దేవుడు లేడు. నిజమా? ఎవరన్నారు? ఈ వాక్యానికి అర్థం ఉందా? మన ప్రాచీనులకు ఈ సమస్య రాలేదు. మనకు ఎందుకొస్తోంది? దేవుడులేడు అనేది సత్యవాక్యం కాదు.దేవుడు ఉన్నాడు అంటే అది జ్ఞానం. లేడు అంటే అది అజ్ఞానం. జ్ఞానం అంటే ఏమిటి? జ్ఞానం అంటే ఎరుక (awareness). అజ్ఞానం అంటే ఆ ఎరుక లేక పోవడం. దేవుడు లేడన్న వాక్యం ఆ మాట చెప్పిన వ్యక్తి యొక్క అజ్ఞానాన్ని సూచిస్తుంది. . నేనెవరు ఈ మాట చెప్పడానికి? నీవు జ్ఞానివా? అని నన్ను ప్రశ్నించవచ్చు. ఒక వాక్యం సత్యమో అసత్యమో తేల్చడము ఒక శాస్త్ర దృష్టి. అది ఒక వ్యక్తి అభిప్రాయం కాదు. ఇలాటి శాస్త్రాలున్నాయా? మన దేశంలో ఉండేవి. ఇప్పటికీ కొనఊపిరితొ ఉన్నాయి. మన విద్యావిధానంలో లోపం వలన వానిని తెలుసుకునే అవకాశం అందరికీ ఉండటంలేదు. వీటిని దర్శన శాస్త్రాలు అంటారు. అంటే నీకు విషయాన్ని కళ్ళకు కట్టినట్లు చూపిస్తాయి అని అర్థం. ముఖ్యంగా జ్ఞానాన్ని గురించి తెలియచేసేవి న్యాయ వైశేషిక దర్శనాలు. వాటి ఋషులు గౌతముడు, కణాదుడు. న్యాయం వస్తువుల, పదార్థాలను గురించిన జ్ఞానం ఇస్తుంది. వైశేషికం పదార్థాల అస్తిత్వాన్ని, పరిణామాన్ని, తత్త్వాన్నీ తెలియచేస్తుంది. వీటిని ఆంగ్లంలో Epistemology, Ontology అని పిలుస్తారు.వీటి అవగాహన ఉంటే "దేవుడున్నాడా? జ్యోతిషం, హొమియోపతీ వైద్యం సైన్సులా?" ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు వెతుక్కోవచ్చు. (సశేషం)న్యాయ వైశేషికాలలో కణాదుని వైశేషికం ప్రాచీనం. ఆయన దర్శనానికి ఔలూక్య దర్శనం అనేపేరు కూడా ఉంది. ఉలూకం అంటే గుడ్లగూబ. చీకటిలో చూడగలిగినది. అజ్ఞానంనుండి జ్ఞాన సముపార్జనకు సంకేతం కావచ్చును. కణాదుడు సృష్టిలో ఆరు పదార్థాలున్నాయి అని చెప్పాడు. ఆ ఆరు పదార్థాలతో సృష్టిరహస్యాన్ని అర్థంచేసుకోవచ్చు అని చెప్పాడు. అవి ద్రవ్యం, గుణం, కర్మ, సామాన్యం, విశేషం, సమవాయం అనేవి. తరువాత వారు అభావాన్ని కూడా చెప్పారు. అప్పటినుండి వైశేషికానికి సప్తపదార్థి అన్నపేరు వచ్చింది. జ్ఞానం అంటే దేనినిగురించిన జ్ఞానం? ఒక వస్తువు ఉండాలి. ఉన్న ఏవస్తువుకైనా మూడు లక్షణాలు ఉండాలి - అవి అస్తిత్వం, జ్ఞేయత్వం, అభిదేయత్వం. అంటే మొదట ఒక వస్తువు ఉండాలి. దానిని తెలుసుకోగలిగి ఉండాలి. దానికి ఒక పేరు ఉండాలి. ____________________
