Showing posts with label Jaina. Show all posts
Showing posts with label Jaina. Show all posts

Sunday, January 21, 2018

ఆంధ్రదేశంలో బౌద్ధజైనాలు ఎప్పుడు వచ్చాయి?


ఆంధ్రదేశంలో బౌద్ధజైనాలు ఎప్పుడు వచ్చాయి? చాలా ముందుగానే అనిచెప్పాలి. సా.శ.పూ. 150 ప్రాంతాలలో ఖారవేలుడు అనేరాజు కళింగ ప్రభువు. అతడి సామ్రాజ్యం కోస్తా ఆంధ్ర అంతాకూడా వ్యాపించింది. ఆయన జైనుడు. అంతకుముందే అశోకుని ద్వారా బౌద్ధమతం కొంత ప్రచారంలోకి వచ్చినది. ఖారవేలుని తరువాత వచ్చిన శాతవాహనుల కాలంలో బౌద్ధం నేటి గుంటూరు జిల్లా లో వ్యప్తిచెందినది. నాగార్జునుడు (సా.శ. 200 ప్రాంతం) కీలక గురువు. తరువాత దేశమంతా వ్యాపించినది. జైనం వర్ణవ్యవస్థను పట్టించుకోలేదు. జైనంలోనికి మారినవారు కులాలను యథా తథంగాఉంచుకుని మళ్ళీ సనాతన మతంలోనికి అలాగే మారిపోయారు. తరువాత కాలంలో (సా.శ 500-900) చాళుక్యుల ద్వారా జైనం పోషింపబడినది. తరువాత నాథ సన్యాసులూ, పంచాచార్యుల ద్వారా శైవం వ్యాప్తిలోకి వచ్చింది.అగస్త్య మహర్షి కాలంనుండే దక్షిణదేశమంతా శైవం వచ్చింది. అన్ని మతాలు ఉండేవి. ఎవరికి నచ్చినది వారు పాటించే వారు. 12 వ శతాబ్దానికి వీర శైవం, వీర వైష్ణవం వచ్చాయి.విభజన, విద్వేషం అనాదిగా మానవుల లక్షణం.
LikeShow More Reactions
Comment

Friday, January 19, 2018

కాలస్వరూపము - చరిత్ర

https://www.facebook.com/vallury.sarma/posts/501604209876997

https://www.facebook.com/vallury.sarma/posts/501927656511319

https://www.facebook.com/vallury.sarma/posts/502681373102614

https://www.facebook.com/vallury.sarma/posts/502958356408249

https://www.facebook.com/vallury.sarma/posts/503337006370384

నిన్న చెప్పిన ఈ వాక్యాలు మళ్ళీ చూదాం - అశోక చక్రవర్తి కళింగయుద్ధములో లక్ష సైనికుల మృతదేహాలను చూచి విషాదం చెంది బౌద్ధమతం స్వీకరించాడని అంటారు. ఇది అర్జున విషాదయోగానికి విపర్యయం. అర్జునుడు బంధుమిత్రుల మరణాన్ని ఊహించుకొని శోకిస్తే, కృష్ణుడు ధైర్యం చెప్పి గీత బోధించి యుద్ధోన్ముఖుణ్ణిచేశాడు. అశోకుడు దేశమంతా బుద్ధుని బోధలను రాళ్ళపై చెక్కించి ప్రచారం చేశాడు. తన పుత్రుడు మహేంద్రను, కుమార్తె సంఘమిత్రను బౌద్ధసంఘములో భిక్షువులుగా చేసి సింహళానికి (నేటి శ్రీలంకకు) పంపించాడు.
శ్రీ కృష్ణుడు చేసినది ధర్మ సంస్థాపన. భారత యుద్ధం తరువాత పరీక్షిత్తు రాజయ్యాడు. తరువాత అతడి కుమారుడు జనమేజయుడు, తరువాత 28 తరాలు (3100 బి.సి.ఇ. నుండి 1800 బి.సి.ఇ. వరకు) ఆ వంశం హస్తినాపురానికి, కురు సామ్రాజ్యానికీ మంచి పాలన అందించారు. బుద్ధుడు చేసినది మోక్షజ్ఞాన బోధ, కాని అది కలియుగంలోని ధర్మచ్యుతి. భారతీయచరిత్రకు చాలా ప్రమాదాన్ని తెచ్చి పెట్టింది. బుద్ధుడు సుక్షత్రియుడు. అతడు, కుమారుడు రాహులుడు భిక్షుకులవడంతో వారికి నిర్వాణం వచ్చి ఉండవచ్చు. కాని శాక్యరాజ్యం ఏమైనది? అరాజకమయినది. అశోకుడు కళింగ యుద్ధము తరువాత బౌద్ధుడయ్యాడు. తన కుమారుని కూడా భిక్షువును చేశాడు. అశోకుని సామ్రాజ్యం గాంధారం నుండి కర్ణాటక వరకు భారతదేశమంతా వ్యాపించింది. అతడి తరువాత మగధ సామ్రాజ్యం అంతరించినది. భారత మంతా అరాచకం ప్రబలినది. బౌద్ధ జైన ధర్మాలు గృహస్థులకు, సన్యాసులకు పనికి వస్తాయి. వారికి పరమ ధర్మాలు. రాజ్యమేలే రాజులకు కాదు. చాణక్యుడు చెప్పినట్లు రాజుకి కావలసిన విద్య - త్రయీ, అన్వీక్షకి, వార్తా, దండనీతి. అహింస కాదు. తన తండ్రుల, తాతల ధర్మాన్ని వదిలిపెట్టడం అశోకుని అజ్ఞానం. అతడికి గీతా బోధ చేసే వారు లేక పోయారు. అశోకుడు రాజ్యము, ప్రజల క్షేమాన్ని వదలి పెట్టి తన మోక్షాన్ని చూసుకున్నాడు మంచిదే. కాని అది మహరాజుగా ఉండి చేయవలసినది కాదు. తన తరువాత రాజ్యపాలనకు ఏర్పాట్లుచేసి తాను సన్న్యాసం స్వీకరించాలి. బౌద్ధంలో వర్ణమూ లేదు, ఆశ్రమమూ లేదు. ఈ విధముగా బౌద్ధము వ్యవస్థను భంగంచేసింది. బౌద్ధం భారతదేశంలో క్షాత్రానికి, దేశ రక్షణకు, విదేశీ దండయాత్రలను ఎదుర్కొనే శక్తికి సముచిత స్థానం లేకుండా చేసింది. ఆధునిక భారతంలో జైన, బౌద్ధాలను కొంతవరకు తెలివితక్కువగా అరాధించిన వారు గాంధీ, నెహ్రూ. నెహ్రూ పంచశీల మన దేశానికి తీరని నష్టం చేకూర్చింది. చైనాతో పంచశీల ఒడంబడిక చేసుకున్న నెహ్రూ 1962 చైనా దండయాత్రలో ఘోర పరాజయాన్ని ఎదుర్కోవలసి వచ్చింది. (Himalayan blunder of Nehru).

