Tuesday, January 23, 2018

చరిత్ర వ్రాసిన వారి దృష్టికోణం నుండి ఉంటుంది

Shivaram Mamindlapalli - చరిత్ర వ్రాసిన వారి దృష్టికోణం నుండి ఉంటుంది. మనం 1857 సంఘటనలని ప్రథమ స్వాతంత్ర్య సమరం అంటాము. బ్రిటిష్ వారు సిపాయిల తిరుగుబాటు అంటారు. మనం భారతీయ సంస్కృతి అంటాము. పాశ్చాత్యులు అనాగరికులైన ఇండియన్లకి నాగరికత, సుపరిపాలన నేర్పాము.వారు స్వాతంత్ర్యానికి తగరు అంటారు. (కాథరిన్ మేయో - మదర్ ఇండియా) దానిని మనం మురుగు కాలువల పరీక్షకుడు వ్రాసినది అంటాము. అమెరికనులు దానిని 60 సంవత్సరాలు అమెరికా యాత్రికులకు చదవడానికి ఇచ్చేవారు. హైదరాబాద్ రాష్ట్రంలో ఆంధ్రను కలపలేదు. హైదరాబాదు రాష్ట్రాన్ని మూడూ విభాగాలు చేసి ఏ భాషప్రాంత్రాన్ని ఆ రాష్ట్రంలో కలిపారు. మీరు 1956 గురించి మాట్లాడుతున్నారు. ఉత్తర సర్కారులు గోల్కొండ నవాబుల పాలనలోనివే. నైజాబునవాబు దరిద్రంతో రక్షణకు బ్రిటిష్ వారికి అయ్యే ఖర్చులు భరించలేక ఉత్తర సర్కారులను, తరువాత సీడెడ్ జిల్లాలను బ్రిటిష్ వారికి సమర్పించుకున్నారు.మీ అభిప్రాయాలు మీవి. 1956 నుండీ 2013 వరకు హైదరాబాదు వచ్చిన కోస్తావారిని, సీమ వారిని సెట్లర్స్ అనేవారిని ఏమనాలో తెలియడంలేదు. వికిపీడియా ను వేదం అనుకోకండి. సమాచారాన్ని ఇస్తుంది. సత్యానికి గారంటీ ఈయదు. మీరూ నేను ఉద్రేక పడినా విభజన ఆగక పోవచ్చును. దాని వలన ఇరు ప్రాంతాలవారికీ లాభ నష్టాలు ఉంటాయి. కర్ణాటకలో నివసిస్తున్న నాకు ఈ దూరానికి ఈ విభజన గురించి సెంటిమెంట్లు లేవు. పాకిస్తాన్ నాటి ముస్లిముల కోరిక. కాని దేశం ముస్లిం పాకిస్తాన్, హిందూ, ముస్లిం, క్రిస్టియన్ ఇండియాగా విభజింపబడి ఆ విభజన నేటి వరకు సమస్యలను శత్రుత్వాన్ని పెంచింది. ఆంధ్ర, సీమ ప్రాంతాలను తెలంగాణా నుండి వేరుచేసినా హైదరాబాదులో వారి ఉనికికి తేడారాదు

No comments:

Post a Comment

The Structure of the Universe (Vedic) - Viswaroopa - K. Sivananda Murty Preface 2

https://www.facebook.com/vallury.sarma/posts/616984388338978 The Puranas speak of individuals going up and down between these proximate...