Sunday, January 21, 2018

ఋషి మిథునం - లోపాముద్ర-అగస్త్యుడు

https://www.facebook.com/vallury.sarma/posts/520015874702497


యుగాల పర్యంతం వ్యాపించిన చరిత్ర అగస్త్య మహర్షిది. ఆదిత్యహృదయం, సూర్యస్తోత్రం వంటి స్తోత్రరాజాలకు ఆయన ఋషి. దేవాంశ సంభూతుడు.ఆయన మిత్రుడు (సూర్యుడు), వరుణుడు - వీరికి అప్సరస ఊర్వశిపై గల మోహంతో, ఆ దేవతలు తమ మోహాన్ని (తేజస్సుని) ఒక కుండలో ఉంచివెడితే పుట్టినవాడు. అందుచేత ఆయనను కుంభసంభవుడంటారు. ఆయనను మైత్రావరుణుడు అంటారు. ఆయనలో అగ్నివాయువుల అంశలు కూడా ఉన్నాయి. పురూరవుడు ఊర్వశిని వివాహంచేసుకొని భూమి మీద ఉన్నప్పుడే ఇది జరిగింది.. ఊర్వశికి ఈకథ కూడా తెలియదు. అందుచేత అగస్త్యుడు భూమి మీద జన్మించినా దైవాంశ సంభూతుడు. దేవతలే ఆయనకు సంస్కారాలు చేశారు, పేరు పెట్టారు. అగ+ అస్తి నుండి అగస్త్యుడనే పదం వచ్చినది. అగ అంటే జలమునింపిన కుంభమని ఒక అర్థం ఉన్నది, సూర్యుడు అని ఒక అర్థం ఉన్నది. అగస్త్యుడు గొప్ప శివ భక్తుడు.
అతడొక సారి ఒక అరణ్యంలో తిరుగుతుంటే, ఒక వృక్షానికి కాళ్ళతో తలక్రిందుగా వ్రేలాడుతో తపస్సుచేస్తున్న ఋషులు కనబడతారు. అగస్త్యుడు వారిని ఎందుకు తపస్సుచేస్తున్నారని అడిగిటే వారు పితృదేవతలమనీ భూలోకంలో వారిని సరిగా ఆరాధింపడంలేదనీ చెబుతారు. అగస్త్యుని పిల్లలను కని, వారిని తండ్రులుగా భావించి, అరాధించమని అడుగుతారు. అగస్త్యుడు అంగీకరిస్తాడు. ఇప్పుడు ఆయనకు వధువు కావాలి. ఎవరూ ఆయనకు తగిన వారిగా కనుపించలేదు. అప్పుడు ఆయన విదర్భ దేశం వెడతాడు. అక్కడ రాజుకు పిల్లలులేక తన బాధ ఈయనతో చెప్పుకుంటాడు. అగస్త్యుడు తనకు ఎలాంటి భార్య కావాలో ఊహించుకొని, రాజా! నీకు ఆడపిల్ల పుడుతుంది. యుక్త వయస్సు వచ్చాక తనకు ఇచ్చి పెళ్ళి చేయమని అడుగుతాడు. రాజు అంగీకరిస్తాడు. అలాగే జరుగుతుంది. అమ్మాయి కలుగుతుంది. లోపాముద్ర ఆమె పేరు. మహా సౌందర్యవతి. "ఇంత అందమైన రాజకుమారిని ఒక జడధారియైన ఋషికి ఈయడమా?" లేకపోతే ఆయనకు కోపం వచ్చి శపిస్తాడేమో అని భయం కలుగుతుంది.కాని ఆమె కారణ జన్మురాలు. ఈ కథ తల్లిదండ్రుల వలన విని, అగస్త్యుని వివాహ మాడుతుంది. అగస్త్యుడు లోపాముద్రను వివాహంచేసుకున్న స్థలం నేటి విదర్భలో, నాగపూర్ సమీపంలో, సిద్ధతీర్థంగా పిలువబడుతూంది. యువతీ యువకులకు అక్కడ స్నానంచేస్తే అత్య్త్తమమైన వరుడు కాని, వధువుకాని లభిస్తారని మహార్ష్ట్ర ప్రంతపు ప్రజల విశ్వాసం. వివాహం అవగానే అగస్త్యుడు ఆమె రాజోచిత దుస్తులను అలంకారాలాను వదలి, ఒక తాపసి భార్యకు ఉచితమైన నార చీరలు ధరింపమని చెబుతాడు. అప్పుడు ఆమెను గంగా ద్వార ప్రాంతానికి (నేటి హరిద్వార్) తీసుకొని వెళ్ళీ ఆశ్రమ జీవితం ప్రారంభిస్తాడు. ఆశ్రమ జీవితం చక్కగా గడిచిపోతున్నది. కొన్ని దినాలకు ఆయనకు పితృదేవతలకిచ్చిన వాగ్దానం గుర్తుకు వస్తుంది. భార్యకు చెబుతాడు. ఆమె భర్తతో ఇలా అంటుంది."ఆశ్రమవాస జీవితం బాగానే ఉంది. ఇప్పుడు పిల్లలు అంటే మనము ఇప్పుడు ఉన్న స్థితిలో శొభించదు. నాకు మంచి దుస్తులు కట్టుకుని, ఆభరణాలు ధరించి మీతో స్వేచ్ఛగా విహరించి కొన్నాళ్ళతరువాత పిల్లలు మనకు కలిగితే బాగుంటుంది. మీరు నాకు ఇంతవరకు ఏమిచ్చారు? గృహస్థ జీవితం గడపడానికి ధనం, స్వర్ణం కావాలి" కావాలంటే తమ రూపాలను మార్చుకొని, కనక వర్షం కురిపింపగల తపః శక్తి ఆయనకు ఉన్నది. కాని ఆయనకు తన తపస్సును కర్చుపెట్టాలనిపించలేదు. భార్యతో " సంపాదన కష్టమేమీ కాదు.ఏరాజు ఏరాజునడిగినా ఇస్తాడు. అని సమీపంలోని ఒక రాజ సభకు వెళ్తాడు.
(సశేషం)

No comments:

Post a Comment

The Structure of the Universe (Vedic) - Viswaroopa - K. Sivananda Murty Preface 2

https://www.facebook.com/vallury.sarma/posts/616984388338978 The Puranas speak of individuals going up and down between these proximate...