ఒక ప్రశ్న తప్పక వస్తుంది. అనేక మంది విజ్ఞానవేత్తలు నోబెల్ బహుమతి గ్రహీతలు కూడా నాస్తికులు. ఉదాహరణకు రిచర్డ్ డాకిన్స్ అనే బ్రిటిష్ జీవ శాస్త్రజ్ఞుని విషయం తీసుకోండి. ఆయన పుస్తకాలు, The selfish gene, the blind watch maker, The God Delusion వంటివి ప్రసిద్ధమైనవి. కాని వీరి వ్రాతలు చూస్తుంటే వారికి దేవుడు గురించి ఉన్న అవగాహన కేవలం బైబిలు లో క్రైస్తవుల, మత ప్రచారకుల, పరిమిత జ్ఞానం. కాని వీరిని చూచి నేర్చుకున్న అనేక హిందూ శాస్త్రజ్ఞులభావాలు కూడా అలాగే ఉంటాయి. ఆధునిక వైజ్ఞానిక దృక్పథం భగవంతుని చేరే మార్గమూ కాదు, వారు ప్రజలకు ఆదర్శమూ కాదు. సైన్స్ యొక్క, మానవ మేధస్సు యొక్క పరిమితులు తెలియకపోవడం వలన కలిగిన నష్టం ఇది.
_________________
Musings – 3 (June 28, 2013)
దేవుడు లేడు అంటే - దేవుడు అనే మానవాకారం గల వ్యక్తి ఆ చెప్పిన వాడికి, వాడి పరిమిత పరిధిలో ఎక్కడా కనపడలేదని అర్థం. అంచేత సత్య వాక్యంగా చెప్పాలంటే ఇలా చెప్పాలి. “చార్వాకుడనే ఆయనకి, దేవుడు ఇలా ఉంటాడని తాను ఊహించుకున్న వ్యక్తి, తాను తిరిగిన ప్రాంతంలో కనపడలేదు.” ఇది ఎవరూ ఖండించరు.
బ్రహ్మ వస్తువు అంటే సమస్యలేదు. దానిని వర్ణించలేము. దానికి ద్రవ్యము (matter), గుణము (quality), కర్మ (action), సామాన్యము (general characteristics), విశేషము (special attributes), సమవాయము (inherence), మొదటి ఆరు లక్షణాలూ లేవు. ఇక్కడ అభావము పనికి వస్తుంది. అభావము అంటే ఏమీలేకపోవడం (absence). నిర్గుణం, నిరాకారం, నిరంజనం. కాబట్టి అది నిత్యము, సత్యము. ఆకాశానికి కొలతలేమిటి? బ్రహ్మము అంతే. నిజానికి సృష్టిలో మొదటిది పంచ భూతాలలో ఆకాశమే.
యథార్థ జ్ఞానాన్ని సంపాదించడానికి కావలసిన రెండవ శాస్త్రము న్యాయ శాస్త్రము. గౌతముడు దీని ఋషి. రామాయణ కాలం నాటిది అయిఉండవచ్చు. గౌతముడు గోత్రకర్త. అనేక గౌతములున్నారు. న్యాయ సూత్ర కర్తను అక్షపాద గౌతముడు అంటారు. ఆయన సూత్ర గ్రంధంలో ప్రధమ సూత్రము ఇలా ఉంటుంది.
ప్రమాణము, ప్రమేయము, సంశయము, ప్రయోజనము, దృష్టాన్తము, సిద్ధాన్తము, అవయవము , తర్కము, నిర్ణయము, వాదము, జల్పము, వితణ్డము, హేత్వాభాస, చలము, జాతి, నిగ్రహస్థానము అనే పదహారు విషయములను తెలుసుకోవడం వలన వలన గమ్యమునకు చేర్చే (మోక్షాన్నిచ్చే) యథార్థ జ్ఞానము లభిస్తుంది. ఈ న్యాయ శాస్త్రాన్ని సామాన్యంగా Indian logic అంటారు. కంప్యూటర్ సైన్స్ లో వాడే knowledge engineering అనే పదం ఎక్కువ తగినది అని నా అభిప్రాయం. న్యాయ తర్కాలు, వైశేషికం కలిపి ఒక తరహా ఆస్తిక దర్శనాలు. ఆస్తిక అనే పదానికి దేవుని ఉనికికి సంబంధములేదు.
