Showing posts with label సద్గురు శివానందమూర్తి. Show all posts
Showing posts with label సద్గురు శివానందమూర్తి. Show all posts

Wednesday, February 7, 2018

Puranic Version of Universe

https://twitter.com/mighty_krishna/status/949499321723965440
As per Puranas, the universe is classified into 3 planetary regions of 14 planetary systems.
The 3 planetary regions are
(1) Svar or Swargga or Heaven (6 upper regions)
(2)  Prithvi or Earth ( 1 middle region)
(3) Pathala or Hell ( 7 lower regions)

Thursday, January 25, 2018

గురుతేజస్సే సద్గురు శివానందమూర్తి ---- వారి మాటే.. మంత్రం…

https://www.facebook.com/vallury.sarma/posts/602280333142717

బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మగారి వ్యాసం ఈ రోజు ఆంధ్రభూమిలో
గురుతేజస్సే సద్గురు శివానందమూర్తి ---- వారి మాటే.. మంత్రం…
- సామవేదం షణ్ముఖశర్మ 25/11/2013 Andhra Bhoomi Daily
శ్రీశ్రీశ్రీ శ్రీ శివానందమూర్తిగారి కారణజన్మబహుమార్గాలలో ప్రణాళికను తయారుచేసింది.
1. తపస్సుతో, త్యాగంతో నిరంతరం దేశ ధర్మక్షేమాలకై తన ప్రతి క్షణాన్నీ వెచ్చించడం,
2. ఈశ్వరార్చనతో, యజ్ఞయాగాలతో దివ్యశక్తిని ఈ భూమిలో వ్యాప్తి చెందించడం,
3. ధర్మాచరణ దిశగా, ఈశ్వరారాధన దిశగా, అసంఖ్యాకులను ప్రేరేపించి, వారి జీవితాలను, ధర్మమయంగా, తీర్చిదిద్దడం,
4. అపారమైన ఆర్షవిజ్ఞానాన్ని సమగ్రంగా, స్పష్టంగా పునరావిష్కరించి పదిలపరచడం, వ్యాప్తిచేయడం.
5. అవ్యాజమైన కారుణ్యంతో, తనదైన సహజ దివ్యశక్తితో ఎందరినో దుఃఖనిర్మూలన చేసి ఆదుకోవడం. ... ఈ పంచముఖాల పరమేశ్వర గురుతేజస్సే సద్గురు శివానందమూర్తి.
మన సనాతన ధర్మం ఆర్షగ్రంథాలపైనా, భవ్యక్షేత్ర తీర్థ దేవాలయాలపైనా ఆధారపడి వర్థిల్ల్లినదే కాదు. ఎందరో మహాత్ముల ద్వారా తేజరిల్లుతున్నది. ఎప్పటికప్పుడు ఆయా దేశ కాలాలకనుగుణంగా యోగులు మన సంస్కృతిని పరిరక్షిస్తున్నారు. కొన్ని వేల గ్రంథాల వలన తెలియవలసిన జ్ఞానం, కలుగవలసిన ప్రభావం ఒక్కయోగివల్ల జరుగుతుంది. ఒక రమణులు, ఒక కంచి మహాస్వామి... ఇలా ఎందరో జీవన్ముక్తులు సనాతన బ్రహ్మ విద్యకు సాకారంగా సంచరించి ధర్మసౌధాన్నినిలుపగలుగుతున్నారు. వీరే మన పరంపరకు, సంప్రదాయాలకు, అమోఘమైన జ్ఞానానికి ఆధారస్తంభాలు. ఈ సద్గురు పరంపరకు ప్రణామాలు. * * *
చాలా యేళ్ల క్రితం... ఒక స్నేహితుడు రమణమహర్షిగారి అరుదైన ఫొటో ఆల్బమ్ను నాకు చూపించారు. చక్కని సాంకేతిక విజ్ఞానంతో ఏర్పరచిన సమాహారమిది. స్ఫుటమైన రమణుల ప్రశాంత ముఖచిత్రాలు ఎన్నోఅందులో ఉన్నాయి. అయితే ప్రతి చిత్రంలోనూ ఆకళ్లల్లో ఏదో అనిర్వచనీయ తేజస్సు ద్యోతకవౌతోంది. ఇలాంటి నయనాలను ఎక్కడో ప్రత్యక్షంగా చూసినట్లు అనిపిస్తోంది. అవును- ఒకే ఒక్క వ్యక్తిలో అలాంటి నేత్రజ్యోతి దర్శనమయింది. ఎవరా మహనీయులు- కాసేపట్లో జ్ఞప్తికి వచ్చింది. అలాంటి ప్రకాశవంతమైన, నిర్మల, నిర్వికార, జ్ఞానస్ఫురనేత్రాలు కల గురువర్యులు సద్గురు శివానందమూర్తిగారు. నాడు అరుణాచలంలో స్థాణు చైతన్యం, నేడు భీమునిపట్నపు ఆనందవనంలోనూ, వరంగల్ గురుధామ్లోనూ, కొన్ని ప్రత్యేక సభల్లోనూ, రాజమండ్రి, హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో వాత్సల్యంతో సంచరిస్తున్న చైతన్యం! వ్యక్తిగతంగా దర్శించిన, అనుభవించిన దివ్యత్వాలు ఒక గ్రంథానికి సరిపడా ఉన్నప్పటికీ, ఆ వ్యక్తిత్వంలో స్ఫురించిన సందేశాలను ఆవిష్కరించుకొనే ప్రయత్నం చేస్తాను. వారి ఒక్కొక్క మాట ఒక్కొక్క మంత్రం, మననం చేసే వారిని రక్షించేది. మంత్రం (మననాత్ త్రాయతే మంత్రః) – అని శాస్తన్రిర్వచనం, అందుకే ఆ వాక్యాలు మంత్రాలు. ఈ దేశం పట్ల, దీని సహజ స్వభావమైన ఆర్య ధర్మం పట్ల వారికున్న పరిజ్ఞానం,పరమభక్తి ‘నాన్యతో దర్శనీయం’. నేటి యువత గ్రహించి స్ఫూర్తి చెందవలసిన అంశం. ఆసేతుశీతాచలం భిన్న రాష్ట్రాల వైవిధ్యంలో ఏకసూత్రంగా అల్లుకున్నసనాతనధర్మ వైభవాన్నివారు పర్యటించి, పరిశీలించి, పరిశోధించి గ్రహించి ఉద్బోధిస్తున్నారు. వ్యతిరేక శక్తుల కువిమర్శలను ప్రశాంతంగానూ, పరమ స్పష్టంగానూ, సూటిగాను ఎదుర్కొంటూ వారు పలికిన, రాసిన వాక్యాలు ప్రత్యేక ధర్మశాస్త్రాలు. అపారమైన వాత్సల్యం, కారుణ్యం వారి కనులనుండి వర్షిస్తున్నా, రాగద్వేషాదుల చాయలు కానరావు. ఒక విశాలమైన ఆహ్లాదినీ దృక్కుంతి హృదయాలను స్పర్శిస్తుంది.
ఒకసారి హైదరాబాదు నగరంలో వారిని దర్శించేందుకు వెళుతున్నప్పుడు మార్గమధ్యంలో ఒక భావన కలిగింది. ‘‘నిత్యం ఏదో కొంతసేపు మాత్రమే ఉపాసన చేసుకోగలుగుతున్నాను. ఉపన్యాసాలతోనే కాలమైపోతోంది. నేను తరించేదెలా?’’- అనే విచారం మనసునావరించింది. వారిని దర్శించి తీర్థం పుచ్చుకున్నప్పుడు, మనసులో ఉన్న ఈ వేదనను చెప్పాలనుకున్నా, చెప్పలేకపోయాను. మౌనంగానే ఉన్నాను. అప్పుడు వారు విబూదిని నా నుదుటరాస్తూ ‘‘నీ ఉపన్యాసమే నీకు ఉపాసన’అన్నారు. ఆశ్చర్యం కలిగింది. మాటాడనవసరం లేకుండా మనసును గ్రహించే మహాదేవ తేజస్సుకి మనసా నమస్కరించుకున్నాను. వారి ఈ మాటలో నాకు గొప్ప సందేశం అందింది. ‘ఉపన్యాసాన్ని ఉపాసనగా సాగించు’అనే ప్రబోధమిది. తరువాత అనేక సందర్భాల్లో ధర్మప్రచారం గురించి కర్తవ్యోన్ముఖులని చేశారు.
