Friday, January 19, 2018

నాటి మహాభారతం - నేటి అవినీతి భారతం అన్న శీర్షిక PART2








న్యాయం, తర్కం, వాదం
నేను నాటి మహాభారతం, నేటి అవినీతి భారతం మీదవ్రాస్తున్న విషయాలు న్యాయ, తర్క, హేతువాద దృష్టితో వ్రాస్తున్నాను. ఇంగ్లీష్ లో చెప్పాలంటే Logic based Reasoning or rational view. ఒక వాక్యము సత్య వాక్యమా? లేదా అది సత్యానికి యెంత దూరం? ఇది చూచుకొని వ్రాయడానికి ప్రయత్నిస్తున్నాను. ఉదాహరణకు రెండు తెలుగు వాక్యాలు ఇస్తాను. ఇవి సత్యమోకాదో పరిశీలిద్దాము. దీనినుండి ఇంతకంటె సత్యానికి చేరువగా ఉండే పదాలతో కొత్త వాక్యములను వ్రాయడానికి ప్రయత్నిద్దాము. 1. భీమరావు అంబేద్కరు దళిత వర్ణస్తుడు. 2. నేటి భారతదేశ మహారాణి శ్వేతజాతీయురాలు. నా దృష్టిలో ఈ రెండు వాక్యాలూ పూర్తి అసత్యాలు. మరి ఐతే వీటిని సత్యవాక్యాలుగా ఎలా వ్రాయవచ్చును? రేపు చూదాం.

నిన్న న్యాయము, తర్కము, వాదము అనే పదాలను గురించి చెబుతూ ఈవాక్యముల సత్యాసత్యములు గమనించమని అన్నాను.
1. భీమరావు అంబేద్కరు దళిత వర్ణస్తుడు.
2. నేటి భారతదేశ మహారాణి శ్వేతజాతీయురాలు.
మొదటి వాక్యము అసత్యము. ఎందుకంటే మన వర్ణవ్యవస్థలో దళితవర్ణము అనేది లేదు. పోనీ భీమరావు అంబేద్కరు దళితుడు అందామా అంటే అదీ అసత్యమే.ఆయన జీవితకాలంలో ఆ పదమే వాడుకలో లేదు.ఆయన బ్రతికి ఉంటే ఆపదాన్ని ఎప్పటికీ ఒప్పుకుని ఉండేవారు కాదు. భీమరావు అంబేద్కరు హరిజనుడు అన్నదికూడా అసత్యమే. అసలు గాంధీగారితో ఆయనకు విభేదం వచ్చినది ఆ పదం మీదనే. "అగ్రవర్ణాలవారు హరిజనులు కారా? వారు రాక్షస జనులా?" అది వారి ప్రశ్న. మాపై జాలితో అలాంటి పదాలు సృష్టించవద్దని వారి వాదం. ఆయన తనని తాను ఎలా వర్ణించుకొని ఉండేవారు. భీమరావు అంబేద్కరు శూద్రుడు అంటే ఆయన ఒప్పుకొనేవారు. ఆవర్ణంలోని ఉపకులం మహార్ ఆయన కులం.ఆయన "Who were the Shudras? - How they came to be the Fourth Varna in the Indo-Aryan Society" "శూద్రులు ఎవరు? ఎందుకు వారు భారతీయ ఆర్యసమాజములో నాలుగవ వర్ణముగా ఎందుకు పరిగణింపబడ్డారు?" అనే తన 1946లో ప్రచురింపబడిన పుస్తకములో తన కులమైన మహర్లు పూర్వము బౌద్ధులనీ, ఆమతమును వదలుకొనుటకు ఇష్టములేక హిందూ సమాజమునకు విడిగా జీవించారనే వాదనను ప్రతిపాదించారు.
దళిత పదం జయదేవ కవి దశావతార వర్ణనలోవాడిన పదం.
తవ కరకమల కరే నఖమద్భుత శృంగం | దళిత హిరణ్యకశిపు తను భృంగం
కేశవ ధృతనరహరి రూప జయ జగదీశహరే
రెండవ వాక్యము అసత్యము. దాని వ్యతిరేక వాక్యము కూడా అసత్యమే. నేటి భారతదేశ మహారాణి శ్వేతజాతీయురాలు కాదు. ఈ వాక్యము కూడా అసత్యమే. ఎందుకంటే నేటి భారత మహారాణి అన్నది శశ విషాణం (కుందేటి కొమ్ము), వంధ్యా పుత్రుడు, గగన కుసుమం వంటిదే. కాని సాహిత్యములో రూపకాలంకారంగా భావిస్తే ఆవాక్యము చెప్పే సత్యం భావనలోకి వస్తుంది.

