https://www.facebook.com/vallury.sarma/posts/579747115396039
నిన్న వ్రాసిన దానిపై సుమాలినీ సోమా గారి స్పందన -- I feel like I understood some but not most of it. I know you have a lot of depth to what you say. ఇది చూచాక నేను ఇంకా విపులంగా వ్రాయవలసినది - అనిపించింది. మొదట ధ్రువోపాఖ్యానం లోని వచనం. ప్రస్తుతం ఇది చాలా మందికి అర్థంచేసుకోవడం కష్టమే.
మేధియందు బరిభ్రామ్యమాణ గోచక్రమును బోలె --- మేధి అంటే పశువులను కట్టే రాట (pole) ఒక పలుపుతో రాటకు ఆవుని కట్టితే ఆ కట్టుకొయ్య చుట్టూ పశువు ఎలా తిరుగుతుందో అలాగే
గ్రహనక్షత్ర తారాగణ జ్యోతిశ్చక్రంబు నక్షత్రరూపంబులైన ధర్మాగ్ని కాశ్యప శక్రులును, సప్తర్షులును, దారాసమేతులై ప్రదక్షిణలు తిరుగుచుండురట్టి --- గ్రహములు, నక్షత్రములు, తారాగణములు (constellations), నక్షత్ర రూపములై యమ, అగ్ని, కాశ్యప (భూమిని కాశ్యపి అంటారు) ఇంద్రుడు, సప్తర్షులు, వారి భార్యలు ప్రదక్షిణాలు చేసే స్థిర స్థానమే ధ్రువ సదనం. ఈ తేజోరూపులైన వారందరూ ఉండే ఊర్ధ్వలోకాలను నక్షత్ర మండలాలుగా భావించడం జరిగినది. సప్తమహర్షులెవరు అని అదిగితే అనేక పేర్లను చూచి ఉంటారు. ఈ అనంతకాల చక్రంలో అనేక నక్షత్రాలు ఆయా స్థానాలను ఆక్రమించాయన్న మాట.

ఉదాహరణకు ఒక సప్తర్షుల సమూహం - మరీచి, అత్రి, అంగీరస, పులహ, పులస్త్య, క్రతు వశిష్ఠులు. ఇంకొక పట్టికలో పులస్త్యుని బదులు భృగువును, అగస్త్యుని చేర్చారు. ఈ అగస్త్యుడు - Southern Pole star. ఇంకొక పట్టికలో కశ్యప, అత్రి, వశిష్ఠ, గౌతమ, జమదగ్ని, భరద్వాజ, విశ్వామిత్రులున్నారు. మొదటి పట్టిక స్వాయంభువ మన్వంతరానికి, చివరచెప్పినది వైవస్వత మన్వంతరానికి సంబంధించినది. ఇతర మన్వంతరాలకు కూడా వేరు వేరు సప్తర్షులున్నారు. మనుష్య జీవితానికి, బ్రహ్మాండానికి గల సంబంధమే జ్యోతిషం. బలి చక్రవర్తి రాబోయే మన్వంతరంలో ఇంద్రుడు. ఆంజనేయుడు బ్రహ్మ.
నేడు హిందూమతంగా వ్యవహరించబడే సనాతన ధర్మం ఋషులు, వారి తపస్సులు, వారు దర్శించి మనకు ఇచ్చిన అపార వాఙ్మయము మన ధర్మానికి పునాదులు. వాళ్ళవలననే మనకు మన వేదాలు, దేవతలు, ఉపాసనలు, యజ్ఞాలు లభించాయి. సృష్టిలో రెండు రకాలుగా భూమిమీద మానవాళి వచ్చినది. బ్రహ్మసృష్టిలోనే బ్రహ్మ చేత మానస పుత్రులుగా సృష్టింపబడిన సనకాదులు, మహర్షులూ, ప్రజాపతులూ మొదట సృష్టింపబడిన ఊర్ధ్వలోకాల నుండి వచ్చి తరువాత ఎన్నడో భూమి మీద మనుష్యులను ఇతర జీవరాశులను సృష్టించారు. సృష్టి జరగడానికి స్త్రీపురుష భేదాలు, పరస్పర ఆకర్షణ,అవసరమయింది. సృష్టిలో పరిణామాలు Creation -- Re-Creation --- Procreation. అందుచేత మనకు పాశ్చాత్యుల వలె Creation theory or Evolution Theory అనే వివాదంలేదు. మనది Creation and Evolution మనకు వందలాది ఋషులు అవతారాలు గురువులు సృష్టిద్వారా లభిస్తే కోట్లాది మనుష్యులు, జీవరాశులు పరిణామం ద్వారా జన్మిస్తారు. వీళ్ళ గతులు భూమికి సమీపవర్తులైన అంతరిక్షం, ద్యులోకాలలో ఉంటాయి. భౌతిక శాస్త్రము పంచభూతాలతో నిర్మింపబడని జీవులను గుర్తించే స్థితికి ఎన్నటికీ చేరలేక పోవచ్చు. When does the progress in science reach a road block? What are the limits of science? ఇవి ఆలోచించదగిన విషయాలు.
No comments:
Post a Comment