury.sarma/posts/519383634765721



ఇక్కడ మన అంటే మనలో అధిక సంఖ్యాకులు ఇప్పటికీ అవలంబించే సనాతన భారతీయ సంస్కృతి, వారి మతంగా చెప్పబడే హిందూమతం. జమ్మూ-కాశ్మీర్, కేరళ, చాలా ఈశాన్య రాష్ట్రాలు, జార్ఖండ్, ఛత్తీస్ఘర్, ఒడీశాలలోని అటవీప్రాంతాలలో అన్య మతాల ప్రాబల్యం ఉన్నది. కాని అన్యమతస్థులలో కూడా భారతీయ సంస్కృతి అంతర్గతంగా కనుపిస్తుంది. మన మతానికి ఒక స్థాపకుడు, ఒక గ్రంధము, ఒక వ్యవస్థాలేవు. అంటే అనేక స్థాపకులు, అనేక గ్రంధాలూ, అనేక వ్యవస్థలు, ఉన్నాయి. స్థాపకులపై మొదట దృష్టి పెడదాం. మన మతం గురించి అబ్బురపడే విదేశీయులకు కనుపించే మొదటి విషయం అనేక దేవతలు, అనేక విగ్రహాలు, వారికి అర్థంకాని మన దేవాలయాలు. మనం గర్భగుడిలో దైవాన్ని దర్శిస్తే, ధ్యానిస్తే, వారు ప్రాకారాల మీద శిల్పాలకు, ముఖ్యంగ మైధున శిల్పాలకు ఆకర్షితులౌతారు. మనమే అర్థంచేసుకోము. తాపీధర్మారావు అనే పెద్దమనిషి "దేవాలయాల మీద బూతు బొమ్మలెందుకు?" అని కొందరు పాశ్చాత్యుల భావాలని తన తెలుగు పుస్తకంలో ఆవిష్కరించారు. మన ప్రభుత్వం వారికి దేవాలయాలలో కనబడేది, భక్తులద్వారా సమకూడే ఆదాయం. అందుకే మనకు దేవాలయ శాఖలేదు, ఉన్నది దేవాదాయ, ధర్మాదాయ శాఖ. ఇది నేటి పరిస్థితి.
వాటి విషయాలు వదలి మన మత స్థాపకులను గురించి తెలుసుకుందాము. మన దేవతల కంటె ముఖ్యులు మన మహర్షులు. మహర్షుల వలననే మనకు దేవతల గురించి, తెలిసినది. వేదాన్ని తమ తపస్సులో విని శిష్య ప్రశిష్యుల ద్వారా నేటికి అందుబాటులో ఉంచినవారు మహర్షులు. మనకు నిజమైన మార్గ దర్శకులు. లోక కల్యాణమే వారి ఆదర్శం. వారు ఎప్పటి వారు? ఎన్ని సంవత్సరాలు బ్రతికారు? వారి జీవితాలగురించి మనకు తెలియచేసేవి మన పురాణాలు, ఇతిహాసాలు. ప్రతి మంత్రానికీ,స్తోత్రానికి ఋషి పేరు తలచుకోవడం సంప్రదాయం. ఋషుల వలన స్థాపింపబడుటచేతనే మన మతానికి ఆర్షమతమని పేరు వచ్చింది. మొదటి తరం మహర్షులు బ్రహ్మ మానస పుత్రులు. దధీచి, అత్రి మొదలైన వారు వేదకాలపు మహర్షులు. తరువాత వారు వశిష్ఠ గౌతమాదులు. ఆతరువాతవారు విశ్వామిత్రాదులు. అగస్త్యాదులు ఇంకా తరువాతి కాలం వారు. వేద వ్యాసుడు భూమిమీదే జన్మించాడు. ఇక్కడ కొన్ని ప్రశ్నలు వస్తాయి. వీరు బ్రహ్మ చే సృష్టించ బడినవారా లేక భూమిపై పుట్టినవారా?
