Monday, January 22, 2018

అసలు భారత కథ ఇది. కౌరవ పాండవులు ద్రోణుని వద్ద అస్త్ర శస్త్ర విద్యలు పూర్తిచేస్తారు

https://www.facebook.com/vallury.sarma/posts/537539609616790


అసలు భారత కథ ఇది. కౌరవ పాండవులు ద్రోణుని వద్ద అస్త్ర శస్త్ర విద్యలు పూర్తిచేస్తారు. ద్రోణుడు ధృతరాష్ట్రునివద్ద వారి విద్యా ప్రదర్శనకు అనుమతి కోరుతాడు. ధృతరాష్ట్రుడు విదురుణ్ణి ఈ ప్రదర్శన నిర్వహింపమని ముహూర్తాన్నీ, తగిన స్థలాన్నీ ఎన్నుకోమని చెబుతాడు.విదురుడు బ్రహ్మాండంగా ఏర్పాట్లు పూర్తిచేస్తాడు. కౌరవ పెద్దలు, అంతఃపుర స్త్రీలు గాంధారి, కుంతితో సహా అందరూ సమావేశం అవుతారు. అందరిలోనూ పెద్దయైన ధర్మజునితో మొదలుపెట్టి వయసుల వారీగా రాజకుమారులందరూ తమ విద్యలను ప్రదర్శిస్తారు. సుయోధన, భీముల గదాయుద్ధం జరుగుతుంది. అది తీవ్ర స్థాయికి చేరినప్పుడు ద్రోణుని సూచనతో అశ్వత్థామ వారిని ఆపుతాడు. తరువాత అర్జునుని ప్రత్యేక అస్త్ర శస్త్ర ప్రదర్శన జరుగుతుంది. ఆహూతులందరూ ఆవిద్యాప్రదర్శనకు ముగ్ధులౌతారు.ఇక సభ చాలించే సమయమయినది. అప్పుడు కర్ణుడు ప్రవేశించి అర్జునుని కంటె తాను ఎక్కువ స్థాయిలో ప్రదర్శించగలనని చెబుతాడు. అర్జునుడు ఈ సభ మావిద్యా ప్రదర్శనకు ఏర్పాటయినది. నీవెవరవు, నిన్నెవరు పిలిచారని అడుగుతాడు. ద్రోణుడు అనుమతిస్తే కర్ణుడు అర్జునుని ప్రదర్శనతో సమానంగా తన విద్య ప్రదర్శిస్తాడు.దుర్యోధనునిలో ఆనందం, అర్జునునిలో ఈర్ష్య ప్రారంభం అవుతాయి. కుంతి కర్ణుని తేజస్సును, సహజ కవచ కుండలాలనీ చూచి అతనిని గుర్తించి అతని ప్రతిభకు ఆనందిస్తుంది. కర్ణార్జునులు ద్వంద్వయుద్ధానికి తలపడతారు.కృపుడు ధర్మ శాస్త్ర ప్రకారము సమాన స్థితి గలవారే ద్వంద్వయుద్ధానికి అర్హులు అని చెబుతాడు. అక్కడ ప్రదర్శన నిర్వహణ కృపాచార్యునిది. ఆయన అర్జునున్ని కౌరవ రాజ కుమారునిగా పరిచయం చేసి, తనని పరిచయం చేసుకోమని కర్ణుని వైపు చూస్తాడు. కర్ణుడు ఆకాశమువైపు చూస్తాడు. అప్పటికే సూర్యుడు అస్తమిస్తాడు.దుర్యో ధనుడు అతడిని అంగ రాజుని చేసి ఈయన అంగ రాజు అనిచెబుతాడు. ఇంతలో కర్ణునిపెంచిన సూతుడు వచ్చి కర్ణుని ఆలింగనం చేసుకుంటాడు. వెంటనే భీముడు నీవు రథంతోలుకోక అస్త్రవిద్యాప్రదర్శన నీకు ఎందుకని ఎద్దేవా చేస్తాడు. దుర్యోధనుడు ఇలా అంటాడు - కర్ణుని తేజస్సు చూస్తేనే అతని ఉత్తమ జన్మ తెలుస్తుంది. ఆడలేడికి పులిపిల్ల పుట్టదు కదా? అంటాడు. భీమునితో కౌరవ వంశీయుల పుట్టు పూర్వోత్తరాలు, వ్యాస, ద్రోణ కృపుల పుట్టుకలు చెబుతాడు. ద్వంద్వయుద్ధంచేస్తే ఇద్దరిలో ఎవరికో ప్రమాదం అని కుంతి కంగారు పడుతుంది. ఈ సంభాషణలో ద్రోణుని పాత్రలేదు. దాన వీర శూరకర్ణలో ద్రోణునికి ఆపాదించిన కులగర్వం NTR కల్పన, బ్రాహ్మణుని నిందించాలన్న వాచాలత.

No comments:

Post a Comment

The Structure of the Universe (Vedic) - Viswaroopa - K. Sivananda Murty Preface 2

https://www.facebook.com/vallury.sarma/posts/616984388338978 The Puranas speak of individuals going up and down between these proximate...