క్రైస్తవ మత ప్రచారకుల వ్యూహమే వేరు. ఒకనాడు అస్పృశ్యతను చూపించి హరిజనులను, క్రీస్తు జనులుగా మార్చారు. ఇప్పుడు ఎప్పుడూ దళితులలోనే అసమానత ఉన్నది. ఇప్పుడు మహానాడు, దండోరాలపేరుతో వచ్చిన విభజన కుల నామాల పేర్లతో ఉన్నది. దానినికూడా చర్చి ఉపయోగించుకున్నది. ఒక చర్చి ఒకవర్గాన్ని ప్రొటస్టెంటులుగా మారిస్తే, మరియొక చర్చి ఇంకొక కులాన్ని కాథలిక్కులుగా మార్చింది. ఆ రెండు వర్గాల సమస్య వెనుక ఆరెండు చర్చిల సహకారం ఉంటుంది. మతమార్పిడితో హరిజన నామము నిరర్థకమైనది. శాశ్వత అసంతృప్తి, ఒక రకమైన, న్యూనతాభావం కారణంగా దళితనామము స్వీకరించారు. మత మార్పిడి కులాలను లేక సామాజిక వర్గాలను అధిగమించలేదనే పేరుతో దళిత క్రైస్తవులు, అన్య కులాల పేర్లతో కమ్మ క్రైస్తవులు, రెడ్డి క్రైస్తవులు, బ్రాహ్మణ క్రైస్తవులు అనే వర్గాలను సృష్టించారు. ఇది ఒక ఆధునిక మహాభారత యుద్ధమే (Crusade, is how they describe) ఒక వర్గానికి ధన బలం, అంగ బలము ఉన్నాయి. రెండవ వర్గానికి యుద్ధం జరుగుతున్న స్పృహకూడా లేదు. వ్యక్తులకు స్పృహ ఉన్నా సంస్థాగతమైన వ్యవస్థ లేదు.
అంబేద్కరు హిందూమతానికి, సనాతన ధర్మానికి, సమాజంలోని దురాచారాలకూ మధ్యగల భేదాన్ని అధ్యయనం చేయలేదు. కేవలం తన అనుభవాల దృష్ట్యా హిందూమతాన్ని వదిలేయాలని నిశ్చయించుకొని ఇతరమతాలను లోతుగా అధ్యయనం చేశాడు. అందుచేత బుద్ధుని తర్కమును, శంకరుడు జయించాడన్న విషయాన్ని ఆయన పరిగణనలోకి తీసుకో లేదు. కాని దీనికి ఆయనను తప్పు పట్టలేము.