అమెరికాలో ఒక చర్చ జరుగుతుంది. బైబిల్ లో చెప్పిన సృష్టి కథ పాఠ శాలలో చెప్పాలా? లేక డార్విన్ పరిణామ సిద్ధాంతం చెప్పాలా?(Creation or evolution?) మనకు చర్చ లేదు. క్రైస్తవ పాఠశాలల్లో బైబిలు కథ చెబుతారు. మతరహిత పాఠ శాలల్లో డార్విన్ సిద్ధాంతంచెబుతారు. మన గ్రంధాలలోనికి వెడితే ఆరంభవాదమూ, పరిణామవాదము కూడా ఉంటాయి. ఒక ప్రశ్న అవసరం. నేటి సిద్ధాంతం ప్రకారం మనుష్యుడు మొదటిలో గుహలలో నివసించి వేటతో జీవించారని ఊహ. (Hunter Gatherer) అప్పటికి వారికి వ్యవసాయంతెలియదు. ఆర్యులు ఇలాంటి సంచార జాతి అని విదేశీచరిత్రకారుల అభిప్రాయం. అందుచేత వేదముల కాలం చాలా ముందుకు సుమారు సా.శ.పూ. 1800. జరుపుతారు. అందుచేత వారి లెక్కలకి, మన లెక్కకీ సంబంధంలేదు. భూమిపై నేడు గల అత్యధిక సంఖ్యాకులు పరిణామ వాదం ప్రకారమే జన్మించినా, ఒకానొకప్పుడు కొందరు మహర్షులు ఊర్ధ్వలోకాల నుండి వచ్చారని నమ్మ వలసి వస్తుంది. వారే ఇక్కడ జ్ఞాన జ్యోతివెలిగించినవారు. మన సృష్టి సిద్దాంతంలో ఊర్ధ్వలోకాలు, అధోలోకాలు, వానిలో జీవులు అవసరమౌతాయి. మహా భారతంలో అటువంటి వారు దర్శనమిస్తారు. కేవలం human drama of epic dimesions అని నిశ్చయిస్తే గ్రంధానికి అర్థమేలేదు.

రావణుడు - సుయోధనుడు

https://www.facebook.com/vallury.sarma/posts/517345444969540


నందిరాజు వారు మళ్ళీ నన్ను గురు అర్జునదేవ్ నుండి త్రేతాయుగానికి, ద్వాపరయుగానికీ తీసుకు వెళ్ళీపోయారు.
రావణుడు బ్రహ్మదేవుని వంశీకుడు. పులస్త్యుడు బ్రహ్మ మానస పుత్రుడు, ప్రజాపతి, మహర్షి. ఆయన కుమారుడు విశ్రావసు మహర్షి. అతడి భార్య దైత్య రాజకుమారి కైకసి. వారి కుమారుడు రావణుడు. అతని చెల్లెలు మీనాక్షి, తరువాత శూర్పణఖగా ప్రసిద్ధం. వేదవేత్త. సామగానంలో పేరెన్నికగన్నవాడు. గొప్పవీణావాదకుడు. మహా శివభక్తుడు, తాపసి.