‘‘మన సనాతన ధర్మం గురించి ప్రచారంచేయడం ముఖ్య కర్తవ్యం. ఋషులిచ్చిన ధర్మం గురించి ప్రచారం చేయడమనేది ఎన్నోఅశ్వమేధ యాగాలకంటె గొప్పది. యాగం స్వర్గాన్నిస్తుంది- అంతే. ధర్మప్రచారం అంతకంటే గొప్పదైన ఈశ్వర కృపను ప్రసాదిస్తుంది’’అని బోధించారు. ‘ఈ దేశంయొక్క అసలు చరిత్రను తెలుసుకోవాలి.దేశమంతా సంచరించాలి. నాకైతే ఈ దేశపు మట్టిలో దొర్లితేనే ధన్యత అనిపిస్తుంది. అంత పవిత్రమైనదీ దేశం’’. ఈ ఆర్యభూమిపై వారికున్నప్రపత్తి అంతటిది. ధర్మప్రచారానికి, ప్రబోధానికి అంకితమయ్యేలా తీర్చిదిద్దినది వారి ఉపదేశం, ఆదేశం, ఆశీర్వచనం. లౌకికాపేక్షలను జన్మతోనే జయించిన ఆజన్మశుద్ధులు వారు. లోకాన్ని ఒక చిత్తరువులా చూసే నిర్వికారులు, జ్ఞానదృష్టితో సర్వాన్నీ వీక్షించే వారి సన్నిధి ప్రశాంతతను ప్రసాదించడమేకాదు, వారివారి యోగ్యతలననుసరించి కర్తవ్యాన్ని నిర్దేశిస్తుంది. నడిపిస్తుంది. మౌనంగానూ, ప్రభావవంతంగానూ వారందించే స్ఫూర్తి నిశ్శబ్దంగానే ఎందరో ధార్మిక యోధుల్ని తయారుచేసింది. దేశ సౌభాగ్యంకోసం వారు నిర్వహించిన, నిర్వహిస్తున్న యాగాలు అనేకం.
‘‘మనకోసం భగవంతుని ప్రార్థిస్తున్నాం. సంతోషమే, కానీ అంతకంటె ముఖ్యంమన దేశ క్షేమం గురించి ప్రార్థించాలి. తన క్షేమం కంటె, దేశ క్షేమంకోసం ప్రార్థించే వారి క్షేమాన్ని భగవంతుడు ప్రధానంగా అనుగ్రహిస్తాడు.’’ ఇది వారిచ్చిన మహాసందేశం. హిమగిరుల నుండి సముద్ర తటాలవరకు విస్తరించిన భవ్య భారత చరిత్ర వారికి కరతలామలకం. విభిన్నరాష్ట్రాల ప్రజలనేకాదు, విదేశాలలోను హిందూ ధర్మ పరిశోధకులు డా.డేవిడ్ ఫ్రాలే వంటి మేధావులు కూడా వారిని ఆశ్రయించి స్ఫూర్తినీ, సరియైన దృక్పథాన్నీసంపాదించుకున్నవారే.
ఈ దేశాన్నీ, దీని స్వాభావిక ఆర్షధర్మాన్నీ ఎప్పటికప్పుడు గమనించి కాపాడుకునే ఒక సిద్ధ వ్యవస్థ- సూక్ష్మభూమికలో సిద్ధ భూములలో ఉంది. ఆ వ్యవస్థనుండి ఒక మహాప్రయోజన సిద్ధికై వచ్చిన జీవన్ముక్తులు మా గురువుగారు శ్రీ శివానందమూర్తిగారు. తాను శైవ సంప్రదాయంలో జన్మించి, శివయోగిగా పరిణిమించి, ఆ అద్భుత శివయోగంలో సమగ్ర భారతీయతను పొదువుకున్న ‘జ్ఞానప్రేమ’వారిది. అందుకే వారి శిష్యుల్లో శైవ వైష్ణవాది సర్వసంప్రదాయాల వారున్నారు. అన్నికులాల, రాష్ట్రాలవారూ ఉన్నారు. వారి ఆదేశంతో కాశీలో ఆధ్యాత్మిక సాధనచేస్తున్న కొందరు విదేశస్థుల గురించి తెలుసుకొని ఆశ్చర్యం కలిగింది.
‘‘దేవతల కంటె ఋషులనే ముందు స్మరించి ఆరాధించాలి. దేవతలు కూడా ఋషులవల్లనే తెలియబడుతున్నారు. వారుకూడా ఋషుల మాటకు కట్టుబడి ఉంటారు’’అంటూ ఋషుల గొప్పతనాన్ని ఎన్నోమార్లు వింగడించారు. వారి మాటలో, వ్రాతలో మహర్షుల చరిత్రలు స్ఫూర్తిదాయకంగా వెలుగులీనాయి. రాజకీయాలు, సామాజిక పరివర్తనలు, మారుతున్న జీవన మూల్యాలు... ఇలా అన్ని పరిణామాలను పరిశీలిస్తూ, వాటిని ధార్మిక దృష్టితో సవరించుకోవలసిన బాధ్యతను, విధానాలను స్పష్టంగా, నిష్పాక్షికంగా సూచించారు. నేటి రాజకీయ విధాన నిర్ణేతలు వాటిని పరిశీలించవలసిన అవసరం ఉంది. ఒక సమగ్ర దృష్టి కలిగిన వారి సందేశాన్ని పాలనా బాధ్యత కలిగినవారు. గమనించేలా, శిష్యులైన మేధావులు బాధ్యత. వహించాలి. దేశంలో ప్రధాన పీఠాధీశ్వరులందరికీ మా గురువుగారిపై ప్రత్యేక ప్రేమ మాత్రమే కాదు, విశిష్ట గౌరవభావముంది. పీఠాల నడుమ ఎవరి పరిమితులు. వారికి ఉన్నప్పటికీ, ఈ సద్గురువు విషయంలో అపరిమిత సౌహార్దం, మన్నన అన్ని పీఠాలు కనబరచుతూనే ఉన్నాయి.
సద్గురువుల రచన ‘కఠయోగా’నికి జగద్గురువులు శ్రీశ్రీశ్రీ భారతీ తీర్థ స్వామివారు అనుగ్రహించిన విస్తార శ్రీముఖం, ఇటీవల ఆంధ్ర దేశ పర్యటనలో పీఠాధీశ్వరులు గురువులతో ఆత్మీయంగా ‘ఆనందవనం’లో సమావేశమవడం దివ్య ఘట్టాలు. నేపాల్, కాశీ, భారత ఈశాన్య రాష్ట్రాలు, ఇలా ఎన్నో ప్రాంతాలలో, కేవలం యాత్రా దృష్టిగాకాక, ఒక తపశ్శక్తితో, భారతీయతా పరిరక్షణ దృష్టితో సంచరించి వీరిచ్చిన సందేశాలు, చేసిన స్ఫూర్తిమంతమైన కార్యాలు అందరూ గమనించి గ్రహించవసినవి. సముద్రతీరంలో సముద్రతనయ అయిన మహాలక్ష్మీ ఆలయాన్ని ‘ఆనందవనంలో, ఉత్కళ శిల్పంలో నిర్మించిన మహోపకృతికి వందనాలర్పించవలసినదే. ‘ఆద్యాలక్ష్మి’రూపంగా పరాశక్తిని ప్రతిష్ఠించి, ‘దేశదారిద్య్రా’న్ని తొలగించమని ప్రార్థించారు. మనచేత ప్రార్థింపజేస్తున్నారు. అనేకమంది జీవితాల్లో వీరి అనుగ్రహ ప్రభావాలు కోకొల్లలు. కానీ అవి ప్రకటితాలు కాకుండా, గుప్తంగానే, తన జ్ఞానస్ఫూర్తిని ప్రసరింపజేయడం సద్గురువుల ప్రత్యేకత. వారి కారణజన్మ బహుమార్గాలలో ప్రణాళికను తయారుచేసింది.
1. తపస్సుతో, త్యాగంతో నిరంతరం దేశ, ధర్మక్షేమాలకై తన ప్రతి క్షణాన్నీ వెచ్చించడం,
2. ఈశ్వరార్చనతో, యజ్ఞయాగాలతో దివ్యశక్తిని ఈ భూమిలో వ్యాప్తి చెందించడం,
3. ధర్మాచరణ దిశగా, ఈశ్వరారాధన దిశగా అసంఖ్యాకులను ప్రేరేపించి వారి జీవితాలను ధర్మమయంగా తీర్చిదిద్దడం,
4. అపారమైన ఆర్షవిజ్ఞానాన్ని సమగ్రంగా, స్పష్టంగా పునరావిష్కరించి పదిలపరచడం, వ్యాప్తిచేయడం.
5. అవ్యాజమైన కారుణ్యంతో, తనదైన సహజ దివ్యశక్తితో ఎందరినో దుఃఖనిర్మూలన చేసి ఆదుకోవడం.
... ఈ పంచముఖాల పరమేశ్వర గురుతేజస్సే సద్గురు శివానందమూర్తి.
భారతీయ విజ్ఞాన సంపదలు, సంస్కృతి నిక్షేపాలన్నిటినీ పరిరక్షించుకోవలసిన ఆవశ్యకతను- తానుచేస్తూ, మనకు బోధించారు. ‘‘గురువు ఒక వ్యక్తికాదు. ఈ అనంత విశ్వంలో గురువు ఒక జటిల ప్రశ్న- దాని సమాధానమూను.’’అని ఎంతో గూఢంగా వచించే సద్గురువులు పరంపరాగతమైన, ఋషి సంప్రదాయ సిద్ధమైన గురుతత్వానికి సాకారం.

