Tuesday, January 23, 2018

మనం తర్క పరిభాషలోని ప్రమాణం, ప్రమేయం, సంశయం, వాదం, జల్పం, వితండం

https://www.facebook.com/vallury.sarma/posts/541538329216918

https://www.facebook.com/vallury.sarma/posts/545191185518299

https://www.facebook.com/vallury.sarma/posts/545472442156840



Musings – 8 (3-7-2013)
మనం తర్క పరిభాషలోని ప్రమాణం, ప్రమేయం, సంశయం, వాదం, జల్పం, వితండం అనే ఆరు అంశాలను గురించి చెప్పుకున్నాం. అనేకులు ప్రాచీనమైనదంతా మూఢవిశ్వాసం అని ఆధునికులవి వైజ్ఞానిక భావాలనీ నమ్ముతారు. విజ్ఞానం పుట్టినదే భారతదేశంలో. నాకు తెలిసినంతలో ఆధునికులకున్న మూఢవిశ్వాసాలు ప్రాచీనులకు లేవు. ఇప్పుడు సిద్ధాంతం, హేతువాదం అనేవాటిని గురించి తెలుసుకుందాం. ఇవి న్యాయ సూత్రాలలో అవయవం , సిద్దాంతం, దృష్టాంతం అనేవాటికి సంబంధించినవి. .మనం ఒక వాక్యం చెబితే దానిని సమర్ధించుకోడానికి ఈ అవయవాలు పనిచేస్తాయి. ఇవి ఐదు. వాటిలో ముఖ్యమైనవి హేతువు,ఉదాహరణ (అదే దృష్టాంతం) మన వాక్యాన్ని వీటి సాయంతో సమర్థించుకో గలిగితే అది మన సిద్ధాంతం అవుతుంది. దేవుడు ఉన్నాడు అని నిరూపించడానికి ప్రమాణాలు కావాలి.ఇక్కడ సంశయం ఉంటుంది. దేవుడు ఉన్నది అనేది స్వయం ప్రమాణము. అలాగే దేవుడు లేడు అనే నాస్తికుడు దానిని హేతుబద్ధంగా నిరూపించుకోవాలి. లేకపోతే అది వితండం అవుతుంది. పెద్దలు ఒక గొప్ప నాస్తికుని గురించి చెబుతారు. ఆయన విషయంలో సందేహంలేదు. ఆయనకు దేవుడు లేడు అని అందరూ ఒప్పుకోవాలి. ఆయన భగవంతుడు. ఆయన ఎవరికీ దాసోహం అనడు. అహం బ్రహ్మాస్మి అనికూడా అనడు. ఆయన ఒకే పదం వాడుతాడు. అది "నేను" ఆయన భాషలో "అహం". విష్ణుసహస్రనామంలో అనీశ అనేనామం ఇదేసూచిస్తుంది. హేతువుకు తర్కం ఇచ్చే ఉదాహరణ నిప్పు-పొగ. నిప్పులేనిదేపొగ రాదు. కాని పొగలేని నిప్పు ఉంటుంది. (కొలిమిలో ఎఱ్ఱగా కాల్చిన ఇనుపవస్తువు). ఒక ప్రదేశంలో పొగ అనే హేతువును చూపి నిప్పు ఉందని నిర్ధారణకు రావాచ్చును. దీన్ని యథావిధిగా చెప్పేవ్ న్యాయ వాక్యంలో ఐదు అవయవాలు ఉంటాయి.



