https://www.facebook.com/vallury.sarma/posts/581428421894575
ఆధునిక విశ్వ విజ్ఞానాన్ని గురించి ఆలోచనలో ఉండగా రెండు విషయాలు నా దృష్టిని ఆకర్షించాయి. మొదటిది ఈ సంవత్సరపు భౌతిక శాస్త్ర నోబెల్ బహుమానాలు. రెండవది సూర్యసిద్ధాంతము అనే ప్రాచీన హిందూ ఖగోళ శాస్త్ర గ్రంధము.
చాలా మంది ఊహించినట్లుఈ సంవత్సరం భౌతిక శాస్త్ర బహుమతి బెల్జియంకు చెందిన ఫ్రాన్స్వా ఎంగ్లెర్ట్, బ్రిటిష్ శాస్త్రవేత్త, పీటర్ హిగ్స్ లను వరించింది. వీరు తమ పరిశోధనలలో హిగ్స్ బోసాన్ అని పేరు పెట్టబడిన ఒక కణం ఉనికిని గురించి ఊహించారు. బోసాన్ అనే పేరు మనకు గర్వకారణం. ఇది భారతీయ శాస్త్రవేత్త సత్యేంద్రనాథ్ బోస్ పేరుమీద వచ్చిన సూక్ష్మకణం. బోస్ (1894-1974) - ఆయన ఢాకా విశ్వవిద్యాలయంలో పనిచేసే రోజులలో 1922 లో తన ఊహలు ఒక పరిశోధనా పత్రంగా ఐన్ స్టీన్ కు పంపించారు. ఐన్ స్టీన్ దానిని జర్మను భాషలోనికి అనువదించి ఒక జర్మన్ జర్నల్ లో ప్రచురించారు. ఇది తరువాత కాలంలో బోస్ - ఐన్ స్టీన్ స్టాటిస్టిక్స్ గా పిలువబడినది. ఇది ఫోటానులనే కాంతి కణాల అధ్యయనానికి పనికి వస్తుంది. హిగ్స్ ఈ కాంతి వేగంతో ప్రయ్యాణంచేసే బరువులేని కణాలనుండి, బరువున్న పరమాణువులు సృష్టించబడే ప్రక్రియ (mechanism) ప్రతిపాదించాడు. అందుకే ఆమధ్య హిగ్స్ బోసాన్ కే సంబంధించినప్రయోగాల విజయంతో ఆయన ఊహ కొంతవరకు నిరూపింపబడినది. ఆకారణంగా మన పత్రికల ఆ కణాన్ని దైవ కణం (God Particle) అని వర్ణించాయి. ఈ ఎన్నిక కొంత వివాదాస్పదం కూడా అయింది. సిద్ధాంతపరమైన ఊహ (Mathematics based theory) కి భౌతిక శాస్త్రబహుమతి ఈయడమేమని ప్రశ్న. ఆనాడు ఐన్ స్టీన్ కు కూడా నొబెల్ బహుమతి సాపేక్ష సిద్ధాంతానికి రాలేదు. ప్రయోగాలద్వారా నిరూపింపబడిన కాంతి-విద్యుత్ ఫలితం (Photo-Electric Effect) కు 1921లో వచ్చింది.
మన శాస్త్ర, పురాణ గ్రంథాలలో గల విశ్వ సృష్టి రహస్యాలను, వైదిక సృష్టి నిర్మాణశాస్త్రాన్నీ(కాస్మాలజీ) అధ్యయనంచేయాలంటే బ్రహ్మాండపురాణాన్నీ, విష్ణు పురాణాన్ని వైజ్ఞానిక దృష్టితో చదవాలి. మన ప్రాచీన ఖగోళ, జ్యోతిష శాస్త్ర గ్రంధం సూర్య సిద్ధాంతము" చదవాలి. వరాహ మిహిరుని బృహత్ జాతకము చదవాలి. అప్పుడు జ్యోతిషంయొక్క రూపురేఖలు కించిత్తు అర్థమౌతాయి. మనం వీటిని కొంచెం రుచిచూద్దాము. మొదట సూర్య సిద్దాంతము.
To be continued
No comments:
Post a Comment