భారతచరిత్రలో అనాదినుండీ జరుగుతున్నవి విదేశీ దండయాత్రలు. అలెక్సాండర్, ఇతర గ్రీకులు, శ్వేతహూణులు, యవనులు, ఇలా అందరోవచ్చి వాయువ్యభాగాన్ని వశం చేసుకుంటూనే ఉన్నారు. అప్పటికి అబ్రహాం (ఇబ్రహీం) మతాలు పుట్టలేదు. మన దేశాన్ని పాలించిన వారిలో ధర్మ పరంగా మెనాండర్-1, కనిష్కులను గుర్తుంచుకోవచ్చును. వారిద్దరూ బౌద్ధులుగా మారి వాయువ్యభాగంలో గాంధారం వరకు బౌద్ధాన్ని భద్రపరిచారు. మెనాండర్ ని మనవాళ్ళు మిళిందుడు అని పిలిచేవారు. అతని రాజధాని సకల (నేటి సయాల్ కోట్, పాకిస్తాన్) ఆయనతో బౌద్ధ సన్యాసి నాగసేనుడు చేసిన చర్చలు మిళిందపన్హా (పాళీ, మిళింద ప్రశ్న) అనే బౌద్ధగ్రంధంగా రూపు దిద్దుకున్నాయి. ఎంతోకాలం చర్చించాకే మిళిందుడు బౌద్ధం స్వీకరించాడు. రెండువేల ఏళ్ళనాటి విధానాలు చూస్తే మనం ఈరోజు ఎక్కడ ఉన్నామా? అనిపిస్తుంది. ఒక ఉదాహరణ:-- మిళిందుడు - ఆచార్యవర్యా, నాకు తమతో చర్చించాలని ఉన్నది. నాగసేనుడు- ఆర్యా, మహారాజా - చాలా సంతోషం. తమరు నాతో మహారాజుగా చర్చిస్తారా? లేక మనము ఇద్దరమూ సత్యాన్వేషకులుగా చర్చిద్దామా? మిళిందుడు - ఏమిటి మీ సందేహం? తేడా ఏమిటి? నాగసేనుడు - తమరు మహారాజుగా చర్చిస్తానంటే నాకు చాలా తేలిక . తమరు ఒక ప్రతిపాదన చేస్తే, నేను అది చాల అద్భుతంగా ఉంది అంటాను. అప్పుడు చర్చ ముగుస్తుంది. తమరు చెప్పినది వ్యతిరేకిస్తే ఏమౌతుందో నాకు తెలుసు.మీరు ఉన్నతమైన సింహాసనం మీద, నేను ఇక్కడ క్రింద కూర్చుని సభలో చర్చిస్తే సత్యము కనుపించదు. మనము ఇద్దరము విడిగా ఒక న్యాయవేత్త సమక్షములో పరస్పరము ఎదురుగ కూర్చుని వాదిస్తే సత్య నిరూపణ తేలిక ఔతుంది. దానికి మిళిందుడు అంగీకరిస్తాడు. వారి సంభాషణలే ఆగ్రంధం. అది రెండు వేలఏళ్ళనాటి రాజరికం.
నేటి పరిస్థితి. రాష్ట్రశాసన సభ ఎన్నికల అనంతరము సమావేశమైనది. అధిక సంఖ్యాకుల పార్టీ తమ నాయకుడిని ఎన్నుకోవాలి. విధానం అందరూ డిల్లీ వెళ్ళడం. అక్కడ పార్టీ అధిష్ఠానం (అంటే పార్టీ నియంత) ఎన్నుకోవలసిన ఒక వ్యక్తిని సూచించడం. అది నేటి ముఖ్యమంత్రి ఎన్నిక. దీని పేరు పార్లమెంటరీ ప్రజాస్వామ్యం.
తరువాత ప్రపంచ చరిత్రలో ముఖ్య ఘట్టం క్రైస్తవ మతం స్థాపన, తరువాత కొన్ని శతాబ్దాలకి ఇస్లాం ఆవిర్భావం. మనకు మొదట ముఖ్యంగా దండయాత్రలతో వచ్చినది ఇస్లాం. తరువాత వ్యాపారం ముసుగుతో వచ్చినది క్రైస్తవం. గత వేయి సంవత్సరాల భారత చరిత్రలో పరస్పర విరుద్ధమైన ఇస్లాం, క్రైస్తవ, హిందూ, జైన బౌద్ధ మతాల ప్రయాణమే, నేటి భారత, పాకిస్తాన్, బంగ్లా, నేపాల్, సింహళ దేశాల ప్రస్తుత చరిత్ర. ఈ నేపధ్యంలోనే శిఖ్ఖుమతం, భక్తి మార్గం, అద్వైతమాదిగా గల వేదాంత మతం పుట్టాయి.


