Sunday, January 21, 2018

పద సంపద - ఈర్ష్యకు అసూయకు తేడా ఏమిటండీ?

https://www.facebook.com/vallury.sarma/posts/518025394901545

శబ్ద పల్లవములు - ఈ పదం ఎవరికైనా తెలుసా? నాకు నరసింహశర్మ గారు గుర్తుచేశారు. శబ్దము అంటే తెలిసినదే. పల్లవము అంటే అంకురము, చిగురు, మొలక, మోసు. ఈ పల్లవమనే పదాని సంస్కృత కవులు యువతుల వ్రేళ్ళకు, పెదవులకు ఉపమానాలుగా వాడుతారు. (దేహి పదపల్లవ ముదారమ్ --- జయదేవ అష్టపది). సంస్కృత పదాలు చిగురిస్తే తెలుగు క్రియా పదాలు పుడతాయి. ఇక్కడ ఇంచు అనేది అదనంగా వస్తుంది. కృశించు, వసించు, వర్షించు, సయించు, పల్లవించు, పుష్పించు, ఫలించు
నాకు చాలా రోజులు మిస్సమ్మ సినిమాలోని బృందావనమది అందరిదీ అనే పాటలో
బృందావనమది అందరిది గోవిందుడి అందరివాడేలే ...
రాసక్రిడల రమణుని గాంచిన ఆశలు మోసులు వేయవటే
ఎందుకె రాధ ఈ సునసూయలు అందములందరి ఆనందములే
చిన్నప్పుడు మోసులు అనేపదం అర్థం కాలేదు. హైస్కూలులో ఉండగా ఈ చిత్రం చూచాను. సునసూయలు అంటే ఏమిటి అనుకున్నాను. ఈసు అసూయ అని తెలియలేదు. ఈర్ష్య అసూయ సంస్కృత పదాలు. ఈసు అంటే ఈర్ష్యకు వికృతి అనీ తెలియలేదు. ఈ మోసు అనే పదంతో అనేక శబ్దపల్లవాలు సృష్టించవచ్చు. మోసులువారు, మోసులెట్టు మోసులిడు, .. కవి కోకిల దువ్వూరి రామిరెడ్డిగారు మోసిడు అని వాడారట.

1. ఈర్ష్యకు అసూయకు తేడా ఏమిటండీ?
2. మోసులు అన్న పదం సంస్కృతం కాదు కదా?

Vvs Sarma ఈర్ష్య = impatience with the success of others ఇతరుల విజయంపై విసుగు,
అసూయ = generally being discontented with displeased with the happiness of others. సంతోష కరమైన వాతావరణంలో అశాంతి, అసంతృప్తి ప్రదర్శించుట But often used for envy, jealousy
Vvs Sarma Mosulu is a pure telugu word often used only in plural.Suresh Kolichala చక్కగా వివరించారు. మరికొన్ని వివరాలు:

ఈర్ష్య- అన్నది ఋధ్- అన్న ధాతువుకు సంబంధించినది. ఋధ- అంటే పెరుగు, అభివృద్ధి చెందు. ఈ + ఋధ్ = ఈర్ష్య అంటే మూలార్థం అభివృద్ధి చెందాలనే కోరిక. చికీర్ష్య అంటే చేయనిచ్ఛ. జిహీర్ష్య కూడా అలాంటిదే.


-సూయము అంటే మూలార్థం ఫలరసాన్ని వెలికి తీయడం. వసూయ- అంటే వస్తువు (wealth) పై కోరిక. రాజసూయ యాగం రాజుల అభివృద్ధి కోసం చేసే యజ్ఞం. అసూయ envy అన్న అర్థంలోకి ఎలా మారిందో తెలియదు, కానీ, అనసూయ అంటే అసూయ లేనిది.