కలియుగంలో వేద ధర్మం క్షీణించింది. వేదాన్ని ప్రమాణం గా స్వీకరించని జైన బౌద్ధాలు మానవుని పరిణామానికి, వ్యక్తిగత వికాసానికి,తోడ్పడినా, నిర్వాణానికి మార్గముచూపించినా, చాలా హేతుబద్ధంగా కనబడినా, సమాజాని ధర్మ బద్ధంగా నడిపే కార్యంలో సనాతన ధర్మానికి సాటి రాలేకపోయాయి. దీనికి అనేక కారణాలున్నాయి.
1. భగవంతుని నిరాకరించడము వానిలోని లోపము. ఈశ్వర ప్రసక్తిలేని మతము, దేశము నిలువవు. ముఖ్యముగా మన దేశములో ఈశ్వరునియందు భక్తి ప్రతి భారతీయునకు జన్మతః వచ్చిన సంస్కారము. In God We Trust" అన్నా "సత్యమేవ జయతే" అన్నా ఒకటే. 2. బౌద్ధ సంఘం పై విశ్వాసము వలన మొదట్లో మతవ్యాప్తి జరిగినా వేయి సంవత్సరాలలో అదే మత నిర్మూలనకు కూడా దోహదం చేసినది. మహమ్మదీయ పాలనలో బౌద్ధసంస్థాగత కార్యక్రమాలన్నీ నాశనమైయ్యాయి. మనకు దేవాలయాలు అనేకం విధ్వంసం అయినా కుటుంబాలలో వ్యక్తులలో మిగిలిన శాస్త్రజ్ఞానము మతాన్ని కాపాడింది. 3. ఇతిహాస, పురాణాలు, దేవీదేవతలు వారి మతాలలో కూడా జాతక కథలు,దేవతలు, పురాణాలు ప్రవేశ పెట్టవలసి వచ్చినది. 4. న్యాయ శాస్త్రాన్ని బౌద్ధజైనులకంటె గొప్పగా సా.శ. 8 వ శతాబ్దమునుండి సనాతన ధర్మవాదులు అభివృద్ది చేశారు. శంకర, రామానుజ ,మధ్వా చార్యులంతా వాదనలో గొప్ప ప్రతిభ చూపించారు. శ్రీ హర్షుడు, మధుసూదన సరస్వతి, గంగేశోపాధ్యాయుడు, రఘునాథ తర్క శిరోమణి వంటి వారు జైన బౌద్ధాల వాదాన్ని తార్కికముగా ఖండించడంలో సఫల మయ్యారు. 5.తులసీ దాసు రామాయణం, మీరా, సూరదాసు వంటి వారి భజనలు, చైతన్యుని కృష్ణ భక్తి మార్గం,జ్ఞానేశ్వరుడు, తుకారాం, సక్కుబాయి వంటి మహారాష్ట్ర భక్తులు, వల్లభ సంప్రదాయం, అన్నమయ్య, పురందర దాసు, త్యాగయ్య వంటి వారల చరిత్రలు దేశమంతా భక్తి మార్గాన్ని ప్రచారంచేయడంతో సమాజమంతా ప్రభావితమైనది. 6. బౌద్ధ, జైనాలు చెప్పిన సాధన సామాన్యుల శక్తికి అందరానిదానిగా కనుపించింది.
సనాతన ధర్మం లో ధర్మమనే పదాన్ని నిర్వచింపడం అర్థంచేసుకోవడం కష్టం. సద్గురు శివానందమూర్తి గారి నిర్వచనాలు నాకు నచ్చినవి. Dharma is appropriateness in thought, action, attitude and judgment to a thing or a happening or a desire or an incident in life ఇలా చూస్తే అశోకుని బౌద్ధస్వీకరణ ఆపరిస్థితిలో ధర్మచ్యుతియే.

కాలస్వరూపము - చరిత్ర
కాలోస్మి లోకక్షయకృత్ప్రవృద్ధో లోకాన్ సమాహర్తు మిహప్రవృత్తం (భ.గీ. 11.311.32) భగవాన్ ఉవాచ - నేను లోకములను క్షయముచేయుటకు విజృంభించిన కాలమును. సంహారక్రియయే ఇప్పటి నాప్రవృత్తి. భగవంతుడే కాలము. అతడే కాలుడు (యముడు, కాళీదేవి). కాలము చక్రము వంటిది. ఒకటి కాదు మూడు కాలచక్రములున్నాయి అని బౌద్ధులు చెబుతారు. దలైలామా వంటి మతగురువులు పరిణతిచెందిన శిష్యులకు కాలచక్ర దీక్ష ఇస్తారు. 2006 లో ఆయన ఈ దీక్ష గుంటూరు జిల్లా అమరావతిలో ఇచ్చారు. తెలుగు సాహిత్యములో కాలతత్త్వజ్ఞానము కలవారు కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు. ఆయన వేయిపడగలు కాల ప్రభావాన్ని సూచించే అద్భుతనవల.
వేయి పడగల పాము విప్పారుకొనివచ్చి
కాటందుకున్నది కల లోన రాజును.
అనే గణాచారి పాటతో నవలా ప్రారంభం. ఇక్కడ పాము కాల సర్పం. వేయిపడగలు, భాగవత తత్త్వానికి ప్రతిబింబం. పరీక్షిత్తు పాముకాటుతో మరణిస్తే కలి విజృంభిస్తుంది. వృద్ధ జమిందారు మరణంతో సుబ్బన్నపేటలో కలియుగం ప్రారంభమౌతుంది.కాలగమనంలో సమాజంలో వచ్చే మార్పులను ఈ నవల అద్భుతంగా చిత్రిస్తుంది.విశ్వనాథ వారే ఝాన్సీరాణి అని ఒక పద్య ప్రబంధాన్ని వ్రాశారు. ఇది చారిత్రకం. 1857 నాటి కథ. ఆంగ్లేయులు సిపాయిల తిరుగుబాటుగా వర్ణించినదానిని మార్క్స్ ప్రథమ భారతీయ సంగ్రామం అన్నాడు. ఈ వైరుద్ధ్యం భారత చరిత్ర విశేషం. విశ్వనాథ వారి పీఠికను చూద్దాం. ఈ కావ్యమున కథానాయకుడు లేడు. లక్ష్మీబాయి కూడా చివరకు యుద్ధమున ఓడిపోయి మరణించును. నాయకుడు కాదు కదా, ఆమె కథానాయిక కూడా కాదు. ఇది ఆమెనుగూర్చిన వట్టి చరిత్ర కథ. ఏదోచేయవలెను.
"ఇంత పరాక్రమవంతురాలు కదా! భారతీయులదృష్టిలో రాజ ధర్మమును పాటించెను కదా! ఆమె ఎందుకు ఓడిపోవలయును? ఆమె సమకాలికులైన ఇతర భారతీయ రాజులు ఆంగ్లేయులకు దాసానుదాసులైరి. సీ!సీ! కాలము యొక్క మహిమ!లేనిచో ఆమె కథానాయకుడైయుండెడిది. విజయమును పొందెడిది. కావ్యము వీరరస ప్రథాన కావ్యమయ్యెడిది. అందుచేత కావ్యమును అధ్యాయములుగా విభజించి ప్రతి అధ్యాయముయొక్క ఆద్యంతములలోనూ కాలమును, దాని స్వరూపమును, దాని యవ లక్షణములను, దాని యుగధర్మము ననుసరించినడిచెడు పద్ధతిని వివరించితిని. కొంత దోషము పోయెనుకదా!” ఆధునిక యుగము. దాని లక్షణములు చరిత్రపై దాని ప్రభావము, ఇక్కడ ముఖ్య విషయములు. భారతదేశపు ప్రస్తుత అధోగతిని వివరించిన కవి విశ్వనాథ. ఆయన "తల వెనుకకు తిప్పియున్న జంతువు" అన్నాడో వామపక్ష విమర్శకుడు. విశ్వనాథ రచనలు అర్థంకాలేదు పాపం. వేదాన్ని ప్రమాణము కాదన్న అన్నలకు డాస్ కాపిటల్, మెగస్థనీస్ ఇండికా ప్రమాణాలు. రంగనాయకమ్మ విషవృక్షం, లక్ష్మీ ప్రసాద్ ద్రౌపది ఆధునిక సాహిత్యం.


