Sunday, January 21, 2018

పదాల ముచ్చట్లు 4

దయ్యము అనే పదానికి అర్థము ఏమిటి?

https://www.facebook.com/vallury.sarma/posts/516747498362668

తెలుగు నిఘంటువు ప్రకారము ఈ పదానికి నాలుగు అర్థాలున్నాయి - దేవుడు, వేలుపు,విధి, పిశాచము. సామాన్యంగా వాడుకభాషలో దెయ్యము అంటాము. ఈ మాట ఎక్కడినుండి వచ్చింది? ఇది దైవము అనే సంస్కృతజన్య తత్సమ పదానికి వికృతి. దైవం అనే పదాన్నికూడా రెండు అర్థాలలో వాడతాం. ఇష్టదైవం కులదైవం అనేమాటలలో దేవుడనే అర్థం. దైవజ్ఞుడు అనేమాటలో దైవం అంటే విది అని అర్థం. దైవజ్ఞుడు అంటే జ్యోతిష్కుడు. జాతకరీత్యా కర్మ ఫలాన్ని (విధి వ్రాతను) చెప్పేవాడు. దైవజ్ఞుడు ముహూర్తంపెడతాడు కాని బ్రహ్మజ్ఞుడు కాదు. దయ్యము సోకింది అనే వాక్యములో ఒక పిశాచము ఆమెను ఆవహించింది అని అర్థము. దయ్యము పట్టుట, దయ్యమును వదలగొట్టుట అనే వాడుకలు కూడా ఉన్నాయి. ఈ వదలగొట్టడం చేసేవాడిని భూతవైద్యుడు అంటారు. మరి భూతము దయ్యము ఒకటేనా? భూతమనే సంస్కృతపదానికి ఎన్నో అర్థాలున్నాయి. ప్రాణికావచ్చు,పిశాచం కావచ్చు, పంచ భూతాలలో ఒకటి కావచ్చు. భూతాలున్నాయి, దయ్యాలో? ఎందుకు ఉండకూడదు? ఇంగ్లీషులో Ghost అనే పదం దీనికి సమీపం. కాని మంత్రులకు, ప్రముఖులకు Ghost writers ఉంటారు. వాళ్ళని దయ్యపు రచయితలు అనకూడదు, గుప్త రచయితలు అనవచ్చు. HolY Ghost దగ్గర ఇబ్బంది వస్తుంది. పవిత్ర దయ్యమని కాకుండా పరిశుద్ధ ఆత్మ అని వాడాలి. దయ్యాల సామెతలున్నాయి. దెబ్బకు దయ్యం వదులుతుంది. అలాగే దయ్యాలు వేదాలు వల్లించినట్లు అని కూడా ఒక ప్రయోగం ఉన్నది. వేదాలు అతి పవిత్రమయినవి. అలాంటి వేదాల్ని దెయ్యాలు వల్లిస్తుంటే ఎంత విచిత్రంగా ఉంటుందో అలానే అలాగే శబ్దార్థ జ్ఞానం లేనివారు వేదాన్ని వివరిస్తుంటే మనకు విచిత్రంగానే ఉంటుంది. దీనినే దెయ్యాలు వేదాలు వల్లించినట్లు అంటారు. దీనికి సరియైన ఇంగ్లీష్ సామెత కూడా ఉన్నది - "Devil quoting scriptures, Devil quoting the Bible. సైతాను ఏసును ఆకర్షించుటకు ప్రయత్నిస్తూ దేవుని వాక్యమును ఉదహరిస్తాడు. ఏమో కలికాలంలో దెయ్యాలు వేదాలూ వల్లిస్తాయేమో?

No comments:

Post a Comment

The Structure of the Universe (Vedic) - Viswaroopa - K. Sivananda Murty Preface 2

https://www.facebook.com/vallury.sarma/posts/616984388338978 The Puranas speak of individuals going up and down between these proximate...