https://www.facebook.com/vallury.sarma/posts/589187257785358
https://www.facebook.com/vallury.sarma/posts/590030611034356
https://www.facebook.com/vallury.sarma/posts/590528957651188
గుజరాత్ లొని మొధెరా అహమ్మదాబాదుకు 102 కి.మీ. లోని ప్రాచీన సూర్యదేవాలయం. ఇది ASI అధీనంలోని కట్టడం. ప్రస్తుతం పూజాదికాలు లేవు. గయలో దక్షిణార్క మందిరమనే సూర్యదేవాలయము ఉన్నది. ఇక్కడ పితృ దేవతలను ఆరాధిస్తారు. కాశీలో లోలార్క కుండం అని సూర్యుడు గంగలో శివుని కోపాగ్నికి తాళలేక స్నానం చేసిన కుండం అసి, గంగా సంగమ స్థానంలో ఉన్నది.

On Cosmologies – New Series - 1
భాగవత రామాయణ గీతాది శ్రుతిశాస్త్ర పురాణపు మర్మములన్
శివాది షణ్మతముల గూఢముల ముప్పదిముక్కోటి సురాంత
రంగముల భావముల నెఱిగి భావరాగ లయాది సౌఖ్యముచే
జిరాయువుల్ గలిగి నిరవధి సుఖాత్ములై త్యాగరాజాప్తులైనవా
రెందరోమహానుభావులు
- త్యాగరాజ పంచరత్న కీర్తన

ఈ శీర్షిక ఒక విధంగా పూర్తిచేశాననుకున్నాను. చాలా రోజులతరువాత బాలమురళి పాడిన పైకీర్తనవింటే పురాణాలు, దేవతలూ, లోకాలు, శివాదిషణ్మతాలూ, ఆధునిక సృష్టివిజ్ఞాన శాస్త్రం, గ్రహాంతరజీవులు, ఎగిరే పళ్ళాలు, UFO లు నన్ను చుట్టుముట్టాయి. త్యాగరాజ స్వామికి నారదుడు దర్శనమిచ్చాడని అంటారు. రామాయణ నాయకుడు త్రేతాయుగంలో 11000 సంవత్సరాలు పాలించాడంటారు. ఇంకొక లెక్కలో ఆయన జీవించినది 60 సంవత్సరాలకు లోపే. మహాభారత యుద్ధం 5000 సంవత్సరాల నాటిదైతే రామాయణం పురాణాలలోని వంశ చరిత్రల ఆధారంగా అంతకు 1000-1500 సంవత్సరాలు ముందు జరిగినదని లెక్కలు చెబుతారు. మహాయోగియైన శ్రీకృష్ణుని జీవితకాలం 125 సంవత్సరాలు అంటారు.మన వంటి ఆధునికులు వీనిని ఎలా సమన్వయం చేసుకోవాలి? మనది సనాతన ధర్మం. లక్షలు కాక పోయిన చరిత్ర ప్రకారమైనా మన ధర్మం పదివేల సంవత్సరాల చరిత్ర గలది. వీటితో పోలిస్తే బౌద్ధం 2500, క్రైస్తవం 2000, ఇస్లాం 1400, సంవత్సరాల చరిత్రగలవి. ఇవి నవీన మతాలు. దేవుని ఏ పేరుతో పిలిచినా ఎహోవా, అల్లాహ్ ఇత్యాదులు అనాదిగా ఉన్నారని ప్రవక్తలకు తెలిసినది కదా. ఇక్కడ సనాతనమైన షణ్మతాలు, నవీనమైన మతాలు వీనిలోని దేవతలు, దేవుడు వీరి చరిత్రలు అవసరమౌతాయి.
షణ్మతాలు ఏమిటి? శైవం, వైష్ణవం, శాక్తేయం, సౌరం, గాణాపత్యం, కౌమారం. ఇవి వరుసగా శివుడు, విష్ణువు, శక్తి, సూర్యుడు, గణపతి, కుమార స్వామి ప్రధాన దేవతలుగా పరిగణింపబడినవి. మనం వినాయక చవితి నాడు ఒక గణపతి జన్మ వృత్తాంతం చెప్పుకుంటాము. ఈ మన్వంతరం ప్రారంభంలో జరిగిన పార్వతీ కల్యాణాన్ని శివరాత్రినాడు జరుపుకుంటాము. కుమారస్వామి జన్మను తలుచుకుంటాము. సూర్యుని కూడా మృత అండమునుండి పుట్టిన మార్తాండునిగా తలుస్తాము. ఆధునిక భౌతిక విజ్ఞానం ప్రకారము సూర్యుడు కూడా బిగ్ బాంగ్ తరువాత సృష్టింపబడినవాడే. ఈ సూర్యునికి యూదు క్రైస్తవ ఇస్లాం మతాల యెహొవా (అల్లాహ్) లకూ ఏదైనా దూరపు సంబంధం ఉన్నదా? ఇది పరిశోధకుల దృష్టిని ఆకర్షిస్తున్న విషయం. ఆది మానవుడు ఆఫ్రికా నుండి వచ్చాడని ఒక వాదం ఉన్నది. ఆఫ్రికా ఐరోపా ఆశియాల ప్రాచీన సంబంధాలు, భూలోక ఇతరలోకాల సంబంధాలు కూడా సృష్టి విజ్ఞానంలో అంతర్భాగాలే.