విశ్వము అనే నాటకములో దేవుని పాత్ర ఏమిటి? - ఇది కూడా ఆలోచింపవలసిన విషయము. All the world is a stage, all the men and women are players. అన్న షేక్స్పియర్ కథనానికి మనం కొంచెం చేర్చి Do not forget nature అని అనవచ్చును. నేటి హిమాలయ విలయంలో, హిమాలయ పర్వతాలు, గంగ, భాగీరథి, మందాకిని, అలకనంద నదుల ప్రముఖ పాత్రను కూడా స్మరించుకోవచ్చు. Nature is a component of God. దేవుడు అనే పదాన్ని, పదార్థాన్ని తెలుసుకుంటే "దేవుడులేడు" అన్నవాక్యం అజ్ఞానానికి పరాకాష్ఠ. "చేరి మూర్ఖుల మనసు రంజింపరాదు".

______________
Musings 4 - 29 JUNE 2013
దేవుడు ఉన్నాడు (/లేడు) అనే వాక్యాలని నేను చెప్పినది - దేవుని ఉనికిని గురింవి, నేను వకాల్తా తీసుకున్నానని కాదు. అది రెండు పదాలు గల ఒక తెలుగు వాక్యం. దాని అర్థం దేవుడనే వస్తువుని గురించిన నా ఊహ, ఒక ఆలోచనతో నేను వాక్యం పలికాను, వ్రాశాను. ఆ వాక్యం వెనుక నా ఆలోచన ఏమిటి? దానిని వినిన లేదా చదివిన వారు ఎలా అర్థం చేసుకున్నారు? ఎలా వారి ప్రతిక్రియ వ్యక్త పరిచారు? - మన FB వ్యాఖ్యలు చూస్తే అర్థమౌతున్నది.
నేను చెప్పదలచినది మనము ఒక మాట సరిగా చెప్పాలంటే, లేదా మరియొకరి మాట సరిగా అర్థం చేసుకోవాలంటే శాస్త్ర దృష్టి కావాలి. ఇక్కడ సాధనాలుగా న్యాయ, వైశేషికాలను గురించి చెప్పాను. పాశ్చాత్య నాగరికతలోని Scientific outlook భారతీయ తత్త్వ దృష్టి కంటె సంకుచితమైనది. న్యాయ వైశేషికాలు మాత్రమే సరిపోవు. కావలసినవి భాషా జ్ఞానం (శబ్ద జ్ఞానం). దానిని ఇచ్చేది వ్యాకరణం. అందుకే మన వాళ్ళు వ్యాకరణాన్ని దర్శనంగా పరిగణించారు. భాషను శాసించేది వ్యాకరణం. వేయి సంవత్సరాల క్రితం మహాభారతాన్ని తెలుగులో అనువాదంచేయడానికి నన్నయ భట్టు ఆంధ్రశబ్ద చింతామణి అనే మొదటి తెలుగు వ్యాకరణాన్ని సంస్కృతభాషలో రచింపవలసి వచ్చినది. అందుకు ఆయన శబ్దశాసనుడు (వాగనుశాసనుడు) అయ్యాడు.
దేవుడు ఉన్నాడు. దేవుడు ఉన్నది. దేవుళ్ళు ఉన్నారు అనే మూడు వాక్యాలూ సరియైనవే, సత్యమైనవే. సరియైనవి అని చెప్పడానికి వ్యాకరణం, సత్యమైనవి అనిచెప్పడానికి న్యాయం కావాలి. అక్కడ నిన్న చెప్పిన 16 లక్షణాలలో ప్రమాణం, ప్రమేయం, సంశయం అనే వస్తువులు కావాలి.