రాష్ట్ర విభజన - తక్షణ కర్తవ్యాలు

https://www.facebook.com/vallury.sarma/posts/595280250509392

మహామహోపాధ్యాయ సద్గురు శివానందమూర్తి 11/11/2013 Andhra Bhoomi
సుమారు మూడు మాసాల నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సంఘర్షణతో అశాంతిగా ఉంది. ప్రభుత్వం నడక, ఆర్.టి.సి. వాహనాలు స్తంభించిపోయి, ప్రజలెన్నో కష్టాలకి గురి అయినారు. మొదటి కారణం కేంద్ర ప్రభుత్వం చేసిన తెలంగాణ ప్రకటన, రెండవది ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగుల నిరవధిక సమ్మె. ఈ రెండు వర్గాలు కూడా నాయకుల చర్చలు, సంప్రదింపులు అనేవి లేకుండానే క్రియకు ఉపక్రమించడం జరిగింది. తెలంగాణకి ప్రత్యేక రాష్ట్రం ఇవ్వడం తప్పు అనడం సరికాదు. ఎందుకంటే అది కూడా 40 ఏళ్ళనాటి ప్రజా ఉద్యమమే. అయితే ఏకపక్షంగా చేసిన తీర్మానం కొంత తొందరపాటు చర్య. సీమాంధ్రకు, ముఖ్యంగా ఉద్యోగులకు విభజనవల్ల జరగబోయే సాంఘిక, సామాజిక, ఆర్థిక సంక్షోభం ఒక గొప్ప భూకంపంలాంటిదే. అయితే కష్టనష్టాలు కనీసం పదేళ్ళపాటు భరించాక తరువాతి కాలంలో స్వతంత్రాంధ్రప్రదేశ్ ఎటువంటి లాభం పొందగలదూ? అని దూరాలోచనతో ఆలోచించాలి. కావాల్సినంత ఆర్థిక, రాజకీయ సహాయ సంపత్తిని కేంద్రం నుంచి పోరాడి తీసుకోవలసి ఉంటుంది.
కనీసం 5 సంవత్సరాల పాటు హైదరాబాద్ ఆదాయం రెండు రాష్ట్రాలు పంచుకోవాలి. ఆంధ్రకు ఒక నూతన ఉత్తమ రాజధాని, అసెంబ్లీ, హైకోర్టు, నదీజలం, విద్యుత్తు వాదించి తీసుకోవలసిన సంపదలు. నదీ జలాల పంపకం అన్ని ప్రాంతాల వారికి కేంద్రమే న్యాయంగా నిర్ణయించాలి. ఇంకా పదివేల పడకల ఆసుపత్రులు అవసరమవుతాయి. లక్షమంది ఉద్యోగుల కుటుంబాలకు, కనీసం 100 లక్షల చదరపుటడుగుల గృహవసతి సౌకర్యాలతో కావాలి. ఇదికాక 20 లక్షల చదరపుటడుగుల స్థలం ప్రభుత్వ కార్యాలయాలకు కావాలిసిందే. ఇదంతా కేంద్రం భరించక తప్పదు కదా! ఒకవేళ తప్పనిసరి అయితే ఇవన్నీ సాధించడానికి ప్రణాళికలు రూపొందించవద్దా? అంతేకాక ఈ హక్కులు, బాధ్యతలు మొదలైనవన్నీ రేపు లోక్సభలో పెట్టబోయే బిల్లులోనే స్పష్టంగా చేర్చి పెట్టాలి. దానికి కావలసిన సిబ్బంది, కాలవ్యవధి ఆలోచించకుండా మూడు నెలలు నష్టపోలేదా మనం?
సరే.. సమైక్యంగా 55 సంవత్సరాలలో ఆంధ్ర సీమ ఏం గొప్ప ప్రగతి సాధించింది? ఏదైనా ఒక మహానగరం రూపుదిద్దుకుందా? ఈ సీమలో ఏదైనా ఒక్క పెద్ద విమానాశ్రయం లభించిందా? సీమలో ఏదైనా ఒక్క అంతర్జాతీయ విశ్వవిద్యాలయం గాని, ఉత్తమశ్రేణి విద్యాలయం గాని ఆవిర్భవించిందా? ఏదైనా ఒక గొప్ప పరిశ్రమ సీమలో ఏర్పడిందా? బెజవాడ నుంచి 300 కి.మీ. దూరంలో ఉన్న హైదరాబాదు పట్టణం సీమ ప్రజలకు చాలా సౌకర్యంగా నిలిచిపోయిందా? ఇలా వెతికి చూస్తే సీమాంధ్రకు ఏకైక రాష్ట్రంలో ఎటువంటి లాభాలు, ప్రగతి లభించాయి? అనేది తెలుస్తుంది. హైదరాబాదులో తమకున్నదంతా పెట్టుబడి పెట్టినవారికి వ్యాపార లాభాలు, బహుశా వందమందికి లభించి ఉండవచ్చు. అది సీమకేం లాభం? ఉద్యోగానికి వెళ్ళినవారు ఒక లక్షమంది హైదరాబాదులో సొంత ఇళ్ళు కట్టుకున్నారేమో? తరతరాలనాటి సొంత ఊరు వదిలిపెట్టి, దూరం వెళ్ళి, కుటుంబానికి ఒక కోటి అప్పు చేసి సంపాదించడం ఒక గొప్ప ఐశ్వర్యమా? ఆంధ్ర రాష్ట్రం వేరుగా ఉండి ఉంటే అంతకన్నా మంచి పట్టణం ఇక్కడ సొంత ఊళ్ళకి దగ్గరగా పుట్టి ఉండేది కాదా? అసలు హైదరాబాద్ తెలుగు పట్టణమా? సుమారు 15 లక్షల మందికి తెలుగు బాగా రాని పట్టణము. వ్యాపారమంతా తెలుగువారి చేతిలో ఉందా? లేదు కదా! భారతదేశంలోని అన్ని ప్రాంతాల వారు అన్ని భాషలతో పంచుకున్న పట్టణమే హైదరాబాదు. ఇలా ఆలోచిస్తే సీమాంధ్రులకు స్వతంత్ర రాజకీయ ప్రతిపత్తితో వేరొక తెలుగు రాజధాని కాలక్రమేణా లభించడం కోరుకోదగినది కాదా?
ఇక తెలంగాణ విషయం
ఇది ఇలా ఉండగా సమైక్యతలో 55 ఏళ్ళలో తెలంగాణ వారికి లభించిన ప్రగతి ఏది? వరంగల్లో ఘీౄ చ్ఘ్దజ జ, 5000 కుటుంబాలని పోషించేది మూతపడింది. హైదరాబాద్ పట్టణంలో గళఔఖఇజష యూళ, -్ఘ్ఘ య్యఒ, తీకశఒ, హ వంటి ఉన్నత స్థాయికి ఛెంది, విజయవంతమైన పరిశ్రమలు సమైక్య ప్రభుత్వ కాలంలో మూతపడిపోయాయి. అంటే నైజాం కాలంలో పుట్టిపెరిగిన సంస్థలు కూడా మూతపడ్డాయి. తెలంగాణలో గ్రామీణ ప్రజల పేదరికం మార్పు చెందలేదు కదా? ఇలాగ ఎన్నో విషయాలు చెప్పుకోవచ్చు. ఆంధ్ర ప్రజలు హైదరాబాద్కి వెళ్ళి ఉండవచ్చు. తెలంగాణ ప్రజలు ఆంధ్రకి రానే లేదు. ఇదంతా సహజీవనమా? సామరస్యమా? లేక సమైక్యతా? తెలంగాణ ప్రజలలో సీమాంధ్ర ప్రజల పట్ల సుహృద్భావం, స్నేహం ఏర్పడిందా? కొన్ని వర్గాలలో ద్వేషం కూడా ఏర్పడింది. మరి సహజీవనం, సామరస్యం ప్రజల మధ్యన ఎలా సాధ్యవౌతాయి? దానివల్ల ప్రభుత్వ కార్యాలయాల్లో కార్యకలాపాలు సాగడం కూడా కష్టమే. ఎందుకంటే ప్రభుత్వ సిబ్బందిలో అనైక్యత ఇప్పుడే వచ్చేసింది. తెలంగాణ వారు తిరస్కరించిన సమైక్యత, సీమ ప్రజలు ఎలాగ సాధిస్తారు? ఇవన్నీ ఆలోచిస్తే 5 లేక 6 సంవత్సరాలు కష్టనిష్టూరాల తరువాత సీమ ప్రజలు ఒక సుందర రాజధానిని తమకోసం వేరుగా సాధించుకోవచ్చు. అలాగే రెండు అంతర్జాతీయ విమానాశ్రయాలు తప్పక సాధ్యవౌతాయి. ఉన్నత శ్రేణి జాతీయ విశ్వవిద్యాలయం, అంతర్జాతీయ ప్రమాణాలు కలిగిన య్యెశ డష్ద్య్య వంటి సంస్థలు మన రాష్ట్రంలోని పర్వత సీమలలో నెలకొల్పుకోవచ్చు. తమిళనాడులోని నీలగిరి పర్వతాలలో ఎన్నో గొప్ప సంస్థలు టీ, కాఫీ తోటలు, అనేక పర్యాటక కేంద్రాలు నూరేళ్ళ నుంచి అక్కడి దేశాన్ని, ప్రభుత్వాన్ని కూడా అపార ధనవంతుల్ని చేశాయి. అటువంటి పని ఆంధ్ర సీమలోని నల్లమలై, రత్నగిరి, విశాఖ సమీపంలోని అనంతగిరి పర్వతాలు ఎన్నో ఉండగా ఈ సమైక్య ప్రభుత్వం వాటినెందుకు వినియోగించుకోలేకపోయింది? కేంద్రం అధికారంలో ఉన్న ఈ ప్రాంతాలు సీమ ప్రజలకిగాని, ప్రభుత్వానికి గాని, అక్కడ జీవిస్తున్న ఆటవిక జాతులకు కాని ఎటువంటి ఆదాయము, ఉపయోగము కల్పించలేదు. కేంద్రం విభజన క్రియలో వేగంగా ముందుకు పోతోంది. 50 ఏళ్ళనాటి పరిపాలనలో రెండు ప్రాంతాలలోనూ సాధించిన ప్రగతి గొప్పగా ఏమీ లేదు. విభజనలో సీమాంధ్ర ఉద్యోగులకు మాత్రమే కలుగబోయే కష్టాన్ని, నష్టాన్ని అధిగమించడానికి కేంద్రం నుంచి హక్కుగా సాధించవలసినవి ధనము, శాసనపరమైన ప్రత్యేక హక్కులు ఎన్నో ఉండగా ఆ విషయంలో ఎన్నో ప్రణాళికలు సిద్ధం చేసుకోక ఆందోళనతో కాలం గడచిపోయింది. ప్రజలు కష్టపడ్డారు. కేంద్రం వాళ్ళకి తోచింది ఇవ్వడానికి ఇప్పుడిప్పుడు సిద్ధపడుతున్నారు. హైదరాబాద్లోని ఆంధ్ర ఉద్యోగులు ఆంధ్రకి వెళితే మిగిలిన ఆంధ్ర ప్రజలు అన్ని రాష్ట్రాలలోనూ ఉన్నట్లే హైదరాబాదులో ఉండిపోగలరు. వాళ్ళని వెళ్ళగొట్టే హక్కు ఎవరికీ లేదు. ఐటిలో సీమప్రజలెంతమందో ఉన్నారు. వారికెవరూ అపకారం చెయ్యలేరు. సాధించవలసిన హక్కులు, హామీలూ ఎన్నో ఉన్నాయి. పోలవరం రెండేళ్ళలోపల పూర్తిచేసే బాధ్యత కేంద్రం తీసుకోవాలి. నీరు, విద్యుత్ నిబంధనలతో సాధించాలి. కాలవ్యవధి చాలా తక్కువ. విభజనతో ఆంధ్రకి అంతా నాశనమే వంటి మాటలు పలుకకూడదు. ఆంధ్ర సీమ మనుగడ తెలంగాణ మీద ఆధారపడి లేదు. విభజన తరువాత రెండు ప్రాంతాలు ఒక మాతృభాషతో సోదరభావం పెంచుకోవచ్చు. అందరూ శాంతిగా ఆలోచించవలసిన సమయం ఇది.
రాయలసీమ విషయం
ఇక రాయలసీమ వారితో స్నేహం కుదుర్చుకొని ప్రత్యేక అభివృద్ధి ప్రణాళిక రూపొందించి అది కూడా బిల్లులో స్పష్టం చేసుకోవాలి. తిరుపతి వెనుకనున్న పలమనేరు నుండి కర్నూలు వరకు గల పర్వత ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తే చాలా ఆదాయం వస్తుంది, అందరికీ లాభం కలుగుతుంది. నల్లమలైకొండలు కొంత భాగం ప్రజల ఉపయోగంలోకి తీసుకురావచ్చు. ఈ విషయంపట్ల కేంద్ర ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలి. ఆ విధంగా రాయలసీమ ఎంతో లాభం పొందవచ్చు.
ఇక కేంద్రం విషయం
ఇక ప్రభుత్వ కేంద్రం విశాఖపట్టణమైతే అది ఒక మహానగరం కావచ్చు. సమీపంలోని పర్వత సీమలు ప్రజల యొక్క ఉపయోగంలోకి రాగలవు. దానికి అనుమతులు కేంద్రం నుంచి సాధించాలి. గుంటూరు సీమ రాష్ట్ర మధ్యభాగంలో ఉన్నా వేసవిలో అక్కడి వేడి 45 డిగ్రీలదాకా వెళుతుంది. అప్పుడు విశాఖలో వేడి 7, 8 డిగ్రీలు గుంటూరు కన్నా తక్కువ ఉంటుంది. పట్టణంలోనే ఉన్న కొన్ని కొండలనైనా నివాసయోగ్యంగా తీర్చవచ్చు. వాటికొక అందచందాలుంటాయి. విశాఖ ద్వారా ఉత్తరాంధ్ర ప్రాంతం అభివృద్ధి అయ్యే అవకాశం ఎక్కువ ఉంది. వేసవిలో పనిచేయని ప్రభుత్వ కార్యాలయాలు హైకోర్టు లాంటివి, కొన్ని విశ్వవిద్యాలయాలు గుంటూరులో ఉండవచ్చు.
త్రవ్వి సిద్ధంగా ఉన్న కాలువలు గోదావరి నదీ జలాలను సమృద్ధిగా తేగలవు. త్వరలో పోలవరం సిద్ధమయితే ఇప్పుడు సముద్రం పాలవుతున్న 90 శాతం గోదావరి, కృష్ణానదీ జలాలు (వరదల సమయంలో) కొంతవరకైనా ప్రజలకు కాలువల ద్వారా కూడా ఉపయోగం కావచ్చు. అలోచించవలసిన విషయాలు ఇంకా ఎన్నో ఉన్నాయి. విరోధము, ద్వేషము లేకుండా విడిపోతే రెండు తెలుగు రాష్ట్రాలు ప్రగతి సాధించగలవు.

