Thursday, January 25, 2018

కార్తీక పురాణం - 1

https://www.facebook.com/vallury.sarma/posts/592487907455293

https://www.facebook.com/vallury.sarma/posts/592810597423024

https://www.facebook.com/vallury.sarma/posts/593320824038668

https://www.facebook.com/vallury.sarma/posts/593729277331156

https://www.facebook.com/vallury.sarma/posts/594126137291470

https://www.facebook.com/vallury.sarma/posts/594513953919355

కార్తీక పురాణం – 7

https://www.facebook.com/vallury.sarma/posts/594869827217101

https://www.facebook.com/vallury.sarma/posts/595671243803626

https://www.facebook.com/vallury.sarma/posts/596072497096834

https://www.facebook.com/vallury.sarma/posts/596535403717210

https://www.facebook.com/vallury.sarma/posts/597078580329559

రాజవరం ఉషగారు కార్తీక పురాణం గురించి చెప్పమన్నారు. నిజానికి అది ప్రత్యేకపురాణం కాదు. స్కందపురాణంలోని ఒక అధ్యాయం. స్కందపురాణాన్నే కార్తీక పురాణం అంటారని కొందరి వాదన. అసలు పురాణాలన్నిటినీ కలిపి మహాపురాణమంటారనీ, అది వ్యాసుని రచన అని,కాల గమనంలో అదే 18 పురాణాలుగ, అనేక ఉపపురాణాలుగా విభజింపబడినదని ఒక ఊహ. కార్తీక పురాణం గురించి అనేక బ్లాగులలో పూర్తిగా ఉంది. కేవలం ఇది విషయ సేకరణమే. నా అభిప్రాయాలులేవు. (స్కంద పురాణమా? స్కాందమా? రెండూ సరియైనవే, సంస్కృత నిఘంటువులో స్కందపురాణ అని ఉంది. తత్పురుష. తెలుగు నిఘంటువులో, పురాణ నీతిచంద్రికలో చెప్పినట్లు ఉన్నది (స్కాందము : పురాణనామచంద్రిక:ఇది శివమాహాత్మ్య ధర్మాదిబోధకమును తత్పురుష కల్పసంబంధమును స్కందప్రోక్తమును అయి ఉండును. ఉపపురాణములలో ఒకటి. స్కాందమ్ పురాణమ్ కర్మధారయ.) స్కాంద పురాణం వ్యాసుడు రచించిన ఆష్టాదశ పురాణాలలొ ఒకటి. ఇందులొ 81,000 శ్లోకాలు ఉన్నాయి. ఈ పురాణం 7 ఖండాలుగా విభజించబడింది.
1. మహేశ్వర ఖండం - ఇందులొ నాలుగు భాగాలు ఉన్నాయి. కేదార ఖండం, కౌమారి ఖండం, అరుణాచల మహత్మ్యం, పూర్వార్థం, అరుణాచల మహత్మ్యం, ఉత్తరార్ధం
2. వైష్ణవ ఖండం - వేంకటాచల మాహాత్మ్యం, పురుషోత్తమ(జగన్నాధ మహత్మ్యం), బదరికాశ్రమ మహత్మ్యం, కార్తీకమాస మహత్మ్యం, మార్గశీర్ష మాస మహత్మ్యం, భాగవత మహత్మ్యం, వైశాఖమాస మహత్మ్యం, అయోధ్యా మహత్మ్యం
3. బ్రహ్మ ఖండం - సేతు మహత్మ్యం, ధర్మారణ్య ఖండం , బ్రాహ్మణోత్తర ఖండం
4. కాశీ ఖండం - కాశీ ఖండం పూర్వార్థం, కాశీ ఖండం ఉత్తరార్థం,
5. అవన్య్త ఖండం - అవన్య్త మహత్మ్యం, రేవాఖండం
6. నాగర ఖండం
7. ప్రభాస ఖండం - ప్రభాస మహత్మ్యం, వస్త్రా పథ మహత్మ్యం, అర్బుద ఖండం, ద్వారక మహత్మ్యం