usings – 9 (13 july 2013)
భారతీయ న్యాయ తర్కాలు ప్రమాణ శాస్త్రాలు. ఒక వాక్యము యొక్క సత్యనిరూపణ చేయాలంటే ప్రమాణాల అవసరం ఉంటుంది. సామాన్యంగా మనకు కావలసిన విషయాలకి ప్రత్యక్ష ప్రమాణము దొరకదు. కొన్ని బాహ్యవిషయాలే మన ఇంద్రియాలకు తెలుస్తాయి. కాని మనకు కావలసిన అంతర్గత విషయాలు ప్రత్యక్షంగా తెలియవు. అందుచేత హేతువాదముపై ఆధారపడిన అనుమాన ప్రమాణమే వేదాంతానికి, విజ్ఞాన శాస్త్రానికి కూడా అవసరము. త్రివిధములైన అనుమానాలున్నాయి. పూర్వవత్, శేషవత్, సామాన్యతో దృష్టం అనేవి అవి. ఆకాశంలో నల్లని మేఘాలు కమ్ముకున్నాయి. వర్షం పడవచ్చును అనేది మొదటి తరగతి. హిందీ వార్తలలో వాతావరణంగురించి పూర్వానుమాన్ అనిచెప్పేది ఇదే. కారణమును చూచి కాగల కార్యాన్ని ఊహించడం. గోదావరిలో వరదలు ఉద్ధృతముగా వచ్చాయి. మహారాష్ట్రలో (catchment area) వర్షాలు బాగా పడి ఉండాలి. జలుబుగా ఉన్నావు. నిన్న వర్షంలో తడిశావా? ఇది రెండో రకం. కార్యాన్ని చూచి కారణమును వెదకడం. ఇదే సైన్సులో estimation theory. మొదటిది prediction (extrapolation) రెండవది smoothing (interpolation). సైన్స్ లో అయినా ఇదే, జ్యోతిషంలో అయినా ఇదే. బంగారంకొంటే మంచిదా? షేర్లు కొంటే మంచిదా? రియల్ ఎస్టేట్ మంచిదా? ఇలాంటి తాపత్రయాలన్నీటికీ సలహాలు ఇచ్చేవారు decision making under uncertainty అనే ప్రక్రియ ఇదే. ఇక మూడవది సామాన్య దృష్టికి కనపడేది. కొన్ని వ్యాధులలో వైద్యులు మీకు ధూమపానం అలవాటు ఉందా? మీరు మద్యం సేవిస్తారా? అని అడుగుతారు. ఇది సామాన్యముగా ఆ అలవాట్లకు, ఆయా వ్యాధులకు కనపడే సంబంధం (correlation). ఇది పూర్తిగా కార్య కారణ సంబంధముగా నిర్ధారించలేక పోయినా సామాన్య వ్యాప్తి లేదా అన్యోన్య సంబంధాన్ని గుర్తించవచ్చును. ఇంకొక విధంగా ఆలోచిస్తే అనుమానం రెండు విధాలు. స్వార్థానుమానం, పరార్థానుమానం. మన సిద్ధాంతాన్ని ముందు మనతృప్తికే మనం నిర్ధారణ చేసుకోవాలి. ఇది స్వార్థానుమానం. తరువాత ఇతరులను ఒప్పించేందుకు ప్రయత్నించాలి. ఇది పరార్థానుమానం. ఇది కష్టతరం. ఇంకా నిర్దుష్టంగా అనుమాన ప్రమాణాన్ని ఉపయోగించడానికి పంచావయవ న్యాయ వాక్యం అవసరమౌతుంది. (Five limbed syllogism). ఇందులో ప్రతిజ్ఞ, హేతువు, దృష్టాన్తము, ఉపనయము, నిగమనము అని ఐదు అవయవాలుంటాయి.


పర్వతో వహ్నిమాన్ - పర్వతముపై అగ్ని ఉన్నది - ప్రతిజ్ఞ
ధూమవత్వాత్ - అక్కడ ఉన్న ధూమము వలన - హేతువు
యోయో ధూమవాన్ స స వహ్నివాన్, యథా మహానసా - ఎక్కడ పొగ ఉంటే అక్కడ అగ్ని ఉంటుంది. - వంటఇంటిలో వలె - ఉదాహరణ
తథా చ అయం - ఇది కూడా అటువంటిదే - ఉపనయం.
తస్మాత్ తథేతి - అందుచేత అదే - పర్వతముపై అగ్ని ఉన్నది - నిగమనం







Ajitha Kolla - దేవాలయము అనిన దేవుని ఆవరణ ఏ కదా? మరి దేవునికి ఆవరణ లేదనిన - దేవాలయమునకు వెళ్ళమని చెప్పడంలో అర్ధం మన హృదయములో ఆయనను పూజించమని అర్ధమా శర్మ గారు?
VVS Sarma - దేవుడు, దేవాలయము మనపరిణతిలో తొలి సోపానాలు. లలిత, శివుడు, విష్ణువు, రాముడు, కృష్ణుడు అని సగుణరూపములను దేవాలయములోని విగ్రహములందు ప్రాణప్రతిష్ఠ చేసి ఆవాహనముచేసి పూజించుట తొలి అడుగు. దేవుడు వ్యక్తి కాదు. సర్వవ్యాపి అయిన పరమాత్మ అని గ్రహించి అణువులో అణువుగా, అన్నిటికంటె అధికముగా ఉన్నతత్త్వముగా భావించగలుగుట రెండవ మెట్టు. ప్రహ్లాదుడందుకే "ఇందుగలడందు లేడని సందేహమువలదు, చక్రి సర్వోహతుండెందెందు వెదకి చూచిన అందందే గలడు దానవాగ్రణి వింటే" అని తండ్రితో అన్నాడు. అ పరమాత్మను హృదయ పద్మమందు యోగసాధనచేత దర్శించుట యే అంతిమ లక్ష్యము. ఇదే ఉపనిషద్బోధ. ప్రార్థనామందిరం దగ్గర ఆగిపోతాయి కొన్ని మార్గాలు.

No comments:

Post a Comment

The Structure of the Universe (Vedic) - Viswaroopa - K. Sivananda Murty Preface 2

https://www.facebook.com/vallury.sarma/posts/616984388338978 The Puranas speak of individuals going up and down between these proximate...