Tuesday, January 23, 2018

Guru Punima Message from Sadguru Sivananda Murty (22-07-2013, Warangal)

Guru Punima - 2013

Translated from Telugu (Andhra Bhoomi Daily, July 23) 

Sanatana Dharma envisaged only upward evolution for all beings (jivas). The path involves leading a life upholding dharma as the ideal, while living in harmony with the society around. Any being, wherever he is situated, either in a higher or lower stage of evolution at a given time, will eventually reach the highest state. That is the intention of the Creator. This is the path of dharma which can lead every being to the final destination. This is Sanatana Dharma. Nothing goes downward forever, even if it appears to be sliding down momentarily. Small offences by common people in a large country have only minor effects on themselves and they do not affect the nation. On the other hand, if the elders, political leaders, administrators, the rich and the powerful and the learned Brahmanas are sinful and unethical, the whole country suffers. The Mahabharata exemplifies this. The sins of a few people in the highest echelons of the Kuru kingdom caused a devastating war in which lakhs of innocent people and the rulers of fifty odd kingdoms and their armies perished. As long as the people were in dharma, the country was safe. When dharma was forgotten, the country suffered in the form of foreign invasions for centuries by people who are totally inimical to the Indian way of life. The structure of Sanatana Dharma weakened and decay set in. By the time of independence, the country had broken into three pieces. Independence from foreign rule was sought not for the purpose of restoring Sanatana Dharma, but its sole mission was for capturing political power. In fact, Sanatana Dharma suffered more at the hands of the new indigenous rulers, who ascribed all the evils of Indian society to Sanatana dharma, and tried their best to weaken it. The elected governments could not also deliver on any of their election promises – alleviation of poverty, achieving equality in the society, uplifting dalits, guaranteeing social justice or even uniform economic prosperity. On the other hand, they could not settle long standing disputes and created many more new problems. In these seven decades, we climbed down seven steps. We can compare this fall to reaching the lowest world, Patala Loka, mentioned in our Puranas. We are neither happy in the present life nor we made any progress in the spiritual plane. This is the state of dharma in Bharat today. Let us hope that we may not fall further, and try for a new beginning from now on. Let us restart an upward journey. Let us follow a course of justice and liberty, which has Indian-ness (Bharatiyata) as its key character. Let us hope for a corruption and bias-free government, ethics and morality in public life, equality among all, protection of the good and the meek, safety and security for women, children and the old, and climb up to the level from where we have fallen in the coming seven decades. It does not help if few human beings evolve and a follow a path of dharma. Every being in the society should change his course. Such a society existed in this country long time ago, in the Ramayana times, in the Mahabharata times, except during the rule of the blind king Dhritarashtra, and, in fact, till centuries later.
This rule of dharma should not be considered and interpreted as being confined to a narrow religious view. It has nothing to do with religious rituals and dogmas. It is an outlook and a way of life. It needs a change in the attitudes. Such a change can only be brought about by God (in his role as Jagadguru, the teacher of the world). Let us pray to the Jagadguru on this auspicious occasion of Guru Purnima, to let our society awake. God ultimately is the custodian of all dharma. Subham Bhuyat.

