Tuesday, January 23, 2018

మనం ఏదైనా ఎలా నేర్చుకుంటాం?

Musings 11 (July 16, 2013)



How do we learn anything? Mostly by being told. మనం ఏదైనా ఎలా నేర్చుకుంటాం? ఎవరో చెప్పగా వినే. పసితనంలో భాష ఎలా నేర్చుకుంటాం? తల్లిదండ్రుల సంభాషణలను విని గ్రహిస్తాం. భాషయొక్క తొలిరూపం శబ్దం. వ్రాసేభాష తరువాత ఎప్పుడో అవసరమయినది. మనుష్యులు తమనోటితో కొన్ని శబ్దాలు పలక గలరు. సుమారు సెకండుకు పది శబ్దాలు ఉచ్చరించగలరు. మన భాషయైన తెలుగులో 56 శబ్దాలున్నాయి. అందుకే మన వర్ణమాలలో 56 వర్ణాలున్నాయి. ఇంగ్లీషులో ఎన్నిశబ్దాలున్నాయి? అమెరికన్ భాషలో 44 ఉన్నాయి. ఒక భాషలో శబ్దాలు మరియొక భాషలో ఉండక పోవచ్చు. ఇంగ్లీషులో వ్రాసే అక్షరాలకు పలికే శబ్దాలకు సరియైన సంబంధంలేదు. మన సమాచారం అంతా వినడం వలన, చదవడం వలన లభిస్తుంది.కాని ఆసమాచారం యదార్థమైనదన్న ప్రమాణం ఉంటుందా? వ్రాసే భాష ప్రమాణాలు వేరు. పలికే భాష ప్రమాణాలు వేరు. ఒక వ్రాసిన వాక్యం చదివినా, ఒక పలికిన వాక్యం వినినా మనకు ఒకే సమాచారం లభిస్తుందా? లభించదు. పలికిన భాషలో లభించే విలువైన సమాచారం వ్రాసేభాషలో ఉండదు. మన తత్త్వ శాస్త్రంలో వాక్కుకే ప్రాధాన్యం. మనం వాగ్దేవి, వాచస్పతి అని వాక్కును దేవతలుగానే ఆరాధిస్తాం. వాక్కుని, దాని అర్థాన్నీ పార్వతీపరమేశ్వరుల అన్యోన్యతకు ఉపమానంగా చెబుతాం. మన తర్క శాస్త్రంలో ప్రత్యక్ష, అనుమాన ప్రమాణాల తరువాత ముఖ్యమైనది శబ్ద ప్రమాణం. గౌతమ న్యాయ సూత్రాలలో నిర్వచనం - ఆప్తోపదేశః శబ్దః. ఆప్తవాక్యమే మనకు ప్రమాణము. మహర్షులు వేదమంత్రాలను దర్శించి, శృతిగా విని, వాక్కుతో శిష్య ప్రశిష్యులకు అందచేసి నేటి మనవరకూ అందచేసిన వేద వాక్కు మనకు పరమ ప్రమాణము. మహర్షులేకాక ఆర్యులు. అనుభవజ్ఞులు మన మంచికోరేవారెవరైనా మనకి ఆప్తులే. రోగికి వైద్యుడు ఆప్తుడే. (దీనినే ఆధునికులు Expert Testimony పేరుతో మేధస్సుకల యంత్రములకు విషయ పరిజ్ఞానాన్ని అందిస్తున్నారు.)


This is how I started my musings
Musings on Indian Philosophy ( Nyaya-Vaiseshika)
1
God does not exist. Who told you about this? What is there, some say God exists and some say God does not exist. One of them must be true. In the absence of any proof, both the propositions must be equally likely. Not really so. I am sure that those who say God exists are aware of Truth and they are certainly wiser than those who say God does not exist. In fact, the one who says God does not exist is ignorant. He is in darkness. He cannot perceive God and he presumes that God does not exist. Our ancients in Santana Dharma never got the doubt. Existence of God is not a matter of belief. A person should just be rational enough to realize the Existence of God. But before we say that the proposition ” God exists “ is TRUE, we should answer the question “Who is God?” Or rather … “What is God?” “Is God a He, She or IT?” This is what the ancient Indian darsanas (schools of philosophy) discuss. Nyaya (or logic) dealing with epistemology and Vaiseshika dealing with Ontology are the Two Indian schools which deal with this problem

No comments:

Post a Comment

The Structure of the Universe (Vedic) - Viswaroopa - K. Sivananda Murty Preface 2

https://www.facebook.com/vallury.sarma/posts/616984388338978 The Puranas speak of individuals going up and down between these proximate...