మనం భారత దేశ చరిత్రను సనాతన ధర్మ చరిత్రగా పరిశీలిస్తునాము. సనాతన ధర్మమంటే వేదవిహితమైన వైదిక మతము ఒకటే కాదని తెలుసుకున్నాము. అనాదిగా తర్క సహాయముతో మతాలను చర్చించడం మన ప్రాచీన విధానం. చార్వాకము, బౌద్ధము, జైనము, శైవము, వైష్ణవము, అనేక మార్గములు, దర్శనములు సనాతన ధర్మాన్ని ఒక కీకారణ్యముగా మార్చివేశాయి. ఉదాహరణకు ఒక వేద వాక్యం తీసుకుందాము. "ఏకం సత్ విప్రా బహుధా వదంతి." ఆధునిక గురువులు దీనికి విపరీతమైన అర్థాలతో సంక్లిష్టం చేశారు. దీని అర్థము సరళమే. సద్వస్తువు ఒకటే, దానిని విప్రులు బహువిధములుగా చెబుతారు. విప్రులు అంటే ఎవరు? జ్ఞానులు. అనంతమును పరిమితమైన పదములతో ఎలా వర్ణిస్తారు? వారు ఊహించిన స్వల్ప విషయాన్ని చెబుతారు. దీన్ని ఆధునిక గురువులలో కొందరు అన్ని మతాలు, అందరు దేవుళ్ళు, అన్ని మార్గాలు ఒకటే అని చెబుతారు. వైవిధ్యం సృష్టి లక్షణమైతే, ఆ భేదాలు గమనించడం విజ్ఞానమైతే అన్నీ ఒకటే అనడం "అన్నమైతే నేమిరా? మరి సున్నమైతేనేమిరా?" అన్నట్లే ఉంటుంది.
సద్వస్తువును అర్థంచేసుకున్నా లేకపోయినా ఈ వాదనల వలన ఒక రకమైన ప్రజా ప్రభుత్వ చర్చా ధోరణి భారతదేశములో ప్రవేశించినది. రాజరికము, నియంతృత్వము, ప్రజాప్రభుత్వము, దొరతనము, వర్గపాలన అని అనేకరకాల ప్రభుత్వాలు ఉన్నాయి సృష్టిలో. సనాతన ధర్మము లేదా హిందూ మతము సంపూర్ణ ప్రజా ప్రభుత్వము. కొందరు పీఠాధిపతులు, ప్రవచనాలు ఇచ్చేవారు, గురువులు ఉన్నా వారి ప్రభావం అతిస్వల్పం. పాలకులు లేని ప్రజా సముదాయమే హిందూమతము. రోమన్ కాథలిక్ మతమును రాజరికము అనవచ్చును. పోప్ మకుటమున్న మారాజు. అందుకే ఆయనను భారత ప్రభుత్వము కూడా రాజ, దౌత్య లాంఛనాలతో ఆహ్వానిస్తుంది. పాకిస్తాన్ ది ఒకరకమైన వర్గ పాలన - కాని అక్కడ కూడ సైన్యాధికారులు, వర్తకులు, సున్నీ మతాధిపతులు పాలక వర్గ పాలనయే. షియాలు వెనుకబడినవారు, అహ్మదీలు, హిందూ, క్రైస్తవులు అస్పృశ్యులు లేదా బలిపశువులు. అమెరికా, ఇండియా ఇతర ప్రజా ప్రభుత్వాలలో కూడా వర్గ పాలన లేకపోలేదు.అందుకే ఆక్స్ ఫర్డ్ చరిత్ర ఆచార్యుడు ఇప్పటికీ ప్రభుత్వాల శక్తి నాలుగు వర్గాల సంఘర్షణ మీద ఆధారపడి ఉంటుదన్నారు. ఇప్పుడు వర్తకులు, సైన్యాధిపతులు, రాజకీయవాదులు/మేధావులు ఆవరుసలో అధికారం పంచుకుంటే పాలితులెప్పుడూ రైతులు, కార్మికులు, కూలీలు. ఇది ఒకరకంగా వర్ణ విభజన శాశ్వతత్త్వమే.


మనము భారతీయ చరిత్రలో సుమారు సా.శ. 1000 కి వద్దాము. ఆసమయంలో మనదేశ చరిత్రను ఇద్దరు వ్యక్తులు ప్రభావితము చేశారు. మొదటివారు ఆది శంకరాచార్య భగవత్పాదులు. ఆయన కాలమును గురించి విభేదాలున్నాయి. శృంగేరి శారదాపీఠము వారి ప్రకారము ఆయన కాలము సా.శ. 788-820. (కంచి కామకోటి వారి ప్రకారము ఆయన కాలము సా.శ.పూ 509-477.) (ఆది శంకరులు, అభినవ శంకరులు అని ఇద్దరున్నారా? అనే వాదముకూడా ఉన్నది.) తన అద్వైత వేదాంతముతో ఆయన అప్పటికే క్షీణదశలో ప్రవేశించిన బౌద్ధ జైనాలను తన పాండిత్య ప్రతిభతో, తర్కముతో ఎదుర్కొన్నారు. అంతకుముందే దేశమంతా వ్యాపించినది ఎక్కువగా శైవము. కాశ్మీరునుండి కన్యాకుమారివరకు శైవ ప్రభావము ఉన్నది. బసవేశ్వరుని వీరశైవము ఆమతానుయాయులైన లింగాయతుల ప్రభావము నేటి కర్ణాటక రాష్ట్రంలో ఇప్పటికీ ఉన్నది. వంగ, కామరూప (బెంగాల్, అసోం, బంగ్లా) వంటి ప్రాంతాలలో శాక్తేయం బహుళ ప్రచారంలోనికి వచ్చినది. మధ్యయుగంనాటికి మనదేశ చరిత్రపై సనాతన ధర్మంలోని పరిణామాలకంటె విదేశీదండయాత్రలప్రభావం ఎక్కువ అవి దేశ చరిత్రగతినే మార్చివేశాయి. మన చరిత్ర గతి మార్చిన రెండవ వ్యక్తి సుల్తాన్ మహమద్ ఘజనవీ (ఘజనీ మహమ్మదు) (సా.శ. 971-1030). ఒక విధంగా ఆయన పై ప్రభావము చూపింది ఇస్లాం మతము. దాని వ్యవస్థాపకులు ముహమ్మద్ ప్రవక్త (సా.శ. 570-632). ఆ కాలములో ప్రపంచమును అత్యధికంగా ప్రభావితము చేసిన వ్యక్తి. ఆనాటి ధార్మిక, రాజకీయ, సైనిక బలాలలో ఆయనకు ఎదురులేదు. భగవంతుని చేత ఆదాము, నోవా, అబ్రహాం, మూసా, ఈసా (యేసు)ల తరువాత పంపబడిన ఆఖరి ప్రవక్త అని ఆమతస్తుల ప్రగాఢ విశ్వాసం. భారతదేశ చరిత్రలో కూడా శంకరాద్వైతము, ఇస్లాం మతము, క్రైస్తవమతము ప్రముఖ పాత్ర వహించాయి. నేటికీ వహిస్తున్నాయి. ప్రపంచజనాభాలో క్రైస్తవులు సుమారు 33 శాతం అయితే, ముస్లిములు 22 శాతం, హిందువులు 10 శాతం, బౌద్ధులు 5 శాతం, చైనీయ ప్రాచీన మతాలు 5 శాతం అనుకోవచ్చు.ఇంకా అనేక మతాలున్నాయి. ఆధునిక భారతీయ సమాజాన్ని మతదృష్టితో పరిశీలించడానికి గుర్తుంచుకోవలసిన విషయం 1947లో విభజన తరువాత ఏర్పడిన దేశాలు - ముస్లిం పాకిస్తాన్ (1971 తరువాత ముస్లిం పాకిస్తాన్, ముస్లిం బంగ్లాదేశ్), హిందూ, ముస్లిం, క్రైస్తవ, సిఖ్, నాస్తిక, మతదృష్టి రహిత ఇండియా, లేక భారత్. ఇండియా ఈ అందరిదీ. ఈవిశ్లేషణ దేశానికీ, ప్రజలకూ, సంస్థలకూ కూడా వర్తిస్తుంది.