Monday, January 22, 2018

అది తపోభూమి...గృహస్థుల కర్మభూమి కాదు

https://www.facebook.com/vallury.sarma/posts/539915766045841

అది తపోభూమి...గృహస్థుల కర్మభూమి కాదు
- డాక్టర్ కందుకూరి శివానందమూర్తి
27/06/2013
TAGS:
.................. కేదార క్షేత్రం నూరేళ్ళపూర్వం వరకూ కూడా వేల సంఖ్యలో జనాభా వెళ్ళిన యాత్ర కాదు. ఏవిధమైన సౌకర్యాలు లేకపోవడం చేత, ఆ యాత్ర కుటుంబాలతో, పిల్లలతో, పెద్దలతో వెళ్ళవలసిన యాత్రగా పరిగణించబడలేదు. గృహస్థులు వెళ్ళి మొక్కుబడులు చెల్లించుకోవడం, ఏవో కోరికలతో పూజలు, ప్రార్థనలు, దీక్షలు చేసే యాత్రగా అది పరిగణించబడలేదు. ....................
గడచిన వారం రోజులలో హిమాలయాలలోని కేదార యాత్రీకుల ఆపదలు చాలా తెలుసుకున్నాం. ఈనాటికి ఐదువేల మంది చనిపోయారని తెలుస్తున్నది. సుమారు ఎనభైరెండువేల మంది ప్రభుత్వ యంత్రాంగం సహాయంతో క్షే మంగా రక్షింపబడ్డారు. చాలామంది ఇళ్ళకి చేరుకున్నారు. దాదాపు అక్కడ ఇరుక్కున్న వారందరూ రక్షింపబడినట్టే. నేడో రేపో ఆ మిగతా పని కూడా పూర్తి అవుతుంది. భారతీయ వాయుసేన యంత్రాంగం ఆరు రోజులలో చాలా గొప్ప సేవ చేసింది. ఈ సంఘటనపైన ఎన్నో రకాల వ్యాఖ్యలు సహజంగా వినబడుతున్నాయ. అసలు ఈ మతం నమ్మకంతో ఇంతమంది అలాంటి చోటుకి ఎందుకు వెళ్ళాలి? ఇదంతా కేవలం మూఢనమ్మకం వల్ల వచ్చి న ఆపద కాదా..? ఇదొకరకం విమర్శ! ఇలాంటి నమ్మకాలు లేకపోతే ఇంతమంది పోయుండేవారు కాదుకదా..అని మరో వ్యాఖ్యానం. మనం గొప్ప నాగరికతతో తయారుచేసుకున్న రోడ్లపైన దేశం మొత్తం మీద పది రోజులకొకసారి ఐదువేల మంది పోతూ ఉండవచ్చు. దానికి ఏ విశ్వాసము కారణము కాదు. కేవలం మన నాగరికతలోని అనాగరికతే కారణం! మన సాంకేతిక విద్యకి పరాకాష్టగా నిర్మించిన ‘టైటానిక్’ అనే ప్రయాణికుల నౌకకి పట్టిన గతికి ఎవరు బాధ్యులు? మరొక్క రోజు ప్రయా ణం క్షేమంగా సాగితే ఆ పధ్నాలుగు వం దల మంది మహా వైభవంగా ఉత్సవం చేసుకుని ఉండేవారు. ఇలాంటివి ఎన్నో! మన భారతదేశంలో ఏ క్షణంలో లెక్క చూసినా సుమారు 15 కోట్ల మంది భక్తులు దేవాలయాలలో, క్షేత్రాలలో, మఠాలలో ఉంటూ ఉంటారు. వీరందరిలో 99 శాతం క్షేమంగా తిరిగి వస్తున్నారు. ప్రమాదాలెన్ని జరిగినా ప్రజల విశ్వాసం మాత్రం ఏమీ తగ్గదు. మానవ జీవితంలో వ్యక్తికి, సంఘానికి కూడా శుభాశుభాలు, అనుకోని ఆపదలు అక్కడక్కడ కలుగుతూనే ఉంటాయి. దానివల్ల జీవన స్రవంతి ఆగకుండా సాగుతూనే ఉంటుంది. కేదారయాత్ర విషయంలో ఆలోచిస్తే అక్కడ జరిగిన ప్రకృతి బీభత్సంలో ఎనభై రెండు వేల మంది క్షే మంగా తిరిగి రావడం చాలా గొప్ప విష యం. ప్రకృతియొక్క ఆగ్రహం కంటే భగవంతుని యొక్క అనుగ్రహం చాలా ఎక్కు వే ఉంది. ఇటువంటి సంఘటనలకు ఏదో కారణం వెతకనే కూడదు. ఆవిధంగా ఎంత తిప్పలు పడ్డా సరియైన కారణం దొరకదు. కానీ ఓ దుర్మార్గుడు బాంబు పేల్చి ఒక వందమందిని చంపడంలో కారణం ప్రత్యక్షంగా కనపడుతుంది. ఆ విధంగా కారణం తెలిసిన చోట ఒక కర్తవ్యం ఉంటుంది. మృ తులు పదిమందైనా, వందమందైనా కానీ చాలా విచారకరమే. కానీ ఆపదయొక్క పరిమాణాన్నిబట్టి నష్టాన్ని అవగాహన చేసుకోవలసి ఉంటుంది. కేదార క్షేత్రం నూరేళ్ళపూర్వం వరకూ కూడా వేల సంఖ్యలో జనాభా వెళ్ళిన యా త్ర కాదు. ఏవిధమైన సౌకర్యాలు లేకపో వడం చేత, ఆ యాత్ర కుటుంబాలతో, పిల్లలతో, పెద్దలతో వెళ్ళవలసిన యాత్రగా పరిగణించబడలేదు. గృహస్థులు వెళ్ళిమొక్కుబడులు చెల్లించుకోవడం, ఏవో కోరికలతో పూజలు, ప్రార్థనలు, దీక్షలు చేసే యాత్రగా అది పరిగణించబడలేదు. ఆవిధంగా మొక్కులు చెల్లించుకునే క్షేత్రాలు దేశం లోపలే అనేక సంఖ్యలో ఉన్నాయి. కేదారయాత్ర చరిత్రలో - పంచపాండవులు ద్రౌపదీదేవితో కలిసి పాదచారులై కేదారానికి మహాప్రస్థానం వెళ్ళారని మహాభారతం వర్ణిస్తోంది. ఆ ఆలయంలో పంచపాండవుల మూర్తులు కూడా ఉన్నాయి. ఆ యా త్రలో ఎటువంటి సౌకర్యాలు అమర్చుకోకుండా ఈశ్వరధ్యానంలో నడచి, నడచి శరీరాలు విసర్జించారు వాళ్ళు. ధర్మరాజు మాత్రమే చివరి పర్వతాగ్రందాకా వెళ్ళి దేవతల దర్శనం చేశాడు. కుటుంబ సభ్యులు అందరూ పడిపోయినా ఒక కుక్క మాత్రం ఆయనతో చివరివరకు నడిచి వచ్చింది. ధర్మదేవత ఆయన్ని స్వర్గానికి ఆహ్వానించినా కుక్కను కూడా తనతో అనుమతించాలని పట్టుపట్టాడు. ఆయన న్యాయ దృష్టికి దేవతలు మెచ్చారు. ఆ కుక్క ఎవరో కాదు ఆయనని పరీక్షించిన ధర్మదేవతే అని ఋజువైంది. మహాప్రస్థానమంటే ఈ లో కాన్ని శాశ్వతంగా వదిలి తిరిగివచ్చే సం కల్పం లేక పైలోకాలకి ప్రస్థానం సంకల్పించి దేహత్యాగం చేయడమన్నమాట. ఈ యాత్ర చేయడంలో అటువంటి మనఃప్రవృత్తి కొందరికి ఉంటూనే ఉండింది. సంసారాన్ని వదలిపెట్టిన విరాగులు, అటువంటి భావన కలిగిన కొద్దిపాటి గృహస్థులు, ఇక బైరాగులు, సన్యాసులు, జీవనయాత్ర పూర్తికాబోతున్నదని నిశ్చయం చేసుకున్న వారు అనేకమంది ఏవిధమైన జాగ్రత్తలు, అన్న వస్త్రాల ఏర్పాట్లు కూడా చేసుకోక అటువెళ్ళి తిరిగి రాలేదు. ఒకవేళ అక్కడ చేరిన తరువాత కూడా స్వాధీనం కాని శరీరంలో వారుకాలం గడిపేవారుకాదు. ఈశ్వర ధ్యానంతో ప్రాణాయామం దీక్షగా చేసి ఊపిరి చాలా వరకు నిగ్రహించి, నెమ్మదిగా ఆ ప్రక్కన కొండ చివరికి చేరి, మనస్సు, బుద్ధి, చిత్తాన్ని ఈశ్వరాయత్తం చేసి మైలు లోతైన అలకనందలోయలో శరీరాన్ని విసర్జించేవారు. ఆ నిగ్రహం చేత కేవలం శరీరమే లోయలో పడి ఆ జీవాత్మ దారిలోనే శరీరాన్ని వదిలి ఊర్థ్వలోకాలని చేరుకునేది. ఇది ‘‘్భృగుపాత’’మనే పేరుగల దేహాన్ని విసర్జించే ఒకానొక ప్రక్రియ. అది దుఃఖంతో చేసుకునే ఆత్మహత్యకాదు. ఇదంతా సుదీర్ఘమైన సాధనతో పూర్తి విరాగంతో ఊర్థ్వ గతిపైన దీక్షతో మోక్షప్రదాత అయిన పరమశివుడు కేదారనాధుని దయపైన నమ్మకంతో చేసిన పని. అలాంటి వారు వేలమంది ఉండరుకదా? హిమవంతం తపోభూమి.గృహస్థులకు సంబంధించిన కర్మభూమి కాదు. వేదవ్యాస మునీంద్రుడు తన దివ్యశరీరంతో అక్కడ శాశ్వతంగా నిలిచిపోయాడు. శ్రీకృష్ణుని అంశ తేజోరూపంతో హిమాలయాలలోనే ఉండిపోయింది. అంతేకాక బ్రాహ్మణుడై మహాపాపం చేసిన అశ్వత్థామ శాపగ్రస్థుడై, రోగగ్రస్థుడై అక్కడే తిరుగుతున్నాడు. అక్కడ పవిత్ర వాతావరణంలో తన పాపం కొంత క్షయిస్తుందని సంకల్పం కావచ్చు. ఇంకా వేలాది మంది అక్కడక్కడ నందాదేవి వంటి పర్వతగుహలలో తపస్సు చేసుకుంటున్నారు. బదరీ, కేదార క్షేత్రాలున్న అన్నపూర్ణ హిమాలయ పర్వత పంక్తికి వెనుకనే ఉన్న మహోన్నత కైలాస పర్వత ప్రాంతంలో రుద్రాంశ సంభూతుడు, బ్రహ్మజ్ఞాని అయిన హనుమంతుడు చిరంజీవిగా సంచరిస్తూనే ఉన్నాడు. ఇవన్నీ గృహస్థుల యాత్రాస్థలాలు కావు. సౌకర్యాలతో యాత్ర, వినోదయాత్ర, వ్యాపార సరళితో కలిసి నేటి పరిస్థితి ఇలాగ మారింది. లౌకిక క్షేమాన్ని ప్రక్కన పెట్టి, కేవలం తాత్విక దృష్టితో చూడగలిగితే అక్కడే దేహాన్ని వదలిన యాత్రికులకి చివరి క్షణంలో దుఃఖమే కలిగిందో లేక శాంతి లభించిందో మనకి తెలియదు. వాళ్ళే ఒక వేళ ఇంటికి తిరిగి వచ్చినా ఏదో ఒకనాడు మృత్యువు తప్పదు. ఇక్కడి మృత్యువు పరిస్థితులు ఎవరి స్వాధీనంలోనూ ఉండవు. ఎట్టి మృత్యువు ఏ జీవునికి మంచిదో, ఉత్తమమో తెలియదు. శరీరం ప్రకృతి వశం, జీవుని గతి కర్మవశం అయి ఉండగా జీవుడు ఈశ్వరునితో ఎంత సంబంధం పెట్టుకున్నాడో అంతమాత్రమే వారిగతి ఈశ్వరేచ్ఛ అయి ఉంటుంది. మనమందరం ఈ దేహయాత్ర చాలించిన యాత్రికులందరి జీవులకు శివానుగ్రహం కలిగి పూర్ణశాతం లభించాలని ఈశ్వరుని వేడుకుందాం. వారికి, వారి కుటుంబాలకి మనఃస్ఫూర్తిగా సానుభూతి చెప్పుకుందాం. భవిష్యత్తులో యాత్రికులందరికి అక్కడి ప్రకృతి ప్రసన్నమై ఉండుగాక! ఈ సందర్భంలో ఒక కథని జ్ఞాపం చేసుకుందాం... ఒకనాడొక బ్రాహ్మణుడు మండుటెండలో నడచి, ఆకలితో నీరసించి ఒక గ్రామం చేరుకున్నాడు. అక్కడ ఉన్న గృహస్థుని చూచి ప్రాణం పోతున్నదని సౌంఙ్ఞతో ఆహారం వేడుకున్నాడు. ఆ గృహస్థు ఇంటి ముందరే ఉన్న చెరువును చూపించి వెంటనే స్నానం చేసి రమ్మని, భోజనం సిద్ధంగా ఉన్నదని అన్నాడు. అంతవరకూ కూడా ప్రాణం నిలువదని వెంటనే ఏదో ఇవ్వమని అడిగితే ఒక గినె్నలో పాయసం ఇచ్చాడు. తీరా పాయసం పాత్ర చేతికి రాగానే కొద్ది ధైర్యం వచ్చిన ఆ బ్రాహ్మణుడు ఒక క్షణంలో స్నానం ముగిద్దామనుకుని ఆ పాయసపాత్రను గట్టుమీద పెట్టాడు. పాపమాతడు త్వరగానే స్నానం ముగించాడు. కాని సమీపంలో చెట్టుపైన ఉన్న ఒక గద్ద ఒక విషసర్పాన్ని గోళ్ళతో చీల్చింది. ఆ మరణవేదనలో ఆ సర్పం విషం కక్కింది. ఆ విషం తిన్నగా పాయసంలో పడింది. ఎంతో ఆత్రంతో ఆకలితో ఉన్న ఆ బ్రహ్మణుడు వేగంగా పాయసం త్రాగేశాడు. ఆ బ్రాహ్మణుడు వెంటనే అక్కడే మరణించాడు. గ్రామస్థులు ఆయన మరణానికి కారకులెవ్వరని చర్చించారు. అడిగిన వెంటనే చేతికి పాయసాన్ని అందించక స్నానం చేయమని సూచించిన గృహస్థునిది తప్పా? విషం కక్కిన సర్పానిది తప్పా? అదే క్షణంలో సర్పాన్ని చీల్చి చంపిన ఆ గద్ద కారణమా? పాయసం వెంటనే తాగకుండా స్నానం కోసం ఆలస్యం చేసిన బ్రాహ్మణునిది తప్పా? చర్చలో గ్రామస్థులు తేల్చలేకపోయారు. వెంటనే ఆ ప్రక్కనే నడచిపోతున్న సాధువు కనిపిస్తే అతనిని సందేహం తీర్చమని అడిగారు. ఆ సాధువు నవ్వి - ఆ బ్రాహ్మణుని మృత్యువుకి ఆ గృహస్థుకాని, ఆ సర్పంకాని, ఆ గద్ధకాని, చివరగా ఆ బ్రాహ్మణుడే కాని ఇందులో ఎవరైనా ఒక్కరు బాధ్యులని నిర్ణయిస్తే దానివల్ల అట్టివారికా పాపం సంక్రమిస్తుందని తెలిపాడు. ఎందుకంటే ఆ మృత్యువులో అసలు పాపమే లేదు. ఎవరి పాప మూ లేదు. ఇటువంటి సహజ సంఘటనలకు ఎవరినీ బాధ్యులని నిర్ణయించడం సరికాదు. ఒక కారు ప్రమాదం జరిగితే దానికి ఎవరినో బాధ్యులుగా నిర్ణయించి చర్య తీసుకోవడం సమాజ జీవనంలోని ఒక శాసన వ్యవస్థగా కొనసాగడం నాగరిక జీవనంలో ఒక భాగం మాత్రమే. అన్నింటికీ మనం చూపించే కారణాలు పూర్తిగా నిజం కావు. ఇది విశేష సత్యం.