పూర్వము కైలాస పర్వతము మీద శంకరుడు బ్రహ్మాది దేవతలు కొలువై యుండి ,యీ స్కాంద పురాణమును వారికి వినిపించెను. పార్వతి అది విని కుమారస్వామికి (స్కందునకు ) చెప్పెను . ఆయన నంది గణమునకు చెప్పెను. నంది దత్తాత్రేయునకు జెప్పెను . ఆయన వ్యాసునకు చెప్పెను .వ్యాసుడు దానిని సూతునకు జెప్పెను . ఆయన శౌనకాది మునులకు జెప్పెను. తత్పురుష కల్పములో , సర్వ సిద్దులను సమ కూర్చెడి మహేశ్వర ధర్మములు కుమార స్వామిచే లోకానుగ్రహ బుద్దితో చెప్పబడినది. అవి అన్నియు ఒక పురాణమై వెలసినవి .స్కందునిచే చెప్పబడిన పురాణము కావున ఇది స్కాంద పురాణమని ప్రసిద్ది కెక్కెను.
మాసానామ్ కార్తికః శ్రేష్ఠో దేవానామ్ మధుసూదనః - బ్రహ్మోవాచ, స్కంద పురాణం
పార్వతి పరమేశ్వరులు గగన౦బున విహరించుచుండగా పార్వతి దేవి " ప్రాణేశ్వర సక లైశ్వర్యములు కలుగ చేయునట్టిది , సకల మానవులు వర్ణ భేదములు లేక ఆచరించదగినది, శాస్త్ర సమ్మతమైనది, సూర్య చంద్రులున్నంత వరకు నాచరింపబడేడిది యగు వ్రతమును వివరింపు"డని కోరెను.అంతట మహేశుడు
మందహాసమొనరించి " దేవి ! నీవు అడుగుచున్న వ్రతము స్కంద పురాణమును చెప్పబడియున్నది దానినిప్పుడు వశిష్ట మహాముని మిథిలాధీశుడగు జనక మహారాజునకు వివరించబోవుచున్నాడు. చూడుమా మిథిలా నగరమువైపు" అని మిథిలానగరపు దిశగా చూపించెను.
మిథిలానగరములో వశిష్టుని రాకకు జనకుడు సంతసించి అర్ఘ్య పాధ్యములతో సత్కరించి, కాళ్ళు కడిగి, ఆ జలమును శిరస్సు పైజల్లుకొనెను. వశిష్టుడు - జనక మహారాజ! నేనొక మహాయజ్ఞము చేయతలపెట్టితిని, దానికి కావాల్సిన అర్ధబలము, అంగబలము, నిన్నడిగి క్రతువు ప్రారంభి౦చమని నిశ్చయి౦చి యిటు వచ్చితిని-అని పలుకగా జనకుడు" మునిచంద్రమా! అటులనే యిత్తును. స్వీకరి౦పుడు. కానీ, చిరకాలమునుండి నాకొక సందేహము గలదు. తమనడిగి సంశయము తీర్చుకోదలచితిని. నాయదృష్టముకొలది యీ అవకాశము దొరికినది. సంవ త్సరములో గల మాసములలో కార్తీకమాసమే యేలన౦త పవిత్రమైనది? ఆ కార్తీకమాసము గొప్పతనమేమి? అను సంశయము నాకు చాలాకాలమునుండి యున్నది కావున తాము కార్తీక మహత్యమును గురించి వివరించవలసివున్నది" యని ప్రార్ధి౦చెను.
పురాణ కథలలో కథ చెప్పుటకు ఈ పద్ధతి ఎందుకు అనుసరిస్తారు? ఇదే పద్ధతి భారతములో శాంతి పర్వములో భీష్ముడు ధర్మరాజు ప్రశ్నలకు కూడా ఉపయోగిస్తాడు. ఇది ఆ కథ యొక్క ప్రాచీనతను, ప్రామాణికతను సూచిస్తుంది. ఇది ప్రాచీన కాలమునుండి పూర్వము శివుడు పార్వతికి చెప్పిన ఆఖ్యానము అంటే ఇది శబ్దము,ఐతిహ్యము అనే ప్రమాణములు ఔతున్నది. వక్త ఇది నా అభిప్రాయము అంటే దానికి ఆ ప్రామాణికత ఉండదు. మన వైదిక సాహిత్యమంతా ఇలా దేవతల, మహర్షుల నుండి వచ్చినదన్న విశ్వాసం అవసరం.