యక్ష రాజు, ఉత్తరదిక్పాలకుడు కుబేరుడు అతని సవతి సోదరుడు. బ్రహ్మను గూర్చి తపస్సుచేసి వరాలు పొందాడు. హిమాలయాలలో తపస్సుచేసి శివుని మెప్పించాడు. ఆయన తపస్సుచేసిన స్థలమే రాక్షస థల్, కైలాస పర్వతం సమీపములోని మానస సరోవరం పక్కనే ఉంటుంది. లంకానగరాన్ని కుబేరుడు నిర్మించాడు. పుష్పక విమానంలో యక్షలోకానికి, లంకకూ మధ్య తిరిగేవాడు. దీనిని రావణుడు వశపరచుకొని, విమానాన్ని కూడా స్వంతం చేసుకున్నాడు. రావణుడు మంచి పాలకుడు. అతని పాలనలో లంక ఐశ్వర్యంతో తులతూగినది. అంత సంపద గల పట్టణం ఆసమయంలో భారతదేశంలో లేదు. రావణుడు మహాపండితుడు. జ్యోతిషం, వ్యాకరణం, మంత్ర శాస్త్రం, ఆయుర్వేదం వంటి శాస్త్రాలలో నిష్ణాతుడు. ఆయన ప్రతిష్ఠించిన శివాలయాలు ఎన్నోఉన్నాయి. ఆయన పూజించిన అమ్మవారి విగ్రహమే కాశ్మీరులో శ్రీనగరం సమీపంలోని క్షీర భవానీ ఆలయం. ఆయనకే ఆలయాలు, ఉన్నాయి. ఆయన ఋషియైన మంత్రాలున్నాయి.
ఆయన గొప్ప రాజ నీతిజ్ఞుడు. ఆయన యుద్ధరంగంలో రామబాణంతో పడి ఉన్నప్పుడు రామ లక్ష్మణులు ఆయన వద్దకు వెళ్ళి ప్రార్థించి రాజనీతి నేర్చుకుంటారు. ఇది బెంగాల్ లో ప్రచారంలో ఉన్న కృత్తివాస రామాయణంలో ఉన్నది. (English - Sudha Majumdar, The Ramayana) ఇందులో Rama learns statecraft from Ravana అనేభాగం చాల సంవత్సరాలక్రితం నేను చదివాను. నాకు ఒక విషయంగుర్తుంది – “రామా మంచిపని చేయాలనే ఆలోచన కలిగినప్పుడు తడవు లేకుండా చెయ్యి. చెడుపని చేయవలసి వచ్చినప్పుడు దానిని మర్నాటికి వాయిదా వెయ్యి. మంచి చెడూ నీ అంతరాత్మకు తెలుస్తూనే ఉంటాయి. నీవు లంకకు వారధినిర్మించినట్లు, నాకు భూమికి స్వర్గానికి మార్గం నిర్మించాలనే ఆలోచన వచ్చింది. ఇది నేను చేయగలిగిన పని. దానిని వాయిదా వేశాను. శూర్ఫణఖ చెప్పగానే ఒక క్షణం కూడా ఆగకుండా ఆలోచనా రహితంగా సీతను తీసుకొని వచ్చి ఈ స్థితికి వచ్చాను " అని చెబుతాడు.
రావణాసురుడు తన వరబలంతో ఊర్ధ్వలోకాలు, అధోలోకాలు వశపరచుకున్నాడు. భూలోకమే ఆయనకు పూర్తిగా వశం కానిది. వాలిచేతులో పరాభవంపొందాడు. శ్రీ రాముడు కూడా ఎంతో ప్రయత్నంమీదే రావణుని వధించాడు. అగస్త్యుడు ఆదిత్యహృదయం ప్రసాదించాడు. “సర్వ శత్రు వినాశనం, జయావహం జపేన్నిత్యం” అని హామీ ఇచ్చాడు. శివాంశతో పుట్టిన ఆంజనేయుడు రక్షించాడు. వాయువు బాణాన్ని సరియైనచోట తగిలేలా చేశాడు. రాముడు మానవుడిని అన్నభావంతోనే ఉన్నా, దేవతల సహకారంతోటే రావణుని జయింప గలిగాడు. రావణుని భార్య మండోదరి. ఆమె మహాపతివ్రత. ఇప్పుడు చెప్పే శ్లోకం ఆవిడ సీత వంటి పతివ్రత అని చూపిస్తుంది.
