Monday, January 22, 2018

సతీ అనసూయ, సతీ సావిత్రీ, సతీ సుమతీ వీళ్ళందరూ మొగుళ్ళు చేసిన

https://www.facebook.com/vallury.sarma/posts/530391606998257

సతీ అనసూయ, సతీ సావిత్రీ, సతీ సుమతీ వీళ్ళందరూ మొగుళ్ళు చేసిన అడ్డమైన పనులకి వత్తాసు పలికి,మొగుళ్ళని వేశ్యల దగ్గరకి మోసుకుపోయి మన పురాణాల్లో పతివ్రతల్లా కీర్తింపబడ్డారు.......అవి పట్టుకుని వేల సంవత్శారాలనుంచి వాటిని నిజమని మోసుకు తిరుగుతూ ,ఇప్పటికి పతియే ప్రత్యక్ష దైవం అని నమ్మే ఆడవాళ్ళని చూసి జాలి పడు...ఏ చదువులు కూడా వీళ్ళని మార్చలేక పోతున్నాయి . ఒక్కొక్కరు పది భాషలు నేరుస్తారు. ఏం లాభం ఒక్క భావం అర్ధం కానప్పుడు. చదువుకున్న వాళ్ళు కూడా వ్రతాలు చేసుకుంటూ.మొగుడికోసం పూజలు చేసుకుంటూ ఎలా గడుపుతారో . -- వింజమూరివారు వ్రాసినట్లు కొందరు ఆధునిక మహిళల అభిప్రాయం
ఈ పైన చెప్పిన ఆధునిక మహిళలకు ఆవేశంతప్ప సంస్కృతిని అర్థంచేసుకునే విజ్ఞానం లేదు. ఇవి ఒకనాటి చరిత్రలు. కొన్ని కల్పిత గాధలు కాలక్రమంలో చేరి ఉండవచ్చు. వాల్మీకి రామాయణం యొక్క ప్రాముఖ్యత, రంగనాయకమ్మ రామాయణం వలన తగ్గలేదు. దశరథునికి ముగ్గురు భార్యలు అంటే నేటి ఇండియన్ పీనల్ కోడ్ ఉదహరిస్తే సమయం సందర్భం తెలియదనే అర్థం. ఆయన ముగ్గురు భార్యలు ఒక చారిత్రక సత్యం. అది నేటి ప్రజలకు ఆదర్శంగా చెప్పబడలేదు కూడా.
సతీ సుమతి కుష్ఠు రోగి ఐన భర్తను వేశ్య దగ్గరకు తీసుకువెళ్ళడం - ఆనాటి, ఈనాటి సమాజం కూడా హర్షించలేని పని కావచ్చును. - "నేనైతే బుట్టలో మొగుణ్ణి చెర్లో పడవేస్తాను" అని ఒక స్త్రీ అనుకున్నా తప్పు పట్టలేము. అలా అనుకునే స్త్రీకి ఆ పరిస్థితి రానేరాదు. కాని పతివ్రత అనే మాటకు అర్థం తెలియకపోవడం వలన వచ్చిన సమస్య ఇది. వ్రతం అంటే ఏమిటి? ఒక - మొక్కు, ఒక సంకల్పం,ఒక శపథం. ఉదాహరణకు సత్య వ్రతం, మౌన వ్రతం, మొదలైనవి. హరిశ్చంద్రునికి సత్యవ్రతం ఎందుకు? విశ్వామిత్రునికి "రాజ్యం ఉన్నప్పుడు మీరడిగినది ఇస్తానన్నాను, కాని ఇప్పుడు కుదరదు" అని చెప్పవచ్చు కదా! అన్ని కష్టాలు ఎందుకు పడాలి? కాని ఆయన వ్రతం వలననే ఆయన కథ నిలిచి ఉన్నది. సుకన్య భర్త వేశ్య వద్దకు వెడతానంటే అది ఆమెకు ఆనందం కలిగించి ఉంటుందని ఎవరూ అనుకోరు. సుకన్య కనుపించని దేవుని కంటె ఎదురుగా ఉన్న భర్తని దేవునిగా చూచి ఆయన ఆజ్ఞ శిరసావహిస్తాను అని అనుకుంది. ఆ వ్రతం వలన మరొక స్త్రీకి వచ్చిన నష్టం ఏమున్నది. నేను భర్త ఒక్క తప్పుని కూడా క్షమించను, విడాకులిస్తాను. -- అని ఒక ఆధునిక పతివ్రత వ్రతం పట్టినదనుకోండి. కాల క్రమేణా ఆవిడ కథ భవిష్యత్తులో ఎప్పుడో పురాణం కావచ్చు. పురాణం చెప్పినది ఒక వ్రతాన్ని నిష్ఠగా ఆచరిస్తే ఫలం వస్తుందని. ఆ ఫలంతో సుమతికి సూర్యుణ్ణి ఆపే శక్తి వచ్చింది. కేసు బలంగ ఉంటుందని సతీ అనసూయ, సతీ సావిత్రుల పేర్లు చేర్చారు. వాళ్ళు మొగుడి పనులకు ఎప్పుడు వత్తాసు పలికారు? ఆ కథలు వినాలని ఉంది.
ఇప్పుడు అడ్డమైన వ్రతాలూ పట్టి గిన్నెస్ బుక్ లో పేరు సంపాదించటంలేదూ. ఆ మూర్ఖత్వాన్ని ఎవరూ విమర్శించరేం?