వశిష్ట మహాముని చిరునవ్వు నవ్వి" తప్పక నీ సంశయమును దీర్చగలను. నే చెప్పబోవు వ్రతకథ సకల మానవులను ఆచరించదగినది సకల పాపహరమైనది అయివున్నది . ఈ కార్తిక మాసము హరిహర స్వరూపము. ఈ మాసమున౦దాచరించు వ్రతముయొక్క ఫలమింతని చెప్పనలవి గాదు. వినుటకు గూడా నాన౦ద దాయకమైనది. వినినంత మాత్రముననే యెట్టి నరక బాధలును లేక యీహమందును, పరమ౦దును సౌఖ్యమును పొందగలరు. శ్రద్దగా ఆలకింపు'మని యిట్లు చెప్పసాగెను .
ఓ మిథిలేశ్వర! జనక మహారాజ! ఏమానవుడైనను కార్తిక మాసములో, సూర్యభగవానుడు తులారాశి య౦దు ఉండగా, వేకువ, జామున లేచి కాలకృత్యములు తీర్చుకొని, స్నానమాచరించి , దానధర్మములను, దేవతపూజలను చేసినచో - దాని వలన ఆగణిత పుణ్యఫలము లబించును. కార్తికమాస ప్రారంభమును౦డియు యిట్లు చేయుచు, విష్ణు సహస్రనామార్చన, శివలింగార్చన ఆచరించుచు౦డ వలెను. ముందుగా కార్తిక మాసమునునకు అధిదేవతయగు దామోదరునికి నమస్కరించి " ఓ దామోదర! నేను చేయు కార్తిక వ్రతమునకు ఎట్టి ఆటంకములు రానియక నన్ను కాపాడుము" అని ధ్యానించి, వ్రతమును ప్రారంభించ వలెను. (ఇక్కడ మనం చెప్పుకుంటున్న సృష్టి విజ్ఞానాన్ని గుర్తుంచుకోవాలి. సూర్యుడు తులారాశిలో ఉన్నప్పుడు సౌరమానంలో తులా మాసము. (తులా సంక్రమణము తేదీ 17 అక్టోబర్ 2013 గురువారం. నవంబరు 16 వృశ్చిక సంక్రమణం) ఈకార్తీక మాసములో పుణ్య నదులైన గంగ, గోదావరి, కృష్ణ, కావేరి, తుంగబద్ర, యమునా మున్నగు నదులలో యే ఒక్క నదిలో నైననూ స్నానమాచరించిన యెడల గొప్పఫలము కలుగును. శ్రీమహా విష్ణువుకు ప్రీతికరమైన పుష్పములను తనే స్వయముగా కోసితెచ్చి నిత్యధూప, దీప , నైవేదములతో భగవంతుని పూజ చేసుకొని, అతిది అభాగ్యతులను పూజించి వారికి ప్రసాద మిడి, తన యింటి వద్దగానీ, దేవాలయములో లేక రావిచెట్టు మొదట గాని కూర్చుండి కార్తిక పురాణము చదువవలయును. ఆ సాయంకాలము సంధ్యావందనమాచరించి, శివాలయమందు గాని విష్ణాలయమందుగాని తులసికోట వద్ద గాని , దీపారాధన చేసి శక్తినిబట్టి నైవేద్యము తయారుచేయించి , స్వామికి సమర్పించి అందరికి పంచిపెట్టి తర్వాత తను భుజింపవలెను. మరునాడు మృష్టాన్నముతో భూత తృప్తి చేయవలయను. ఈ విధ ముగా వ్రత మాచరించి స్త్రీ పురుషులకు పూర్వమందును , ప్రస్తుత జన్మమందును చేసిన పాపమూ పోయి మోక్షమునకు ఆర్హులగుదురు . ఈ వ్రతము చేయుటకు అవకాశము లేనివారులు వ్రతము చేసిన వారిని జూచి , వారికి నమస్కరించినచొ వారికి కూడా తత్సమాన ఫలముదక్కును .
కార్తీక పురాణం – 3
భగవానువాచ
వనస్పతీనాం తులసీ, మాసానాం కార్తికః ప్రియః
ఏకాదశీ తిథీనాం, చ క్షేత్రాణాం ద్వారకా మమ
బ్రహ్మోవాచ
యత్కిఞ్చిత్ క్రియతే పుణ్యం విష్ణుముద్దిశ్య కార్తికే