పల్లవించు అన్న అర్థంలో అచ్చ తెలుగు పదం మొలచు-. దీకిని నామవాచక రూపంగా 'మొలకలు' అనే కాకుండా 'మొలచులు' అని కూడా వాడేవారేమో అది కాస్తా మొలసులుగా, ఆపై మోసులు గా మారింది (మొగము > మోము అయినట్టుగా మొలసు > మోసు అవుతుంది).
https://www.facebook.com/vallury.sarma/posts/519534778083940
గ్రహము అంటే ఏమిటి? గ్రహము ముఖ్యార్థము గ్రహించడం,పట్టుకోవడం, అర్థంచేసుకోవడం, గమనించడం, గ్రహము అంటే పట్టుకునేది.అదే గ్రాహం.మొసలి. గ్రాహకుడు అంటే వినియోగదారు, customer అదే గ్రహణం. రాహువో,కేతువో పట్తుకుంటే సూర్య లేదా చంద్రగ్రహణం. చేయి పట్టుకుంటే పాణిగ్రహణం. ఉపసర్గలతో అనేకపదాలు వస్తాయి. అనుగ్రహము, ఆగ్రహము, విగ్రహము, నిగ్రహము, పరిగ్రహము,ప్రతిగ్రహము,సంగ్రహము. జ్యోతిషంలో నవగ్రహాలు అంటారు. కాని గ్రహాలు ఐదే - బుధ,కుజ, శుక్ర, గురు, శని. రాహు కేతువులు చాయాగ్రహాలు. అల్లుడు దశమగ్రహం - ముందు అమ్మాయి చేతినీ, తరువాత మామగారి పీకనీ పట్టుకోవచ్చు.గ్రహం అనే పదాన్ని తొమ్మిదికి సంకేతంగా వాడుతారు. దయ్యాలనుకూడా దుష్టగ్రహం, బాలగ్రహం అని వ్యవహారంలో ఉన్నది.గ్రహ స్థితి, గ్రహపాటు, (పురస్కార) గ్రహీత .


Suryanarayana Murthy Dharmala గ్రహము యొక్క భారీ విగ్రహాన్ని మన ముందుంచారు బాగుంది. భవిష్యత్తులో గ్రహాంతరవాసులకు కూడ పనికొస్తుంది ఈ వివరణ. వాళ్లకు ఒకవేళ మన తెలుగుభాష తెలియకపోతే అది వాళ్ల
గ్రహచారము. ఏదో గ్రహము అనే పదానికి ఒకటి రెండు పరసర్గలు చేర్చి చెబుదామన్న ప్రయత్నము తప్పవిడిచి నేను రాసేదాంట్లో పెద్దగా తాత్పర్యము వెదకొద్దని మనవి.
"పద సంపద" అనే శీర్షిక తో ఆచార్య శర్మగారందించిన లేఖనము అతి సుందరము, పదసంపదను సమృద్ధి చేయు ప్రశంసనీయ ప్రయత్నము.


Ramabrahmam Varanasi చంద్రుడు, రవి?

ఆదిత్యానామహం విష్ణుర్జ్యోతిషాం రవిరంశుమాన్|
మరీచిర్మరుతామస్మి నక్షత్రాణామహం శశీ|| 10-21 ||



Ramabrahmam Varanasi భగవద్గీత అలా చెప్పిందే అనుకోండి. కాని జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అవి రెండూ గ్రహములే కదా?!Vvs Sarma In fact this description is given by Sadguru Sivananda Murti garu. He in fact says that the 9 are called in common parlance grahas The sun and moon are jyotishas whose rays influence while the grahas influence through their positionRamabrahmam Varanasi ఏకమ్ సత్ విప్రాః బహుధా వదంతి!Ramabrahmam Varanasi ఏకమ్ సత్ విప్రాః బహుధా వదంతి!





No comments:

Post a Comment

The Structure of the Universe (Vedic) - Viswaroopa - K. Sivananda Murty Preface 2

https://www.facebook.com/vallury.sarma/posts/616984388338978 The Puranas speak of individuals going up and down between these proximate...