మనదేశంలో ఆవిర్భవించకపోయినా వేయి సంవత్సరాలనుండి ఇస్లాం, 500 సంవత్సరాలనుండి క్రైస్తవమతం మన చరిత్రను ఎంతో ప్రభావితం చేశాయి, చేస్తున్నాయి. దానిని అర్థంచేసుకోవాలంటే అవి ప్రపంచములో 60 శాతం జనంలో ఎలా వేళ్ళూనాయో తెలుసుకోవడం అవసరం. అవి ఒకే కుదుటిలోనివైనా ఆ రెండుమతాల మధ్య్యా బహుకాల సంఘర్షణ కూడా ఉన్నది. అది నేడు విశ్వవ్యాప్తమైన ఉగ్రవాదం మీద పోరులో కూడా అనుమానాలకు దారి తీస్తూంది. 20వ శతాబ్దంలోని దేశ విభజన, భాషా రాష్ట్రాల ఏర్పాటనే విఫల ప్రయోగం, త్రిభాషా సూత్రం అనే ప్రమాదకారి యైన విద్యారంగ నిర్ణయం, అనవసరంగా హిందీని రాష్ట్రభాషగా చేసిన రాజ్యాంగం, 21వ శతాబ్దంలో ఐలయ్యలాంటి వాళ్ళు కలలు కంటున్న హిందూమతానంతర భారత దేశ స్వప్నం, ఈ శతాబ్దములోనే తెలుగు మృతభాషగా మారిపోతుందన్న యునెస్కో అనుమానం, ప్రపంచీకరణ, ప్రపంచము ఒక కుగ్రామం (globaliation, concept of global village) అనే అసత్యాల, అర్ధ సత్యాల ప్రచారం, ఇలా ఎన్నో పరిణామాలు మన నేటి దుస్థితికి కారణం. ముహమ్మద్ ప్రవక్త (సా.శ. 570-632) జీవితకాలంలోనే ఇస్లాం అరేబియా అంతావ్యాపించింది. తరువాత 100-120 సం.లలో అట్లాంటిక్ తీరమైన స్పెయిన్ దేశంనుండి, మధ్యధరా తీర దేశాలు, మధ్య ఆశియా, భారతదేశంలో సింధు, పంజాబ్ వరకు మహమ్మదీయ రాజ్యాలు ఏర్పడ్డాయి. (Arab or Islamic conquests).
ఆనాటి వాయువ్య భారతదేశంలోని ఖైబర్ కనుమ (khyber pass) భారత్ పై దండయాత్రలకు రాజమార్గం. అలెక్సాండర్, జెంఘిజ్ ఖాన్, ఘజనీ మహమ్మద్, ఘోరీ మహమ్మదు, బాబర్, తైమూర్, అందరిదీ ఇదే మార్గము. దీనిని కాపాడుకోవాలనే సామాన్య ఆలోచన కాని వ్యూహం కాని మన స్థానీయ రాజులు చేయలెదు. ఒకే ఒక సారి 1798లో మహారాజా రంజిత్ సింగ్ దీనిని వశపరచుకోగలిగాడు.కొన్నాళ్ళు అది భారతీయ సిఖ్ఖు రాజుల చేతికి వచ్చింది.
