Thursday, January 25, 2018

On Cosmologies – 8

https://www.facebook.com/vallury.sarma/posts/579360928767991

ఈ రోజు మనం తెలుగు భాగవతంలో చతుర్థ స్కంధములో, ధ్రువోపాఖ్యానము లోని ఒక వచనమును చూదాం. (4. 290)
మేధియందు బరిభ్రామ్యమాణ గోచక్రమును బోలె గ్రహనక్షత్ర తారాగణ జ్యోతిశ్చక్రంబు నక్షత్రరూపంబులైన ధర్మాగ్ని కాశ్యప శక్రులును, సప్తర్షులును, దారాసమేతులై ప్రదక్షిణలు తిరుగుచుండురట్టి దురాసదంబును, అనన్యాధిష్ఠితంబును లోకత్రయ ప్రళయకాలంబు నందు నశ్వరంబుగాక ప్రకాశమానంబును నైన ధ్రువక్షితి యను పదంబు ముందట ఇరువదియారువేలేండ్లు సనబ్రాప్తింతువు. తత్పదప్రాప్తి పర్యంతంబు భవదీయజనకుడు వనవాసగతుడైన దద్రాజ్యంబు పూజ్యంబుగా ధర్మ మార్గమున జితేంద్రియుండవై ఏలుదువు.
ధ్రువో పాఖ్యానము శ్వేతవరాహ కల్పములోని స్వాయంభువ మన్వంతరముమొదలులోని కథ, స్వాయంభువ మనువు బ్రహ్మ మానస పుత్రుడు. శతరూప బ్రహ్మ మానసపుత్రిక. వీరి ఇరువురు సృష్టికి బ్రహ్మచేత నియోగింపబడినవారు. వీరి కుమారుడు ఉత్తానపాదుడు. అతనికుమారుడు ధ్రువుడు. ఉత్తానపాదుడికి సునీతి, సురుచి అనే ఇద్దరు భార్యల వలన ధ్రువుడు (సునీతి) ఉత్తముడు (సురుచి) అనే ఇద్దరు కుమారులు కలిగారు. కాలప్రభావం వలన ఉత్తానపాదుడికి సునీతి కంటే సురుచి అంటే ప్రేమ మరియు అనురాగం ఎక్కువగా ఉండేవి. ఒకరోజు సురుచి కుమారుడైన ఉత్తముడు తండ్రి తొడపై కూర్చొని ఉండగా దానిని ధ్రువుడు చూసి తాను తండ్రి తొడ ఎక్కబోతుండగా, సురుచి చూసి నవ్వి, నీకు తండ్రి తొడ పై ఎక్కే అధృష్టం లేదు, అదే కనుక ఉన్నట్లయితే నువ్వు నా సవతి కుమారుడిగా పుట్టి ఉండేవాడివి కాదు అని అవహేళన చేస్తుంది. నీకా అధృష్టం కలగాలంటే శ్రీహరి ని ప్రార్థించమని చెబుతుంది. ఆ పరుష భాషణానికి చింతాక్రాంతుడై ధ్రువుడు తన తల్లి సునీతి వద్దకు వెళ్ళి జరిగిన విషయం చెబుతాడు. అప్పుడు సునీతి ధ్రువుడితో నాయనా కాలప్రభావం వలన నీ తండ్రి తనను దాసీ కంటే తక్కువగా చూస్తున్నాడని, కష్టం కలిగించే పలుకులైన సవతి సరైన విషయం చెప్పిందని, శ్రీహరి పాదధ్యానము వలన జరగనివి ఉండవని స్వాయంభువ మనువు శ్రీహరిని ధ్యానించి ఉత్తమ గతి పొందాడని చెబుతుంది. అప్పుడు ధ్రువుడు శ్రీహరిని ప్రసన్నం చేసుకోవడానికి అడవికి బయలుదేరాడు. పైన ఇచ్చిన ధ్రువపదం ద్రువునికి విష్ణువు ప్రత్యక్షమై ఇచ్చిన వరం.
ఈ ఉపాఖ్యానం సృష్టికి ఖగోళానికి ఉన్న సంబంధం చూపిసుంది. 26000 సంవత్సరాలు ఏమిలెక్క? Pole Star గురించి వికిపీడియా కథనం చూడండి.
The identity of the pole stars gradually changes over time because the celestial poles exhibit a slow continuous drift through the star field. The primary reason for this is the precession of the Earth's rotational axis, which causes its orientation to change over time. If the stars were fixed in space, precession would cause the celestial poles to trace out imaginary circles on the celestial sphere approximately once every 26,000 years, passing close to different stars at different times. However, the stars themselves also exhibit proper motion, and this motion is another cause of the apparent drift of pole stars.
ధ్రువోపాఖ్యానంలో పేర్లు చూడండి. ద్రువునిది అంతరిక్షంలో స్థిర స్థానం. అతని భార్య భ్రమి. నక్షత్రమండలాల పరిభ్రమణాన్ని సూచిస్తుంది. ఆమె తండ్రి శింశుమార ప్రజాపతి. శింశుమార చక్రం అంటే ecliptic. వారికి ఇద్దరు పిల్లలు - వత్సర, కల్ప. ఒకటి భూమి సూర్యుని చుట్టూ తిరిగే సమయం. ఒకటి 14 మన్వంతరాల బ్రహ్మ కల్పం. మనుష్యుడు దేశకాలాలకు పరిమితమైన అనంతకోటి జీవరాశుల్లో ఒకడు. కాలం - పుట్టిన సంవత్సరంలో, ఒక అహోరాత్రంతో ప్రారంభమైన అతని కాలం మరొక దినంతో పూర్తి అవుతుంది. కాలమే ఆరంభం అంతం కూడా. అందుచేతనే జ్యోతిషం అంత ముఖ్య శాస్త్రం అయినది. మన జీవితం సూర్యుని మీద ఆధార పడి ఉన్నది. జ్యోతిషాణాం పతయేనమః. మిల్కీ వేలో సూర్యుడు ఒక సామాన్య నక్షత్రం అనే వైజ్ఞానిక సత్యం మనకు పెద్ద ఉపయోగం కాదు. .



No comments:

Post a Comment

The Structure of the Universe (Vedic) - Viswaroopa - K. Sivananda Murty Preface 2

https://www.facebook.com/vallury.sarma/posts/616984388338978 The Puranas speak of individuals going up and down between these proximate...