Showing posts with label పదాల ముచ్చట్లు. Show all posts
Showing posts with label పదాల ముచ్చట్లు. Show all posts

Sunday, January 21, 2018

పద సంపద - ఈర్ష్యకు అసూయకు తేడా ఏమిటండీ?

https://www.facebook.com/vallury.sarma/posts/518025394901545

శబ్ద పల్లవములు - ఈ పదం ఎవరికైనా తెలుసా? నాకు నరసింహశర్మ గారు గుర్తుచేశారు. శబ్దము అంటే తెలిసినదే. పల్లవము అంటే అంకురము, చిగురు, మొలక, మోసు. ఈ పల్లవమనే పదాని సంస్కృత కవులు యువతుల వ్రేళ్ళకు, పెదవులకు ఉపమానాలుగా వాడుతారు. (దేహి పదపల్లవ ముదారమ్ --- జయదేవ అష్టపది). సంస్కృత పదాలు చిగురిస్తే తెలుగు క్రియా పదాలు పుడతాయి. ఇక్కడ ఇంచు అనేది అదనంగా వస్తుంది. కృశించు, వసించు, వర్షించు, సయించు, పల్లవించు, పుష్పించు, ఫలించు
నాకు చాలా రోజులు మిస్సమ్మ సినిమాలోని బృందావనమది అందరిదీ అనే పాటలో
బృందావనమది అందరిది గోవిందుడి అందరివాడేలే ...
రాసక్రిడల రమణుని గాంచిన ఆశలు మోసులు వేయవటే
ఎందుకె రాధ ఈ సునసూయలు అందములందరి ఆనందములే
చిన్నప్పుడు మోసులు అనేపదం అర్థం కాలేదు. హైస్కూలులో ఉండగా ఈ చిత్రం చూచాను. సునసూయలు అంటే ఏమిటి అనుకున్నాను. ఈసు అసూయ అని తెలియలేదు. ఈర్ష్య అసూయ సంస్కృత పదాలు. ఈసు అంటే ఈర్ష్యకు వికృతి అనీ తెలియలేదు. ఈ మోసు అనే పదంతో అనేక శబ్దపల్లవాలు సృష్టించవచ్చు. మోసులువారు, మోసులెట్టు మోసులిడు, .. కవి కోకిల దువ్వూరి రామిరెడ్డిగారు మోసిడు అని వాడారట.

1. ఈర్ష్యకు అసూయకు తేడా ఏమిటండీ?
2. మోసులు అన్న పదం సంస్కృతం కాదు కదా?

Vvs Sarma ఈర్ష్య = impatience with the success of others ఇతరుల విజయంపై విసుగు,
అసూయ = generally being discontented with displeased with the happiness of others. సంతోష కరమైన వాతావరణంలో అశాంతి, అసంతృప్తి ప్రదర్శించుట But often used for envy, jealousy
Vvs Sarma Mosulu is a pure telugu word often used only in plural.Suresh Kolichala చక్కగా వివరించారు. మరికొన్ని వివరాలు:

ఈర్ష్య- అన్నది ఋధ్- అన్న ధాతువుకు సంబంధించినది. ఋధ- అంటే పెరుగు, అభివృద్ధి చెందు. ఈ + ఋధ్ = ఈర్ష్య అంటే మూలార్థం అభివృద్ధి చెందాలనే కోరిక. చికీర్ష్య అంటే చేయనిచ్ఛ. జిహీర్ష్య కూడా అలాంటిదే.


-సూయము అంటే మూలార్థం ఫలరసాన్ని వెలికి తీయడం. వసూయ- అంటే వస్తువు (wealth) పై కోరిక. రాజసూయ యాగం రాజుల అభివృద్ధి కోసం చేసే యజ్ఞం. అసూయ envy అన్న అర్థంలోకి ఎలా మారిందో తెలియదు, కానీ, అనసూయ అంటే అసూయ లేనిది.

