Friday, January 19, 2018

పదాల ముచ్చట్లు 2


ఈ రోజు National Science Day ఒక పోస్ట్ లో దానిని జాతీయ వైజ్ఞానిక దినంగా అనువదించారు. తల్లుల దినం, తండ్రుల దినం, ప్రేమికుల దినం అంటే ఆసమాసాలు ఎందుకో నాకు బాగుండవు. స్వాతంత్ర్య దినం,గణతంత్ర దినం అన్న పదాలు కొంత అలవాటయ్యాయి. అందుకు బాగానే వినిపిస్తాయి. విజ్ఞాన అనాలా, వైజ్ఞానిక అనాలా? ఇది రెండవ ప్రశ్న. విజ్ఞానము అంటే సైన్స్. వైజ్ఞానిక అంటే scientific. విజ్ఞాన దినం అంటే బాగుంటుందేమో. జ్ఞానానికి, అజ్ఞానానికి, విజ్ఞానానికి తేడాలు ఏమిటి? సుజ్ఞానము, యదార్థ జ్ఞానము, మిథ్యాజ్ఞానము అనే పదాలు కూడా దర్శనాలలో వస్తాయి. జ్ఞ అంటే తెలియుట,ఎరుక, తెలివి; తెలిసినవాడు జ్ఞాని, తెలియనివాడు అజ్ఞాని, తెలిసినదంతా సత్యంకాక పోవచ్చు,సత్యమని నిరూపింపబడిన జ్ఞానం యథార్థ జ్ఞానం. కానిది మిథ్యాజ్ఞానం. దానికంటె అజ్ఞానం నయం. అదే Ignorance is bliss. పరమాత్ముని గురించి చెప్పేది జ్ఞానం లేక సుజ్ఞానం. సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ అన్నట్లు.
విజ్ఞానమంటే లౌకిక లేదా ప్రపంచ జ్ఞానం. ఇది పూర్తిగా తెలియదు. వైజ్ఞానిక దృష్టి అంటే మనకు తెలిసిన భౌతిక ప్రపంచం గురించిన విజ్ఞానాన్ని మన పరిధిలో సత్యంగా నిరూపించడం. విజ్ఞాన శాస్త్రము చెప్పే సత్యాలు పరిపూర్ణం కాదు. ఇంతవరకు తెలిసిన తాత్కాలిక సత్యాలు. విజ్ఞానం ఎప్పటికీ సంపూర్ణం కాదు. కొంత తెలిసిన కొలదీ, తెలియనిది ఇంకా ఎక్కువ ఔతుంది.


We pray to God. It is not sufficient. One has to worship God, with or without a prayer ప్రార్థనకి, ఉపాసనకు తేడా ఏమిటి? భగవంతుడికి మన కోర్కెలు నివేదించడం ప్రార్థన. భగవంతుని అనుగ్రహం కోసం ఆయనను చేరుకోడం కోసం మనం చేసేది ఉపాసన. నిత్య షోడశోపచార పూజ, రుద్రాభిషేకం, సూర్య నమస్కారాలు, వ్రతాలు, శ్రవణ, మనన,నిధిధ్యాసనాదులు, జప తపాలు ఇవన్నీ ఉపాసనే అనుకోవచ్చును.

No comments:

Post a Comment

The Structure of the Universe (Vedic) - Viswaroopa - K. Sivananda Murty Preface 2

https://www.facebook.com/vallury.sarma/posts/616984388338978 The Puranas speak of individuals going up and down between these proximate...