Sunday, January 21, 2018

పద సంపద



నుతజల పూరితంబులగు నూతులు నూరిటికంటె సూనృత
వ్రత యొక బావి మేలు... అనే నన్నయ్యగారి పద్యంలో చివరికి
ఒక సూనృత వాక్యము మేలు చూడగన్ అని వస్తుంది.
సూనృత వాక్యము అంటే సత్య వాక్యము అని సాధారణంగా అర్థం చెబుతారు. శ్రీరాముడు దశరథుని కుమారుడు, ఇండియాకు రాజధాని న్యూఢిల్లీ అని సత్యవాక్యాలు చెబితే యజ్ఞాలు చేసిన ఫలం వస్తుందా? సూనృత - అంటే సత్య - అనే పదాని కంటె ఎక్కువైనది. సత్య వలెనే అది సంస్కృత పదం. అర్థం వేరు. సూనృత = సు + ఋత అని అర్థం చెప్పుకోవచ్చు. ఋత నుండి వచ్చినదే ఋతువు. సృష్టిలో క్రమ బద్ధమైన ధర్మం ఋతం. సత్యంగా, ప్రియం కలిగించేలా, ధర్మ సమ్మితముగా చెప్పబడిన వాక్యము. ఇది జైన పారిభాషిక పదం. అక్కడ pleasant and true speech. అలాంటి ఒక వాక్యం చెప్పడం, వ్రాయడం కష్టమే.

Suresh Kolichala సూనృత - అంటే సత్య - అనే పదాని కంటె ఎక్కువైనది అని చక్కగా వివరించారు శర్మ గారు. భాగవతంలో పంచమ స్కంధంలో ఇరవయ్యమ ఆశ్వాసంలో 27వ వచనంలో ఋత, సత్య వ్రతాలను వేర్వేరుగా పేర్కోవడం గమనించవచ్చు.

తద్-వర్ష-పురుషా ఋతవ్రత-సత్యవ్రత-దానవ్రతానువ్రత-నామానో భగవంతం వాయ్వ
ాత్మకం ప్రాణాయామ-విధూత-రజస్-తమసః పరమ-సమాధినా యజంతే

(నా అనువాదం) ఆ ప్రాంతంలో ఋతవ్రత, సత్యవ్రత, దానవ్రత, అనువ్రత అను పేర్లతో ఉండే నాలుగు రకాల పురుషులు వాయువు రూపంలో భగవంతుని భజిస్తూ, ప్రాణాయామంతో, పరమ సమాధిలో తమ రజస్సును, తమస్సును తొలగించుకొందురు.

ఇక్కడ పేర్కొన్న ఋతవ్రత, సత్యవ్రత, దానవ్రత, అనువ్రతాలను గురించి వివరంగా తెలుపుగలరా?

ఈ పదం గురించి నేను కొంత చర్చించిన నా వ్యాసం ఈమాటలో చూడవచ్చు:
http://www.eemaata.com/em/issues/201305/2078.html

No comments:

Post a Comment

The Structure of the Universe (Vedic) - Viswaroopa - K. Sivananda Murty Preface 2

https://www.facebook.com/vallury.sarma/posts/616984388338978 The Puranas speak of individuals going up and down between these proximate...