పల్లవించు అన్న అర్థంలో అచ్చ తెలుగు పదం మొలచు-. దీకిని నామవాచక రూపంగా 'మొలకలు' అనే కాకుండా 'మొలచులు' అని కూడా వాడేవారేమో అది కాస్తా మొలసులుగా, ఆపై మోసులు గా మారింది (మొగము > మోము అయినట్టుగా మొలసు > మోసు అవుతుంది).
https://www.facebook.com/vallury.sarma/posts/519534778083940
గ్రహము అంటే ఏమిటి? గ్రహము ముఖ్యార్థము గ్రహించడం,పట్టుకోవడం, అర్థంచేసుకోవడం, గమనించడం, గ్రహము అంటే పట్టుకునేది.అదే గ్రాహం.మొసలి. గ్రాహకుడు అంటే వినియోగదారు, customer అదే గ్రహణం. రాహువో,కేతువో పట్తుకుంటే సూర్య లేదా చంద్రగ్రహణం. చేయి పట్టుకుంటే పాణిగ్రహణం. ఉపసర్గలతో అనేకపదాలు వస్తాయి. అనుగ్రహము, ఆగ్రహము, విగ్రహము, నిగ్రహము, పరిగ్రహము,ప్రతిగ్రహము,సంగ్రహము. జ్యోతిషంలో నవగ్రహాలు అంటారు. కాని గ్రహాలు ఐదే - బుధ,కుజ, శుక్ర, గురు, శని. రాహు కేతువులు చాయాగ్రహాలు. అల్లుడు దశమగ్రహం - ముందు అమ్మాయి చేతినీ, తరువాత మామగారి పీకనీ పట్టుకోవచ్చు.గ్రహం అనే పదాన్ని తొమ్మిదికి సంకేతంగా వాడుతారు. దయ్యాలనుకూడా దుష్టగ్రహం, బాలగ్రహం అని వ్యవహారంలో ఉన్నది.గ్రహ స్థితి, గ్రహపాటు, (పురస్కార) గ్రహీత .


Suryanarayana Murthy Dharmala గ్రహము యొక్క భారీ విగ్రహాన్ని మన ముందుంచారు బాగుంది. భవిష్యత్తులో గ్రహాంతరవాసులకు కూడ పనికొస్తుంది ఈ వివరణ. వాళ్లకు ఒకవేళ మన తెలుగుభాష తెలియకపోతే అది వాళ్ల
గ్రహచారము. ఏదో గ్రహము అనే పదానికి ఒకటి రెండు పరసర్గలు చేర్చి చెబుదామన్న ప్రయత్నము తప్పవిడిచి నేను రాసేదాంట్లో పెద్దగా తాత్పర్యము వెదకొద్దని మనవి.
"పద సంపద" అనే శీర్షిక తో ఆచార్య శర్మగారందించిన లేఖనము అతి సుందరము, పదసంపదను సమృద్ధి చేయు ప్రశంసనీయ ప్రయత్నము.


Ramabrahmam Varanasi చంద్రుడు, రవి?

ఆదిత్యానామహం విష్ణుర్జ్యోతిషాం రవిరంశుమాన్|
మరీచిర్మరుతామస్మి నక్షత్రాణామహం శశీ|| 10-21 ||



Ramabrahmam Varanasi భగవద్గీత అలా చెప్పిందే అనుకోండి. కాని జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అవి రెండూ గ్రహములే కదా?!Vvs Sarma In fact this description is given by Sadguru Sivananda Murti garu. He in fact says that the 9 are called in common parlance grahas The sun and moon are jyotishas whose rays influence while the grahas influence through their positionRamabrahmam Varanasi ఏకమ్ సత్ విప్రాః బహుధా వదంతి!Ramabrahmam Varanasi ఏకమ్ సత్ విప్రాః బహుధా వదంతి!





పద సంపద



నుతజల పూరితంబులగు నూతులు నూరిటికంటె సూనృత
వ్రత యొక బావి మేలు... అనే నన్నయ్యగారి పద్యంలో చివరికి
ఒక సూనృత వాక్యము మేలు చూడగన్ అని వస్తుంది.
సూనృత వాక్యము అంటే సత్య వాక్యము అని సాధారణంగా అర్థం చెబుతారు. శ్రీరాముడు దశరథుని కుమారుడు, ఇండియాకు రాజధాని న్యూఢిల్లీ అని సత్యవాక్యాలు చెబితే యజ్ఞాలు చేసిన ఫలం వస్తుందా? సూనృత - అంటే సత్య - అనే పదాని కంటె ఎక్కువైనది. సత్య వలెనే అది సంస్కృత పదం. అర్థం వేరు. సూనృత = సు + ఋత అని అర్థం చెప్పుకోవచ్చు. ఋత నుండి వచ్చినదే ఋతువు. సృష్టిలో క్రమ బద్ధమైన ధర్మం ఋతం. సత్యంగా, ప్రియం కలిగించేలా, ధర్మ సమ్మితముగా చెప్పబడిన వాక్యము. ఇది జైన పారిభాషిక పదం. అక్కడ pleasant and true speech. అలాంటి ఒక వాక్యం చెప్పడం, వ్రాయడం కష్టమే.

