Thursday, January 25, 2018

On Cosmologies – 4

https://www.facebook.com/vallury.sarma/posts/576741595696591

బ్రహ్మమునకు గుణాలులేవు. ఇంకో విధంగా చెప్పాలంటే సత్త్వ రజో తమో గుణాలు సమ తౌల్యంలో ఉంటాయి. ప్రకృతి (మాయ) సంపర్కం కలిగినప్పుడే గుణాల సమతౌల్యం చెదురుతుంది. అదే సృష్టికి సంకల్పం. ఆరంభం. మహావిష్ణువు సత్త్వగుణస్వరూపుడు. విష్ణుమాయ ఆయన శక్తి. రజొగుణం ఉంటే గాని సృష్టి నడవదు. దానికి ప్రతిరూపమే బ్రహ్మ సృష్టి. దానిని రక్షించే విష్ణ్వంశ సత్త్వ గుణ ప్రధానము. మాయా జనిత సృష్టి అనిత్యము. అసత్యము. దానికి ఆరంభం ఉన్నట్లే అంతం ఉండాలి. అందుకే బ్రహ్మ నుండి రుద్రుని ఆవిర్భావం. సృష్టితోనే కాల గణన. దేశకాలాల లెక్క. (ఇదే Space-Time) రుద్రుడే కాల స్వరూపుడు. మృత్యుదేవతయే కాలుడు. కాల గణనం సృష్టి తోనే మొదలయింది. విష్ణువు, బ్రహ్మ రుద్రులు వరుసగా 3, 4, 5వ బ్రహ్మలు. సదాశివ, కామేశ్వర, మహావిష్ణు, బ్రహ్మ రుద్రులనే పంచ బ్రహ్మలంటారు. బ్రహ్మాండం బ్రహ్మ సృష్టియా, లేక మహావిష్ణు సంకల్పోద్భవమా? అనే విషయం పై పురాణ కథనాలలో వ్యత్యాసం కనబడుతుంది. మనమున్న పరిమిత విశ్వం మన బ్రహ్మాండం. దానికి కార్యబ్రహ్మలు బ్రహ్మ, విష్ణువు, రుద్రుడు. పాల సముద్రం పై శయనించే మహావిష్ణువు అనంత విశ్వంలోనివారు. అక్కడ అనేక బ్రహ్మాండాలు ఉంటాయి. ఆ మహావిష్ణువు పాదాంశతోనే మన పరిమిత బ్రహ్మాండం సృష్టించ బడినది. 
     
అండం అనే పేరు పరిమిత తత్త్వాన్ని సూచిస్తుంది. ఆధునిక సైన్స్ పరిభాషలో Ellipsoid అది గుడ్డు ఆకారంలోని ఘనపదార్థం అని కాదు. అనంతవిశ్వంలోని పరిమిత వ్యవస్థ. ఇంకో అండం కూడా ఉంది. అది మార్తాండం. (మృత అండం) అది సూర్యుడు. ఈ బ్రహాండంలోనే 14 లోకాలనే స్థానాలను బ్రహ్మ సంకల్పించాడు. బ్రహ్మ ఉన్న స్థానానికి బ్రహ్మలోకమని పేరు.అదేసత్యలోకం. దానిక్రింద వరుసగా తపోలోకం, జనోలోకం, మహర్లోకం, సువర్లోకం (స్వర్గలోకం)భువర్లోకం (ద్యులోకం) భూలోకం,దానికి దిగువగా అతల, వితల,సుతల,తలాతల, మహాతల, రసాతల, పాతాళాలనే ఏడు అధోలోకాలను సృష్టించాడు. భూమిని పైనున్న ఏడులోకాలను ఊర్ధ్వలోకాలంటారు. ఇప్పుడు క్రమంగా పైనుండి క్రిందవరకూ ఉన్న లోకాలలో జీవులను సృష్టించాడు. ఈ జీవులు క్రొత్తవికాదు. అంతకు పూర్వసృష్టిలో ఉండి ప్రళయ కాలంలో మహావిష్ణువు యందు అంతర్గతమైనవే. బ్రహ్మ వాటికి తగు శరీరాలు ప్రకృతిలోని తత్త్వాలతో కల్పించి, ఆయాలోకాలలో ప్రవేశ పేట్టాడు. కాల గణన జీవులదే. ఈ కాల గణన సృష్టి తోముడి పడి ఉన్నది.
ఇప్పుడు మన భౌతిక శాస్త్రం చెప్పే కాస్మాలజీకి, మన వేద పురాణాలు చెప్పే బ్రహ్మాండ విజ్ఞానానికి సమన్వయము సాధ్యమా?అనే ప్రశ్న వస్తుంది. వేద,పురాణాలలో ఆధునిక విజ్ఞానం దాగి ఉన్నదని చెప్పటం నా ఉద్దేశ్యంకాదు. మనకున్న ఆధునిక విజ్ఞానంతో మన ఋషులు వేల సంవత్సరాలపూర్వం చెప్పిన పురాణాలను సరిగా అర్థంచేసుకోగలమా? అన్నది సరియైన ప్రశ్న. ఇవ్వాళ మన హిందూ మతమంతా పురాణాలపై ఆధారపడినదే. సత్యనారాయణ వ్రతం చేసుకుంటున్నామంటే అది స్కాంద పురాణంలోనిది. మకర సంక్రాంతి, మేష సంక్రాంతి (తమిళ సౌరమాన సంవత్సరాది) సూర్యుని రాశి చక్ర పరిభ్రమణం మీద ఆధార పడినది. మన వయస్సు భూమి తనచుట్టు, సూర్యుని చుట్టూ చేసే పరిభ్రమణాలపై ఆధారపడినది. జ్యోతిష శాస్త్రం, పంచాగం లేనిదే హిందూ మతంలేదు.
To be continued

No comments:

Post a Comment

The Structure of the Universe (Vedic) - Viswaroopa - K. Sivananda Murty Preface 2

https://www.facebook.com/vallury.sarma/posts/616984388338978 The Puranas speak of individuals going up and down between these proximate...