On Cosmologies – New Series – 3
మనం నిన్న మేరువును గురించి చర్చించుకున్నాము. మేరువు ఒక పర్వతం. సూర్యుడు మేరువు చుట్టూ ప్రదక్షిణం చేస్తాడు. ఒకప్పుడు వింధ్య పర్వతం "మేరువుతో పోల్చుకుంటే నా తక్కువేమిటి? నేను పెరిగి పోయి సూర్యుని రాకపోకలకు అడ్డువస్తాను. నాకు కూడా ప్రదక్షిణం చేయమని సూర్యుణ్ణి అడుగుతాను అని పెరగడం మొదలు పెట్టాడు. అప్పుడు దేవతలు అగస్త్య మహర్షిని ప్రార్థిస్తారు. ఆయన దక్షిణాపథానికి బయలు దేరుతాడు. మేరువు తల వంచి నమస్కరిస్తాడు. అగస్త్యుడు మళ్ళీ నేను తిరిగి వచ్చే వరకు అలాగే ఉండమని ఆజ్ఞాపిస్తాడు. ఆయన దక్షిణాదినే ఉండిపోతాడు. వింధ్య పెరగడం ఆగిపోయింది. ఇది పురాణ కథ. స్కంద పురాణం లోనిది. నిన్న మనము విశ్వములో సూర్యమండలము బ్రహ్మాండ కేంద్రము చుట్టూ పరిభ్రమణ చేసే అక్షము (axis) మేరువు అని చెప్పుకున్నాము. ఇంకొకరు మేరువు అంటే మనుష్యుని అంతరంగమని తన ఊహ చెప్పారు. సూర్యుడు నక్షత్రము, సూర్యుడు దేవతా మూర్తి, సూర్యుడు శ్రీ రాముని వంటి రఘువంశీయుల వంశ కర్త. సూర్యుడు పంచ బ్రహ్మ, త్రిమూర్తి స్వరూపము. ఆదిత్యులు పన్నెండు మంది. (ద్వాదశ ఆదిత్యులు - ధాత, మిత్ర, అర్యమ, రుద్ర, వరుణ, సూర్య, భగ, వివస్వన్, పూషా, సవితా, త్వష్ట, విష్ణు.) భౌతిక కాస్మాలజీలో సూర్యుణ్ణీ, పురాణాలలో సూర్యునీ, సౌరమతంలో పరమేశ్వరుడైన సూర్యుని, భూలోకంలో కాల స్వరూపుడైన సూర్యుని ఎలా అర్థం చేసుకోవాలి?
There are two essential parts to understanding the universe: its representation in terms of material objects, and the manner in which this representation changes with time. In philosophy, these are the positions of two different schools, one believing that reality is being, and the other that it is becoming. The conception of the cosmos, consisting of the material universe and observers, has been shaped by ideas that belong to these two opposite schools. The conception of the world as being is associated with materialism, while that of becoming is associated with idealism. In the materialist view, mental experience is emergent on the material ground and contents of the mind are secondary to the physical world. Conversely, in the idealist position consciousness has primacy. ---- Prof. Subashh Kak, Journal of Cosmology, 2009, Vol 3, pages 500-510.
సూర్యుడు - సౌరమతము
సూర్యుడు భూమిమీద మనుష్యులకు, బ్రహ్మాండములోని ఊర్ధ్వలోకములకు గల ప్రత్యక్ష సంబంధము. మన ఉనికికి ప్రత్యక్ష కారణము సూర్యుడు. సూర్యుడు ప్రత్యక్ష నారాయణుడు. దైవత్వానికి ప్రత్యక్ష సాక్షి. సూర్యుని పరమేశ్వరుని గా ఆరాధించేది సౌరమతము. సూర్యారాధన మన దేశంనుండే మధ్య ఆశియా, ఆఫ్రికా వరకు వ్యాపించి ఉండాలి. పంచాయతన పూజలో సూర్యునికి స్థానం ఉన్నది. మనదేశంలో ఇప్పుడు తక్కువ సంఖ్యలో సూర్యదేవాలయాలు ఉన్నాయి. ఋగ్వేద మంత్రాలలో సూర్యుని ఉద్దేశించే మంత్రాలు అనేకం. సూర్యసిద్ధాంతం ప్రాచీన జ్యోతిష గ్రంధం.