Suresh Kolichala సూనృత - అంటే సత్య - అనే పదాని కంటె ఎక్కువైనది అని చక్కగా వివరించారు శర్మ గారు. భాగవతంలో పంచమ స్కంధంలో ఇరవయ్యమ ఆశ్వాసంలో 27వ వచనంలో ఋత, సత్య వ్రతాలను వేర్వేరుగా పేర్కోవడం గమనించవచ్చు.

తద్-వర్ష-పురుషా ఋతవ్రత-సత్యవ్రత-దానవ్రతానువ్రత-నామానో భగవంతం వాయ్వ
ాత్మకం ప్రాణాయామ-విధూత-రజస్-తమసః పరమ-సమాధినా యజంతే

(నా అనువాదం) ఆ ప్రాంతంలో ఋతవ్రత, సత్యవ్రత, దానవ్రత, అనువ్రత అను పేర్లతో ఉండే నాలుగు రకాల పురుషులు వాయువు రూపంలో భగవంతుని భజిస్తూ, ప్రాణాయామంతో, పరమ సమాధిలో తమ రజస్సును, తమస్సును తొలగించుకొందురు.

ఇక్కడ పేర్కొన్న ఋతవ్రత, సత్యవ్రత, దానవ్రత, అనువ్రతాలను గురించి వివరంగా తెలుపుగలరా?

ఈ పదం గురించి నేను కొంత చర్చించిన నా వ్యాసం ఈమాటలో చూడవచ్చు:
http://www.eemaata.com/em/issues/201305/2078.html

పదాల ముచ్చట్లు 4

దయ్యము అనే పదానికి అర్థము ఏమిటి?

https://www.facebook.com/vallury.sarma/posts/516747498362668

తెలుగు నిఘంటువు ప్రకారము ఈ పదానికి నాలుగు అర్థాలున్నాయి - దేవుడు, వేలుపు,విధి, పిశాచము. సామాన్యంగా వాడుకభాషలో దెయ్యము అంటాము. ఈ మాట ఎక్కడినుండి వచ్చింది? ఇది దైవము అనే సంస్కృతజన్య తత్సమ పదానికి వికృతి. దైవం అనే పదాన్నికూడా రెండు అర్థాలలో వాడతాం. ఇష్టదైవం కులదైవం అనేమాటలలో దేవుడనే అర్థం. దైవజ్ఞుడు అనేమాటలో దైవం అంటే విది అని అర్థం. దైవజ్ఞుడు అంటే జ్యోతిష్కుడు. జాతకరీత్యా కర్మ ఫలాన్ని (విధి వ్రాతను) చెప్పేవాడు. దైవజ్ఞుడు ముహూర్తంపెడతాడు కాని బ్రహ్మజ్ఞుడు కాదు. దయ్యము సోకింది అనే వాక్యములో ఒక పిశాచము ఆమెను ఆవహించింది అని అర్థము. దయ్యము పట్టుట, దయ్యమును వదలగొట్టుట అనే వాడుకలు కూడా ఉన్నాయి. ఈ వదలగొట్టడం చేసేవాడిని భూతవైద్యుడు అంటారు. మరి భూతము దయ్యము ఒకటేనా? భూతమనే సంస్కృతపదానికి ఎన్నో అర్థాలున్నాయి. ప్రాణికావచ్చు,పిశాచం కావచ్చు, పంచ భూతాలలో ఒకటి కావచ్చు. భూతాలున్నాయి, దయ్యాలో? ఎందుకు ఉండకూడదు? ఇంగ్లీషులో Ghost అనే పదం దీనికి సమీపం. కాని మంత్రులకు, ప్రముఖులకు Ghost writers ఉంటారు. వాళ్ళని దయ్యపు రచయితలు అనకూడదు, గుప్త రచయితలు అనవచ్చు. HolY Ghost దగ్గర ఇబ్బంది వస్తుంది. పవిత్ర దయ్యమని కాకుండా పరిశుద్ధ ఆత్మ అని వాడాలి. దయ్యాల సామెతలున్నాయి. దెబ్బకు దయ్యం వదులుతుంది. అలాగే దయ్యాలు వేదాలు వల్లించినట్లు అని కూడా ఒక ప్రయోగం ఉన్నది. వేదాలు అతి పవిత్రమయినవి. అలాంటి వేదాల్ని దెయ్యాలు వల్లిస్తుంటే ఎంత విచిత్రంగా ఉంటుందో అలానే అలాగే శబ్దార్థ జ్ఞానం లేనివారు వేదాన్ని వివరిస్తుంటే మనకు విచిత్రంగానే ఉంటుంది. దీనినే దెయ్యాలు వేదాలు వల్లించినట్లు అంటారు. దీనికి సరియైన ఇంగ్లీష్ సామెత కూడా ఉన్నది - "Devil quoting scriptures, Devil quoting the Bible. సైతాను ఏసును ఆకర్షించుటకు ప్రయత్నిస్తూ దేవుని వాక్యమును ఉదహరిస్తాడు. ఏమో కలికాలంలో దెయ్యాలు వేదాలూ వల్లిస్తాయేమో?

