తెలంగాణా ప్రజలు కారణమేదైనా చాలా కాలంనుండి తెలంగాణా ప్రత్యేకరాష్ట్రం కావాలని కోరుకొన్నారు. చాలా కాలం ఉద్యమంచేసారు. రాష్ట్ర విభజనా కార్యక్రమాలు కేంద్రంలో ప్రారంభమయ్యాయి. ఆంధ్రతీరప్రాంతాలు, రాయలసీమ ప్రాంతం వారికి అయాచితంగా పాత పేరుతో కొత్తరాష్ట్రం ప్రమాదం వచ్చిపడినది. ఇది వాళ్ళు ఊహించలేదు. అది కోరుకోలేదు. రాదులే అని తమకు తాము చెప్పుకున్నారు. ఒక వేళ వస్తే అన్న ప్రయత్నాలు, ఆలోచనలు కూడా చేయలేదు. ప్రధాన పార్టీలనాయకులలో అన్ని ప్రాంతాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకున్నవారులేరు. కేవలం మొత్తంలో పార్టీల ప్రయోజనాలు ముఖ్యమనుకున్నారు. ఉన్నట్లుండి వారందరూ ఉప ప్రాంతీయనాయకులుగా మాత్రం నిలువ దొక్కుకోడానికి ప్రయత్నిస్తున్నారు. సమైక్యాంద్ర ఉద్యమం నేతలు ఏమికోరుతున్నారు? స్వాతంత్ర్యం నాటి Two nation theory ఇప్పుడు దేశంలోపల 2 or 3 or 4 state theory గా పరిణామం చెందింది. అప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం పాత్రని ఇప్పుడు కేంద్రము, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ వహిస్తూంది. ఒక ప్రాంతపు కథ కంచి దగ్గరలో ఉన్నది. ఇంకొకటి, డామిట్, అడ్డంతిరిగింది. జార్ఖండ్, చత్తీస్ ఘడ్, ఒడీశాల పక్కనే బక్కచిక్కిన ఆంధ్రప్రదేశ్.
జాజి శర్మ రాష్ట్ర విభజన కొరకై కాంగ్రేసు కావలసిన సాధారణ మోజారిటి లోకసభ లో లేదు. పైగా ఓడిన తీర్మానం లోకసభలో పెట్టె ఆనవాయితీ లేదు. పెట్టినా సభ్యులు దానిని చర్చించే అవకాశం చాలా తక్కువ.Vvs Sarma ఒక కలకలం సృష్టించారు. సమస్య పరిష్కారం ఎన్నటికి అవుతుంది? అయితే ఇప్పుడవ్వాలి లేకపోతే ఎప్పటికీ అవదు అని మాఊరిలో ఒక విఖ్యాత జ్యోతిష్కుని ఉవాచ.జాజి శర్మ సమస్య సృష్టించి కాలానికి వదిలెయ్యటం కాంగ్రేసు కు అలవాటు కదా! ఆ సమస్యల వలయం లో నుండి ఎలా బయటపడాలి అనే ఆతురత తో మరిన్ని సమస్యలు సృష్టించిన కాశ్మీరము చూస్తూనే ఉన్నాముగా!
No comments:
Post a Comment