ఆధునిక కాలంలో బౌద్ధ ధర్మాన్ని లోతుగా అధ్యయనం చేసిన

https://www.facebook.com/vallury.sarma/posts/501245056579579

ఆధునిక కాలంలో బౌద్ధ ధర్మాన్ని లోతుగా అధ్యయనం చేసిన రాజకీయ నాయకులలో ప్రముఖుడు బాబాసాహెబ్, భీమరావు అంబేద్కర్. హిందూసమాజంలో అస్పృశ్యత కూ మతానికి సంబంధము ఉన్నట్లు భావించిన డాక్టర్ అంబేద్కర్ జీవితకాలమంతా ఈ అస్పృశ్యతకు కారణాలేమిటని పరిశోధించి, వారి కులము వారు పూర్వము బహుశ బౌద్ధులేమో అని నిర్ణయానికి వచ్చారు. కాని సనాతన ధర్మము గురించికూడా పూర్తిగా తెలిసిన ఆయన దానికి సమీపవర్తియైన బౌద్ధాన్ని తన మరణానికి కొన్ని నెలల ముందు స్వీకరించారు. ఆయన అనుయాయులు కొందరు కూడా ఆయనను అనుసరించారు. ఆధునిక భారత చరిత్రలో ఇది ఒక శుభపరిణామం. 

జైన, బౌద్ధమతాల తర్కం అప్పటి వైదికుల తర్కంకంటె బలంగా ఉండడం వలన దానికి తాత్కాలికంగా విజయం లభించి మేధావి వర్గంలో ఆ మతాలకు ఆదరణ వచ్చినది. మహారాజులు. పండితులు, బ్రాహ్మణ క్షత్రియ, వైశ్యులు ఆకర్షితులయ్యారు. వర్ణ వ్యవస్థలేకపోవడంలో సమాజంలో ఇతరవర్గాలు కూడా ఆకర్షితులయ్యారు. మన చరిత్ర పుస్తకాల ఆధారంగా బుద్ధుడు, మహావీరుడు సా.శ. పూ. 500 ప్రాంతంలోని వారు. కాని వారి సాహిత్యం అధారంగా ఆ మతాలు ఎంతో ప్రాచీనమైనవి. 22 వ తీర్థంకరుడే కృష్ణుని సమకాలికుడంటే ఆదినాథుడు ఎప్పటి వాడు? చంద్ర గుప్త మౌర్యుని కాలం గ్రీకు యాత్రికుడు మెగస్థనీసు ఇండికా ఆధారంగా నిర్ణయించారు. అందులో ఉన్న విషయం "అప్పుడు పాలింబొత్రా లో సాంద్రకొత్తాస్ అనే రాజు ఉండేవాడు". ఇతడు పాటలీపుత్రపు రాజు చంద్రగుప్త మౌర్యుడని నిశ్చయించారు. కాని అతడు గుప్త చంద్రగుప్తుడో, సముద్రగుప్తుడో కావచ్సుకదా! ఇదే సత్యమైతే బుద్ధుని కాలము సా. శ. పూ. 1100 అవుతుంది.
స్వల్ప కాలంలో బౌధ్ధ జైనాలు ఎంతో ప్రజాదరణ పొందాయి. అశోక చక్రవర్తి కళింగయుద్ధములో లక్ష సైనికుల మృతదేహాలను చూచి విషాదం చెంది బౌద్ధమతం స్వీకరించాడని అంటారు. ఇది అర్జున విషాదయోగానికి విపర్యయం. అర్జునుడు బంధుమిత్రుల మరణాన్ని ఊహించుకొని శోకిస్తే, కృష్ణుడు ధైర్యం చెప్పి గీత బోధించి యుద్ధోన్ముఖుణ్ణిచేశాడు.అశోకుడు దేశమంతా బుద్ధుని బోధలను రాళ్ళపై చెక్కించి ప్రచారం చేశాడు. తన పుత్రుడు మహేంద్రను, కుమార్తె సంఘమిత్రను బౌద్ధసంఘములో భిక్షువులుగా చేసి సింహళానికి (నేటి శ్రీలంకకు) పంపించాడు. ఆంధ్రదేశంలో శాతవాహనులు వైదికమతస్త్థులైనా బౌద్ధాన్ని ఆదరించారు. వారి భార్యలు భర్తల పక్కన కూర్చుని యజ్ఞాలు చేశారు. బౌద్ధ విహారాలకు కానుకలు ఇచ్చారు. ఇక్కడ మతమార్పిడి అన్న ఇతరమతాల ప్రక్రియకు ఆస్కారంలేదు. బుద్ధుడు ఏర్పాటుచేసిన వ్యవస్థలలో ముఖ్యమైనది సంఘం. ఇది భిక్షువుల సముదాయం. వీరు విహారాలలో ఉండి ధర్మ బోధ చేసేవారు. వీరిని రాజులు పోషించేవారు. తరువాత కాలంలో అన్నిదేశాల విద్యార్థులను ఆకర్షించిన తక్షశిల, నలంద, విక్రమశిల వంటి విశ్వవిద్యాలయాలు ప్రపంచ ఖ్యాతి వహించాయి. ఒక్క వేయి సంవత్సరాలలో తిరిగి సనాతన ధర్మం ఏవిధంగా బహుళ ప్రచారాన్ని పొందింది? ఈ మతాలు ఎందుకు ప్రజాదరణ కోల్పోయాయి? భారతీయ చరిత్రపై ఈ మతాల ప్రభావం ఎంత?



