Thursday, January 25, 2018

On Cosmologies 6

https://www.facebook.com/vallury.sarma/posts/577988015571949

On Cosmologies – 6
ఈ శీర్షికపై వ్రాస్తున్న కథనాలకు కొన్నిఆసక్తి కలిగించే స్పందనలు వస్తున్నాయి. మొదటిది పితృ కార్యాలను గురించి. మనం ఏటా శ్రాద్ధ కర్మలు చేయకపోతే మన పూర్వజులు సంవత్సరమంతా ఆకలితో అలమటిస్తారా? ప్రాణం పోయాక వాళ్ళూ మరల జన్మ ఎత్తితే ఈపాత జన్మలోని సంబంధాలను గుర్తుంచుకుంటారా? మనమిచ్చే తర్పణాలు తిలోదకాలు వారికి చేరతాయా?
ఇంకొక మిత్రుడు తన వ్యాఖ్యలో శంభళ అనే పేరు ప్రస్తావించారు. ఆత్మ జ్ఞానం కలిగిన యోగులకు అది నిలయమనీ, హిమాలయాలలో ఉందని అన్నారు. మన పురాణాలలో కల్కి పురాణంలో ఆపేరు వస్తుంది. కల్కి అవతారం జన్మ అక్కడ జరుగుతుంది.
शम्भले विष्णुयशसो गृहे प्रादुर्भवाम्य् अहम्
सुमत्यां मातरि विभो! कन्यायां त्वन्निदेशतः))4
కల్కిపురాణము , adhyaaya 2
ఈశంభళమును గురించిబౌద్ధగ్రంధాలలో చాలా విషయాలున్నాయి. కాలచక్ర దీక్షకు కూడా ఇది సన్నిహితం.
మనం ఆధునిక కాలంలో మన జీవితాన్ని అనేక విషయాలను సమన్వయం చేసుకోకుండా బ్రతుకు తున్నాము. మన "ఆధునిక విద్య", మన దైవ భక్తి, మన విశ్వాసాలు, వేరువేరు Folders లో పెట్టి ఆలోచిస్తున్నాం. మనం జీవిస్తున్న వాతావరణంలో మన మతాన్ని మూఢ విశ్వాసాలుగా చిత్రించే వ్యవస్థాగత ప్రయత్నాలు మనం అర్థంచేసుకోవటంలేదు. మన దేశంలోనే మన హిందువులకు మూడు వర్గాల ప్రబల శత్రువులు ఉన్నారు. ఇది అందరికీ తెలిసిన విష యమే. కాని మనకు మన మతాన్నీ, ధర్మాన్ని గురించి తెలుసుకునే అవకాశం ఉండటంలేదు. ఎవరైనా ప్రశ్నిస్తే సమాధానంచెప్పే పరిజ్ఞానం కూడా అనేకులకు ఉండటంలేదు. ఇంగ్లీష్ మీడియమ్ విద్యతో మన ముందు తరాలకు తెలిసినంత కూడా మన భావి తరాలకు సంస్కృతి గురించి తెలియటంలేదు.
మరణించిన తరువాత శరీరమును వదలిన జీవుని గతి (ప్రయాణం) యెక్కడకు? ఎన్నోలోకాల ప్రసక్తి ఇక్కడ వస్తుంది. సామాన్యజీవులు భువర్లోకానికి కాని, స్వర్గానికి కాని వెళ్ళరు. ఇక్కడ ప్రేతలోకం, యమలోకం, నరకం, పితృలొకం, విధ్యాధర లోకం, కింపురుషలోకం, గంధర్వలోకం, యక్షలోకం వంటి పేర్లను వింటాము. బ్రహ్మాండములో ఇవి ఎక్కడున్నాయని ప్రశ్న వస్తుంది. ఇవాన్నీ భూమికి సమీపవర్తులైన భూలోకం వంటి చిన్నలోకాలు. భూలోకానికి, భూమికి గల తేడాని గమనించాలి. విమానప్రయాణీకుడు భూమిమీద ప్రయాణం చేయటంలేదు. కాని భూలోకంలోనే ఉన్నాడు. టివీ కార్యక్రమాలు, దూరవాణి మాధ్యమాలు కలిగి ఉన్న కృత్రిమ ఉపగ్రహాలు కూడా భూలోకంలోనే ఉన్నాయి. ఇక్కడ అంతరిక్షం, ద్యులోకం వంటి పేర్లు కనుపిస్తాయి.
మనందరికీ బాగా తెలిసిన శాంతి మంత్రంలో ఈ పేర్లు వస్తాయి.
ॐ द्यौ: शान्ति रन्तरिक्षँ शान्ति:
पृथिवी शान्ति राप: शान्तिरोषधय: शान्ति: ।
वनस्पतय: शान्ति र्विश्वे देवा: शान्ति र्ब्रह्म शान्ति:
सर्वँ शान्ति: शान्तिरेव शान्ति: सा मा शान्तिरेधि ॥
ॐ शान्ति: शान्ति: शान्ति: ॥



