Friday, February 2, 2018

Spirituality

https://www.facebook.com/vallury.sarma/posts/806389456065136

శర్మ గారు, మనం తరచుగా వాడే పదం 'ఆధ్యాత్మికత' గురించి కొంచం వివరించగలరు. పదము యొక్క అర్థం, అంతరార్థం కూడా తెలుసుకోవాలని .... ధన్యవాదములు
ఆధ్యాత్మికత – आध्यात्मिकता – Spirituality 1
ఆధ్యాత్మికత అనే పదం ఈరోజులలో తరచుగా వినబడుతోంది. నిఘంటువులలో (తెలుగు, సంస్కృతం) ఈపదం కనబడదు. ఇంగ్లీషులో spirituality అనే పదాన్ని తెలుగులో చెప్పడానికి సృష్టించబడిన ఈ పదం, ఇప్పటి వాడుకలో తప్ప సాహిత్యంలోకాని, శాస్త్ర చర్చలో కాని దర్శనమీయదు. సంస్కృతంలో ముఖ్యమైన పదాలు అధ్యాత్మ, అధ్యాత్మం, అద్యాత్మన్, అధ్యాత్మిక అనే విశేషణరూపం. అధి+ఆత్మన్ = అధ్యాత్మన్ అయింది.
వెబ్ లో చూస్తే తెలుగు వారు ఆధ్యాత్మికత అనే ఈ పదప్రయోగం ఎక్కువగా చేస్తున్నారు. ఉదాహరణకు ఒక వ్యాసంలో ఇలా ఉన్నది.
“ఆధ్యాత్మికత... అంటే అసలు ఏమిటి? దైవ చింతన. అంటే ఏ మతంలో ఉంటే ఆ మత దేవుళ్లు, దేవతలను పూజించడం ఆధ్యాత్మిక అని అనుకుంటారు చాలా మంది. అందుకే ఓ దేవుడిని ఎంచుకుని ఆయననే పూజిస్తుంటాం కదా. అయితే ఈ మతాలకు అతీతంగా భక్తిని ఏర్పరుచుకోగలిగితే ఉన్నతమైన ఆధ్యాత్మిక స్థితిని సాధించినట్టవుతుంది. మత వర్గాల చర్చ ముగింపుతోనే ఆధ్యాత్మిక చింతన ప్రారంభమవుతుంది. అప్పుడే నిజమైన ఆధ్యాత్మిక స్థితిని చేరుకోగలము. ఓ వ్యక్తి అభివృద్ధి చెందడానికి మొదటి అడుగు మతంగా చెప్పవచ్చు. ఆధ్యాత్మికం ముక్తికి మార్గం... ఎప్పుడైతే ఈ మతకట్టుబాట్లను వదిలి ముందుకు సాగుతాడో అప్పుడే అతనికి ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది. ముక్తి మార్గానికి బాట ఈ ఆధ్యాత్మిక చింతన. “
ఈ పై వాక్యాలలో మనకు కనబడేవి - అజ్ఞానం, అస్పష్టత, వాచాలతలు మాత్రమే.
ఆధ్యాత్మికత అనే పదం గంభీరముగా కనుపించే ఒక ఆధునిక పదము. మతం, ఈశ్వరుడు, విగ్రహారాధన, పూజ, శ్రవణం, మననం, ధ్యానం, భక్తి, శ్రద్ధ, సాధన, సంకీర్తనం ఇవన్నీ పాతకాలపువి, ఆధ్యాత్మికత ఉంటే ఇవన్నీ అనవసరమనే superiority complex ఈ fashionable పదం వాడుకలో ఆధునిక తెలుగు రచనలలో కనబడుతుంది. దీనికంటే ఇంగ్లీషులో spirituality అనే పదాన్ని ఎక్కువ అర్థవంతంగా వాడుతున్నారనిపిస్తుంది. See the following write up – 



Spirituality is a process of personal transformation, either in accordance with traditional religious ideals, or, increasingly, oriented on subjective experience and psychological growth independently of any specific religious context. There is no single, widely-agreed definition for the concept. In modern times the emphasis is on subjective experience. It may denote almost any kind of meaningful activity or blissful experience. It still denotes a process of transformation, but in a context separate from organized religious institutions, termed "spiritual but not religious". Modern spirituality seems to be a blend of humanistic psychology, mystical and esoteric traditions and eastern religions such as Buddhism and Hinduism. "Spirituality" is only one term of a range of words which denote the praxis of spirituality. Some other terms are "contemplation, asceticism, mysticism, perfection, devotion and piety". Spirituality means something different to everyone. 

This is typical Western understanding of spirituality. The first passage in Telugu only reflects the confusion of the writer. 

Spirit - This is not Atman or Adhyatman, Dictionary meanings are the following 

Spirit = the principle of conscious life; the vital principle in humans, animating the body or mediating between body and soul.

Spiritual = 1) of or relating to the spirit or soul, as distinguished from the physical nature: "a spiritual approach to life." 2) of or relating to sacred things or matters; religious; devotional; sacred. 

Spirituality = predominantly spiritual character as shown in thought, life, etc.; spiritual tendency or tone.

మన భావాలలో, మన భాషలలో, ఆధ్యాత్మికం అనే పదం, తాపత్రయం అనే పదం సూచించే మూడు రకాలైన దుఃఖాలలో ఒకటి. అవి ఆధిభౌతికం, ఆధిదైవికం, ఆధ్యాత్మికం. అధ్యాత్మ అనే పదం భగవద్గీత, భాగవతంలో అనేక చోట్ల కనుపిస్తుంది. అధ్యాత్మ యోగం అనే ప్రయోగం కఠోపనిషత్తులో కనబడుతుంది. మన పదాల వ్యుత్పత్తి, అర్థాలు మరొక పర్యాయం. దానికి ఇది ఉపోద్ఘాతం. Spirituality అని మనము పైన చెప్పిన ఇంగ్లీషు నిర్వచనం కంటె మన ఆధ్యాత్మిక లేక అధ్యాత్మ జ్ఞానం చాలా విస్తృతమైనది. భగవద్గీతనో, శ్రీభాగవతమునో ఇంగ్లీషులోనికి అనువదించాలంటే సందర్భమును బట్టి అనేక ఇంగ్లీషు పదాల అవసరం వస్తుంది. అధ్యాత్మ అనే పదానికి అన్నివిధములుగా అర్థంచెప్పుకోవచ్చు.

No comments:

Post a Comment

The Structure of the Universe (Vedic) - Viswaroopa - K. Sivananda Murty Preface 2

https://www.facebook.com/vallury.sarma/posts/616984388338978 The Puranas speak of individuals going up and down between these proximate...