కానీ అంబేద్కర్ కృషి ఫలితాలను అనుభవిస్తున్న చాలామంది ఆయన అనుసరించిన బౌద్ధాన్ని మాత్రం వదిలేసి, భారతీయత ఏమాత్రం లేని క్రైస్తవం వైపు పోతున్నారు.
మీరు చెప్పినది నిజమే. కాని కాల స్వభావము వలన కొందరుపురోగమిస్తే కొందరు వెనుకకు నడుస్తారు. కాని నా ఉద్దేశ్యం- వాళ్ళకి కూడా తెలిసి వస్తుంది. అటునుండి ధన ప్రవాహం వచ్చినంత వరకు ఇప్పటి కథ నడుస్తుంది. అది వెను తిరిగి నపుడు ఆసౌధం కూలిపోతుంది. ఐరోపాలో పరిస్థితి అదే. అమెరికా పౌరులైనవారు భారతీయత కోల్పోయినట్లే మత మార్పిడుల వలన ప్రజాపతులనుండి మారి, అబ్రహాంకు దత్తపుత్రులౌతారు. వారి మూలాలు భారతదేశం నుండి మధ్య ఆశియాకు మారతాయి. ఇప్పటికే లేకపోతే హైదరాబాదు నుండి జెరూసలెం Direct flight వస్తుంది. సమాజానికి మార్పులు సహజం


గాంధీ – జైనం



ఆధునిక భారత చరిత్రలో కూడా జైన బౌద్ధాలకు ప్రత్యేక స్థానం ఉన్నది. ఈనాడు మన దేశంలో 80 లక్షల మంది బౌద్ధులు, 40 లక్షల మంది జైనులు ఉండ వచ్చును. జైన మతం కూడా ఐహిక జీవనంలో ప్రవర్తనకు ముఖ్య స్థానం ఇస్తుంది. ఈమతం 24 మంది తీర్థంకరుల ద్వారా వ్యాప్తి చెందినది. 24 వ తీర్థంకరుడు మహావీరుడు స్థాపకుడని చరిత్ర పుస్తకాలు చెబుతాయి. ఆయన బుద్ధుని సమకాలికుడు.
జైనుల న్యాయ తర్కాలు కూడా బౌద్ధుల న్యాయము వలెనే వైదికుల న్యాయము కంటె శక్తివంతమైనది. వారి న్యాయాన్ని అనేకాంత వాదము, స్యాద్ వాదము, నయ వాదము అని చెబుతారు. అనేకాంతవాదమంటే పరస్పర విరుద్ధమైన, వ్యతిరేకమైన భావాలను జైనం అంగీకరిస్తుంది. వారి న్యాయం లో ఈఅంగాన్ని నయవాదము అంటారు. సప్తభంగినయం అంటే - స్యాదస్తి, స్యాన్నాస్తి, స్యాదస్తి చ నాస్తి, స్యాదవక్తవ్య, స్యాదస్తి చ అవక్తవ్య,స్యాన్నాస్తి చ అవక్తవ్య, స్యాదస్తి చ నాస్తి చ అవక్తవ్య. May be it is, May be it is not, May be it is and is not, May be it is indescribable, May be it is and is indescribable, May be it is not and is indescribable, May be it is, it is not and is indescribable" దేవుడున్నాడా? అంటే జైనుడికి ఎలా అన్నా సంతోషమే, బహుశా ఉన్నాడు, బహుశా లేడు, బహుశా ఉన్నాడో లేడో, బహుశా అనిర్వచనేయుడేమో... ఇలా ఏడు రకాలు. This is an ancient Indian exposition of FUZZY LOGIC. జైనమత ప్రభావం మనమీద ఇంతా అంతా కాదు. 67 సంవత్సరాల స్వతంత్ర భారతంలో ఏ సమస్యకైనా అనేకాంతవాదం చేయడం మన ప్రజల, మన ప్రభుత్వ విధానంగా మారిపోయింది. ఒక ఉగ్రవాదికి శిక్షవేయడానికి కూడా మనకు దశాబ్దాల కాలం పడుతుంది. మనము ఏప్రశ్న నైనా "అంధగజన్యాయం" (Elephant and the blind) తోనే పరిష్కరించడానికి పూనుకొని విఫలమౌతాం.
జైన మతంలో ముఖ్యాంశాలు - అహింస, సత్యము, అస్తేయము, బ్రహ్మచర్యము, అపరిగ్రహము. ఆధునిక యుగంలో రాజకీయాలలో వీనిని ప్రబోధించినవాడు గాంధీ మహాత్ముడు. నిజానికి ఆయనను ప్రచ్ఛన్న జైనుడు అనవచ్చును. క్షత్రియులు స్థాపించిన జైనమతాన్ని పోషించి, ఆదరించినవారు వైశ్యులు. మహావీరుని కుమారులు భరతుడు, బాహుబలి. బాహుబలినే గోమఠేశ్వరుడు అంటారు. ఆయన అరిహంత. మానవునిగా పుట్టి నిర్వాణము పొందినవాడు. "ఓం నమో అరిహంతానాం" జైనుల ధ్యానమంత్రం. (బౌద్ధులు ఓం మణిపద్మేహం అంటారు.) ఆయన విగ్రహం, కర్ణాటక లోని హసన్ జిల్లా , శ్రావణ బెళగోళ లో చూడవచ్చు. గోమఠేశ్వరునినుండి వచ్చినపేరే కోమటి. స్వాతంత్ర్యయోధులలో తిలక్ బ్రాహ్మణుడు, అరవిందుడు, సుభాష్ బోస్ క్షత్రియులు, గాంధీ వైశ్యుడు. స్వభావాలలోని వ్యత్యాసం గమనింప వచ్చు.

Nandiraju Radhakrishna జైనుడు-గాంధి; క్షత్రియులు-వైశ్యులు అద్భుత వివరణ ఇచ్చారు. తిలక్, అరవిందుడు, సుభాష్ చంద్రబొస్, గాంధి మధ్య వైరుధ్యాలను గొప్పగా ఆవిష్కరించారు. ఇవి ఈ తరాలకు తెలియాలి..వందనాలు..