నైతిక పాప కాలుష్య ఫలమిది! -డాక్టర్ కందుకూరి శివానందమూర్తి 29/06/2013

నైతిక పాప కాలుష్య ఫలమిది!
-డాక్టర్ కందుకూరి శివానందమూర్తి 29/06/2013 Andhra Bhoomi Daily 

https://www.facebook.com/vallury.sarma/posts/540241342679950

కేదార సంఘటన మన అందరికీ చాలా బాధ కలిగిస్తూనే ఉంది. భక్తితో, నమ్మకంతో వెళ్ళిన వాళ్ళు ఆలయం దగ్గరే పోవడాన్ని భరించడం చాలా కష్టం. అది శివసన్నిధి కదా! అక్కడ రక్షణ ఉండదా? వంటి ఎన్నో ప్రశ్నలు పుడతాయి. కొద్దిపాటి తాత్విక అవగాహన మనకి శాంతినివ్వగలదు. ఈ ప్రకృతి అంతా చైతన్యమయం. అదే మనలో ఉన్న ప్రాణం, ఆకలి, మనస్సు, బుద్ధి. అంతవరకూ మనమందరం ఒక్కటే. ఆ మనస్సులోంచి మాత్రం గుణాలు, స్వభావాలు, కామక్రోధాలు, పాపము, సిద్ధాంతాలు, తిరస్కారాలు, ద్వేషం ఇవన్నీ పుట్టి, వాటి ఫలంగా పుట్టిన సుఖాలు, దుఃఖాలు మనమనుభవించక తప్పదు. మొదట ఉన్న చైతన్యం పేరే ఈశ్వరుడు. మన కర్మకి ఫలమిచ్చే ఆ చైతన్యం స్వతహాగా దయ, అనుగ్రహం అనే లక్షణాలను కలిగి ఉంది. కాని మనం దానిని అలాగ వాడుకుంటున్నామా? ఆ దయ మొత్తం మానవజాతి మీద సమానంగానే ఉంది. కానీ మానవజాతి మాత్రం పరస్పరం సమానంగా చూసుకోవడం లేదు. మన మనస్సులోంచి పుట్టి వికారాల్లో అంతటా సమానంగా ఉండే ఈశ్వరుడిని అసమానంగా చూస్తున్నాం. ఒకరి విశ్వాసం, మరొకరికి అజ్ఞానం. ఒకరి సిద్ధాంతం మీద మరొకరికి ద్వేషం. అందరిపైనా సమానంగా ఉండే దయని పంచుకోవడానికి బదులు ద్వేషాలు పెంచుకొని ఆ దయలోనే ఆగ్రహం సృష్టించుకొని దాన్ని అనుభవిస్తున్నారు. దీనే్న దుష్ట శిక్షణ అని, పాపఫలితమని మనమంటాం. అట్లాంటి పాపఫలితం అంతటా ఉన్న చైతన్యంలోకి వ్యాపిస్తుంది. ఆ మహాచైతన్యంలోనే పంచభూతాలు పనిచేస్తున్నాయి. దయా స్వరూపమైన ఆ చైతన్యంలోనే మనం తినే ఆహారం కూడ పుడుతోంది. మనం, మన గుణాలు, కర్మలు, దోషాలతో నిండి, మన ఆహారం, నిద్ర, మనం నిత్యం చేసే పనులు, నడక, నడవడి, తరచు దుఃఖప్రదమవుతాయి. ఇదింకా స్పష్టంగా అర్థం చేసుకోవాలంటే ఒక విశ్వాసంలో ఉండే వాళ్ళని, మరో విశ్వాసంలో ఉండే వాళ్లు... పొరుగు దేశాల్లో, ఒక ఉద్యమంగా చంపుతున్నారు. అక్కడ మానవ సమానత్వం పోయింది. ఆ చనిపోయిన వాళ్ళు చేసిన ప్రత్యేక పాపం ఏమీ ఉండదు.
అందువల్ల ఈ పాపమనేది ఒక విషంగా పరిణిమించి నీరు, గాలి, నేల వీటిలో వ్యాపిస్తుంది. నేడు ఈ ద్వేషం, హింస, అనే పాపం రోజు, రోజుకు పెరుగుతోంది. ఆ గాలి, నీరు ఎప్పుడైనా, ఎక్కడైనా, ఎవరికైనా హాని కల్పించవచ్చు. అయితే ఈ పాపం ప్రకృతిలో ప్రవేశించినప్పుడు దానికి ఒక విచక్షణ, బుద్ధి, న్యాయాన్యాయ విచారణ ఉండవు. క్రీ.శ. 1018 డిసెంబర్ 2వ తేదీనాడు మథురా పట్టణాన్ని పాలించే రాజ్యపాలుడు మహమ్మూద్ని ఎదిరించలేక పారిపోయాడు. సుల్తాన్ మథురా పట్టణాన్ని రెండువందల దేవాలయాలతో సహా నేలమట్ట చేసి తగులబెట్టాడు. అక్కడ శ్రీకృష్ణాలయంలో పదిహేను అడుగుల ఎత్తు కలిగిన ఎర్రని బంగారు పోత పోసి, ఎన్నో రత్నాలు పొదిగిన విగ్రహాలను నేలమట్టం చేసి ముక్కలు చేశాడు. వేలాది ప్రజలు మరణించారు. దేశమంతా దుఃఖసముద్రంలో మునిగారు. ఈ ఆపదకు ఎవరు కారణం? ఇలాంటి వందలాది ఘోరాలను జననష్టంతో ఈ దేశం భరించింది. దేవుడెందుకు కాపాడలేదు? ఇవే ప్రజలకు కలిగే సామూహిక దుఃఖాలు. ఆ విధంగా లక్షల మంది యొక్క శ్రద్ధా, భక్తులకు కేంద్రమైన మథురలోని కృష్ణాలయం, మరొకరి ద్వేషానికి బలైంది. ఇక్కడ భక్తి సత్వగుణమైతే, దానికంటే బలంగా ద్వేషం, రజోగుణం, విజృంభించాయి. సాత్వికులైన భక్తులు వేలమంది చనిపోయారు. పవిత్ర స్థానాల్లో సహజంగా సత్వగుణమే ఉంటుంది. కొనే్నళ్ళకు పూర్వం వెంకటేశ్వరాలయంలో తొక్కిసలాటలో అనేక మంది చనిపోయారు. ఇటీవల పాతికమంది యువకులు షిరిడి యాత్రకు పోతూ మరణించారు. ఇదంతా మనుష్యుల యొక్క గుణములు, కర్మ, ప్రకృతి వీటి కథేకాని భగవంతుడు కొందరిపైన ఆగ్రహించడం అనేది లేదు. మనం చేసే జీవహింసే అపరిమితంగా ఉంది. ఆత్మరక్షణకోసం కొందరు చేసే ప్రార్ధన కంటే ప్రకృతిలోని ఆగ్రహం బలం గా ఉండవచ్చు. అలాంటివి ఎవరికి తోచినట్టు వారు అర్థం చేసుకుంటున్నారు. ఈ పాపమనేది పెద్దలు చేస్తే దానికి శక్తి మరీ ఎక్కువ. మహాభారతంలో చాలాపాపం చేసిన పెద్దలు పదిమందే. చనిపోయిన వారు లక్షమంది. దుఃఖంలో మునిగిపోయిన కుటుంబాలు లక్షమంది. అహంకారం, రాగద్వేషం, వీటితో ఆచరించిన సత్కర్మలు అంటే-క్రతువులు, జపతపాలు, దానాలు కూడా ఫలితాన్ని ఇవ్వకుండా ఆ వ్యక్తి యొక్క మృత్యువులోనే నశిస్తున్నాయి. ప్రకృతిని మన భౌతిక మానసిక ప్రవర్తన ద్వారా పవిత్రంగాపెట్టుకోవడం మన కర్తవ్యం. ఇటువంటి దుఃఖకర ప్రాకృతిక దుస్సంఘటనలు వెనుక మనుష్యుల వంటి కారణాలు కనబడేవి కావు. ప్రకృతిలో మానవులు చేసిన పాపకర్మ, సామూహిక పాపకర్మ వ్యాపించి ఉండడం చేత ఇట్టి వైపరీత్యాలు, సంఘ మరణాలు సంభవించవచ్చు. అంతేకాని ఇందులో ఈశ్వరుడు ఆగ్రహించాడని కాని, దయచూపలేదని కాని వ్యాఖ్యానించకూడదు. అలాగే పోయిన వ్యక్తులు వారి పాపఫలం అనుభవించారని చెప్పకూడదు. వారందరికి అప్పుడే ఆయువు తీరిందని కూడా చెప్పకూడదు. ఇక్కడ ఏ వ్యక్తి యొక్క కర్మ ముఖ్యం కాదు. ప్రకృతిలో భౌతిక కాలుష్యం దాని ఫలము మనకి కనబడతాయి. మానవ సంఘం చేసే అసురీ స్వభావం కలిగిన నైతిక పాప కాలుష్యం యొక్క ఫలం ఇట్లా ఉంటుందని గ్రహించుకోవాలి. కష్ట నష్టాలకి గురైన వారందరికి మన సానుభూతి చూపవలసిందే.

