Sunday, January 21, 2018

మన తెలుగు మన సంస్కృతి -

https://www.facebook.com/vallury.sarma/posts/519702368067181

మన తెలుగు మన సంస్కృతి - ఈ సృష్టిని ఏదో శక్తి మాత్రం నడిపిస్తుంది అని మాత్రం పూర్తిగా విశాసిస్తాను సర్ పురాణాలు లోనే కొన్ని సందేహాలు ఉదా : నారదుడు అన్ని యుగాలలోను వుంటాడు హరిశ్చ్చంద్రుడి కాలం నుండి కలియుగం వరకు కనిపిస్తాడు . ఒక్క గ్రహం చేరాలి అంటే కొన్ని కోట్ల కిలోమీటర్ల ప్రయాణం మరి ఒక లోకం నుండి ఇంకో లోకం కి సునాయాసంగా ప్రయాణం చేసేవారు అంటారు వారి శక్తి యుక్తులు తపోమయ శక్తులు వలన అంటారా?
మీది చిన్నప్రశ్న. చిక్కు ప్రశ్న కాదు. మనం చూసే, ఊహించే విశ్వము (universe), సృష్టి వ్యవస్థ (cosmos), బాహ్యాంతరిక్షము (Outer Space) ఇవన్నీ సుమారు సమానార్థకాలుగా వాడుతున్నాము. ప్రపంచము(world) వేరు పదము. భూమి, భూలోకము, భూదేవి, భూగోళము, జగత్తు ఇవన్నీకూడా సమానార్థకాలు కావు. కారు భూమిమీద వెడుతుంది. విమానం ఆకాశంలో వెడుతుంది. అది భూలోకమే. PSLV బాహ్యాకాశంలో వెడుతుంది. అదీ భూలోకపు బాహ్యాకాశమే. చంద్రుడు అనే భూమి తాలూకు ఉపగ్రహం భూలోక బాహ్యాకాశంలోనే ఉన్నది. అక్కడే నీల్ ఆర్మ్స్ట్రాంగ్ పాదంమోపాడు. అది చంద్రలోకం కాదు. భూలోక వ్యవస్థలోనిదే. Planets, Planetary system ఖగోళ శాస్త్రములోని అంశాలు. అవి సూర్యమండలములోని భాగాలు. కంటికి కనపడేవి.
ఊర్ధ్వలోకాలలోని జీవులు ప్రకృతి బద్ధులు కారు. వారిదేహము పంచభూతాత్మకము కాదు. వారు ఒకలోకమునుండి మరియొకలోకమునకువెళ్ళుట క్షణమాత్రములోనే. ఉదాహరణకు నారదుడు సత్యలోక వాసి అనుకుందాం. వారు కల్పాంతం వరకూ ఉంటారు. ఇక్కడ దూరమూలేదు, కాలమూ లేదు. చాలా క్రిందుగానున్న స్వర్గములోనే జీవులకు ముసలితనము, మరణము లేదు. వారు 30 సం వయసులోనే ఉంటారు. కాలమానం వేరుగా ఉంటుంది. ఇప్పుడు మనమున్నది వైవస్వతమన్వంతరం. 14 మన్వంతరాలు బ్రహ్మకు ఒకదినం. మనకు సమీపములోని లోకము పితృలోకము. అక్కడ మన సంవత్సరము వారికి ఒకదినము. సంవత్సరమునకు ఒక సారి శ్రాద్ధకర్మ చేయడం ఉద్దేశ్యం ఇదే. 14 మన్వంతరాలలో సగము పూర్తి ఐతేకాని భూలోక జీవులు సృష్టించ బడలేదు. ఈ మన్వంతరం ప్రారంభములోనే పార్వతీ పరమేశ్వరుల కల్యాణము భూమి మీద జరిగినది. అప్పటికి భూమి మీద జీవులు లేరు. అంతకుముందు దక్ష ప్రజాపతి కథ. అది చాక్షుష మన్వంతరంలో జరిగినది. అంతకు ముందు ఒక రైవత మన్వంతర కథ భాగవతంలో ఉన్నది. బలరాముని భార్య రేవతి. రేవతి రైవత మనువు కుమార్తె. ఆమెకు వరాన్వేషణకై తండ్రీ, కుమార్తె బ్రహ్మలోకం వేడతారు.అక్కడ కొన్ని నిముషాలు ఆలస్యమౌతుంది. వారు తిరిగి వచ్చేటప్పటికి వైవస్వతమన్వంతరం వచ్చేసింది. ఈ కథలు అర్థం చేసుకోడానికి అనంత కాల చక్రం, సర్గ, ప్రతిసర్గల అవగాహన కావాలి.
మీప్రశ్నలకు సూటి సమాధానాలు.
1. సృష్టిలో సృష్టికర్త, అతడి శక్తి ఉన్నారు (ఉన్నాయి).
2. నారదుడు భూలోక కాలమానంలో అనేక యుగాలు, మన్వంతరాలు ఉంటాడు. అతడి లోకంలో అవి నూరేళ్ళే.
3. లోకాల మధ్య సంచార సమయం కోట్లకిలోమీటర్లలో, కాంతి సంవత్సరాలలో ఉండదు. అదితత్ క్షణమే జరుగుతుంది.
4. ఆ ప్రయాణం యోగమార్గం. అదే తపో మార్గం.
5. సిద్ధిపొందిన యోగులు అన్నిలోకాలనూ దర్శింపవచ్చు.
6. శరీరంతో స్వర్గము కాని, యమలోకం కాని ఎవరూ వెళ్ళరు. త్రిశంకుడి గతి తెలిసినదే. విశ్వామిత్రుడు తపస్సు వృధా చేసుకున్నాడు.
నేను చెప్పినది పురాణాల విషయం. Cosmology కాదు. కాని Modern Cosmology లోని expanding universe, many galaxies వంటివి సృష్టిలోని అనేక బ్రహ్మండముల వంటి ఊహలతో సమన్వయము చేసుకొన వచ్చును. space-time అనేది కూడా అవసరము. Worm holes అనే concept తో Time-travel కొంతవరకు అర్థం చేసుకోవచ్చును.
To quote Stephen Hawking - "We are just somewhat an advanced breed of monkeys on a minor planet of a very average star in the cosmos". Still, whether it is Puranas or Cosmology, you can see the level of human intellect at work. I, of course, do not accept Hawking’s view “God no longer has any place in theories on the creation of universe”. It shows his limited understanding of God based on his Christian background.

No comments:

Post a Comment

The Structure of the Universe (Vedic) - Viswaroopa - K. Sivananda Murty Preface 2

https://www.facebook.com/vallury.sarma/posts/616984388338978 The Puranas speak of individuals going up and down between these proximate...