Vinjamuri Venkata Apparao ఈ కాలం లో ముగుడి కొరకు పూజలు చేస్తున్నారు.. బాగానే ఉంది. మంచిదే... కానీ ఆమోగుడు ని సరిగ్గా చూసుకోవటం లేదు... వారి తో కాలం గడపటం లేదు. అందుకే ముగుడు పక్క దారులు త్రొక్కే అవకాసం ఉంది. అని నా భవాన... వ్రతాలు అంటో మొగ్గుని పస్తులు పెట్టె వాళ్ళను నేను చాలా మందిని చూసాను.
అలాగే భార్యకు భర్త సహయం చెయ్యాలి...అప్పుడే సంసారం సుఖముగా సాగుతుంది.


Vvs Sarma భార్య వ్రతాలు ఆమె విశ్వాసం. భర్తను సరీగా చూడటం అంటే అర్థం ఏమిటి? నాదృష్టిలో ఈనాటికీ భార్యలే భర్తలను సరిగా చూస్తున్నారు. భర్తలు ఆమె పనులను ఒత్తిడులనూ గమనించరు. తమ ఆఫీసే లోకమనుకుంటూ మిగిలిన సమయం తమను భార్య సేవించాలని అనుకుంటారు. భర్తలే భార్యలకు , పిల్లలకు సమయం కేటాయించరు. ఇంటి బాధ్యత అంతా ఆమెమీదే పడుతుంది. భర్తే కాదు అత్తగారు, మామ గారు కూడా ఉచిత సలహాలు పడేస్తూ ఉంటారు. మనుషులలో రెండు రకాలూ ఉండవచ్చు. 75 శాతం కేసులలో భర్తలదే పొరపాటు అనిపిస్తుంది. ముఖ్యంగా వివాహాల సమయంలో పెళ్ళికొడుకు తరఫు వారి ప్రవర్తన వారిదే అధికారం అన్నట్లు ఉంటుంది. పెళ్ళి ఆడపెళ్ళి వారి ఇంటిలోని కార్యక్రమం. కన్యాదాత దగ్గర దానం స్వీకరిస్తూ, ఆయన ఆతిథ్యం తీసుకుంటూ,మాదే పైచేయి అన్నట్లు మగ పెళ్ళివారు వ్యవహరించడం ఈనాటికీ కనుపిస్తూంది. అక్కడే మొదలవుతుంది ఆడపిల్లల చేదు అనుభవం.

No comments:

Post a Comment

The Structure of the Universe (Vedic) - Viswaroopa - K. Sivananda Murty Preface 2

https://www.facebook.com/vallury.sarma/posts/616984388338978 The Puranas speak of individuals going up and down between these proximate...