Friday, January 19, 2018

పదాల ముచ్చట్లు 2


ఈ రోజు National Science Day ఒక పోస్ట్ లో దానిని జాతీయ వైజ్ఞానిక దినంగా అనువదించారు. తల్లుల దినం, తండ్రుల దినం, ప్రేమికుల దినం అంటే ఆసమాసాలు ఎందుకో నాకు బాగుండవు. స్వాతంత్ర్య దినం,గణతంత్ర దినం అన్న పదాలు కొంత అలవాటయ్యాయి. అందుకు బాగానే వినిపిస్తాయి. విజ్ఞాన అనాలా, వైజ్ఞానిక అనాలా? ఇది రెండవ ప్రశ్న. విజ్ఞానము అంటే సైన్స్. వైజ్ఞానిక అంటే scientific. విజ్ఞాన దినం అంటే బాగుంటుందేమో. జ్ఞానానికి, అజ్ఞానానికి, విజ్ఞానానికి తేడాలు ఏమిటి? సుజ్ఞానము, యదార్థ జ్ఞానము, మిథ్యాజ్ఞానము అనే పదాలు కూడా దర్శనాలలో వస్తాయి. జ్ఞ అంటే తెలియుట,ఎరుక, తెలివి; తెలిసినవాడు జ్ఞాని, తెలియనివాడు అజ్ఞాని, తెలిసినదంతా సత్యంకాక పోవచ్చు,సత్యమని నిరూపింపబడిన జ్ఞానం యథార్థ జ్ఞానం. కానిది మిథ్యాజ్ఞానం. దానికంటె అజ్ఞానం నయం. అదే Ignorance is bliss. పరమాత్ముని గురించి చెప్పేది జ్ఞానం లేక సుజ్ఞానం. సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ అన్నట్లు.
విజ్ఞానమంటే లౌకిక లేదా ప్రపంచ జ్ఞానం. ఇది పూర్తిగా తెలియదు. వైజ్ఞానిక దృష్టి అంటే మనకు తెలిసిన భౌతిక ప్రపంచం గురించిన విజ్ఞానాన్ని మన పరిధిలో సత్యంగా నిరూపించడం. విజ్ఞాన శాస్త్రము చెప్పే సత్యాలు పరిపూర్ణం కాదు. ఇంతవరకు తెలిసిన తాత్కాలిక సత్యాలు. విజ్ఞానం ఎప్పటికీ సంపూర్ణం కాదు. కొంత తెలిసిన కొలదీ, తెలియనిది ఇంకా ఎక్కువ ఔతుంది.


We pray to God. It is not sufficient. One has to worship God, with or without a prayer ప్రార్థనకి, ఉపాసనకు తేడా ఏమిటి? భగవంతుడికి మన కోర్కెలు నివేదించడం ప్రార్థన. భగవంతుని అనుగ్రహం కోసం ఆయనను చేరుకోడం కోసం మనం చేసేది ఉపాసన. నిత్య షోడశోపచార పూజ, రుద్రాభిషేకం, సూర్య నమస్కారాలు, వ్రతాలు, శ్రవణ, మనన,నిధిధ్యాసనాదులు, జప తపాలు ఇవన్నీ ఉపాసనే అనుకోవచ్చును.

