మనుష్యులెవరైనా,నేనైనా చనిపోయిన తర్వాత కాలిస్తే బూడిదౌతాం. పూడ్చిపెడితే మట్టిలో కలిసిపోతాం. అంతే. అప్పటితో మన చరిత్ర క్లోజ్. మూడో రోజు కర్మని,పదకొండో రోజు కర్మని చేసేదంతా బ్రహ్మల బతుకుతెరువుకే. గోదానాలని, వస్త్ర దానాలని రక రకాల సామాగ్రిని మోసుకుపోయేది పురోహితుడే. వాళ్ళ జరుగుబాటుకు కావాల్సిన వస్తువులన్ని కొండపల్లి చాంతాడంత రాసిస్తారు. ఈ అత్యాధునిక సమాజంలో కూడా ఈ చావు కర్మకాండలు నిర్విఘ్నంగా కొనసాగడం మహా విసుగ్గా ఉంది. ఆత్మలని,అవి కాకుల రూపంలో తిగుతాయని,శ్రాద్ధకర్మలు సరిగ్గా చెయ్యకపోతే అవి నరకానికి పోతాయని సామాన్య మానవుల్ని భయభ్రాంతుల్ని చేసి పురోహిత వర్గం తమ పబ్బం గడుపుకుంటున్నారన్నది నగ్నసత్యం. ఇది హిందువులకు మాత్ర్రమే ఉన్న ఓ పెద్ద మూఢనమ్మకం.
వ్యాఖ్య
మనుష్యులను కాల్చరు. పూడ్చరు . ఒక సుబ్బారావు గారు చనిపోతే, మిగిలేది ఆయన శవం. ఒక జాన్ గారికైనా ఖాన్ గారికైనా అంతే. ఆయన శవం ఆయన కాదు. ఆయన పాత చిరిగిన శిధిలమైన బట్టల వంటిది మృతశరీరం. అది ఆయన ఉపకరణం అంతే. ప్రాణం ఉంటేనే మనిషి. సమాజంలో అందరూ బతకాలి. వైద్యులు వైద్యంచేస్తారు. కాటి కాపరులు శవాలను కాలుస్తారు. బ్రాహ్మణులు వైదిక కర్మకాండ చేస్తారు. అదివారి బ్రతుకు తెరువు. నాది గొప్ప అభిప్రాయం. ఇతరులది మూడ విశ్వాసం అనుకోవడం సహజం. కాని అవి వ్యక్తిగతం. ఆత్మ, ప్రేతాత్మ, యమలోకం, నరకం , స్వర్గం ఉన్నాయని మతగ్రంధాలు చెబుతాయి. నమ్మడం నమ్మక పోవడం మళ్ళీ వ్యక్తిగత అభిప్రాయములే. ఎదుటివారిది మూఢనమ్మకం అనడం మూఢనమ్మకం కాదు, కేవలం మూఢత్వం. రామ గోపాల వర్మ సినిమాలు, తెలుగు సీరియల్సు చూచేవారు బ్రాహ్మలు భయపెడితే భయపడడము పెద్దజోక్.
No comments:
Post a Comment