బోలన్ కనుమ (Bolan pass) బెలూచిస్తాన్, ఆఫ్గనిస్తాన్ సరిహద్దులలో ఉంది. క్వెట్టా నగరం నుండి శిబి,జాకొబాబాద్ అనే నగరాల మధ్య మార్గం లో ఉంటుంది. ఇది సింధు రాష్ట్రంపై అరేబియ దండయాత్రలకు మార్గం. శిబి నగరం పేరు ఆనాటి హిందూ చరిత్రను గుర్తుకు తెస్తుంది. 1960లలో అక్కడ 10 శాతం హిందువులుండేవారు. 2012లో వారి పరిస్థితులు దయనీయంగా ఉన్నట్లు వార్తలు వచ్చినా, వాటిని పట్టించుకునే నాథుడు లేడు.
ఈ రెండు మార్గాలు అరబ్, టర్కిష్ మొదలైన ఇస్లాం విజయాలకు మార్గాలైతే మూడో మార్గం అరేబియా సముద్రం. వీరు అరబ్ వ్యాపారులు. అరబ్ వ్యాపారులైనా, పోర్చుగీస్ వ్యాపారులైనా కూడా మతప్రచారకులుండే వారు. వీరి ప్రచార ప్రభావం ఎక్కువ కేరళ పై పడినది. కేరళలోని మలబార్ జిల్లా వీరికేంద్రం. వీరిని మాప్పిళ్ళ (Moplah) అంటారు. గాంధీగారి ఖిలాఫత్ ఉద్యమం భయంకర పరిణామాలు కేరళలో హిందువుల రక్తపాతానికి దారి తీశాయి. వ్యాపారం పేరుతో ఇండియాకు సముద్రమార్గం కనుగొనే ప్రయత్నంలోకూడా మతప్రచారం లక్ష్యం ఉన్నదనే సత్యాన్ని కొలంబస్ లేఖ నిరూపిస్తుంది. మధ్య ఆశియా భూమార్గం ముస్లిముల అధీనమయింది.
(From, The World is Flat , Thomas L Friedman) Letter of Columbus
Your Highnesses, as Catholic Christians, and princes who love and promote the holy
Christian faith, and are enemies of the doctrine of Mahomet, and of all idolatry and
heresy, determined to send me, Christopher Columbus, to the above-mentioned countries
of India, to see the said princes, people, and territories, and to learn their
disposition and the proper method of converting them to our holy faith; and
furthermore directed that I should not proceed by land to the East, as is customary,
but by a Westerly route, in which direction we have hitherto no certain evidence that
anyone has gone.
- Entry from the journal of Christopher Columbus on his voyage of 1492


