Thursday, January 25, 2018

మీరు భాగవతం చదివారా? అందులో అజైకపాత్, అహిర్బుధ్న్య అనే పేర్లు కలవారు కనుపిస్తారు.

https://www.facebook.com/vallury.sarma/posts/575020375868713

మీరు భాగవతం చదివారా? అందులో అజైకపాత్, అహిర్బుధ్న్య అనే పేర్లు కలవారు కనుపిస్తారు. విశ్వ రచనలో వారి పాత్ర ఏమిటి? (నేను భాగవతాన్ని కాచి వడకట్టాననుకోకండి. నిన్న ఒక వ్యాసంలో వారి ప్రసక్తి వచ్చింది.)అహిర్బుధ్న్యుని పేరు చాలా సందర్భాలలో విన్నాను. అజైకపాత్ పేరు నిన్ననే విన్నాను.)

జాజి శర్మ అదితి, బృహస్పతి, సర్పము, పితృదేవతలు, భగుడు, అర్యమసూర్యుడు, త్వష్టవాయువు ఇంద్రాగ్నులు, మిత్రుడు, ఇంద్రుడు జలము నిబుురుతి, విశ్వేదేవులు, విష్ణువు వసుగణము, వరుణుడు, అజైకపాత్‌, అహిర్బధ్న్యుడు, పూషయను వారు దేవతలు.
జాజి శర్మ అజైకపాత్ = విష్ణువు ముఖ్యమైన పాదముగా కలవాడుVvs Sarma విశ్వ రచనలో వారి పాత్ర ఏమిటి?జాజి శర్మ రైవతుడు, అజుడు, భవుడు, భీముడు, వాముడు, ఉగ్రుడు, వృషాకపి, అజైకపాత్‌, అహిర్బుధ్న్యుడు, బహురూపుడు, మహాన్‌ మొదలైన అసంఖ్యాకులగు రుద్రులు ప్రసూతుని భార్యయగు సరూపయందు జన్మించిరి. వారిలో పదకొండు మంది ముఖ్యులు, అని శివపురాణం చెబుతోంది.Vvs Sarma వారిని గురించిన విశేషాలు ఇంకా ఉన్నాయి. తరువాత చెబుతాను.జాజి శర్మ శ్రీ శర్మ గారు, కామకోటి వారి వెబ్సైటు లో చాలా ఉంది కాని అర్ధం కావటానికి చాలా సమయం పట్టేట్లు ఉంది. ఇది చూడండి. http://www.kamakoti.org/telugu/48/56-Adyaayam.htm...
పది సంవత్సరాల క్రితం మా తమ్ముడు (నేత్రవైద్యుడు) నన్ను నీకు చాక్షుషోపనిషత్తు గురించి తెలుసునా అని అదిగాడు. దాని పాఠంవింటే కంటిజబ్బులకు ఉపశమనం కలుగుతుందట అని అడిగాడు. తెలియదు కాని తెలుసుకోడానికి "ఇప్పుడు 5 నిమిషాలు చాలు కదా" అన్నాను. అహిర్భుధ్న్య సంహిత ఈ ఉపనిషత్తుకు సంబంధించినది. అదిపంచరాత్రాగమంలోనిది.అజైకపాదుడు, అహిర్బుధ్న్యుడు ఏకదశరుద్రులలోని వారు. రుద్రులెంతమంది? అన్న ప్రశ్నకు సమాధానం అసంఖ్యమైన వారు.
భాగవతం పురాణం. సర్గ, ప్రతిసర్గ, మన్వంతరము, వంశము, వంశానుచరితము అనే పంచ లక్షణాలు కలది. ఈ సృష్టికథలో భాగవతం షష్ఠ స్కంధములో వీరి పేర్లు వస్తాయి.
సరూపాసుత భూతాస్య భార్యా రుద్రాంశ చ కోటిశః
రైవతో 2జో భవో భీమో వామ ఉగ్రో వృషాకపిః
అజైకపదహిర్బుధ్న్యో బహురూపో మహాన్ ఇతి
రుద్రస్య పార్షాదశ్చన్యే ఘొరాః ప్రేత-వినాయకః (6.6.18)
త్తెలుగు భాగవతములో ఇవి గద్య రూపంగా చెప్పబడ్డాయి.
అజైకపాదుడు (అజ+ఏకపాద) పూర్వాభాద్ర నక్షత్రానికి అధిదేవత. కౄరత్వము, అస్త్ర శస్త్రాలు మొదలైనవి అతని లక్షణాలు.
అహిర్బుధ్న్యుడు (అహి+బుధ్న్య ) (పాము-దిగువభాగము) సత్త్వగుణ సంపన్నుడైన రుద్రుడు. ఉతరాభాద్ర నక్షత్రానికి అధిదేవత.

No comments:

Post a Comment

The Structure of the Universe (Vedic) - Viswaroopa - K. Sivananda Murty Preface 2

https://www.facebook.com/vallury.sarma/posts/616984388338978 The Puranas speak of individuals going up and down between these proximate...