An Indian Marxist historian, D D Kosambi's dedication of his work on Bhartrhari is as follows
నూతన మానవ సమాజస్య పురశ్చరణం మార్క్స్-ఎంజెల్స్-లెనిన్- నామధేయాం తేజస్వినాం మహామానవానాం పునీత స్మరణార్థం (To the sacred memory of the great and glorious pioneers of today's society, Marx, Engels and Lenin)



కలియుగంలో సనాతన ధర్మంతో సహజీవనం చేసినవి జైన, బౌద్ధ మతాలు. PART 2

https://www.facebook.com/vallury.sarma/posts/500458073324944

గౌతమ గోత్రజుడు, శాక్యవంశ రాజకుమారుడైన సిద్ధార్థుడిచేత బోధింపబడినది బౌద్ధధర్మం. ఆయన ప్రపంచంలోని దుఃఖానికి, దాని పరిహారానికి కారణం అన్వేషించడానికి, రాజభవనాన్ని, భార్యా పుత్రులని, తండ్రిని వదలి తపస్సుకి వెళ్ళిపోతాడు. అనేక సంవత్సరాలు గడిచాక ఆయనకు జ్ఞానోదయం అయి, బుద్ధుడని పిలవబడ్డాడు. ఆయన మొదట చెప్పినవి నాలుగు సత్యాలు (చత్వారి ఆర్య సత్యాని). అవి 1. సంసారం దుఃఖమయం. జన్మ,జరా,వ్యాధి, మృత్యువు అన్నీ దుఃఖాలే. 2. కోరికలు దీనికి కారణం. అవే జనమరణ చక్రానికి కూడా కారణం. 3. దుఃఖ నిరోధము (కాంక్షను త్యజిస్తే దుఃఖం దూరమవుతుంది), 4. దీనికి మార్గము (అష్టాంగ మార్గం). సమ్యగ్వచనము (మంచిమాట), సమ్యగ్కర్మ (మంచి పనులు), సమ్యగ్జీవనము (మంచి జీవితం), సమ్యగ్వ్యాయామము (మంచి ప్రయత్నం), సమ్యగ్స్మృతి (మంచి దృక్పధము), సమ్యగ్సమాధి (మంచి ధ్యానము), సమ్యగ్దృష్టి (సత్యాన్ని చూడడం), సమ్యగ్సంకల్పము (మంచి సంకల్పము). ప్రధానంగా వీటిని గమనింప వచ్చును. 1. గౌతమ బుద్ధుడు గురువు, (బుద్ధం శరణం గచ్ఛామి) 2. మధ్యేమార్గం , కార్య కారణత్వం (Dependent origination), నాలుగు పరమ సత్యాలు, అష్టాంగ మార్గం - ఇది బౌద్ధ ధర్మం. (ధర్మం శరణం గచ్ఛామి) 3. సామాన్యులు, సంఘ పరివారంలోనివారు కూడా సాధన ద్వారా నిర్వాణం పొందవచ్చును. (సంఘం శరణం గచ్ఛామి) నిర్వాణం పరమోత్కృష్ట గమ్యం . ఈనాటి హిందువులుగా మనం దీనిని పరిశిలిస్తే మనకు విరుద్ధ భావాలు ఏవీ కనుపించవు. ఇది నిజంగా ఉపనిషత్తుల మతమే. ఒకే ఒక భేదం ఈశ్వర ప్రసక్తి లేదు. కాని గురువుని అంగీకరించారు కదా. ఇంచుమించు కొంతవరకు నేటి షిర్డీ సాయిబాబా నూతన సంప్రదాయాన్ని పోలి ఉండవచ్చు. మనకు పాశ్చాత్యులు వ్రాసిన చరిత్ర, ఇంగ్లీషు భాష ఉపయోగం వలన కొన్ని సమస్యలు వచ్చాయి. మతం అనే పదాన్ని మనం religion అనే పదానికి గతిలేక అనువాదంగా వాడుతున్నాము. కాని religion, religious conversion మత మార్పిడి అనే మాటలు మనకు పూర్తిగా అర్థం కావు. దిలీప్ కుమార్ ముస్లిం అయితే రహమాన్ గా మారి తీరాలి. శివారెడ్డి, శామ్యూల్ శివారెడ్డి గా మార వచ్చు. బాప్తిజం అనేప్రక్రియ ఉంటుంది. కాని పేరు విషయంలో కొంత వికల్పం ఉంటుంది. హిందూ బౌద్ధమతాలలో హిందువు, బౌద్ధుడు అనే పదాలకు నిర్వచనం లేదు. ఇది రేపు ముచ్చటించుకుందాం.

Nandiraju Radhakrishna ఆలోచనా శక్తి కలిగించేందుకు, జ్ఞానజ్యోతి వెలిగించేందుకు, వ్యక్తిత్వాన్ని తట్టిలేపేందుకు నిరంతరం మీరు నిర్వహిస్తున్న భావ సంపద పంపిణీ యజ్ఞం వల్ల కొందరిలోనైనా గుణాత్మక మార్పువస్తునదన్నది నా విశ్వాసం. మీరు రోజూ వివరించే ఇవన్నీ ఈ తరానికి ఎవరు చెబుతారు? మీబోటివారు చెప్పినా మాబోంట్లు అనుకునేది " ఇవన్నీ ఎవరికి కావాలి. ఇవి చదూతూ కూర్చుంటే మన సంగతి చూసుకొవద్దా? వాటినిస్కూళ్ళలో చెబుతారు. నా గురించి, నా ఘనత గురించి ఎవరూ చెప్పరుకదా! అందుకే నాగురించి నేనే చెప్పుకుంటా. అందుకయ్యే ఖర్చులేదుగా? అనే మార్కెటింగ్ ధోరణి మితిమీరిపోయింది. సామాజిక మాధ్యమం కూడా యాజమాన్య నిర్వాహక మాధ్యమంలా ప్రచార సాధనమైంది. రోజూ వేదికలపై, టీవీల్లో, రేడియోల్లో మన జాతి, మన చరిత్ర, మాతృభాష భాష, మన సంస్కృతి, మన సాంప్రదాయమంటూ గొంతులు చించుకోవడం మినహా దానికి మనంగా చేస్తున్న కృషి ఏమిటన్న ఆత్మ పరిశీలన ఎవరికున్నదండీ! ఇప్పుడంతా "లై"కింగులు, షే"రింగులు" .. ఇదొక్కటే కొలమానం. "ఎవరినన్నా కొమ్ము కాసే రాజకీయాలైతే మరీ భేష్.. లాభ దాయకం. మనం మన మతం గురించి మాట్లాడితే మరి నాకేంటి? అన్నేదే కీలకం ఇప్పుడు. ఇదంతా "ఎర్నలిస్టుల" కాలం. మీ ప్రతి వాక్యాన్ని భద్రపరుచుకుంటున్నా! ధన్యుణ్ణి.

http://www.udaypai.in/am-i-a-hindu/

P Mallikarjuna Rao Our ancestors have not used the term religion. They called it Dharma. Buddha also called his teachings Dhamma. this is more comprehensive and a better term than religion. " Matam" means opinion, that is why Hindi "Matdan" means casting vote , expressing one's preference or opinion.

