https://www.facebook.com/vallury.sarma/posts/588337591203658
కేదార్ నాథ్ వరదల్లో కేదారేశ్వరునికీ, గంగమ్మతల్లికి కోపం వచ్చి యాత్రకు వెళ్ళిన భక్తులను రక్షించలేదు అని సెక్యులర్ మీడియా మొసలి కన్నీరు కార్చింది. ఇప్పుడు గుణదల మరియమ్మ, కరుణామయుడైన గొఱ్ఱెల కాపరి, ప్రార్థనతో వర్షాలను ఆపగల అనిల్ అన్నయ్య, చిక్కోలు జామియా మసీదు దేవుడు, మారచిపోయాను ఆంధ్ర ఒడీశా సరిహద్దు లోని మావో, మార్క్సు,లెనిన్ దేవుళ్ళు కూడా తుఫాను, అతివృష్టి నుంచి రక్షణ ఇవ్వలేదని అనకుండా ప్రభుత్వం ఏదోచేయలేదంటారేమిటి? వాతావరణ శాఖ చెబుతూనే ఉంది కదా?
1934 లో బీహార్ లో ఒక భూకంపం వచ్చినది. మహాత్మా గాంధీ తన హరిజన్ పత్రికలో దానిని గురించి వ్రాస్తూ, మనదేశంలోని అస్పృశ్యత వంటి సంఘపాపములవలన ఈ ప్రకృతి విపత్తు సంభవించినది.అని వ్రాశారు. దానికి జవాబు గా రవీంద్రనాథ టాగూర్ స్పందిస్తూ "ప్రకృతి విపత్తులను వ్యక్తుల పుణ్య పాపాలకు అంటకట్టడం సరియైనది కాదు. భూగోళ భౌతిక శాస్త్రం Geophysics భూకంపాలు ఎందుకు వస్తాయో విజ్ఞాన శాస్త్ర పరంగా నిర్వచిస్తుంది. దానికి వ్యక్తుల గుణగణాలకు సంబంధం వెదకటం మత పరమైన అంధవిశ్వాసమనే తలుస్తాను" అని వ్రాశారు. గాంధీ ఆయనలేఖను హరిజన్ ప్రచురిస్తూ నేను గురుదేవుల అభిప్రాయాలను ఆయన వ్యక్తిగతమైనవి గా గౌరవిస్తాను. కాని ఆయన నా దృఢమైన అభిప్రాయాని మార్చలేరు అంటారు.
దేవుళ్లకి తుఫానులకి, వర్షాలకి, వరదలకి సంబంధంలేదంటారు ప్రసాద్ - ఆయన దేవుణ్ణి నమ్మక పోయినా నాకు ఇబ్బందిలేదు. ఒక్కసారి భాగవతంలో గోవర్ధన గిరి ఉద్ధరణను గురించి చదివితే ఆయన అనుమానం తీరవచ్చు. పురాణాలు నేను నమ్మను అంటే - ఆయన ఇష్టం.
దేవుళ్లకి తుఫానులకి, వర్షాలకి, వరదలకి సంబంధంలేదంటారు ప్రసాద్ - ఆయన దేవుణ్ణి నమ్మక పోయినా నాకు ఇబ్బందిలేదు. ఒక్కసారి భాగవతంలో గోవర్ధన గిరి ఉద్ధరణను గురించి చదివితే ఆయన అనుమానం తీరవచ్చు. పురాణాలు నేను నమ్మను అంటే - ఆయన ఇష్టం.
No comments:
Post a Comment