Showing posts with label మాతృభాష. Show all posts
Showing posts with label మాతృభాష. Show all posts

Sunday, January 21, 2018

మాతృభాష - బజారు భాష

https://www.facebook.com/vallury.sarma/posts/511159895588095


భాష,లిపి, ఉచ్చారణ ఈ మూడు భాషకి కావలసినవి. క్రుష్ణుడు, రుణము, రుషి అంటే చదవడానికి, పలకడానికి, ఎంత కష్టముగా, అసహ్యముగా ఉన్నదో తెలుగువారిలో అనేకులకు అర్థం కావడంలేదు. ఇక గుఱ్ఱము, బఱ్ఱె చెప్పనక్కరలేదు. ఋ వదిలేసి కృష్ణుడు అంటే అర్థం ఏమిటి. చాకు లో చ palatal sound తాలవ్యము, ౘలిలో ౘ dental sound దంత్యము. త్రిలింగ అనేది సరిగా త్రిలిఙ్గ అనివ్రాస్తే సరియైన ఉచ్చారణ వస్తుంది.మహ+రుషి నుండి మహర్షి ఎలా వస్తుంది? మహరుషి అనేవ్రాయాలి. మహ+ఋషి -> మహ+అర్+షి = మహర్షి వస్తుంది.


1. 1925 లో ప్రచురింపబడి క్రీస్తార్పణం అని యేసుక్రీస్తుకు అంకితంచేయబడిన తెలుగు సాహిత్య చరిత్ర ఎవరు వ్రాశారు?
2. బ్రహ్మర్షి, సద్గురు అని పీఠాధిపతులు పిలువబడే మహమ్మదీయ ఆధ్యాత్మిక పీఠం ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ ఉంది?


1925 లో ప్రచురింపబడి క్రీస్తార్పణం అని యేసుక్రీస్తుకు అంకితంచేయబడిన తెలుగు సాహిత్య చరిత్ర ఎవరు వ్రాశారు?
పండిపెద్ది చెంచయ్య, రాజా మంత్రిప్రగడ భుజంగరావు బహదూర్ (ఏలూరు సమీపంలోని లక్కవరం జమిందారు) 1925 లో ప్రచురించిన పుస్తకం A History of Telugu Literature. చెంచయ్య మతంమారిన మొదటితరం క్రైస్తవుడు. భుజంగరావు తెలుగు నియోగి బ్రాహ్మణుడు. కాని క్రైస్తవ సువార్త గ్రంధాలు తెలుగులోకి అనువదించాడు. వీరిద్దరీ ఉద్దేశ్యం - క్రైస్తవం భారతీయ ఆలోచనా విధానంలో ఉండాలి. విదేశీ నాగరికత, సంస్కృతులకు భిన్నంగా ఉండాలని, ఒక ఉత్తమ దర్శనంగా రూపు దిద్దుకోవాలనీ వీరి అభిప్రాయం. కాళీచరణ్ బెనర్జీ అనే వంగ బ్రాహ్మణుడు ఇలాగే క్రైస్తవుడై కలకత్తా క్రీస్తో సమాజాన్ని స్థాపించాడు. చెంచయ్య అదేఆశయంతో మద్రాసుక్రీస్తో సమాజాన్ని స్థాపించాడు. ఈ పుస్తకం క్రీస్తార్పణం అని అంకితం చేయబడినది.
2. బ్రహ్మర్షి, సద్గురు అని పీఠాధిపతులు పిలువబడే మహమ్మదీయ ఆధ్యాత్మిక పీఠం ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ ఉంది?
శ్రీ విశ్వవిజ్ఞాన విద్యాపీఠం అని 1472లో బాగ్దాద్ నుండి ఢిల్లీ,అక్కడ నుండి ఆంధ్రలో పిఠాపురం వచ్చిన సూఫీ వేదాంతుల స్థానం. ఇప్పటి 9వ పీఠాధిపతి బ్రహ్మర్షి ఉమర్ అలీ షా -2.

The Structure of the Universe (Vedic) - Viswaroopa - K. Sivananda Murty Preface 2

https://www.facebook.com/vallury.sarma/posts/616984388338978 The Puranas speak of individuals going up and down between these proximate...