అహల్యా ద్రౌపదీ సీతా తారా మండోదరీ తథా ।
పంచకన్యా స్మరేన్నిత్యం మహాపాతకనాశినీ ||
రావణుడి ఏకైక బలహీనత స్త్రీ. అనేక భార్యలున్నారు ఆయనకు. పేర్లు తెలియవు. వేదవతి కథ తెలిసినదే. సుందరకాండలో లంకకు వచ్చిన హనుమ మొదట రావణుని అంతః పురంలోనే సీతకై వెదకుతాడు. అక్కడ అనేక సుఖించి నిద్రిస్తున్న అనేక స్త్రీలు - దేవ కాంతలు, యక్ష కాంతలు, మానవ కాంతలు, వీరందరి మధ్య ఆయన శయనించడం హనుమంతుడు చూచాడు. సీతను ఆయన బలవంతపెట్టే ప్రశ్నలేదు. సీత ఎవరో ఆయనకు తెలుసు. సీత రావణునికి మండోదరి వలన పుట్టిన కుమార్తె. వేదవతి రావణుని ఇంటిలో పుట్టినప్పుడు, రావణుడే ఆ శిశువును పేటికలో పెట్టి సముద్రంలో వదిలేస్తాడు. అదే జనకునికి తరువాత భూమిలో దొరుకుతుంది. మండోదరికికూడా సీత ఎవరో తెలుసు. ఇది వాల్మీకి రామాయణంలో ఉందో లేదో నాకు తెలియదు. రావణుడు తన రెండో జన్మ పూర్తిచేసుకొని హరిని దర్శించి ఆయన చేతిలో మరణించి వైకుంఠానికి త్వరితంగా వెళ్ళే ప్రయత్నమే సీతాపహరణం అని అనుకుంటాను.
సుయోధనుడు
సుయోధనుణ్ణి గురించి క్లుప్తంగా వ్రాస్తాను. ఆయన మహావీరుడు. గదా యుద్ధంలో భీముని మించినవాడు. పాండవులు కృష్ణుని మేనత్తయైన కుంతీదేవి కొడుకులు. అర్జునుడు కృష్ణుని చెల్లెలు భర్త. దుర్యోధనుడు కృష్ణుని వియ్యంకుడు. బలరాముని ప్రియ శిష్యుడు. సుయోధనుడు మంచి ప్రభువు. అరణ్యవాస కాలం అద్భుతంగా పరిపాలించాడు. ఋషులను పూజించాడు. బ్రాహ్మణులను గౌరవించాడు. స్నేహ శీలి. కర్ణుని మించిన దాన గుణం కలవాడు. అందుకే రాజసూయయాగంలో దానాలిచ్చే బాధ్యత ధర్మరాజే దుర్యోధనునికి ఇస్తాడు. చత్తీస్ గఢ్ ఆంధ్రా సరిహద్దులలోని వనవాసీలు దుర్యోధనుడి పేరు పెట్టుకుంటారు. ధర్మ రాజు సుయోధనుని కంటె పెద్దావాడవడంచేత, రాజ్యమంతా సంపాదించినది పాండు రాజే అవడం వలన ధర్మజుని ధర్మ ప్రవర్తన వలన ధృతరాష్ట్రుడు ధర్మరాజుకి యువరాజ పట్టాభిషేకం చేస్తాడు. చిన్నతనం నుండీ పాండవులంటే ఈర్ష్య. ఈ ఒక్క దుర్గుణమే అతడి చేత చెడు పనులు చేయించింది.
దుర్యోధనుడు దైవాంశ సంభూతుడే. కృష్ణుడు అహం కాలోస్మి ఆని గీతలో చెప్పాడు. ద్వాపరయుగం కలియుగం కాలంలో బాగాలు. ద్వాపర, కలియుగాల సంధికాలమే భారతకథను నడిపించింది. ద్వాపరుడు శకుని, కలి పురుషుడు సుయోధనుడు. జూదంలో ఓడిపోడం సహజమే. ఇక్కడ ధర్మరాజే వ్యసన పరుడు. కాని అది మాయా జూదం. శకుని మోసమే జూదంలో ధర్మజుని ఓడించింది. ధర్మజుని వ్యసన పరత్వమే తమ్ములను, భార్యనూ పణం గా ఒడ్డడానికి దారితీసింది. కాని తరువాత ద్రౌపది విషయంలో నిండు సభలో మహామహుల సమక్షంలో జరిగిన అత్యాచారమే కౌరవుల వినాశానికి, దుర్యోధనుని ఊరుభంగానికీ దారితీసింది. ఇది కలికాల మహిమ.
