Showing posts with label Games Theory. Show all posts
Showing posts with label Games Theory. Show all posts

Thursday, January 25, 2018

క్రీడాశాస్త్రము Game Theory

https://www.facebook.com/vallury.sarma/posts/566582826712468

మీరు దీనిపేరు విన్నారా! క్రీడ అంటే క్రికెట్, ఫుట్ బాల్ వంటివేకాదు. మూడు ముక్కల పేకాట కూడా ఆటే. కనీసం ఇద్దరు ఆటగాళ్ళుంటే కాని ఆట లేదు.కంప్యూటర్ గేమ్ Free Cell వంటివి ఆటలే.ఎందుకంటే రెండవ ఆటగాడు కంప్యూటర్. కాని దీని శాస్త్రమునకు చాలా ప్రాముఖ్యత ఉంది. ఇది గణిత శాస్త్రంలో అంతర్భాగం. అందుకే ఆర్ధిక శాస్త్రంలో కూడా. ఎకనామిక్స్ లో నోబెల్ బహుమతిపొందిన వాళ్ళలో ఈ శాస్త్రజ్ఞులు కూడా ఉన్నారు. e - కామర్సులో ఇవి ముఖ్యాంగం. వ్యాపారం అంటే కొనేవాళ్ళు అమ్మేవాళ్ళ మధ్య ఆట. క్లబ్బులలో పేకాట ఆడతారు.పేకమేడలు వంటి నవలలే వచ్చాయి. ప్రతిఆటలోనూ కొందరకు డబ్బుపోతుంది. ఒకరికి వస్తుంది. మిగిలిన అందరికీ పోయినడబ్బు నెగ్గిన ఒకరికి వస్తుందా వస్తే మంచిదే. అది zero sum game. కాని ప్రతిఆటలో డబ్బువచ్చేవాడు ఒకడు ఉంటాడు. వాడిని గమనించము వాడు క్లబ్బు ఓనరు. స్వతంత్ర్య పోరాటము ముఖ్యంగా హిందువులు బ్రిటిష్ వారి మధ్య జరిగినది మధ్యలో గెలిగిన కోతి జిన్నా. గెలిచి కూడా ఓడినది భారత్. .
ఇప్పుడు ఆంధ్రదేశములో జరుగుతున్నది ఇటువంటి ఆటే సీమాంధ్రులు ఒకవైపు, తెలంగాణావారు ఒకవైపు. ఈ ఆట శతాబ్దంకాలం నుండి జరుగుతున్నది. ఇంతకు ముందు ఈ ఆట తమిళులు ఆంధ్రుల మధ్య మద్రాసులో జరిగినది. ఆంధ్రులు సీమ వారు, తీరంవారు. వీరిలోపల తాత్కాలిక ఒడంబడికలు జరిగాయి. (కాని వీరు నిజానికి ఇద్దరు ఆటగాళ్ళు ) ఇప్పుడు హైదరాబాదు, ఢిల్లీలలో జరుగుతున్నఆట రాజ్య విభజన. నష్ట పోయినది పోతున్నది ఇరు ప్రాంతాల వారూ. బాగు పడేది రిఫరీ కాంగ్రెస్ పార్టీ, కనుపించని ఆటగాడు తమిళుడు (వాళ్ళ కెప్టన్ చిదంబరం). తమిళ నాడు దక్షిణదేశంలో అతిపెద్ద, ముఖ్యమైన రాష్ట్రం కానుంది. తమిళం రెండో నేషనల్ లాంగ్వేజ్ అయినా ఆశ్చర్య పడక్కరలేదు.

The Structure of the Universe (Vedic) - Viswaroopa - K. Sivananda Murty Preface 2

https://www.facebook.com/vallury.sarma/posts/616984388338978 The Puranas speak of individuals going up and down between these proximate...