_______________
Musings 5 - 29 JUNE 2013
దేవుడు ఉన్నాడు - ఈ వాక్యం సత్యమని ఎలా నిరూపించాలి? దీనికి ప్రమాణం, ప్రమేయం అనేవాటిని గుర్తించాలి. ముందుగా దేవుడు ఉన్నది అనే వాక్యం పరిశీలిద్దాం. ఇక్కడ సంశయమేలేదు. వాదానికి స్థానమేలేదు. దీనికి ఒక అర్థము దేవుడు (అనే పదం) ఉన్నది. పదం ఉంటే పదార్థము ఉన్నది. అలా కాక మీరు దేవుడు (అనే స్త్రీ) ఉన్నది అంటారనుకోండి. అప్పుడు దేవుడు అనే పురుషుడు ఉన్నాడన్నా, దేవుడనే స్త్రీ ఉన్నదన్నా నిరూపించే పద్ధతి ఒకటే. దేవుళ్ళు ఉన్నారు అన్నది పరమ సత్యం - పితృదేవుడు, పతిదేవుడు, గురుదేవుడు, అతిథి దేవుడు, అగ్నిదేవుడు, వరుణదేవుడు, పాఠకదేవుడు, ప్రేక్షక దేవుడు - ఇందరు దేవుళ్ళు ఉంటే లేదనేవాడు ఎవరు? మనం జ్ఞానార్జన చేసే విషయం ప్రమేయం. దాని ఉనికిలో ఉన్న సత్యాన్ని వెలికి తీసేది ప్రమాణం. అనేక ప్రమాణాలు. అన్నిటిలోను శక్తి వంతమైనది ప్రత్యక్ష ప్రమాణము. ఇంద్రియములతో స్వయంగా గ్రహించేది ప్రత్యక్ష జ్ఞానం. చార్వాకుడు అంటాడు - దేవుడంటే ప్రథమ పురుష, ఏక వచన, పుల్లింగ పదం, మీ విగ్రహాలలా నాలుగుచేతులు శంఖం, చక్రం, గద, ఖడ్గం వీటితో నాకు కనుపిస్తేనే ఆయన ఉన్నాడని ఒప్పుకుంటాను. లేకపోతే మొజెస్, మహామ్మదు లకు వినపడి నట్లు ఆయన మాట వినిపించు. లేకపోతే ఋషులకు వినపడినట్లు వేదం వినిపింపజెయ్యి. వాళ్ళ మాటలు నాకు hearsay. నాకే వినపడాలి.
ఈ దర్శనాలు అయిన వాళ్ళకు, శ్రుతులు విన్న వాళ్ళకు సంశయమేలేదు. వాళ్ళకు ప్రత్యక్ష ప్రమాణం తోనే వారి విశ్వాసంలోని సత్యం అనుభవంలోకి వచ్చింది. చార్వాకునికి, దేవుడు ఉన్నాడని నమ్మే సామాన్యులకు, ప్రత్యక్ష ప్రమాణం లేదు. చార్వాకులకు ఇంకో ప్రమాణంలేదు. ఎండమావిలో నీళ్ళుచూసి అక్కడిదాకా వెళ్ళేవాడు చార్వాకుడు. వాని జ్ఞానం పరిమితం. వాడు నూతిలో కప్ప. కాని ఏమాత్రం వైజ్ఞానిక దృష్టి ఉన్నా జ్ఞానానికి ఇంకా ప్రమాణాలు ఉన్నాయని తెలుస్తుంది. మాకు కాలేజ్ లో ఉన్నప్పుడు ఒక క్రైస్తవ ఫాదర్ మోరల్ సైన్స్ చెప్పే వాడు. If there is a watch, there must be a watch maker. There is a world. There should be a maker; he is called the creator and God. అప్పుడు ఈ లాజిక్ లో దోషం తెలియలేదు. ఇది ఇప్పటికీ క్రైస్తవ దృష్టికోణం. అందుకే బ్రిటిష్ శాస్త్రవేత్త రిచర్డ్ డాకిన్స్ తన "The blind watchmaker, The God Delusion" పుస్తకాలతో (వారి క్రైస్తవ) మతగురువులను ఎద్దేవా చేశాడు. వాచీలు చేయడానికి కర్మాగారం ఉంటుంది. ముడి పదార్థాలు ఉంటాయి. అందులో చిప్స్, కేస్ వంటివి చేసే ఇతర కర్మాగారాలు ఉంటాయి. ప్రపంచాన్ని తయారుచేయడానికి అంత కర్మాగారం ఉండాలి. అది ప్రపంచానికి అవతల ఇంకా చాలా పెద్దదిగా ఉండాలి. ఒక్కడే చేస్తే ఆయన డిజైనరా? మెకానిక్కా? గ్రీకుల లాజిక్ ని స్వంతం చేసుకున్న చర్చి బైబిల్ పురాణంలో ఇంతకంటె లోతైన తత్త్వాన్ని ఆవిష్కరించలేక పోయినది. పైగా God created mankind in his own image దేవుడు మనిషిని తన