https://www.facebook.com/vallury.sarma/posts/575760765794674
కాస్మోలజీ పేర జరిగే పరిశోధనలలో ఖగోళశాస్త్రజ్ఞులు, భౌతిక శాస్త్రజ్ఞుల దృష్టి కేవలం 13.7 బిలియన్ సంవత్సరాల క్రితం జరిగిన మహావిస్ఫోటం Big Bang తరువాత ఏర్పడిన భౌతిక పరిణామాల గురించే అంటే నక్షత్రాలు, సౌరమండలాలు, గెలక్సీలు వీని ఆవిర్భావం, గతులు, వేగాలు, దూరాలు, పదార్థ విజ్ఞానం, కృష్ణబిలాలు (Black holes) వంటి వాటి పై కేంద్రీకరింపబడినది. స్పేస్-టైం యొక్క ఆవిర్భావం కూడా అప్పుడే జరిగింది. బిగ్ బాంగ్ ముందు ఏమిటీ? అనే ప్రశ్న అర్థంలేనిది. ఈ పరిశోధనలో భగవంతునికే కాదు, జీవరాసులకు కూడా స్థానం లేదు. మత సంబంధమైన సృష్టి విజ్ఞానం - ఒకొక మత గ్రంధంలో ఒకలా చెప్పారు. చాలా వరకు దీనికి విశ్వాసాలే ఆధారం. ఇక్కడే సనాతన ధర్మ సృష్టి సిద్ధాంతము మిగతా మతాలకంటె విభిన్నమైంది. ఈ సమాచారం ఒక ప్రవక్త నుండి ఒక పుస్తకం నుండి రాలేదు. ఉదాహరణకు కాల మానం. మనకు యుగాలు ఉన్నాయి. 4 యుగాలు కలిస్తే ఒక మహాయుగం. మనకలియుగానికి 4,32,000 సంవత్సరాలు. ఒకమహాయుగానికి 43,20,000 సంవత్సరాలు. 71 మహాయుగాలు ఒక మన్వంతరం. 14 మన్వంతరాలు ఒక బ్రహ్మకల్పం. అంటే ఇప్పటి సృష్టి మొదలై 4.3 బిలియన్ సంవత్సరాలయినది. ఇక ఏమత సిద్ధాంతం లోనూ ఇంత కాలం ప్రసక్తిలేదు. దీనికి ఎవరూ భౌతిక శాస్త్రం,ఉపకరణాలు వాడలేదు. ఈ సంఖ్యలు వచ్చిన విధానం తపస్సులు.
సృష్టి ఆరంభములో ఏమున్నది? శూన్యం అనడానికి వీలు లేదు. శూన్యం నుండి వస్తుప్రపంచం ఎలా పుట్టినది? ఆ ఆది పదార్థాన్ని ఏమనాలి? దానినిగురించి మనకు ఏమీ తెలియదు. దానితో పోల్చడానికి ఏవస్తువులేదు. పదమే లేనప్పుడు, పదార్థాన్ని ఎలా గుర్తించడం? దానికి ఆకారంలేదు. గుణాలు లేవు. మార్పులేదు. దానికి బ్రహ్మము అని ఏదోపేరు పెట్టుకున్నాము. నపుంసకలింగము. దిక్కులు లేవు. కాలంలేదు. దానిని గురించి మనకు తెలియచెప్పే గుణాలు ఏమీలేవు. ... BIG BANG ఎందుకు జరిగింది? అన్నట్లే ఆ పదార్థంలో ఒక చలనం జరిగినది. స్థాణువు లో చలనంఎలాఉంటుంది? ఒకటి రెండు గా అయింది. రెండు వస్తువులను భావించ వలసిన అవసరం ఏర్పడినది. ఒకటి స్థితిని ఒకటి గతిని సూచిస్తాయి.(Static and Dynamic elements) .. బ్రహ్మము అనే ఒకటి పురుషుడు, ప్రకృతి అని రెండుగా కనపడ్డాయి. .. ఏదో లీలగా సృష్టి సంకల్పం (కామన) ఏర్పడిందని అనుకోవాలి. పరబ్రహ్మానికి సదాశివ తత్త్వము అని పేరు. సృష్టి సంకల్పం కలిగాక ఏర్పడిన రెండు తత్త్వాలకు పురుషుడు, ప్రకృతి యే కామేశ్వరుడు, కామేశ్వరి. ఇవి కూడా తత్త్వాలే. ... ఇవన్నీ మనుష్యులకు ఎలా తెలిసాయి? ... ఈ విజ్ఞాన మంతా మనుష్యులు భూమి మీద పుట్టాక వాళ్ళకు వచ్చిన ప్రశ్నలకు సమాధానం వెదుక్కోవటంలో తెలిసినది. న్యూటన్ తరువాత వచ్చిన భౌతిక శాస్త్ర పదార్థ విజ్ఞానం Physical Sciences. మహర్షుల తపఃఫలంగా లభించినది వైదిక విజ్ఞానం. (Spirtual Sciences) సైన్స్ అనే పదం వాడవచ్చునా అంటే అది మనం ఆ పదానికి ఇచ్చే నిర్వచనం మీద ఆధార పడి ఉంటుంది. ముక్కు మూసుకుని అడవిలో కూర్చుని ధ్యానిస్తే బ్రహ్మాండంగురించి ఎలా తెలిసినది? ఇదే ప్రశ్న న్యూటన్ కు గురుత్వాకర్షణ గురించి ఎలా తెలిసినది? ఐన్ స్టీన్ కు సాపేక్ష సిద్ధాంతం ఎలా తెలిసింది? వంటిదే. ఈ ప్రశ్నకు మన వారి సమాధానమే యోగ శాస్త్రం. మానవ శరీరంలోనే సృష్టి రహస్యం దాగి ఉన్నది. దానిని క్షుద్ర బ్రహాండం అన్నారు.
(To be Continued)
No comments:
Post a Comment