ఆరోజులలో రాజులెవరూ ఏక పత్నీవ్రతులు కాదు. సుయోధనుని పట్టమహిషి భానుమతీదేవి ఒక్కతే విఖ్యాతి చెందినది. శల్యపర్వంలో దుర్యోధనుడు గదాయుద్ధంలో పడి పోయినప్పుడు అతని భార్యలు వచ్చి చూచారని ఉన్నది. నేను ఈమధ్య “Critical Perspectives on the Mahabharata" Ed A K Parmar, Sarup and Sons, Delhi, 2002 పుస్తకం చూచాను. అందులో ఊరుభంగ సమయంలో సుయోధనుని ప్రవర్తన, ఆయన నాయకత్వ లక్షణాలు అనే వ్యాసం ఉన్నది. అందులో మాళవి, పౌరవి అనే దుర్యోధనుని ఇతర భార్యల ప్రసక్తి వస్తుంది. ఈ ఊరుభంగ అనే సంస్కృత నాటకం కర్త భాసుడు. భాసుడు కాళిదాసుకు పూర్వుడు. ఊరుభంగమై పడిపోయాక కృష్ణునితో దుర్యోధనుడు ఇలా అన్నాడని చెబుతారు
జానామి ధర్మం న చ మే ప్రవృత్తిః,
జానామ్యధర్మం న చ మే నివృత్తిః;
కేనాపి దేవేన హృది స్థితేన
యథా నియుక్తోస్మి తథా కరోమి"
ధర్మం తెలుసు ఆచరించాలనే ఉత్సాహం లేదు.అధర్మం తెలుసు విడవాలనిలేదు
హృదయంలో ఉన్నదేవా! నీవేది నిర్ణయిస్తే అలాచేస్తాను.


JAJAI SARMA

భర్తృహరి ఇలా చెప్పాడు.
కేయూరాణి న భూషయంతి పురుషం హారాః న చంద్రోజ్జ్వలాః
న స్నానం న విలేపనం న కుసుమం నాలంకృతా మూర్ధజా

వాణ్యేకా సమలంకరోతి పురుషం యా సంస్కృతా ధార్యతే
క్షీయంతేऽఖిల భూషణాని సతతం వాగ్భూషణం భూషణం !!
పై శ్లోకానికి తెలుగులో పద్యము.
భూషలు కావు మర్త్యునికి భూరి మయాంగద తార హారముల్
భూషిత కేశ పాశ మృదు పుష్ప సుగంధ జలాభిషేకముల్
భూషలు కావు పూరుషుని భూషితు జేయు పవిత్ర వాణి వా
గ్భూషణమే సుభూషణము భూషణముల్ నశియించునన్నియున్ !!
ఈ పై విషయములు కాని, వ్రాయబోయు విషయములు కాని మీకు తెలియనివి కావు. కాని మీ వ్యాసము చదివినతరువాత కొంతమంది పిన్నలు ప్రతినాయకులను అనుసరించే ధోరణి అవలంబించకుండా, ఈ నాలుగు వాక్యములు.
మనకి మూలము వాల్మికి ప్రసాదిత శ్రీమద్రామాయణము ఆధారము గా చేసుకుని శ్రీరామాయణము లోని వ్యక్తిత్వాలు అర్ధము చేసుకోవాలి. అలాగే శ్రీమద్భారతము., వ్యాస ప్రణీతము మూలము కదా!