Thursday, January 18, 2018

Telugu/Sanskrit words for these gadgets

You may like to have Telugu/Sanskrit words for these gadgets
Cooker స్థాలీ, pressure cooker పీడన స్థాలీ
mixie లేహ్యకరి Lighter అగ్ని-శలాక Beater కవ్వము
wet grinder మర రుబ్బురోలు, laptop ఊర్వసి charger శక్తిపాతకరి
bean-bag కందులబస్తా recharge card పునఃశక్తిదాయి
vaccum cleaner శూన్యపీడన శుభ్రకరి



బ్రహ్మాండం - ఇటు బ్రహ్మ అటు అండం, Brahma’s Egg or Cosmic Egg. మార్తాండం - మృత అండం. సూర్యుడు. అండం అంటే గ్రుడ్డు. ఆ ఆకారంలోని వస్తువు సరియైన పదం తెలుగులోలేదు (Ellipsoid). బ్రహ్మము అంటే ఆకారము, అవధులులేని వస్తువు, నిరాకారం, నిర్గుణం,నిరంజనం, ఇది వేదాంతుల నిర్వచనం. అవతల జీవంలేనట్లు కనుపించి ఒకపక్షి లేదా ఇతర జీవుల జన్మకారణమైన పదార్థం అండం. పిల్లికి మార్జాలంలా అర్థంచెప్పుకోవాలంటే అంబోజసంభవాండం. బ్రహ్మసృష్టించిన అండాకారముగల ఒక వస్తువు. మనం వేంకటేశ్వరస్వామిని అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు అంటాం. బ్రహ్మ సృష్టించకముందు బ్రహ్మాండం లేదా అంటే ఉన్నది. ఎక్కడ? మహా విష్ణు గర్భంలో. అందుకే ఆయనను జ్యేష్ఠుడు, ప్రజాపతి, హిరణ్యగర్భుడూ అన్నారు. ఆయన ఎక్కడ ఉంటాడు? బ్రహ్మాండానికి అవతల. మనం ఉండేది లోపల. ఆ బైట ఉన్నదే క్షీరసాగరం. (Milky way galaxy) అనుకోవచ్చును. ఆ బ్రహ్మాండములోపలే 14 భువనాలు ఉన్నాయి. అసురులున్నారు. సురలున్నారు. పితృదేవతలున్నారు. భూతగణాలన్నీ ఉన్నాయి. నాగులు ఉన్నారు. పాతాళాది అధోలోకాలలో జీవులు ఉన్నారు. బ్రహ్మాండం బద్దలై సృష్టిజరగలేదు. అలాఉండగానే సృష్టి జరిగింది. కాని బ్రహ్మాండం పెరుగుతోన్నది. (Expanding Universe) మనం ఉన్న బ్రహ్మాండం ఒకటే కాదు. అనేక బ్రహ్మాండాలున్నాయి. (Modern Cosmology లో Milky Way యే కాక Andromeda వంటి అనేక గెలాక్సీలు ఉన్నట్లు). ఈ నిర్గుణ బ్రహ్మవస్తువే కాక మహవిష్ణువు నాభికమలం నుండి పుట్టిన ప్రతి సృష్టిచేసే చతుర్ముఖ బ్రహ్మ ఉన్నాడు. ఆయన ముఖం నుండి పుట్టిన రుద్రుడున్నాడు. విష్ణు సహస్రనామము చూస్తే అందరీ నామాలు అందరికీ అన్వయమౌతాయని తెలుస్తుంది. ఈ బ్రహ్మాండ రచనను గురించి చెప్పడానికి వ్యాసుడు బ్రహ్మాండ పురాణమే చెప్పాడు. బ్రహ్మవైవర్తమని ఇంకో పురాణం ఉంది. (సశేషం)

The Structure of the Universe (Vedic) - Viswaroopa - K. Sivananda Murty Preface 2

https://www.facebook.com/vallury.sarma/posts/616984388338978 The Puranas speak of individuals going up and down between these proximate...