Thursday, January 18, 2018

గురుతేజస్సే సద్గురు శివానందమూర్తి ---- వారి మాటే.. మంత్రం

https://www.facebook.com/vallury.sarma/posts/602280333142717

బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మగారి వ్యాసం ఈ రోజు ఆంధ్రభూమిలో
గురుతేజస్సే సద్గురు శివానందమూర్తి ---- వారి మాటే.. మంత్రం…
- సామవేదం షణ్ముఖశర్మ 25/11/2013 Andhra Bhoomi Daily 

శ్రీశ్రీశ్రీ శ్రీ శివానందమూర్తిగారి కారణజన్మబహుమార్గాలలో ప్రణాళికను తయారుచేసింది. 

1. తపస్సుతో, త్యాగంతో నిరంతరం దేశ ధర్మక్షేమాలకై తన ప్రతి క్షణాన్నీ వెచ్చించడం,
2. ఈశ్వరార్చనతో, యజ్ఞయాగాలతో దివ్యశక్తిని ఈ భూమిలో వ్యాప్తి చెందించడం,
3. ధర్మాచరణ దిశగా, ఈశ్వరారాధన దిశగా, అసంఖ్యాకులను ప్రేరేపించి, వారి జీవితాలను, ధర్మమయంగా, తీర్చిదిద్దడం,
4. అపారమైన ఆర్షవిజ్ఞానాన్ని సమగ్రంగా, స్పష్టంగా పునరావిష్కరించి పదిలపరచడం, వ్యాప్తిచేయడం.
5. అవ్యాజమైన కారుణ్యంతో, తనదైన సహజ దివ్యశక్తితో ఎందరినో దుఃఖనిర్మూలన చేసి ఆదుకోవడం. ... ఈ పంచముఖాల పరమేశ్వర గురుతేజస్సే సద్గురు శివానందమూర్తి.
మన సనాతన ధర్మం ఆర్షగ్రంథాలపైనా, భవ్యక్షేత్ర తీర్థ దేవాలయాలపైనా ఆధారపడి వర్థిల్ల్లినదే కాదు. ఎందరో మహాత్ముల ద్వారా తేజరిల్లుతున్నది. ఎప్పటికప్పుడు ఆయా దేశ కాలాలకనుగుణంగా యోగులు మన సంస్కృతిని పరిరక్షిస్తున్నారు. కొన్ని వేల గ్రంథాల వలన తెలియవలసిన జ్ఞానం, కలుగవలసిన ప్రభావం ఒక్కయోగివల్ల జరుగుతుంది. ఒక రమణులు, ఒక కంచి మహాస్వామి... ఇలా ఎందరో జీవన్ముక్తులు సనాతన బ్రహ్మ విద్యకు సాకారంగా సంచరించి ధర్మసౌధాన్నినిలుపగలుగుతున్నారు. వీరే మన పరంపరకు, సంప్రదాయాలకు, అమోఘమైన జ్ఞానానికి ఆధారస్తంభాలు. ఈ సద్గురు పరంపరకు ప్రణామాలు. * * *
చాలా యేళ్ల క్రితం... ఒక స్నేహితుడు రమణమహర్షిగారి అరుదైన ఫొటో ఆల్బమ్ను నాకు చూపించారు. చక్కని సాంకేతిక విజ్ఞానంతో ఏర్పరచిన సమాహారమిది. స్ఫుటమైన రమణుల ప్రశాంత ముఖచిత్రాలు ఎన్నోఅందులో ఉన్నాయి. అయితే ప్రతి చిత్రంలోనూ ఆకళ్లల్లో ఏదో అనిర్వచనీయ తేజస్సు ద్యోతకవౌతోంది. ఇలాంటి నయనాలను ఎక్కడో ప్రత్యక్షంగా చూసినట్లు అనిపిస్తోంది. అవును- ఒకే ఒక్క వ్యక్తిలో అలాంటి నేత్రజ్యోతి దర్శనమయింది. ఎవరా మహనీయులు- కాసేపట్లో జ్ఞప్తికి వచ్చింది. అలాంటి ప్రకాశవంతమైన, నిర్మల, నిర్వికార, జ్ఞానస్ఫురనేత్రాలు కల గురువర్యులు సద్గురు శివానందమూర్తిగారు. నాడు అరుణాచలంలో స్థాణు చైతన్యం, నేడు భీమునిపట్నపు ఆనందవనంలోనూ, వరంగల్ గురుధామ్లోనూ, కొన్ని ప్రత్యేక సభల్లోనూ, రాజమండ్రి, హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో వాత్సల్యంతో సంచరిస్తున్న చైతన్యం! వ్యక్తిగతంగా దర్శించిన, అనుభవించిన దివ్యత్వాలు ఒక గ్రంథానికి సరిపడా ఉన్నప్పటికీ, ఆ వ్యక్తిత్వంలో స్ఫురించిన సందేశాలను ఆవిష్కరించుకొనే ప్రయత్నం చేస్తాను. వారి ఒక్కొక్క మాట ఒక్కొక్క మంత్రం, మననం చేసే వారిని రక్షించేది. మంత్రం (మననాత్ త్రాయతే మంత్రః) – అని శాస్తన్రిర్వచనం, అందుకే ఆ వాక్యాలు మంత్రాలు. ఈ దేశం పట్ల, దీని సహజ స్వభావమైన ఆర్య ధర్మం పట్ల వారికున్న పరిజ్ఞానం,పరమభక్తి ‘నాన్యతో దర్శనీయం’. నేటి యువత గ్రహించి స్ఫూర్తి చెందవలసిన అంశం. ఆసేతుశీతాచలం భిన్న రాష్ట్రాల వైవిధ్యంలో ఏకసూత్రంగా అల్లుకున్నసనాతనధర్మ వైభవాన్నివారు పర్యటించి, పరిశీలించి, పరిశోధించి గ్రహించి ఉద్బోధిస్తున్నారు. వ్యతిరేక శక్తుల కువిమర్శలను ప్రశాంతంగానూ, పరమ స్పష్టంగానూ, సూటిగాను ఎదుర్కొంటూ వారు పలికిన, రాసిన వాక్యాలు ప్రత్యేక ధర్మశాస్త్రాలు. అపారమైన వాత్సల్యం, కారుణ్యం వారి కనులనుండి వర్షిస్తున్నా, రాగద్వేషాదుల చాయలు కానరావు. ఒక విశాలమైన ఆహ్లాదినీ దృక్కుంతి హృదయాలను స్పర్శిస్తుంది.
ఒకసారి హైదరాబాదు నగరంలో వారిని దర్శించేందుకు వెళుతున్నప్పుడు మార్గమధ్యంలో ఒక భావన కలిగింది. ‘‘నిత్యం ఏదో కొంతసేపు మాత్రమే ఉపాసన చేసుకోగలుగుతున్నాను. ఉపన్యాసాలతోనే కాలమైపోతోంది. నేను తరించేదెలా?’’- అనే విచారం మనసునావరించింది. వారిని దర్శించి తీర్థం పుచ్చుకున్నప్పుడు, మనసులో ఉన్న ఈ వేదనను చెప్పాలనుకున్నా, చెప్పలేకపోయాను. మౌనంగానే ఉన్నాను. అప్పుడు వారు విబూదిని నా నుదుటరాస్తూ ‘‘నీ ఉపన్యాసమే నీకు ఉపాసన’అన్నారు. ఆశ్చర్యం కలిగింది. మాటాడనవసరం లేకుండా మనసును గ్రహించే మహాదేవ తేజస్సుకి మనసా నమస్కరించుకున్నాను. వారి ఈ మాటలో నాకు గొప్ప సందేశం అందింది. ‘ఉపన్యాసాన్ని ఉపాసనగా సాగించు’అనే ప్రబోధమిది. తరువాత అనేక సందర్భాల్లో ధర్మప్రచారం గురించి కర్తవ్యోన్ముఖులని చేశారు.
