Friday, January 19, 2018

ఆధునిక కాలంలో బౌద్ధ ధర్మాన్ని లోతుగా అధ్యయనం చేసిన

https://www.facebook.com/vallury.sarma/posts/501245056579579

ఆధునిక కాలంలో బౌద్ధ ధర్మాన్ని లోతుగా అధ్యయనం చేసిన రాజకీయ నాయకులలో ప్రముఖుడు బాబాసాహెబ్, భీమరావు అంబేద్కర్. హిందూసమాజంలో అస్పృశ్యత కూ మతానికి సంబంధము ఉన్నట్లు భావించిన డాక్టర్ అంబేద్కర్ జీవితకాలమంతా ఈ అస్పృశ్యతకు కారణాలేమిటని పరిశోధించి, వారి కులము వారు పూర్వము బహుశ బౌద్ధులేమో అని నిర్ణయానికి వచ్చారు. కాని సనాతన ధర్మము గురించికూడా పూర్తిగా తెలిసిన ఆయన దానికి సమీపవర్తియైన బౌద్ధాన్ని తన మరణానికి కొన్ని నెలల ముందు స్వీకరించారు. ఆయన అనుయాయులు కొందరు కూడా ఆయనను అనుసరించారు. ఆధునిక భారత చరిత్రలో ఇది ఒక శుభపరిణామం. 

జైన, బౌద్ధమతాల తర్కం అప్పటి వైదికుల తర్కంకంటె బలంగా ఉండడం వలన దానికి తాత్కాలికంగా విజయం లభించి మేధావి వర్గంలో ఆ మతాలకు ఆదరణ వచ్చినది. మహారాజులు. పండితులు, బ్రాహ్మణ క్షత్రియ, వైశ్యులు ఆకర్షితులయ్యారు. వర్ణ వ్యవస్థలేకపోవడంలో సమాజంలో ఇతరవర్గాలు కూడా ఆకర్షితులయ్యారు. మన చరిత్ర పుస్తకాల ఆధారంగా బుద్ధుడు, మహావీరుడు సా.శ. పూ. 500 ప్రాంతంలోని వారు. కాని వారి సాహిత్యం అధారంగా ఆ మతాలు ఎంతో ప్రాచీనమైనవి. 22 వ తీర్థంకరుడే కృష్ణుని సమకాలికుడంటే ఆదినాథుడు ఎప్పటి వాడు? చంద్ర గుప్త మౌర్యుని కాలం గ్రీకు యాత్రికుడు మెగస్థనీసు ఇండికా ఆధారంగా నిర్ణయించారు. అందులో ఉన్న విషయం "అప్పుడు పాలింబొత్రా లో సాంద్రకొత్తాస్ అనే రాజు ఉండేవాడు". ఇతడు పాటలీపుత్రపు రాజు చంద్రగుప్త మౌర్యుడని నిశ్చయించారు. కాని అతడు గుప్త చంద్రగుప్తుడో, సముద్రగుప్తుడో కావచ్సుకదా! ఇదే సత్యమైతే బుద్ధుని కాలము సా. శ. పూ. 1100 అవుతుంది.
స్వల్ప కాలంలో బౌధ్ధ జైనాలు ఎంతో ప్రజాదరణ పొందాయి. అశోక చక్రవర్తి కళింగయుద్ధములో లక్ష సైనికుల మృతదేహాలను చూచి విషాదం చెంది బౌద్ధమతం స్వీకరించాడని అంటారు. ఇది అర్జున విషాదయోగానికి విపర్యయం. అర్జునుడు బంధుమిత్రుల మరణాన్ని ఊహించుకొని శోకిస్తే, కృష్ణుడు ధైర్యం చెప్పి గీత బోధించి యుద్ధోన్ముఖుణ్ణిచేశాడు.అశోకుడు దేశమంతా బుద్ధుని బోధలను రాళ్ళపై చెక్కించి ప్రచారం చేశాడు. తన పుత్రుడు మహేంద్రను, కుమార్తె సంఘమిత్రను బౌద్ధసంఘములో భిక్షువులుగా చేసి సింహళానికి (నేటి శ్రీలంకకు) పంపించాడు. ఆంధ్రదేశంలో శాతవాహనులు వైదికమతస్త్థులైనా బౌద్ధాన్ని ఆదరించారు. వారి భార్యలు భర్తల పక్కన కూర్చుని యజ్ఞాలు చేశారు. బౌద్ధ విహారాలకు కానుకలు ఇచ్చారు. ఇక్కడ మతమార్పిడి అన్న ఇతరమతాల ప్రక్రియకు ఆస్కారంలేదు. బుద్ధుడు ఏర్పాటుచేసిన వ్యవస్థలలో ముఖ్యమైనది సంఘం. ఇది భిక్షువుల సముదాయం. వీరు విహారాలలో ఉండి ధర్మ బోధ చేసేవారు. వీరిని రాజులు పోషించేవారు. తరువాత కాలంలో అన్నిదేశాల విద్యార్థులను ఆకర్షించిన తక్షశిల, నలంద, విక్రమశిల వంటి విశ్వవిద్యాలయాలు ప్రపంచ ఖ్యాతి వహించాయి. ఒక్క వేయి సంవత్సరాలలో తిరిగి సనాతన ధర్మం ఏవిధంగా బహుళ ప్రచారాన్ని పొందింది? ఈ మతాలు ఎందుకు ప్రజాదరణ కోల్పోయాయి? భారతీయ చరిత్రపై ఈ మతాల ప్రభావం ఎంత?



కానీ అంబేద్కర్ కృషి ఫలితాలను అనుభవిస్తున్న చాలామంది ఆయన అనుసరించిన బౌద్ధాన్ని మాత్రం వదిలేసి, భారతీయత ఏమాత్రం లేని క్రైస్తవం వైపు పోతున్నారు.
మీరు చెప్పినది నిజమే. కాని కాల స్వభావము వలన కొందరుపురోగమిస్తే కొందరు వెనుకకు నడుస్తారు. కాని నా ఉద్దేశ్యం- వాళ్ళకి కూడా తెలిసి వస్తుంది. అటునుండి ధన ప్రవాహం వచ్చినంత వరకు ఇప్పటి కథ నడుస్తుంది. అది వెను తిరిగి నపుడు ఆసౌధం కూలిపోతుంది. ఐరోపాలో పరిస్థితి అదే. అమెరికా పౌరులైనవారు భారతీయత కోల్పోయినట్లే మత మార్పిడుల వలన ప్రజాపతులనుండి మారి, అబ్రహాంకు దత్తపుత్రులౌతారు. వారి మూలాలు భారతదేశం నుండి మధ్య ఆశియాకు మారతాయి. ఇప్పటికే లేకపోతే హైదరాబాదు నుండి జెరూసలెం Direct flight వస్తుంది. సమాజానికి మార్పులు సహజం


No comments:

Post a Comment

The Structure of the Universe (Vedic) - Viswaroopa - K. Sivananda Murty Preface 2

https://www.facebook.com/vallury.sarma/posts/616984388338978 The Puranas speak of individuals going up and down between these proximate...