కలియుగంలో సనాతన ధర్మంతో సహజీవనం చేసినవి జైన, బౌద్ధ మతాలు.

https://www.facebook.com/vallury.sarma/posts/499821023388649

https://www.facebook.com/vallury.sarma/posts/500026073368144

https://www.facebook.com/vallury.sarma/posts/500138283356923

https://www.facebook.com/vallury.sarma/posts/500458073324944


కలియుగంలో సనాతన ధర్మంతో సహజీవనం చేసినవి జైన, బౌద్ధ మతాలు. మనతప్పుల తడకల చరిత్ర పుస్తకాలను పక్కన పెడితే - మనకు లభించే ఆధారాలు గ్రంధాలు. సాంప్రదాయ నిర్ణయం ప్రకారం కృష్ణుని సమకాలికుడైన వేదవ్యాసుడు వ్రాసినవే భారత, భాగవతాలు. కృష్ణుని తరువాత వచ్చినది బుద్ధావతారం. ఈ ఊహకు ఆధారం భాగవత శ్లోకం. (భాగవతం - 1.3.24)
తతః కలౌ సంప్రవృత్తే సమ్మోహాయ సురాద్విషామ్ |
బుద్దో నామ్నా జినసుతా కీకటేషు భవిష్యతి ||
తరువాత కలియుగంలో సురద్వేషులైన నాస్తికులను సమ్మోహన పరచుటకు కీకట దేశంలో బుద్ధుడనే పేరుతొ జినసుతుడుగా ప్రభవిస్తాడు. ఈ బుద్ధుడెవరు? 12వ శతాబ్దపు జయదేవుని అష్టపది ప్రకారం గౌతమ బుద్ధుడు గుర్తుకు వస్తాడు --
నిందతి యజ్ఞవిదే రహః శ్రుతిజాతం, సదయ హృదయ దర్శిత పశుఘాతం
కేశవ ధృత బుద్ధ శరీరా, జయ జగదీశ హరే ||
కాని భాగవత శ్లోకం లో జినసుత అనే పేరు, ఆ బుద్ధుడు వేరు అని సూచిస్తుంది. జైనం తో సంబంధాన్ని సూచిస్తుంది. దానికి అర్థం వసుదేవుడు జినుడు. వాసుదేవుడు జిన సుతుడు. దీనికి గ్రంధాలలో ఆధారాలు లేకపోలేదు. వసుదేవుడి సోదరుడు. సముద్రవిజయుడు. ఆయన కుమారుడు అరిష్టనేమి. ఆయన 22 వ జైన తీర్థంకరుడుగా ప్రసిద్ధుడు. ఆయననే నేమీనాథుడని పిలుస్తారు. శ్రీకృష్ణుడు కూడా జైనుల 63 ప్రసిద్ధ పురుషులలో ఒకడు. (ఆ గ్రంధం పేరు త్రిషష్ఠి శలాక పురుషా). బలదేవుడు కూడా వారిలో ఒకడు. భాగవతము పంచమ స్కంధంలో వృషభదేవుని విష్ణువు అవతారంగా భావించిన కథ ఉంది. వృషభదేవుడు మొదటి తీర్థంకరుడు. ఆయనకు ఆదినాథుడన్న పేరు కూడాకూడా ఉంది. ఆయనది ఆపేరుతో శివతత్త్వం అని కొందరి భావన. మన సనాతన ధర్మ చరిత్రలో జైన, బౌద్ధాలను, చార్వాక (లోకాయత) మతంతో సహా సనాతన ధర్మంలొభాగాలుగా నాస్తిక దర్శనాలుగా చూడాలి.
బౌద్ధ జైనాలు వైదిక మతానికి విరుద్ధమైనవి, ఎందుకు ప్రచారంలోకి వచ్చాయి? ఎందుకు ఉన్నత వర్గాల ప్రజలు వాటివైపు ఆకర్షితులయ్యారు? అహింసా పరమో ధర్మః అని బోధించిన జైన తీర్థంకరులు, బుద్ధుడు క్షత్రియులు. అశోకుని వంటి చక్రవర్తులుకూడా బౌద్ధంవైపు మళ్ళారు. క్షత్రియులు క్షాత్రాన్ని వదలి ఇటు ఎందుకు నడిచారు? బౌద్ధ జైన తత్త్వ వేత్తలలో అధిక సంఖ్యాకులు బ్రాహ్మణులే. అందుకే సాహిత్యమంతా తిరిగి సంస్కృతం లోనే వచ్చింది.? దీనికి కారణం ఏమిటి? నేటి క్రైస్తవం సమాజంలో అట్టడుగు వర్గాలను మొదట ఆకర్షించింది. దీనికి దానికి భేదమేమిటి? ఇప్పటి చరిత్రను అర్థంచేసుకోడానికి ప్రాచీన చరిత్ర ఉపయోగిస్తుంది.


జైన, బౌద్ధాల గురించి తెలుసుకునే ముందు కొంచేం తర్కం నేర్చుకోవాలి. ఈ క్రింది వాక్యాలు సత్యమో అసత్యమో చెప్పండి.
1. సూర్యుడు తూర్పున ఉదయించును.
2. 1+1 = 2
3. 1+1 = 10
4. కాంతి కిరణములు ఋజు మార్గములో ప్రసరించును.
5. యేసు క్రీస్తు శిలువవేయబడెను.
6. జగమే మాయ.
7. విజ్ఞాన శాస్త్రము చెప్పు ఏవిషయము నిత్య సత్యము కాదు.
8. యేసు క్రీస్తు డిసెంబరు 25 న పుట్టెను.
9. రాముడు, కృష్ణుడు మధ్యకాలము సుమారు 1000 సంవత్సరములు.
10. ఉత్తరమున ధ్రువనక్షత్రము వలెనే దక్షిణమున కూడా ఒక నక్షత్రము ఉన్నది.