తస్య క్షయం న పశ్యామి మయోక్తం తవ నారదః
కార్తిక మాసములో సోమవార వ్రతమునకు ప్రత్యేక ప్రాముఖ్యము గలదు. కార్తిక మాసములో సోమవారము శివునకు అత్యంత ప్రీతికరమైన రోజు. ఆ రోజున స్త్రీ గాని, పురుషుడుగాని రోజంతయు ఉపవాసము౦డి, నది స్నానము చేసి తమశక్తి కొలది దానధర్మములు చేసి నిష్ఠ తో శివదేవునకు బిల్వ పత్రములతో అబిషేకము చేసి, సాయంత్రము నక్షత్ర దర్శనము చేసిన తరువాత భుజించవలయును.ఈ విధముగా నిష్టతో నుండి ఆరాత్రి యంతయు జాగరణ చేసి పురాణ పఠన మొనరించి తెల్లవారిన తరువాత నదికి వెళ్లి స్నాన మాచరించి, తిలాదానము చేసి, తమశక్తి కొలది పేదలకు అన్నదానము చేయవలెను. అటుల చేయ లేనివారు కనీసము ముగ్గురు బ్రాహ్మణుల కైనను తృప్తిగా భోజనము పెట్టి, తాము భుజించవలయును. ఇట్లు కార్తిక మాసమందు వచ్చు సోమవార వ్రతమును చేసిన యెడల పరమేశ్వరుడు కైలాస ప్రాప్తి కలిగించి, శివ పూజ చేసినచో కైలాస ప్రాప్తియు - విష్ణు పూజ చేసినచో వైకుంఠ ప్రాప్తియు నొందును.
కుక్క కైలాసానికి వెళ్లుట… (పాపం ఆకుక్కకు చాలా జన్మల కథ ఉన్నది)
”పూర్వ కాలమున కాశ్మీర్లో ఒక పురోహిత బ్రాహ్మణుడు ఉండేవాడు. అతనికి లేకలేక ఒక కూతురు పుట్టింది. ఆమెకు స్వాతంత్ర్య నిష్ఠురి అని పేరు పెట్టారు. తండ్రి ఆమెకు సౌరాష్ట్రకు చెందిన మిత్రశర్మ అనే సద్బ్రాహ్హణుడికి ఇచ్చి పెళ్లి చేశాడు. అయితే ఆ బ్రాహ్మణ యువకుడు నాలుగు వేదాలు, శాస్త్రాలు అభ్యసించడం వల్ల సదాచారపరుడై ఉండేవాడు. భూతదయ కలిగి ఉండేవాడు. నిత్య సత్యవాది. నిరంతరం భగవన్నామస్మరణ చేసేవాడు ఈ కారణాలతో ప్రజలంతా అతన్ని ‘అపర బ్రహ్మ’ అని పిలిచేవారు. ఇంతటి ఉత్తమ పురుషుడికి భార్య అయిన స్వాతంత్ర అందుకు భిన్నంగా ఉండేది. అయితే శాంత స్వరూపుడైన ఆమె భర్త మాత్రం ఆమెను ఏవగించుకోకుండా… ఆమెతో కలిసే ఉండేవాడు. చుట్టుపక్కలవారంతా ఆమెను గయ్యాళి అని ఏవగించుకుంటూ… కర్కశ అని పేరుపెట్టి ఎగతాళి చేసేవారు. కొంతకాలం తర్వాత ఆమె ఒకనాటి రాత్రి తన భర్త గాఢనిద్రలో ఉండగా… ఒక బండరాయితో అతని తలపై కొట్టి చంపింది. ఇష్టారాజ్యంగా తిరగసాగింది. తన సౌందర్యాన్ని చూపి ఎందరినో క్రీగంటనే వశపరుచుకుంది.ఆ తర్వాత ఆమె యవ్వనం క్రమంగా నశించడం ఆరంభమైంది. వయసు పైపడసాగింది. చేసినపాపాలకు గురుతుగా శరీరంపై పుండ్లు ఏర్పడ్డాయి.విటుల్లో ఒక్కరూ ఇప్పుడామెవైపు కన్నెత్తికూడా చూడడం లేదు. అలా కొంతకాలం ఆమె ప్రత్యక్ష నరకాన్ని చవిచూచి, పురుగులు పడి చనిపోయింది.