ముఖ్యమైన సూర్యక్షేత్రాలు - ఒడీశాలో కోణార్క సూర్యదేవాలయం చాలా ప్రఖ్యాతి చెందినది. మన రాష్ట్రంలో శ్రీకాకుళం సమీపం లోని అరసవల్లి సూర్యదేవాలయం చాలా ప్రాచీన మైనది. ఇది 1641లో గోల్కొండ సుల్తానుల ఫౌజ్ దార్ షేర్ మహమ్మద్ ఖాన్ ద్వంసంచేశాడు. అతని బారినపడిన ఇంకొక విఖ్యాత

దేవాలయం శ్రీకాకుళం లోని శ్రీకాకుళేశ్వర దేవాలయం. అరసవల్లి దేవాలయం తిరిగి 19వ శతాబ్దంలో పునర్నిర్మింపబడినది. తమిళనాడులో కుంభకోణం సమీపం లోని సూర్యనార్ కోయిల్ లో శివ సూర్యనారాయణ ఆలయం ఉన్నది. ఇది సూర్యుడు ప్రధానం గా గల నవగ్రహ ఆలయము.
గుజరాత్ లొని మొధెరా అహమ్మదాబాదుకు 102 కి.మీ. లోని ప్రాచీన సూర్యదేవాలయం. ఇది ASI అధీనంలోని కట్టడం. ప్రస్తుతం పూజాదికాలు లేవు. గయలో దక్షిణార్క మందిరమనే సూర్యదేవాలయము ఉన్నది. ఇక్కడ పితృ దేవతలను ఆరాధిస్తారు. కాశీలో లోలార్క కుండం అని సూర్యుడు గంగలో శివుని కోపాగ్నికి తాళలేక స్నానం చేసిన కుండం అసి, గంగా సంగమ స్థానంలో ఉన్నది.
On Cosmologies – New Series – 4
జంతునామ్ నరజన్మ దుర్లభమ్ - వివేక చూడామణి

అన్ని జంతువులలో మానవ జన్మ దుర్లభమైంది. దానికి అర్థం మానవ జన్మ అత్య్త్తమమైనది అని కాదు. పశువు, పక్షి, మనుష్యులు, గంధర్వులు, దేవతలు, అసురులు వీరందరూ సృష్టిలోని జీవులే. వీరందరికీ లేని ప్రత్యేకత మనుష్యులకు ఏమున్నది? ఇక్కడ బ్రహ్మాండములోని లోకాల ప్రసక్తి అవసరం. ఊర్ధ్వలోకాలకు తమ కర్మఫలముగా వెళ్ళగలిగె మార్గము భూలోకములోని మనుష్యులకే ఉంది. “స్వర్గ కామయ యజేత” అంటే స్వర్గం కోరుకునే వాడు యజ్ఞం చేయాలి. యజ్ఞం వేదం చెప్పిన కర్మ మార్గం.
నహుష చక్రవర్తి కథ తెలిసినదే. నహుషుడు చంద్ర వంశంలో జన్మించిన రాజు. ఇతడు ప్రభ - ఆయువుల పుత్రుడు. ప్రియంవద ద్వారా యతి, యయాతి, సంయాతి, యాయాతి, ధ్రువులనే పుత్రులను కన్నతండ్రి. నహుషుడు రాజ్యపాలన చేస్తూ నూరు యాగాలు చేశాడు. దేవేంద్రుడు స్వర్గానికి అధిపతి. ఒకసారి ఇంద్రుడు వృత్రాసురుణ్ణి సంహరించాడు. అందువల్ల బ్రహ్మహత్యాదోషం పట్టుకుంది. తాను స్వర్గాధిపత్యానికి అనర్హుడన్ననుకొని ఆచూకి తెలియని సరస్సులో దాగున్నాడు. అప్పుడు స్వర్గాధిపత్యానికి అర్హులెవరా అని అలోచించి మునులతో సంప్రదించి నహుషుడే తగినవాడని నిర్ణయించి, అందుకు ఆతడంగీకరించగా దేవతలు నహుషుని స్వర్గాధిపతిని చేశారు. మళ్ళీ అక్కడ నహుషుడు తాను చేసిన చేసిన పొరపాటు వలన అగస్త్య మహర్షి శాపానికి గురియై శపింపబడి తిరిగి సర్పరూపములో పదివేల సంవత్సరాలు గడప వలసి వస్తుంది.