‘‘మన సనాతన ధర్మం గురించి ప్రచారంచేయడం ముఖ్య కర్తవ్యం. ఋషులిచ్చిన ధర్మం గురించి ప్రచారం చేయడమనేది ఎన్నోఅశ్వమేధ యాగాలకంటె గొప్పది. యాగం స్వర్గాన్నిస్తుంది- అంతే. ధర్మప్రచారం అంతకంటే గొప్పదైన ఈశ్వర కృపను ప్రసాదిస్తుంది’’అని బోధించారు. ‘ఈ దేశంయొక్క అసలు చరిత్రను తెలుసుకోవాలి.దేశమంతా సంచరించాలి. నాకైతే ఈ దేశపు మట్టిలో దొర్లితేనే ధన్యత అనిపిస్తుంది. అంత పవిత్రమైనదీ దేశం’’. ఈ ఆర్యభూమిపై వారికున్నప్రపత్తి అంతటిది. ధర్మప్రచారానికి, ప్రబోధానికి అంకితమయ్యేలా తీర్చిదిద్దినది వారి ఉపదేశం, ఆదేశం, ఆశీర్వచనం. లౌకికాపేక్షలను జన్మతోనే జయించిన ఆజన్మశుద్ధులు వారు. లోకాన్ని ఒక చిత్తరువులా చూసే నిర్వికారులు, జ్ఞానదృష్టితో సర్వాన్నీ వీక్షించే వారి సన్నిధి ప్రశాంతతను ప్రసాదించడమేకాదు, వారివారి యోగ్యతలననుసరించి కర్తవ్యాన్ని నిర్దేశిస్తుంది. నడిపిస్తుంది. మౌనంగానూ, ప్రభావవంతంగానూ వారందించే స్ఫూర్తి నిశ్శబ్దంగానే ఎందరో ధార్మిక యోధుల్ని తయారుచేసింది. దేశ సౌభాగ్యంకోసం వారు నిర్వహించిన, నిర్వహిస్తున్న యాగాలు అనేకం.
‘‘మనకోసం భగవంతుని ప్రార్థిస్తున్నాం. సంతోషమే, కానీ అంతకంటె ముఖ్యంమన దేశ క్షేమం గురించి ప్రార్థించాలి. తన క్షేమం కంటె, దేశ క్షేమంకోసం ప్రార్థించే వారి క్షేమాన్ని భగవంతుడు ప్రధానంగా అనుగ్రహిస్తాడు.’’ ఇది వారిచ్చిన మహాసందేశం. హిమగిరుల నుండి సముద్ర తటాలవరకు విస్తరించిన భవ్య భారత చరిత్ర వారికి కరతలామలకం. విభిన్నరాష్ట్రాల ప్రజలనేకాదు, విదేశాలలోను హిందూ ధర్మ పరిశోధకులు డా.డేవిడ్ ఫ్రాలే వంటి మేధావులు కూడా వారిని ఆశ్రయించి స్ఫూర్తినీ, సరియైన దృక్పథాన్నీసంపాదించుకున్నవారే.
ఈ దేశాన్నీ, దీని స్వాభావిక ఆర్షధర్మాన్నీ ఎప్పటికప్పుడు గమనించి కాపాడుకునే ఒక సిద్ధ వ్యవస్థ- సూక్ష్మభూమికలో సిద్ధ భూములలో ఉంది. ఆ వ్యవస్థనుండి ఒక మహాప్రయోజన సిద్ధికై వచ్చిన జీవన్ముక్తులు మా గురువుగారు శ్రీ శివానందమూర్తిగారు. తాను శైవ సంప్రదాయంలో జన్మించి, శివయోగిగా పరిణిమించి, ఆ అద్భుత శివయోగంలో సమగ్ర భారతీయతను పొదువుకున్న ‘జ్ఞానప్రేమ’వారిది. అందుకే వారి శిష్యుల్లో శైవ వైష్ణవాది సర్వసంప్రదాయాల వారున్నారు. అన్నికులాల, రాష్ట్రాలవారూ ఉన్నారు. వారి ఆదేశంతో కాశీలో ఆధ్యాత్మిక సాధనచేస్తున్న కొందరు విదేశస్థుల గురించి తెలుసుకొని ఆశ్చర్యం కలిగింది.
‘‘దేవతల కంటె ఋషులనే ముందు స్మరించి ఆరాధించాలి. దేవతలు కూడా ఋషులవల్లనే తెలియబడుతున్నారు. వారుకూడా ఋషుల మాటకు కట్టుబడి ఉంటారు’’అంటూ ఋషుల గొప్పతనాన్ని ఎన్నోమార్లు వింగడించారు. వారి మాటలో, వ్రాతలో మహర్షుల చరిత్రలు స్ఫూర్తిదాయకంగా వెలుగులీనాయి. రాజకీయాలు, సామాజిక పరివర్తనలు, మారుతున్న జీవన మూల్యాలు... ఇలా అన్ని పరిణామాలను పరిశీలిస్తూ, వాటిని ధార్మిక దృష్టితో సవరించుకోవలసిన బాధ్యతను, విధానాలను స్పష్టంగా, నిష్పాక్షికంగా సూచించారు. నేటి రాజకీయ విధాన నిర్ణేతలు వాటిని పరిశీలించవలసిన అవసరం ఉంది. ఒక సమగ్ర దృష్టి కలిగిన వారి సందేశాన్ని పాలనా బాధ్యత కలిగినవారు. గమనించేలా, శిష్యులైన మేధావులు బాధ్యత. వహించాలి. దేశంలో ప్రధాన పీఠాధీశ్వరులందరికీ మా గురువుగారిపై ప్రత్యేక ప్రేమ మాత్రమే కాదు, విశిష్ట గౌరవభావముంది. పీఠాల నడుమ ఎవరి పరిమితులు. వారికి ఉన్నప్పటికీ, ఈ సద్గురువు విషయంలో అపరిమిత సౌహార్దం, మన్నన అన్ని పీఠాలు కనబరచుతూనే ఉన్నాయి.
సద్గురువుల రచన ‘కఠయోగా’నికి జగద్గురువులు శ్రీశ్రీశ్రీ భారతీ తీర్థ స్వామివారు అనుగ్రహించిన విస్తార శ్రీముఖం, ఇటీవల ఆంధ్ర దేశ పర్యటనలో పీఠాధీశ్వరులు గురువులతో ఆత్మీయంగా ‘ఆనందవనం’లో సమావేశమవడం దివ్య ఘట్టాలు. నేపాల్, కాశీ, భారత ఈశాన్య రాష్ట్రాలు, ఇలా ఎన్నో ప్రాంతాలలో, కేవలం యాత్రా దృష్టిగాకాక, ఒక తపశ్శక్తితో, భారతీయతా పరిరక్షణ దృష్టితో సంచరించి వీరిచ్చిన సందేశాలు, చేసిన స్ఫూర్తిమంతమైన కార్యాలు అందరూ గమనించి గ్రహించవసినవి. సముద్రతీరంలో సముద్రతనయ అయిన మహాలక్ష్మీ ఆలయాన్ని ‘ఆనందవనంలో, ఉత్కళ శిల్పంలో నిర్మించిన మహోపకృతికి వందనాలర్పించవలసినదే. ‘ఆద్యాలక్ష్మి’రూపంగా పరాశక్తిని ప్రతిష్ఠించి, ‘దేశదారిద్య్రా’న్ని తొలగించమని ప్రార్థించారు. మనచేత ప్రార్థింపజేస్తున్నారు. అనేకమంది జీవితాల్లో వీరి అనుగ్రహ ప్రభావాలు కోకొల్లలు. కానీ అవి ప్రకటితాలు కాకుండా, గుప్తంగానే, తన జ్ఞానస్ఫూర్తిని ప్రసరింపజేయడం సద్గురువుల ప్రత్యేకత. వారి కారణజన్మ బహుమార్గాలలో ప్రణాళికను తయారుచేసింది.
1. తపస్సుతో, త్యాగంతో నిరంతరం దేశ, ధర్మక్షేమాలకై తన ప్రతి క్షణాన్నీ వెచ్చించడం,
2. ఈశ్వరార్చనతో, యజ్ఞయాగాలతో దివ్యశక్తిని ఈ భూమిలో వ్యాప్తి చెందించడం,
3. ధర్మాచరణ దిశగా, ఈశ్వరారాధన దిశగా అసంఖ్యాకులను ప్రేరేపించి వారి జీవితాలను ధర్మమయంగా తీర్చిదిద్దడం,
4. అపారమైన ఆర్షవిజ్ఞానాన్ని సమగ్రంగా, స్పష్టంగా పునరావిష్కరించి పదిలపరచడం, వ్యాప్తిచేయడం.
5. అవ్యాజమైన కారుణ్యంతో, తనదైన సహజ దివ్యశక్తితో ఎందరినో దుఃఖనిర్మూలన చేసి ఆదుకోవడం.
... ఈ పంచముఖాల పరమేశ్వర గురుతేజస్సే సద్గురు శివానందమూర్తి.
భారతీయ విజ్ఞాన సంపదలు, సంస్కృతి నిక్షేపాలన్నిటినీ పరిరక్షించుకోవలసిన ఆవశ్యకతను- తానుచేస్తూ, మనకు బోధించారు. ‘‘గురువు ఒక వ్యక్తికాదు. ఈ అనంత విశ్వంలో గురువు ఒక జటిల ప్రశ్న- దాని సమాధానమూను.’’అని ఎంతో గూఢంగా వచించే సద్గురువులు పరంపరాగతమైన, ఋషి సంప్రదాయ సిద్ధమైన గురుతత్వానికి సాకారం.

The Structure of the Universe (Vedic) - Viswaroopa - K. Sivananda Murty Preface 2

https://www.facebook.com/vallury.sarma/posts/616984388338978 The Puranas speak of individuals going up and down between these proximate...