బతికినన్ని రోజులు ఒక్క పురాణ శ్రవణమైనా చేయని పాపి కావడంతో భయంకరంగా కనిపించే యమకింకరులు ఆమెను యముని ముందు హాజరుపరిచారు. చిత్రగుప్తుడు ఆమె పాపపుణ్యాలను ఏకరవు పెట్టారు. కుంభీపాకంలో వేశారు. ఆమె చేసిన పాపాల ఫలితాలను ఆమె ఒకత్తే కాకుండా, ఇటు ఏడు తరాలు, అటు ఏడు తరాలు నరక బాధలు అనుభవించసాగారు. ఆ తర్వాత ఆమె నీచజన్మలు ఎత్తుతూ, క్రిమికీటకాలుగా పుట్టి.. చివరకు పదిహేనో జన్మలో కళింగ దేశంలో ఒక కుక్కగా జన్మనెత్తింది.
కుక్కజన్మలో ఆమె ఆకలికి తట్టుకోలేక ఇంటింటికీ తిరిగింది. కర్రతో కొట్టేవారు ఆమెను కొడుతున్నారు. పిల్లలు తరుముతున్నారు. అయితే… ఒక బ్రాహ్మణుడు కార్తీక సోమవార వ్రతమాచరించి, ఉపవాసముండి, సాయంత్రం నక్షత్ర దర్శనం చేసి, ఉపవాస విరమణ నిమిత్తం సిద్ధం చేసుకున్న అల్పాహారాన్ని అరుగుపై పెట్టి, కాళ్లూచేతులు కడుక్కునేందుకు వెళ్లాడు. అయితే… ఆ కుక్క గబగబా వెళ్లి ఆ ఆహారాన్ని భుజించింది.
వ్రత నిష్ఠా గరిష్ఠుడైన ఆ బ్రాహ్మడి పూజ విధానముతో జరిపెంచిన బలియన్నం కావడం… కార్తీక సోమవారం నాడు కుక్క ఆకలితో రోజంతా ఉపవాసముండడం, శివపూజ పవిత్ర స్థానంలో ఆరగించడం వల్ల ఆ కుక్కకు పూర్వజన్మ జ్ఞానం కలిగింది. వెంటనే ఆ కుక్క ‘విప్రోత్తమా… నన్ను కాపాడుము’ అని మొరపెట్టుకుంది. ఆ మాటలు బ్రాహ్మణుడికి ఆశ్చర్యాన్ని కలిగించింది. మనుష్యులెవరూ కనిపించకపోయేసరికి అంతా భ్రమ అనుకున్న ఆ విప్రుడికి మళ్లీ మాటలు వినిపించాయి. ‘రక్షించు… రక్షించు…’ అనే కేకలు వినిపించాయి. ఆ మాటలు కుక్క నుంచి వస్తున్నాయని గ్రహించిన బ్రాహ్మడు ‘ఎవరు నీవు? నీ వృత్తాంతమేమిటి?’ అని ప్రశ్నించాడు. అంత ఆ కుక్క తన వృత్తాంతాన్ని వివరించింది. పదిహేను జన్మల క్రింద సద్భ్రాహ్మణుడి భార్యయైన తాను వ్యభిచారం చేసిన తీరు, భర్తను చంపడం, వృద్ధాప్యంలో కుష్టువ్యాధితో దినదినగండంగా బతికి, చనిపోయిన తీరును, నరకంలో అనుభవించిన శిక్షలను గురించి వివరించింది. ‘ఈ రోజు మీరు కార్తీక సోమవార వ్రతం చేసి, ఇక్కడ పెట్టిన బలిఅన్నం తినడం వల్ల నాకు జ్ఞానోదయం కలిగింది. కాబట్టి ఓ విప్రోత్తమా…! నాకు మహోపకారంగా మీరు చేసిన కార్తీక సోమవార వ్రత ఫలమొక్కటి ఇచ్చి, నాకు మోక్షం కలిగించు’ అని ప్రార్థించింది.
దాంతో ఆ శునకం మీద జాలితో ఆ బ్రాహ్మణుడు తాను చేసిన కార్తీక సోమవార వ్రతాల్లో ఒక రోజు నాటి ఫలాన్ని ఆమెకు ధారబోశాడు. అలాచేసిన వెంటనే… ఒక పుష్పక విమానం అక్కడకు చేరుకుంది. కుక్క తన జన్మను చాలింది, సూక్ష్మదేహంతో పుష్పకాన్ని చేరింది. అటు నుంచి శివసాన్నిథ్యాన్ని చేరుకుంది.”

No comments:

Post a Comment

The Structure of the Universe (Vedic) - Viswaroopa - K. Sivananda Murty Preface 2

https://www.facebook.com/vallury.sarma/posts/616984388338978 The Puranas speak of individuals going up and down between these proximate...