ఘజనీ, ఘోరీ మహమ్మదుల దండయాత్రల తరువాత ఢిల్లీ అనేక ముస్లిం రాజవంశాల పాలనలో ఉన్నది. పరిపాలకుని ఢిల్లీ సుల్తాన్ అనేవారు (Delhi Sultanate). వీరి పరిపాలన 1206-1526 వరకూ ఉన్నది. ఘులాం, ఖిల్జీ, తుగ్లఖ్, సయ్యీద్, లోడీ వంశాలు. వీరుచేసిన ధర్మ విధ్వంసం మరపురానిది. మనం కొన్ని ముఖ్యమైన స్థలాలను మాత్రం గుర్తుకు తెచ్చుకుందాం. బౌద్ధుల విశ్వవిద్యాలయాలు - నలంద, విక్రమశిల. హిందువుల దేవాలయాలు, అసంఖ్యాకాలు. ఉదాహరణకు, సోమనాథ్, మథుర, కాశీవిశ్వనాథ్, మనకు సమీపంలో వరంగల్లు వేయిస్తంభాల ఆలయం. నలందా భారత దేశ ప్రాచీన విశ్వవిద్యాలయం. నలందా అంటే జ్ఞానాన్ని ఇచ్చేది అని అర్ధం. గుప్తుల కాలంలోనే ఇది నిర్మింపబడింది. సుమారు సా.శ. 500నాటికే బహుళ ప్రచారం చెందినది. సుమారు 800 సంవత్సరాలు భారతీయ విజ్ఞానాన్ని, వేదాంతాలను ప్రపంచమంతా వ్యాపింపచేసినది. 1193లో నలందా విశ్వవిద్యాలయాన్ని, భక్తియార్ ఖిల్జీ నాయకత్వములో తురుష్క సేనలు దండెత్తి కొల్లగొట్టాయి. ఈ సంఘటన భారతదేశములో బౌద్ధం యొక్క క్షీణతకు మైలురాయి. 1235లో టిబెట్ అనువాదకుడు ఛాగ్ లోట్స్వా నలందను సందర్శించినపుడు కొల్లగొట్టబడి జీర్ణవస్థలో ఉన్నప్పటికీ కొద్దిమంది బౌద్ధ భిక్షువులతో పనిచేస్తూ ఉన్నది. గణితము, ఖగోళశాస్త్రము, రసాయన శాస్త్రం మొదలగు శాస్త్రాలలో ప్రాచీన భారతీయ విజ్ఞానము అకస్మాత్తుగా అంతరించిపోవడానికి నలంద విశ్వవిద్యాలయ నాశనము కారణమని చరిత్రకారులు భావిస్తారు. టిబెట్, చైనా, కొరియా, జపాన్, మంగోలియా, టర్కీ, ఆగ్నేయ ఆశియా,సింహళం వంటిదేశాలనుండి విద్యార్థులు వచ్చేవారు. సా. శ. 1200 నాటికీ తూర్పున ఈ విద్యాలయాలు నశిస్తే, పశ్చిమాన ఇటలీ లోని బొలోనా, ఇంగ్లండ్ లోని ఆక్స్ ఫర్డ్ అదే సమయంలో ప్రారంభమయ్యాయి. 2010లో అంతర్జాతీయ సహకారంతో నలందాలో, ప్రాచీన నలందా శిధిలాలకు 10 కి.మీ. దూరంలోని రాజగిరి (బీహార్) లో Nalanda University ని స్థాపించారు. ఇది మనదేశ ప్రస్తుత వాతావరణంలో ఏస్థాయికి వస్తుందో వేచిచూడాలి. కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉండడం వలన ఆశలు నిజమయ్యే అవకాశం ఉన్నది. The Nalanda University 2010 act ప్రకారము దీని లక్ష్యం pursuit of intellectual, philosophical, historical and spiritual studies. మతం అన్నపేరే మనకు భయావహం.
నలందాతోబాటుగా విధ్వంసంచేయబడిన ఇంకొక బౌధ్ధవిద్యాలయం విక్రమశిల విద్యాలయం. ఇది భాగల్పూర్ సమీపములోనే ఉండేది. ఇదికూడా భక్తియార్ ఖిల్జీయే 1200లో నాశనంచేశాడు. ఇది సుమారు సా.శ. 800 ప్రాంతాలలో నిర్మింపబడింది. బెంగాల్ ను పరిపాలించిన పాల వంశము రాజులు దీనిని స్థాపింఛారు. వారు బౌద్ధులు. అదే సమయములో కామరూపను (అసోం) హిందువులైన పాలవంశపురాజులు పాలించారు. వారి పూర్వికుడుగా వారు నరకాసురుని చెప్పుకుంటారు. ఇది అసోం చరిత్రలో భాగం. నరకుని రాజధాని ప్రాగ్జ్యోతిషపురం కామరూపదేశానికి పూర్వరాజధాని. ఇప్పుడు ఇది గువాహతీ సమీపంలోని జాతియా అనే ప్రాంతం. 
   
ఆనాడు కాకతీయులపై దండయాత్రలు చేసినవారు ఖిల్జీలు, తుగ్లక్లు. వేయి స్తంభాలదేవాలయాన్ని వారే ధ్వంసం చేశారు. కాజీపేట స్టేషన్ సమీపములో నేను చూచిన ఒక సమన్వయ దృశ్యం. కాకతీయ కళా తోరణం నమూనాపై ఏసుక్రీస్తు విగ్రహం, ఒక క్రైస్తవ ఆలయ పాఠశాల ముఖద్వారం!


No comments:

Post a Comment

The Structure of the Universe (Vedic) - Viswaroopa - K. Sivananda Murty Preface 2

https://www.facebook.com/vallury.sarma/posts/616984388338978 The Puranas speak of individuals going up and down between these proximate...