Monday, January 22, 2018

Father's Day Musings

https://www.facebook.com/vallury.sarma/posts/533943869976364


ఆలివంకవారు ఆత్మబంధువులైరి
తల్లివంకవారు తగుమాత్ర చుట్టాలు
తండ్రి వంకవారు దాయాది పగవారు
విశ్వదాభిరామ వినురవేమ

ఇది వేమన గుర్తించిన సామాజిక న్యాయం. ఆస్తి పరుడైన తండ్రి ఎప్పుడు తనువు చాలిస్తాడా అని ఎదురుచూస్తూ, జ్యోతిష్కులను అడిగిన పుత్ర రత్నాలను నేను ఎరుగుదును. నాటి ప్రహ్లాదుడు, దానవ వైరిపై భక్తితో తండ్రిని మానసికంగా హింసించాడు. చాణక్యుని అర్థ శాస్త్రంలో మహారాజైన తండ్రి, ప్రియ పుత్రుడైనా యువరాజుపై నిఘా ఉంచాలని ఉన్నది. ఇక ఔరంగజేబు సింహాసనానికై తండ్రిని, ముగ్గురు అన్నగార్లనూ ఏమిచేశాడో చరిత్ర చెబుతుంది. అత్తా కోడలు, వలెనే తండ్రీకొడుకులది కూడా ఉమ్మడికుటుంబములో కొంత stressful relation కావడానికి అవకాశం ఉంది. తల్లి తండ్రులపై, గౌరవం మొదటి స్థాయి. ప్రేమ కొందరిది, ఆత్మీయత కొందరిది, ఆరాధన కొందరిది, తరాల అంతరాలతో వచ్చిన చికాకులు మరికొందరివి.వ్యక్తుల సంబంధాలను ఒక సూత్రంగా నిర్వచించలేము. పితృదినోత్సవం అని సంస్కృతీకరిస్తే అది తెలుగు/భారతీయ సంస్కృతి కాదు. ఇక్కడ తప్పొప్పులు లేవు. ఎవరి వీలు, ఉత్సాహం వారిది. జాతిపితగా పేరుపొందిన గాంధీ తన పుత్రులకు మంచి తండ్రి, తన తండ్రికి మంచి పుత్రుడూ కూడా కాలేకపోయాడు. భార్యా భర్తలకు ఆధునిక నాగరికత విడాకుల సౌలభ్యం కలిగించింది. అది తల్లి తండ్రులతోనూ , పిల్లల తోనూ కుదరదు.


Vvs Sarma తల్లితండ్రులను గౌరవించడం, గుర్తుచేసుకోవడం పిల్లల కనీసధర్మం. అది తప్పని ఎవరూ అనరు. ఒకతరం అభిప్రాయాలు, మరొకతరంవాటికి బాగా తేడా వచ్చేసింది. మా పిల్లలతో మాట్లాడుతున్నా మనం పాత తరంవాళ్ళము. మన సంభాషణలు ఒక Wavelength పై లేవు అని స్పష్టంగా తెలుస్తూంది.
Vvs Sarma Vinjamuri Venkata Apparao In electronic media a hastily made remark and an equally hastily made comment leave our hands instantaneously, appear on the screen and might cause emotional upsets. I am very sorry for what happened today. It is better to forget and forgive. Generally the use of language has become quite unpolished because of the influence of TV and cinema. We are more careful with English and Telugu even in public discourse is becoming very pedestrian and hurting people. Often people make an extreme comment as a devil's advocate without really meaning it but to put across a point.Vvs Sarma నా భావం ప్రహ్లాదుని వంటి మహా భక్తుని తప్పుపట్టడం కాదు, హిరణ్యకశిపుని వంటి తండ్రులున్నప్పుడు తండ్రి అనే సంబంధంకూడా భగవంతునితో యోగం ముందు అర్థంలేనిది అనిచెప్పడమే. ఒక చాటువు గుర్తుకు వచ్చి ఆవాక్యం వ్రాశాను. తల్లిన చంపిన పరశురాముడు, అన్న మరణానికి కారకుడైన విభీషణుడు, తండ్రి మరణానికి కారకుడైన ప్రహ్లాదుడు మొదలైన వారు వీరవైష్ణవులు అని దాని భావము. ఇది నిందా స్తుతి మాత్రమే. మీరన్నట్లు వ్యాపార పండుగలపై చర్చ అనవసరమే. కాని విదేశాలలో కేవలం వ్యాపారంగా ఉన్నదానికి, మన వాళ్ళు కొత్త సంప్రదాయంగా చేస్తున్నారు.



No comments:

Post a Comment

The Structure of the Universe (Vedic) - Viswaroopa - K. Sivananda Murty Preface 2

https://www.facebook.com/vallury.sarma/posts/616984388338978 The Puranas speak of individuals going up and down between these proximate...