వాసుదేవరావు గారు
1. భగవంతుడు అనేకమా? సృష్తికర్తలు వేరు, వేరా? ఈ ప్రపంచంలోని జీవ రాశులను వివిధ ఖండాలని, వివిధ ప్రజలని, వేరు వేరు సృష్తికర్తలు సృజించారా? అసలు, భగవంతుడికి మతమేంటి? ఏ భగవంతుడు తనకు ప్రచారం కావాలని అడిగాడు?
VVS
అసలు ఎవరీ భగవంతుడు? మనకు ఎందుకు కావలసి వచ్చాడు? మనుష్యులు సృష్టించబడ్డారా? కోతులనుండి పరిణామం చెంది తయారయ్యారా? అంతకు ముందు భూమి సృష్టించబడిందా? సౌరమండలం సృష్టించ బడినదా? గెలాక్సీ లను ఎవరు సృష్టించారు? ఆధునిక కాస్మాలజీ ఒక రకమైన సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తుంది. దాని ప్రకారం 10-20 బిలియనుల సంవత్సరాలముందు మహా విస్ఫోటమని ఒకటి జరిగిందట.(BIG BANG). విశ్వసృష్టి అప్పుడు ప్రారంభమై అనేకవేల కాంతి సంవత్సరాల దూరంవ్యాపిస్తూ పోతున్నదట. దానిలో అనేక గెలాక్సీలు. మనది పాల పుంత milky way మనకు దగ్గరిది ఆండ్రొమెడా. దీని ప్రకారం సృష్టి ఒక సంఘటనపై ఆధారపడి ప్రమాద వశాత్తూ జరిగినది.భగవంతుని వంటి ఊహల అవసరమేలేదు. ఒక చిన్నగ్రహంమీద కారణం లేకుండా సృష్టి జరిగినది. ఆ మధ్య ప్రచారమైన దైవ కణం God particle ఆ పరిశోధనలకు సంబంధించినదే. (ఆపేరే మన మూర్ఖత్వాన్ని సూచిస్తుంది) . దీనిని Physical Cosmology అంటారు. ఇది కాక ప్రతిమతానికి religious cosmology అనేది ఉంది. క్రైస్తవ మతం ప్రకారం అనగనగా ఒకదేవుడు. పేరు జెహోవా. ఆయన సృష్టి ఆరంభించి స్వర్గాన్నీ, భూమిని, నరకాన్నీ సృష్టించాడు. ఆయన స్వర్గంలోనే ఉంటాడు. (సృష్టించకముందు ఎక్కడ ఉండే వాడు? నాకు తెలియదు.) భూమిమీద ఒక గార్డెన్ ఆఫ్ ఈడెన్ ని అందులో ఆదాము అనే మనిషిని ఆతరువాత ఆతని ప్రక్క ఎముకనుండి అవ్వ అనే స్త్రీని -దిగంబరంగా సృష్టించాడు. అనేక దేవదూతలను సృష్టించాడు. వారిలో లూసిఫర్ అనేవాడు దేవుణ్ణి గో టూ హెల్ అని విదిలించుకుని నరక సామ్రాజ్యాన్ని ఏర్పరచుకున్నాడు. వాడే సేటన్ (సైతాన్) వాడికి దేవుని ప్లాన్ భంగంచేయటం ఇష్టం. అందుకు వాడు పామువేషంలో ఆదాము అవ్వ దగ్గరకు వచ్చి దేవుడు వాళ్ళను తినవద్దన్న ఆపిల్ పండుని తినిపించాడు. అప్పుడు వారికి కామము ఏర్పడి original sin చేశారు. మన వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు కూడా సృష్టిని గురించి చాలా విశిష్టమైన కథనాన్ని అందిస్తాయి. ఇది Vedic Cosmology దీనిని హిందూ కాస్మాలజీ అంటున్నారు కాని అది సరియైన పరిభాషకాదు. మనభాషలో దేవుడనే ఒక్కడు లేడు. 33 కోట్ల దేవతలున్నారు. నా దృష్టిలో క్రైస్తవుల దేవుడు అసిస్టెంట్ బ్రహ్మ. బ్రహ్మ సెలవులో ఉన్నాప్పుడు. In-charge బ్రహ్మఏమో? మన గ్రంథాలలోని సృష్టి ని అర్థంచేసుకోవాలంటే పరబ్రహ్మా, కామేశ్వర, మహావిష్ణు, త్రిమూర్తి తత్త్వాలను అర్థంచేసుకోవాలి.
(To be continued)

No comments:
Post a Comment