ప్రతిబింబంగానే సృష్టించాడు అని అర్థం. అంటే దేవుడు మనిషిలాగే ఉంటాడు. మరి అతడి శరీర తత్త్వమేమిటి?" God is non-physical - spirit. John 4:24 అందుకే క్రీస్తు దేవుని కుమారుడు అని చెప్పడానికి Holy Ghost అవసరమయింది. దీనికి ప్రత్యక్ష ప్రమాణం లేదు. అసలు ఇది ఎందుకు నమ్మాలి? అని ప్రశ్నిస్తే సమాధానం ఉండదు. చాలామంది దృష్టిలో మన పురాణ కథలూ అలాగే ఉంటాయి. కాని పురాణం శ్రుతి కాదు. ప్రమాణం కాదు. పైగా పురాణ కథలు శాస్త్రగ్రంధాలవలె ఉండవు. వేదం ప్రమాణం. మనకి ప్రత్యక్షంతో బాటుగా అనుమానం, ఉపమానం, శబ్దం అనే ప్రమాణాలను నైయాయికులు స్వీకరిస్తారు. ఇంకా అర్థాపత్తి, అనుపలబ్ధి, ఐతిహ్యము వంటి ప్రమాణాలను కొందరు స్వీకరిస్తారు. అనుమానం అనే పదం తెలుగులో suspicion అనే అర్థంలో వాడతాము. దాని అసలు అర్థం inference.
మన న్యాయ శాస్త్రంలో ఇతర ప్రమాణాలు దేవుని ఉనికిని ఎలా సమర్థిస్తాయో మరోసారి. కాని మన తత్త్వ శాస్త్రం అంతటితో ఆగ లేదు. దేవుడు ప్రమేయమా? ఆయన అప్రమేయుడు - తెలుసుకోలేని వాడు. నీ తర్కం ఆయన ఉనికి నిరూపిస్తుందా? Next level question!
Buddhavarapu Venkateswara Rao "God created man in his own image " I believe in man created God in his own image! if a cow or elephant .... like animals have imaginary powers they imagine God as a very big cow with eight legged with very ling horns and an elephant with a very big trunk etc............ but the imaginary power is humankind's privilege.
Vvs Sarma Every one is entitled to his or her beliefs. My objective is not God. My focus is on logic and reasoning, as it developed in India.Buddhavarapu Venkateswara Rao yes my dear sir I too use logic only in my thoughts and conversations. Didn't you convinced with the logical thinking of imaginary power vested with humans. That imaginary power only created large hues and cries in the last century when people argued there was and is life on Mars .... and Jules Verne wrote a novel on submarine 100 yrs before its invention!

Vvs Sarma There are truths beyond the logic conceived by humans. Human rationality is limited. That is why science is incomplete forevr.Buddhavarapu Venkateswara Rao There is no absolute truth in the world." Even the sun rises in the east' also a relative statement !!!when compared with the universe !Buddhavarapu Venkateswara Rao Not science sir it is human knowledge incomplete!Buddhavarapu Venkateswara Rao In the olden days people believed in questioning You can see many questions raised in vedas about our existence and the reason for existence!
____________-
No comments:
Post a Comment