పై పద్యాలలో భర్తృహరి చెప్పినట్లు శ్రీరామాయణ,శ్రీమధ్బారతములలోని ప్రతినాయకులకు , వారి భాషణములు వారికి భూషణములు కాలేక, వారిచేత సకల అకృత్యములు చేయించి వారి వినాశనమునకు దారితీసినది. కాలక్రమేణా ప్రక్షిప్తాలు చాలా వచ్చిచేరటముచేత, రావణాసుర, ధుర్యోధనులను ఎందుకు మహర్షులు మనకుదాహరణగా చూపించారో నన్నది ఇప్పటి తరమువారికి తెలియకుండాపోయి, వారే నాయకులు అన్న భ్రాంతిలో పడిపొతున్నారు. నిజానికి వారు ఆయా పురాణాలలో ప్రతినాయకులు మాత్రమే. వారి దుర్గుణములు వారి వ్యక్తిత్వాలను అధికముగా ప్రభావితము చేసినవి. ప్రతివ్యక్తిలోను మంచి చెడు అనేవి రెండూ వుంటాయి. ఏది వ్యక్తిత్వాన్ని ప్రభావితము చేస్తే దానిచేత వాడు వ్యవహరించబడతాడు.
ధుర్యోధనుని పరిపాలన మహాభారతములో ఎక్కువగా ప్రస్తావనలేదు. వాడు ఉన్న పరిపాలనను కొనసాగించినట్లే వ్యాసులవారు తెలిపారు. పైగా ధర్మాన్ని అనుసరించే భీష్మాచార్యులు పరిపాలనా వ్యవహారములు చూస్తూండేవారు.
శ్రీరాముడు యుద్ధసమయానికే సకల విద్యాపారంగతునిgaa వశిష్ట, విశ్వామిత్రులు తీర్చిదిద్దారు. శ్రీరాముడు రావణుని దగ్గర రాజనీతి నేర్చుకున్నది పూర్తిగా అవాస్తవము. ఎందుచేతనంటే, శ్రీరాముడు బ్రహ్మాస్త్రం ప్రయోగము చేసినంతనే ఆ అస్త్రము రావణుని హృదయములో గుచ్చుకుని అతని ప్రాణములు తీసి, తిరిగి శ్రీరాముని అమ్ములపొది చేరినది. (యుద్ధకాండ 111 వ సర్గ)
ధుర్యోధనుడు యుద్ధానికి వెడుతూ తల్లి ఆశ్శీసులు పొందగోరి పాదాభివందనము చేస్తాడు.గాంధరి వాక్సుద్ధి కల పతివ్రత. అప్పుడు గాంధారి "నువ్వు యుద్దములో జయిస్తావు" అని కొడుకుని దీవించకుండా "యతోధర్మ: తతో జయ:" అని దీవిస్తుంది. ఇందువల్ల సుయోధనుడు అధర్మ ప్రవర్తునుడు అని తల్లి చెప్పకయే చెప్పినది.
వేదవతి వృత్తాంతము కూడా వాల్మీకి రామాయణము లోనిది కాదు.
కాబట్టి ప్రక్షిప్తాలు ఆధారము చేసుకొని, వారి సుగుణములు మనము ఉగ్గడించటము ప్రస్తుత పరిస్థితులలో అవాంచనీయము.


Vvs Sarma i agree with you fully. This trend of talking about these characters based on the notion that they are just imagined stories and criticizing them and modifying them has gone to far. But with tools like internet, this is what is happening. The so called theory that Bhagavad Gita is rational and Mahabharata is a myth is nonsense. I agree that we should not add to the raging fire.


The Structure of the Universe (Vedic) - Viswaroopa - K. Sivananda Murty Preface 2

https://www.facebook.com/vallury.sarma/posts/616984388338978 The Puranas speak of individuals going up and down between these proximate...