Thursday, January 25, 2018

On Cosmologies – New Series – 6


తైత్తిరీయోపనిషత్ - ఆనందవల్లి
ఉపనిషత్తు ఈ భాగం విషయం ఆనందము యొక్క మీమాంస.
ఒక యువకుడు, సజ్జనుడు, వేద పురాణ సాహిత్యాన్ని అధ్యయనం చేసినవాడు, పండితుడు, దృఢచిత్తం కలవాడు,ఆరోగ్యము బలము కలవాడు, ఐశ్వర్యవంతుడు అట్టి వ్యక్తి యొక్క ఆనందమును పరిపూర్ణ మనుష్యానందముయొక్క ప్రమాణముగా భావించవచ్చును.ఇది పరిపూర్ణ లౌకికానందము.
అట్టి ఆనందము యొక్క నూరు రెట్లు మనుష్య గంధర్వానందము. ఇది గంధర్వలోకములోని జీవులకు వర్తించును. ఈ జీవులు తమ పుణ్యమువలన గంధర్వలోకమునకు వెళ్లినవారు.అదే ఆనందం భూమిపై వేదాధ్యయనముచేసి, కామాది వికారములను జయించిన శ్రోత్రియునికి లభిస్తుంది.
దీనికి వందరెట్లు ఆనందము దేవగంధర్వానందము. ఇది శాశ్వత గంధర్వలోకములోని జీవులకు, భూమిపై వేదార్ధము తెలిసి ఆరు అంతఃశత్రువులను జయించిన పరిపూర్ణవేద పండితునకు లభిస్తుంది. దీనికి నూరురెట్లు ఆనందం పితృలోకములోని పితృ దేవతలకు ఉంటుంది. దీనికి శతాధికం ఆజానజ దేవతలకు ఉంటుంది. వీరికి శతాధికమైన ఆనందం కర్మ దేవతలకు ఉంటుంది. వీరికి నూరురెట్లు ఆనందం దేవరాజైన ఇంద్రుని ఆనందం. దానికి శతాధికం దేవగురువైన బృహస్పతిది. దీనికి నూరురెట్లు ప్రజాపతులది. దానికి నూరురెట్లు బ్రహ్మ యొక్క ఆనందము. ముక్తజీవులు, బ్రహ్మజ్ఞానులు పొందిన ఆనందము దీనికి సమానము.
యతోవాచో నివర్తంతే అప్రాప్య మనసా సహ
ఆనందం బ్రహ్మణో విద్వాన్ న బిభేతి కదాచనేతి
అని ఈ ఉపనిషద్వాక్యము.
మాటలకు దొరకనిది, మనసులోని ఊహలకందనిది అయిన ఆ బ్రహ్మానందానుభవమును పొందిన విద్వాంసుడు ఎవరివలనను, దేనివలనను భయమును పొందడు.

Acharya Sadananda Besides all that said, he is also the owner of the enter earth - his ananda is one unit. mukhyamainadi - shrotiyasya akaamaya tasya - This is repeated at every level of ananda. One who has dispassion for all that in that level of happiness also enjoys the same level of happiness without possessing anything. In essence he is happy with himself. Hari Om!Vvs Sarma Thank you Acharya Sadananda - I observed it but could not find proper Telugu terms for describing it distinctly at each level. Do you read Telugu?Acharya Sadananda Sarma gaaru - maa naanagaaru telugu-samskRitamulo mahaa vidvansulu. We are still publishing his works. Allasani peddna Manucharitra, Krishadevarayala AmuktaMallada samskRitiikaranamu chesinaaru. Modatidi Andhra Sahitamu samshta, rendavadi TTD publish cesinaaru. Nenu padita puttunni! Vedanta Deshikas Rahasyatra saara (original in Tamil) pi 14 volume of commentary vrasinaaru. avi inkaa publish ceya prayatnistunnnamu. Hari Om! Sada
Vvs Sarma చాలా సంతోషం. మా నాన్నగారికి, తాత గారికి, సాహిత్యాభిమానము ఉన్నది కాని పాండిత్యములేదు. మా పూర్వజుడు వల్లూరి నరసకవి నాగ్నజితీ పరిణయమని మంచి ప్రబంధాన్ని రచించారు. దాని తాళపత్ర ప్రతి తిరుపతి లో దొరికినది. మా తమ్ముని కుమారుడు దానిని ప్రచురించే పనిలో ఉన్నాడు. నా అభిరుచి మాగురువుగారు శివానందమూర్తిగారి సాన్నిహిత్యముతో బలపడినది. గత ఇరవై సంవత్సరములుగా నేను విన్నవీ, చదివినవి నలుగురితో పంచుకునే ప్రయత్నం చేస్తున్నాను. నా జ్ఞానం కేవలం చదివితెలుసుకోవడం వలన అభించినది. చాలా దోషాలు ఉండవచ్చు.

No comments:

Post a Comment

The Structure of the Universe (Vedic) - Viswaroopa - K. Sivananda Murty Preface 2

https://www.facebook.com/vallury.sarma/posts/616984388338978 The Puranas speak of individuals going up and down between these proximate...