https://www.facebook.com/vallury.sarma/posts/562957263741691
https://www.facebook.com/vallury.sarma/posts/563687410335343
https://www.facebook.com/vallury.sarma/posts/564352846935466
అయోధ్య శ్రీరాముని రాజధాని.జన్మభూమి. నాడు (ఉత్తర) కోసల దేశానికి ముఖ్యనగరం. సూర్య వంశీయులు బహుకాలం పాలింఛారు. 400 ఏళ్ళనాడు బాబర్ సేనాని మీర్ బాకీ ముఖ్య దేవాలయాన్ని ధ్వంసంచేసి మసీదుకట్టాడు. అది జన్మభూమి మసీదు అనే వ్యవహారింపబడేది. లక్నో ఉత్తర ప్రదేశ ముఖ్య పట్టణం. లక్ష్మణునిచేత నిర్మింపబడిన లక్ష్మణపురి అది. లఖనపురి, లఖనవూ, లక్నో. బహుకాలం నవాబుల పాలనలో ఉంది. అయోధ్య ఫైజాబాద్ జిల్లాలోది. రామజన్మభూమికి కొద్దిమంది సన్యాసుల యాత్రను ములాయం, అఖిలేష్ ల ప్రభుత్వం అడ్డుకుంటూంది. ఇది లేని సమస్యను సృష్టించడం. అయోధ్యలో ఇదివరకు కరసేవకులపై ములాయం సర్కారు విచక్షణా రహిత కాల్పులు తెలిసినవే. దాని పరిణామాలు కూడా అందరికీ తెలుసు.రామ లక్ష్మణులను రెండు రాష్ట్రాలలో ఉంచడం క్షేమం. శ్రీరాముని దయచేతను ఉత్తరప్రదేశ్ కు విభజన తక్షణ అవసరం.
Krishna Mohan Mocherla .రామ లక్ష్మణులను రెండు రాష్ట్రాలలో ఉంచడం క్షేమం

Krishna Mohan Mocherla ఉత్తరప్రదేశ్ కు విభజన తక్షణ అవసరం. .రామ లక్ష్మణులను రెండు రాష్ట్రాలలో ఉంచడం క్షేమం
Satyanarayana Piska "ఉత్తరాఖండ్" ఆవిర్భవించినది ఉత్తరప్రదేశ్ విభజన వల్లనే కదా!
శ్రీరాముని తరువాత అయోధ్యను ఎవరు పాలించారు?
ఈ ప్రశ్నకు సమాధానం కాళిదాసు రఘువంశంలోనే దొరుకుతుంది. శ్రీ రాముడు తన అవతార సమాప్తికి ముందే తన కుమారులైన కుశ లవులకు, తమ్ములకుమారులకు చిన్న చిన్న రాజ్యాలు ఇచ్చాడని చూచాము. వారంతా రాముడు జీవించియుండగానే ఆ యా రాజ్యాల పాలనను స్వీకరిస్తారు. అందులో కుశునికి కుశావతి అనే నగరం కేంద్రముగా చిన్న రాజ్యం లభిస్తుంది. ముందు లక్ష్మణుడు తరువాత శ్రీరాముడు తమ మానవదేహాలను త్యజించి వైకుంఠవాసులౌతారు. అయోధ్యానగర పౌరులు అనేకులు కూడా శ్రీరామునితోబాటుగా సరయూనదిలో జలప్రవేశం చేస్తారు. అయోధ్య కళావిహీనమౌతుంది. కొంతకాలానికి కుశావతిలో రాజభవనంలో నిద్రిస్తున్న కుశునికి ఒక రాత్రి ఒక కల వస్తుంది. అయోధ్యానగర అధిదేవత దర్శనము ఇచ్చినది. అయోధ్యకు తిరిగివచ్చి పాలనను చేపట్టమని, పూర్వవైభవం చేకూర్చమని ఆదేశిస్తుంది.
ఆమెకోరికను శిరసావహించి కుశుడు అయోధ్యకు తిరిగి వస్తాడు. సింహాసనం అధిష్ఠిస్తాడు. కొన్ని రోజులలోనే అయోధ్య తిరిగి కళకళలాడుతుంది. ప్రజలు ఆనందంగాఉంటారు. ఒక దినం కుశుడు సరయూనదిలో జలక్రీడలు సలుపుతుండగా అతడి కేయూరమనే ఆభరణం నదిలో పడిపోతుంది. వెదకినా దొరకదు. ఆనదిలో నివాసం ఏర్పరచుకున్న నాగవంశీయుడు కుముదుడు ఆ ఆభరణాన్ని తీసి ఉంటాడని అనుమానించి కుశుడు అస్త్రప్రయోగం చేయబోతాడు. కుముదుడు ఆభరణంతో నది వెలుపలికి వాచ్చి తాను కేవలం కుతూహలంతో దానిని తీసినట్లు చెబుతాడు. తరువాత తన సోదరి కుముద్వతిని వివాహంచేసుకొమ్మని అడుగుతాడు. కుశుడు అంగీకరించి ఆమెను తన రాణిగా చేసుకుంటాడు. వారికి అతిథి అనే కుమారుడు కలుగుతాడు. కుశుని తరువాత అతడు అయోధ్యను పాలిస్తాడు.. గొప్ప రాజనీతికోవిదుడు. కాని దుర్జయుడనే అసురునిచేతిలో మరణిస్తాడు.
తరువాత 21 రాజుల పేర్లు రఘువంశం చెబుతుంది. 21వ తరము రాజు సుదర్శనుడు. అతడికుమారుడు అగ్నివర్ణుడు. స్త్రీలోలుడు. క్షయ వ్యాధితో మరణిస్తాడు. తరువాత ఆవంశంలో గుర్తుంచుకోవలసిన వారులేరు. మహాభారత కాలంలో వారి వంశీయుడు కౌరవులతరఫున యుద్దంచేసి మారణిస్తాడు. అయోధ్య సప్త పుణ్యనగరాలలో ఒకటిగా కీర్తి పొందింది. బాబరు అయోధ్యపై దాడిచేసిన ఆధునిక అసురుడు.
రాముని తరువాత అతనిరాజ్యం శత్రుఘ్నునికి, అతడి పుత్రునికి వచ్చినది. ఈ వాక్య నిర్మాణంలో పొరబాటు ఉంది. రాముని జీవితకాలంలోనే రాజ్యం విభజింపబడి, లవ కుశులకు, తమ్ముల కుమారులకు పంచబడినది. అయోధ్య శత్రుఘ్నునకు రాలేదు. అతనికి, కుమారులకు వచ్చినది మధుర. అయొధ్యకు తరువాత పాలకుడైన వాడు కుశుడు. తరువాత అతని కుమారుడు అతిథి. రఘువంశ గాథను ఇంకొక చోట చెప్పాను.
No comments:
Post a Comment