Showing posts with label తెలుగు సాహిత్య చరిత్ర. Show all posts
Showing posts with label తెలుగు సాహిత్య చరిత్ర. Show all posts

Friday, January 19, 2018

దేశ చరిత్ర - తెలుగు సాహిత్య చరిత్ర

https://www.facebook.com/vallury.sarma/posts/507765695927515


తెలుగు సాహిత్య చరిత్ర చెప్పుకుంటూ తూర్పు చాళుక్య రాజు, రాజరాజ నరేంద్రుణ్ణీ, ఆదికవి, వాగనుశాసనుడు నన్నయ్యని, రాజమండ్రీని , తణుకునీ తలచుకున్నాం. సమయం సా.శ. 1050 ప్రాంతం. ఎవరీ తూర్పు చాళుక్యులు? ఎక్కడనుండి వచ్చారు? తెలుగు చరిత్ర, సాహిత్యం గురించి మాట్లాడుకుంటే కటకం, పర్లాకిమిడి, రాజమండ్రి, వేములవాడ, వరంగల్లు, నెల్లూరు, చెన్నపట్టణం, కంచి, తంజావూరు, మధుర, హంపీ విజయనగరం, శృంగేరి, కోలారు, బళ్ళారి, ఎలహంక (బెంగుళూరు), బాదామి (వాతాపి), ఢిల్లీ, (హరప్పా, లాహోరు తో సహా) గుర్తుకు తెచ్చుకోవాలి. రాజకీయంగా రాజమండ్రీకి పూర్వరంగం కర్ణాటక లోని బాగలకోట జిల్లాలోని బాదామి (వాతాపి). చాళుక్యుల ముఖ్య ప్రదేశం. వాళ్ళే పశ్చిమ చాళుక్యులు. వాళ్ళే బాదామినుండి రాజమండ్రీ వరకు ఆరవ శతాబ్దమునుండి, పదకొండవ శతాబ్దము వరకు ఇప్పటి ఆంధ్ర కర్ణాటక రాష్ట్రాలుగా చెప్పబడే ప్రాంతాన్ని పాలించారు. కన్నడభాషని సాహిత్యాన్ని పోషించారు. కన్నడ కవులు పంప, తరువాత రన్న, పొన్న అనేవారు హళెగన్నడ (పాత కన్నడం) అనే అప్పటి భాషలో కన్నడ సాహిత్యానికి ఆద్యులు. వీరు కన్నడ భాషకు కవిరత్నత్రయం. ఆదికవి పంప కన్నడభాషలో పంప భారతాన్ని వ్రాశాడు. దాని మరోపేరు విక్రమార్జున విజయం. ఈ పంప వేములవాడ నుండి వెళ్ళాడు. పొన్న వేంగీ దేశపు (ఏలూరు ప్రాంతం) వాడు. ఈయన భారతం పేరు గదాయుద్ధ (భారతయుద్ధం ఆఖరి ఘట్టం -భీమ దుర్యోధన యుద్ధం). నన్నయ పేరు నారాయణ శబ్దానికి తెలుగు వికృతి. ఈయన తన మిత్రుడైన నారాయణభట్టు సహాయంతో భారత రచన చేశాడు. నారాయణ భట్టుకు ఈ కన్నడ సాహిత్యంతో పరిచయం ఉన్నది. కాని కన్నడ భారతాలు వ్యాస భారతం అనువాదాలు కాదు. ఆ కవులకు కూడా జైనమతంపై ఉన్న అనురక్తి సనాతనధర్మం పైలేదు. వాళ్ళ ముఖ్యగ్రంధాలు జైన పురాణాలు. వీరరస ప్రధానగ్రంధాలుగా వాళ్ళు భారత కథను వ్రాశారు. పైగా ఒకరు అర్జునుని నాయకుడుగా వ్రాస్తే, ఒకరు భీముణ్ణి నాయకునిచేశారు. వాళ్ళవాళ్ళ ప్రభువులను ఆయా నాయకులతోపోల్చారు. ఈ పంప చాళుక్యరాజు అరికేసరి ఆస్థానకవి. రాజును అర్జునునితో పోల్చినప్పుడు ద్రౌపదికి ఐదుగురు భర్తలంటే ఏంబాగుంటుంది? అందుకు ద్రౌపదిని అర్జునునికి ఒక్కడికే భార్యను చేశాడు. యుద్ధం తరువాత అర్జునునికే పట్టంకడతారు. పైగా సుభద్ర మహారాణి. జైన పురాణాలు, ఈ మార్చిన భారతకథలూ ఆంధ్ర దేశంలోకూడా ఈ కవి పండితులద్వారా ప్రచారమయ్యాయి. వీరంతా అన్ని రాజ్యాల రాజుల వద్దకూ వెళ్ళేవారు. రాజమండ్రీనుండి కటకంపై వరకు కళింగ సామ్రాజ్యం. ఈ రాజకుటుంబాలన్నీ వివాహ సంబంధాలు కలిగిఉండేవి. రాజ రాజనరేంద్రుని కాలానికి, గోరక్షనాథ ప్రభావం వలన జైనం స్థానంలో స్మార్త శైవం వచ్చినది. సారంగధర కథ మాళవదేశమునుంచి వచ్చినది. చరిత్ర గతిలో వ్యాస మహాభారతాన్ని యధాతథంగా తెలుగు ప్రజలవద్దకు తీసుకు రావలసిన అవసరం వచ్చినది. తెలుగు సాహిత్యపు శుభారంభానికి రాజమండ్రి కేంద్రమయింది. కాని రాజ రాజ నరేంద్రుని అనంతరం అనతికాలం లోనే సామ్రాజ్యకేంద్రం తంజావూరుకు, భాషా చరిత్ర కేంద్రాలు వరంగల్లుకు, వెలనాడుకు, నెల్లూరుకు తరలిపోయాయి

The Structure of the Universe (Vedic) - Viswaroopa - K. Sivananda Murty Preface 2

https://www.facebook.com/vallury.sarma/posts/616984388338978 The Puranas speak of individuals going up and down between these proximate...