ఎందుకు ఉన్నత వర్గాల ప్రజలు జైన, బౌద్ధ మతాల వైపు ఆకర్షితులయ్యారు?
ఈ ప్రశ్నకు సమాధానం కావాలంటే మతాలను తులనాత్మకంగా అధ్యయనం చేయాలి. మతాలను అనుసరించే వాళ్ళ ప్రతిక్రియ వేరువేరుగా ఉంటుంది. అన్ని మతాలు ఒకటే అనేవారు కొందరు, మాదే సత్యమైన మతం, మా దేవుడు, మా మతం, మా పుస్తకం, ఇదే అంతిమ సత్యం అనేవారు కొందరు. మా మతం గురించి మీరు మాట్లాడితే, మీకు ex parte శిక్ష విధిస్తాం, అనేవారు కూడా లేక పోలేదు. మతాలన్నీ మానవాళికి మత్తుమందులు అంటూ పరమ సత్యం మా సామ్యవాదమే అనేవారు కొందరు. అందుచేత కేవలం భారతీయ తత్త్వ శాస్త్ర దృష్ట్యా ఈ ప్రశ్నకు సమాధానం అన్వేషిద్దాం. వేదం మహర్షుల నుండి శ్రుతి గా మనకు లభించింది. వందలాది ఋషుల తపస్సు ఫలం అది. తరువాత కాలంలో అది అర్థం అవడానికి 6 వేదాంగాలు (వ్యాకరణం జ్యోతిషం మొదలైనవి) అవసరమయ్యాయి. వాటిలోని తత్త్వాన్ని అర్థం చేసుకోడానికి దర్శనాలు పుట్టాయి. ప్రపంచ, లేదా ఆధ్యాత్మిక జ్ఞానాన్ని గ్రహించడానికి ముఖ్యంగా తెలుసుకోవలసినవి. న్యాయ, వైశేషికాలు - గౌతముడు, కణాదుడు వీటి సూత్ర గ్రంధకర్తలు. English equivalents are logic (epistemology) and ontology. ప్రత్యక్షము,అనుమానము, శబ్దము, ఉపమానము అనే ప్రమాణాల ద్వారా సత్యాన్వేషణ చేయడం న్యాయ శాస్త్ర పరిధి లోనిది. ఇది వైదిక మతానికి శాస్త్రము. దీని ద్వారా యథార్థ జ్ఞానాన్ని గ్రహించి, మిథ్యా జ్ఞానాన్నిపరిహరించడం ఉద్దేశ్యం. కాని చార్వాకుడికి ఒకటే ప్రమాణం - ప్రత్యక్షం. దేవుడు లేడు. ఉంటే చూపెట్టు - ఇది వాని వాదం. సనాతన వాదులకు ఈశ్వరుడు అనుమాన, శబ్ద ప్రమాణాల ద్వారా సాధ్యం. శబ్దం అంటే శ్రుతి, ఆప్తవాక్యం. బౌద్ధులకు, జైనులకు ప్రత్యక్ష, అనుమానాలు మాత్రమే ప్రమాణం. అందుచేత వాళ్ళకు వేదం ప్రమాణం కాదు. గౌతమ న్యాయం కంటే బౌద్ధుల న్యాయ శాస్త్రం ఎక్కువ అభివృద్ధి చెందినది. నాగార్జునుడు, దిఙ్నాగుడు, ధర్మకీర్తి గొప్ప నైయాయికులు. దూరంగా కొండమీద పొగవస్తూంది. అంటే కొండమీద నిప్పు ఉంది అని చెప్పడం అనుమానం. ఇది చెప్పడానికి ఆధారం. "యత్ర యత్ర ధూమః , తత్ర తత్ర వహ్ని"ఎక్కడ పొగ ఉంటే అక్కడ నిప్పు ఉంటుంది" అనే న్యాయవాక్య అవయవం. ఈ నిప్పుకు, పొగకు ఉన్న అవినాభావ సంబంధాన్ని వ్యాప్తి అంటారు. ధూమాన్ని హేతువు అంటారు. దీన్ని ఉపయోగించి విషయాన్ని తెలుసుకోవడమే హేతువాదం. మన హేతువాదులకు తెలియనిది. ఈ శాస్త్ర జ్ఞానం వలన, వాదంలో బౌద్ధులు జైనులు, వైదికులపై విజయం సాధించారు. వారి వాదనలు ఎక్కువ హేతుబద్ధం గా ఉండేవి. వైదికులు "స్వర్గ కామయ యజేత" "యజ్ఞం చేస్తే స్వర్గం వస్తుంది " అనేమాటలతో అప్పటి ప్రజలను నమ్మించలేక పోయారు. ప్రజలకు దేవుడు, స్వర్గం, యజ్ఞం గురించి మాట్లాడే మాటలు అంధ విశ్వాసాలుగా తోచాయి. వ్యక్తీ, సమాజం (జగత్తు) ప్రత్యక్షాలు. దేవుడు అనుమాన ప్రమాణంతోనే సాధ్యమౌతాడు. వారి వాదం బౌ ద్దుల, జైనుల న్యాయం ముందు ఓడిపోయింది. ఉన్నత వర్గాల ప్రజలు వాటివైపు ఆకర్షితులయ్యారు.




గౌతమ గోత్రజుడు, శాక్యవంశ రాజకుమారుడైన సిద్ధార్థుడిచేత బోధింపబడినది బౌద్ధధర్మం. ఆయన ప్రపంచంలోని దుఃఖానికి, దాని పరిహారానికి కారణం అన్వేషించడానికి, రాజభవనాన్ని, భార్యా పుత్రులని, తండ్రిని వదలి తపస్సుకి వెళ్ళిపోతాడు. అనేక సంవత్సరాలు గడిచాక ఆయనకు జ్ఞానోదయం అయి, బుద్ధుడని పిలవబడ్డాడు. ఆయన మొదట చెప్పినవి నాలుగు సత్యాలు (చత్వారి ఆర్య సత్యాని). అవి 1. సంసారం దుఃఖమయం. జన్మ,జరా,వ్యాధి, మృత్యువు అన్నీ దుఃఖాలే. 2. కోరికలు దీనికి కారణం. అవే జనమరణ చక్రానికి కూడా కారణం. 3. దుఃఖ నిరోధము (కాంక్షను త్యజిస్తే దుఃఖం దూరమవుతుంది), 4. దీనికి మార్గము (అష్టాంగ మార్గం). సమ్యగ్వచనము (మంచిమాట), సమ్యగ్కర్మ (మంచి పనులు), సమ్యగ్జీవనము (మంచి జీవితం), సమ్యగ్వ్యాయామము (మంచి ప్రయత్నం), సమ్యగ్స్మృతి (మంచి దృక్పధము), సమ్యగ్సమాధి (మంచి ధ్యానము), సమ్యగ్దృష్టి (సత్యాన్ని చూడడం), సమ్యగ్సంకల్పము (మంచి సంకల్పము). ప్రధానంగా వీటిని గమనింప వచ్చును. 1. గౌతమ బుద్ధుడు గురువు, (బుద్ధం శరణం గచ్ఛామి) 2. మధ్యేమార్గం , కార్య కారణత్వం (Dependent origination), నాలుగు పరమ సత్యాలు, అష్టాంగ మార్గం - ఇది బౌద్ధ ధర్మం. (ధర్మం శరణం గచ్ఛామి) 3. సామాన్యులు, సంఘ పరివారంలోనివారు కూడా సాధన ద్వారా నిర్వాణం పొందవచ్చును. (సంఘం శరణం గచ్ఛామి) నిర్వాణం పరమోత్కృష్ట గమ్యం . ఈనాటి హిందువులుగా మనం దీనిని పరిశిలిస్తే మనకు విరుద్ధ భావాలు ఏవీ కనుపించవు. ఇది నిజంగా ఉపనిషత్తుల మతమే. ఒకే ఒక భేదం ఈశ్వర ప్రసక్తి లేదు. కాని గురువుని అంగీకరించారు కదా. ఇంచుమించు కొంతవరకు నేటి షిర్డీ సాయిబాబా నూతన సంప్రదాయాన్ని పోలి ఉండవచ్చు. మనకు పాశ్చాత్యులు వ్రాసిన చరిత్ర, ఇంగ్లీషు భాష ఉపయోగం వలన కొన్ని సమస్యలు వచ్చాయి. మతం అనే పదాన్ని మనం religion అనే పదానికి గతిలేక అనువాదంగా వాడుతున్నాము. కాని religion, religious conversion మత మార్పిడి అనే మాటలు మనకు పూర్తిగా అర్థం కావు. దిలీప్ కుమార్ ముస్లిం అయితే రహమాన్ గా మారి తీరాలి. శివారెడ్డి, శామ్యూల్ శివారెడ్డి గా మార వచ్చు. బాప్తిజం అనేప్రక్రియ ఉంటుంది. కాని పేరు విషయంలో కొంత వికల్పం ఉంటుంది. హిందూ బౌద్ధమతాలలో హిందువు, బౌద్ధుడు అనే పదాలకు నిర్వచనం లేదు. ఇది రేపు ముచ్చటించుకుందాం.






The Structure of the Universe (Vedic) - Viswaroopa - K. Sivananda Murty Preface 2

https://www.facebook.com/vallury.sarma/posts/616984388338978 The Puranas speak of individuals going up and down between these proximate...