Thursday, January 25, 2018

On Cosmologies – New Series – 10


V V S Sarma
నరకములు
ఇట్లు అధోలోకములను గురించి వివరించిన శ్రీశుక మహర్షి, పరీక్షిత్తుని, మహారాజా, ఇక ఏమి చెప్పను? అని అడుగుతాడు. జంతుజాలముల శ్రద్ధలు త్రిగుణాత్మకములు గావున ఆయా జీవులు కర్మ వశముగా అనేకజన్మలలో వేర్వేరు లోకములలో సంచరిస్తారు. అధోలోకములలో సుఖాపేక్ష, భోగలాలసత ఉంటాయి కాని మోక్ష విచారము ఉండదు. జీవులకు ఎక్కువగా ఆసురీసంపత్తి ఉంటుంది. అధర్మ వర్తన గల జీవుల కర్మఫలము కూడా విపరీతముగానే ఉంటుంది. అధర్మ వర్తన వలన, కామాది వికారముల వలన కలిగిన కర్మ ఫలములను నీకు వివరిస్తాను. --- శుకునితోఁ బరీక్షిన్నరేంద్రుం డి ట్లనియె.
“మునివరేణ్య! నరకములు ముజ్జగంబుల
యందొ? యంతరాళమందొ? వెలినొ?
యదియుఁ గాక దేశమందుండు భూవిశే
షముల యందొ? తెలుపు సంతసమున." ------------- (భాగవతము)
దానికి శుకుడు ఇలా బదులుచెబుతాడు. "రాజా మూడులోకములకు అవతల భూమ్యాకాశాల మధ్యన దక్షిణదిశలో ఈ నరకాలు ఉంటాయి. అంటే భూలోకానికి ద్యులోకానికి మధ్యాంతరాళంలో యమలోకానికి సమీపముగా దక్షిణ దిశను నరకములుంటాయి. ఆగ్నిష్వత్తాది పితృ గణములుండే పితృలోకము కూడా దక్షిణ దిశలోనే ఉంటుంది. దాని అధిపతికూడా యముడే. అతడు తనవద్దకు వచ్చిన జీవుల పాపకర్మలకు వానికి తగినఫలములనిచ్చి శిక్షిస్తాడు. ప్రధానముగా 21 నరకములను చెబుతారు - వాటిలో కొన్నిటి పేర్లు తామిస్రము, అంధతామిస్రము, రౌరవము, మహారౌరవము, కుంభీపాకము, కాల సూత్రము, అసిపత్రవనము, సూకరముఖము, అంధకూపము, వైతరిణి, క్రిమిభోజనము,మొదలైనవి, అలాగే సూచీముఖము వంటి మరొక ఏడు మొత్తము 28 నరకముల పేర్లు భాగవతము చెబుతున్నది. కలియుగంలో అధిక సంఖ్యాకులకు ఇదేమార్గముగా కనుపిస్తుంది. ఈ పేర్లు అక్కడ శిక్షల ప్రాతిపదికగా కనుపిస్తాయి. కుంభీపాకం అంటే వంటపాత్రలో ఉడికించుట - అంత దుఃఖాన్ని కలిగించే నరకం, రౌరవం అంటే వేదనతో దుఃఖంతో ఆర్తనాదాలుచేసే నరకం, సూచీముఖం అంటే సూదులతో గుచ్చి ఏడిపించే నరకం - మృత్యుబాధ వేయి వృశ్చికములు ఒకేసారి కుట్టినట్లు ఉంటుందట. దానికి వాచవి ముందే లభిస్తుంది. ఆసుపత్రి ICU లో భూమిమీదే అనుభవానికి వస్తుంది.

No comments:

Post a Comment

The Structure of the Universe (Vedic) - Viswaroopa - K. Sivananda Murty Preface 2

https://www.facebook.com/vallury.sarma/posts/616984388338978 The Puranas speak of individuals going up and down between these proximate...