Friday, January 19, 2018

కలియుగంలో సనాతన ధర్మంతో సహజీవనం చేసినవి జైన, బౌద్ధ మతాలు. PART 2

https://www.facebook.com/vallury.sarma/posts/500458073324944

గౌతమ గోత్రజుడు, శాక్యవంశ రాజకుమారుడైన సిద్ధార్థుడిచేత బోధింపబడినది బౌద్ధధర్మం. ఆయన ప్రపంచంలోని దుఃఖానికి, దాని పరిహారానికి కారణం అన్వేషించడానికి, రాజభవనాన్ని, భార్యా పుత్రులని, తండ్రిని వదలి తపస్సుకి వెళ్ళిపోతాడు. అనేక సంవత్సరాలు గడిచాక ఆయనకు జ్ఞానోదయం అయి, బుద్ధుడని పిలవబడ్డాడు. ఆయన మొదట చెప్పినవి నాలుగు సత్యాలు (చత్వారి ఆర్య సత్యాని). అవి 1. సంసారం దుఃఖమయం. జన్మ,జరా,వ్యాధి, మృత్యువు అన్నీ దుఃఖాలే. 2. కోరికలు దీనికి కారణం. అవే జనమరణ చక్రానికి కూడా కారణం. 3. దుఃఖ నిరోధము (కాంక్షను త్యజిస్తే దుఃఖం దూరమవుతుంది), 4. దీనికి మార్గము (అష్టాంగ మార్గం). సమ్యగ్వచనము (మంచిమాట), సమ్యగ్కర్మ (మంచి పనులు), సమ్యగ్జీవనము (మంచి జీవితం), సమ్యగ్వ్యాయామము (మంచి ప్రయత్నం), సమ్యగ్స్మృతి (మంచి దృక్పధము), సమ్యగ్సమాధి (మంచి ధ్యానము), సమ్యగ్దృష్టి (సత్యాన్ని చూడడం), సమ్యగ్సంకల్పము (మంచి సంకల్పము). ప్రధానంగా వీటిని గమనింప వచ్చును. 1. గౌతమ బుద్ధుడు గురువు, (బుద్ధం శరణం గచ్ఛామి) 2. మధ్యేమార్గం , కార్య కారణత్వం (Dependent origination), నాలుగు పరమ సత్యాలు, అష్టాంగ మార్గం - ఇది బౌద్ధ ధర్మం. (ధర్మం శరణం గచ్ఛామి) 3. సామాన్యులు, సంఘ పరివారంలోనివారు కూడా సాధన ద్వారా నిర్వాణం పొందవచ్చును. (సంఘం శరణం గచ్ఛామి) నిర్వాణం పరమోత్కృష్ట గమ్యం . ఈనాటి హిందువులుగా మనం దీనిని పరిశిలిస్తే మనకు విరుద్ధ భావాలు ఏవీ కనుపించవు. ఇది నిజంగా ఉపనిషత్తుల మతమే. ఒకే ఒక భేదం ఈశ్వర ప్రసక్తి లేదు. కాని గురువుని అంగీకరించారు కదా. ఇంచుమించు కొంతవరకు నేటి షిర్డీ సాయిబాబా నూతన సంప్రదాయాన్ని పోలి ఉండవచ్చు. మనకు పాశ్చాత్యులు వ్రాసిన చరిత్ర, ఇంగ్లీషు భాష ఉపయోగం వలన కొన్ని సమస్యలు వచ్చాయి. మతం అనే పదాన్ని మనం religion అనే పదానికి గతిలేక అనువాదంగా వాడుతున్నాము. కాని religion, religious conversion మత మార్పిడి అనే మాటలు మనకు పూర్తిగా అర్థం కావు. దిలీప్ కుమార్ ముస్లిం అయితే రహమాన్ గా మారి తీరాలి. శివారెడ్డి, శామ్యూల్ శివారెడ్డి గా మార వచ్చు. బాప్తిజం అనేప్రక్రియ ఉంటుంది. కాని పేరు విషయంలో కొంత వికల్పం ఉంటుంది. హిందూ బౌద్ధమతాలలో హిందువు, బౌద్ధుడు అనే పదాలకు నిర్వచనం లేదు. ఇది రేపు ముచ్చటించుకుందాం.

Nandiraju Radhakrishna ఆలోచనా శక్తి కలిగించేందుకు, జ్ఞానజ్యోతి వెలిగించేందుకు, వ్యక్తిత్వాన్ని తట్టిలేపేందుకు నిరంతరం మీరు నిర్వహిస్తున్న భావ సంపద పంపిణీ యజ్ఞం వల్ల కొందరిలోనైనా గుణాత్మక మార్పువస్తునదన్నది నా విశ్వాసం. మీరు రోజూ వివరించే ఇవన్నీ ఈ తరానికి ఎవరు చెబుతారు? మీబోటివారు చెప్పినా మాబోంట్లు అనుకునేది " ఇవన్నీ ఎవరికి కావాలి. ఇవి చదూతూ కూర్చుంటే మన సంగతి చూసుకొవద్దా? వాటినిస్కూళ్ళలో చెబుతారు. నా గురించి, నా ఘనత గురించి ఎవరూ చెప్పరుకదా! అందుకే నాగురించి నేనే చెప్పుకుంటా. అందుకయ్యే ఖర్చులేదుగా? అనే మార్కెటింగ్ ధోరణి మితిమీరిపోయింది. సామాజిక మాధ్యమం కూడా యాజమాన్య నిర్వాహక మాధ్యమంలా ప్రచార సాధనమైంది. రోజూ వేదికలపై, టీవీల్లో, రేడియోల్లో మన జాతి, మన చరిత్ర, మాతృభాష భాష, మన సంస్కృతి, మన సాంప్రదాయమంటూ గొంతులు చించుకోవడం మినహా దానికి మనంగా చేస్తున్న కృషి ఏమిటన్న ఆత్మ పరిశీలన ఎవరికున్నదండీ! ఇప్పుడంతా "లై"కింగులు, షే"రింగులు" .. ఇదొక్కటే కొలమానం. "ఎవరినన్నా కొమ్ము కాసే రాజకీయాలైతే మరీ భేష్.. లాభ దాయకం. మనం మన మతం గురించి మాట్లాడితే మరి నాకేంటి? అన్నేదే కీలకం ఇప్పుడు. ఇదంతా "ఎర్నలిస్టుల" కాలం. మీ ప్రతి వాక్యాన్ని భద్రపరుచుకుంటున్నా! ధన్యుణ్ణి.

http://www.udaypai.in/am-i-a-hindu/

P Mallikarjuna Rao Our ancestors have not used the term religion. They called it Dharma. Buddha also called his teachings Dhamma. this is more comprehensive and a better term than religion. " Matam" means opinion, that is why Hindi "Matdan" means casting vote , expressing one's preference or opinion.

No comments:

Post a Comment

The Structure of the Universe (Vedic) - Viswaroopa - K. Sivananda Murty Preface 2

https://www.facebook.com/vallury.sarma/posts/616984388338978 The Puranas speak of individuals going up and down between these proximate...