ఆకాశంలో పాల పుంతగా వ్యవహరించే Milky Way గెలాక్సీని సంస్కృతంలో ఏమంటారు? దాని ప్రసక్తి ఏపురాణంలోనైనా వస్తుందా?

Vvs Sarma నాకు తెలిసినంతవరకు స్వర్గపథం, స్వర్గమార్గం అని రెందు పదాలు పురాణాల్లో ఉన్నాయి. ఇది milky way కావచ్చును అనే అభిప్రాయాన్ని సంస్కృత నిఘంటువులు చెబుతున్నాయి. కాని దానిని గురించిన పౌరాణిక వర్ణనలు ఏమైనా ఉన్నాయా అన్నది నా ప్రశ్న.Vvs Sarma మందాకిని అంటే ఆకాశ గంగ, కేదారంలో ప్రవహించే గంగ ఉపనది. శివుణ్ణి మందాకినీ సలిల చందన చర్చితాయ అంటారు. అదే వియద్గంగజాజి శర్మ శ్రీ విష్ణు సహస్ర నామం లోని మొదటి నామమే" విశ్వం ' ద్వారా సృష్టి మొత్తం విష్ణు స్వరూపంగా మన పురాణాలు వర్ణించాయి అంటూ శ్రీ సత్యనారాయణ శర్మ గారు విష్ణు నాభి అని చాలా వివరణ ఇచ్చారు. http://www.teluguyogi.net/2010/05/blog-post.html
Vvs Sarma మనకు కనుపించేది మన Milky Way galactic centre దానిని విష్ణునాభి అనడం సమంజసంగాఉన్నది. ఇది ఇతర గలాక్సీలకు కేంద్రం కాదు కదా. మనకు కనుపించే భాగం ఒక నక్షత్రవీధిలా ఉంటుంది సరే దానిని కొన్నిపురాణాలలో స్వర్గ వీది, స్వర్గ మార్గము అన్నారట. కాని మన భూమి ఉన్న సౌర మండలం గెలాక్టిక్ సెంటర్ కి చాలా దూరంలో ఉంటుంది. సూర్యుడు సెకండుకు 220 కిమీ వేగంతో దాని చుట్టూ పరిభ్రమిస్తున్నాడు. milky way గలక్సీని మన వాళ్ళు ఎల్లా అర్థంచేసుకున్నరనేది నా ఆలోచన. నేను మీరు పంపిన బ్లాగ్ చదువుతాను. మంచి విషయం. ధన్యవాదాలు.

No comments:

Post a Comment

The Structure of the Universe (Vedic) - Viswaroopa - K. Sivananda Murty Preface 2

https://www.facebook.com/vallury.sarma/posts/616984388338978 The Puranas speak of individuals going up and down between these proximate...