https://www.facebook.com/vallury.sarma/posts/504083839629034
సౌరాష్ట్ర దేశే వసుధావకాశే , జ్యోతిర్మయం చంద్రకలా వతంసం
భక్తి ప్రదానాయ కృతావతారం , తం సోమనాథం శరణం ప్రపద్యే
భగవదవతారమూర్తి శ్రీకృష్ణుని ద్వారక ఇక్కడదే. ద్వారక రాధికాక్షేత్రం. అక్కడ శక్తి ఆవిడయే.
సౌరాష్ట్ర (ఆధునిక గుజరాత్) కలియుగానంతర భారతచరిత్రలో మన దేశంలో ప్రముఖ పాత్రవహించింది. ప్రభాస తీర్థంలోని సోమనాథుడు మన ఆరాధ్యదైవం.
సౌరాష్ట్ర దేశే వసుధావకాశే , జ్యోతిర్మయం చంద్రకలా వతంసం
భక్తి ప్రదానాయ కృతావతారం , తం సోమనాథం శరణం ప్రపద్యే
భగవదవతారమూర్తి శ్రీకృష్ణుని ద్వారక ఇక్కడదే. ద్వారక రాధికాక్షేత్రం. అక్కడ శక్తి ఆవిడయే.
కృష్ణనిర్యాణానంతరం ఆయన ద్వారక సముద్రంలో కలసిపోయినది. ఇప్పటి ద్వారక, అక్కడకు కొంత దూరంగా, ఆయన మునిమనుమడు, అనిరుద్ధుని కుమారుడైన వజ్రనాభునిచేత నిర్మింపబడినది. మన చరిత్రలో గుర్తుంచుకోవలసిన సౌరాష్ట్ర ప్రాంతపు ఇంకొక నగరం పోర్ బందర్. గాంధీ గారు పుట్టిన ఊరు. దాని ప్రాచీననామం సుదామపురి. సుదాముడు మనకు కుచేలునిగా బాగా తెలిసిన కృష్ణభగవానుని బాల్యమిత్రుడు. కృష్ణ-సుదామ మందిరం ఇక్కడి ఆకర్షణ. గాంధీగారి కొన్ని పద్దతులు చూస్తే “ఆయనలో కుచేలుని అంశలేదుకదా?” అనిపిస్తుంది.
సింధు, సౌరాష్ట్ర దేశాల చరిత్ర గతిని మార్చిన వారు మధ్యయుగంలో దండయాత్రలు చేసిన అరబ్బులు, ఇతర తురుష్కులు. ఇప్పటికీ ముఖ్యమైన సింధునదీ పరీవాహక ప్రాంతం, అప్పటి సరస్వతీనదీ ప్రాంతం మన ప్రాచీన నాగరికతలకు ఆటపట్టు. మధ్యయుగంలో ఈ ప్రాంతాలు తీవ్రమైన దండయాత్రలు ఎదుర్కొన్నాయి. అరబ్ (ప్రస్తుత సౌదీ అరేబియా) ప్రాంతీయుడైన మహమ్మద్ బిన్ కాశిం సా.శ. 711లో అప్పటి హిందూపాలకుడు రాజా దహీర్ ని ఓడించి సింధుప్రాంతాన్ని జయించాడు. జిన్నా మాటలలో అప్పుడే పాకిస్తాన్ కి బీజం పడినది. 715లోనే కాశిం హత్యచేయబడ్డాడు. సోమనాథ దేవాలయ విధ్వంసానికి అప్పుడే ప్రారంభం. సా. శ. 725లొనే అక్కడి అరబ్ పాలకుడు దేవాలయవిధ్వంసానికి సైన్యం పంపాడు. ఘుర్జర ప్రతీహార రాజు నాగభట్2, సా.శ. 825లో పునర్నిర్మించాడు. తరువాత ముఖ్యవ్యక్తి సుల్తాన్ మహమ్మద్ ఘజనీ. 1024 లో ఘజనీ మహమ్మదు తిరిగి ఆలయాన్ని, ధ్వంసంచేసి అక్కడ ఉన్న అపార ధనరాసులను తన రాజ్యానికి తరలించాడు. మొత్తము 17 సార్లు భారతదేశముపై దండయాత్రలు చేశాడు. అయోధ్య, మథుర, మాయ (హరిద్వార్), కాశీ, కాంచీ, అవంతికా (ఉజ్జయిని), ద్వారక ఏడు పుణ్యనగరాలని చెప్పబడుతాయి. వీనిలో ద్వారక, ఉజ్జయినిలలోని దేవాలయాలు కూడా ఘజనీ ధ్వంసంచేశాడు. పైన చెప్పిన అన్ని నగరాలలోని ముఖ్యాలయాలు మహమ్మదీయప్రభువులు ధ్వంసం చేశారు. సోమనాథాలయం అనేకసార్లు నాశనం చేయబడి పునర్నిర్మింపబడినది ఆఖరుసారి స్వాతంత్ర్యము వచ్చాక 1951లో నిర్మింపబడినది. ఆధునిక దేశచరిత్రకు మూల స్తంభాలైన గాంధీ, పటేల్, జిన్నా గుజరాతీలే. 1990లో లాల్ కృష్ణ ఆద్వానీ సోమనాథ్ నుండి అయోధ్యకు చేసిన రథయాత్ర కూడా ఆధునిక భారతచరిత్రలో కంపనాలు సృష్టించి, భారతీయ రాజకీయాలలో ఒక అవసరమైన మార్పునకు శ్రీ కారం చుట్టింది. జిన్నా గుజరాత్ నుండి కరాచీ వెడితే ఈయన కరాచీనుండి మనకు వచ్చాడు. ప్రస్తుత అయోధ్య, మథుర, కాశీ వంటి నేటి పరిష్కారము లేని సమస్యలకు 1951 నాటి సోమనాథ్ సమస్య పరిష్కారానికి రాజకీయనాయకుల పాత్ర ఎంతో ఉన్నది. రొమిలా థాపర్ వంటి మార్క్సిస్ట్ చరిత్రకారులు కూడా సోమనాథ్ చరిత్రను white-wash చేయడంలో వారి ప్రతిభను చూపించారు.