వైదిక సాహిత్యం ప్రకారము మనుష్య జన్మ ఎత్తిన జీవునికి స్వర్గలోకానికి వెళ్లగలిగే మార్గము, పుణ్య క్షయమైనప్పుడు తిరిగి భూమి లేక ఇతర అథోలోకములలోనికి పతనము ఉన్నది. ప్రతిమానవుడు స్వర్గంజేరక పోవచ్చును. అలాగే భారతములో ధర్మ రాజు కూడా ఒక్క సారి అసత్యమాడటం వలన కొలది సమయం నరక దర్శనం, అక్కడ పాండవులను చూడడం తరువాత స్వర్గ ప్రవేశం అక్కడ కౌరవులనుచూచి ఆశ్చర్య పడడం జరిగినది. అందరూ ధర్మ రాజు, నహుషుడూ కాలేరు. కాని మరణించిన తరువాత జీవుని గతి (ప్రయాణం) ఏమిటి? అన్న ప్రశ్న కేవలం సనాతన ధర్మంలోనే ప్రతిపాదించ బడినది. మరణించిన వారి ఆత్మలకు RIP - Rest in Peace అనే ఆకాంక్ష అర్థంలేని పద ప్రయోగం. అందుకే కర్మ, పునర్జన్మ సిద్దాంతములు ప్రతిపాదించారు. అన్నీ ఆత్మలు స్వర్గానికి వెళ్ళవు. స్వర్గానికి భూమికి మధ్య భువర్లోకమున్నది. భువర్లోకమునకు దిగువగా ద్యులోకము, అంతరిక్షమూ ఉన్నాయి. ఈ మధ్యలోనే ప్రేత లోకము, చంద్రలోకము, వసులోకము. సూర్యమండలము,గంధర్వాది లోకములు ఉన్నాయి. మనుష్యులు చేసిన పుణ్యఫలంగా ఈ లోకాలకు కూడా వెళ్ళవచ్చు. భీష్ముడు అంపశయ్యపై 54 దినములు నిరీక్షించి ఉత్తరాయణము వచ్చాక తనదైన వసులోకానికి వెళ్ళాడు. భారతంలో గంధర్వుల ప్రసక్తి కూడా వస్తుంది.
పురాణాలలో ఈ కథలన్నీ మనకు ఎందుకు చెప్పారు? మొదటి కారణం మానవజీవిత కాలము అత్యల్పం. జాతకం చూపించుకుని ప్రమోషన్ ఎప్పుడొస్తుందని అడగడం మూర్ఖత్వం. అవి క్షణికమైన సుఖ సంతోషాలని ఇచ్చేవి. వచ్చేవరకు నిరీక్షణలోని దుఃఖం, రాక పోతే రాలేదని దుఃఖం, పక్కవాడికి వచ్చిందని దుఃఖం, వస్తే మనకి నచ్చని స్థానానికి బదిలీచేశారని దుఃఖం, మళ్ళీ కొన్నాళ్ళకు పైదానికోసం ఆరాటం. మరణం తరువాత ప్రయాణాన్నే ఉత్తరగతులు అంటారు.ఇహం కంటె పరమే చాలా ముఖ్యమైన ప్రయాణం. దానికోసమే మన వైదిక సాహిత్యం శ్రాద్ధకర్మలకు అంత ప్రాధాన్యత ఇచ్చింది.
విశ్వ సృష్టి (కాస్మాలజీ)లో అన్యలోకాల, అక్కడి జీవుల ప్రసక్తి లేదే? సైన్స్ తనకు కనపడిన వాటిని గురించి చెబుతుంది. సైన్స్ పద్ధతులకు అందకపోతే అవిలేవని నిర్ధారించలేము. దేవలోకం గంధర్వలోకం గురించి పరిశోధించే స్థాయికి ఆధునిక విజ్ఞానం ఇంకా ఎదగలేదని మనం అర్థంచేసుకోవాలి. దీనికి అద్భుతమైన ఉదాహరణ త్రిశంకుని కథ. మహర్షి విశ్వామిత్రుని ఋషులలో సైంటిస్ట్ అనుకోవచ్చు. ఆయన సృష్టించిన త్రిశంకు స్వర్గం విజ్ఞాన శాస్త్రం సృష్టించిన ఆధునిక ప్రపంచాన్ని గుర్తుచేస్తుంది. మనం రసాయన శాస్త్రాన్ని ఎంతో అభివృద్ధి చేశాం. ఎందరో శాస్త్రజ్ఞులకు నోబెల్ మొదలైన బహుమతులు ఇచ్చుకున్నాం. కాని ఆ శాస్త్రం చాలా రోజులవరకు వాతావరణాన్ని, భూమిని జలవనరులను కలుషితం చేశామని గమనించలేదు.

No comments:
Post a Comment