Monday, January 22, 2018

హిందూ మతంలో విగ్రహారాధన అసలు ఉందా?


హిందూ మతంలో విగ్రహారాధన అసలు ఉందా?? భగవంతుడు అంతటా ఉన్నాడు (సర్వాంతర్యామి) అని చెప్పే హైంధవ ధర్మంలో విగ్రహారాధన ఎందుకు ఉన్నది?? దేవతలకు ఆకారం ఇవ్వజూసి ఇలా విగ్రహారాధన మొదలయ్యిందా? లేక ఇది మొదటి నుంచే ఉన్నదా??

Vvs Sarma 

I had a longer article some time ago. I shall try to re-post it. Hindus do not worship stone idols. Idol is like a dead-body - You need prana pratishtha, aavahana etc, .. you invoke God into the icon - which can be made of earth, wood, metal, stone, turmeric etc. - and in the end of the puja You give send off to the God, which you symbolically do by moving the plate in which you keep the icon. Saguna does not mean vigraha, even muslims do saguna, calling Allah by the gunas, merciful and compassionate.
The so-called vigraha-aradhana is among the most effective and scientific way of worshipping God in any religion. Worshipping in a prayer hall like a church or mosque is less effective. To give a latest tech example temple or your puja-room worship is like conversing with your daughter in the USA on Skype. The lap top with the image of your daughter is the icon, the conversation is mantra you read. The original way of worshipping Gods in Sanatana dharma is worship through offering oblations through fire, next is through water in abhisheka, and for those not able to do either, the worship in your own puja room to an icon and if you cannot do that also in a temple where a priest does on your behalf.
In language a vigraha is called a metaphor and in science and engineering it is called a model. In real life a currency note is an icon for money (nothing more than an IOU from govt).
Your wife or daughter is so everywhere, why do you keep a photograph in certain places. If you can see God everywhere, there is no need to do a pooja. Still you do as an example for others not so evolved.

___________________

జీవహింస మరియూ మాంసాహారం భుజించే విషయమై హిందూ ధర్మం మరియూ పురాణాలు ఏమని చెబుతున్నాయి?
VVS Sarma
ఇది వేదాలు,పురాణాలు స్పృశించే విషయము కాదు. ఆహారము అనేది ఆకాలపు సమాజాన్ని బట్టి ఉంటుంది. సనాతన ధర్మం ఒకరు స్థాపించి, ఒకపుస్తకానికి కట్టుబడ్డ ఆధునిక మతం కాదు. ధర్మ శాస్త్రాలు, గృహ్యసూత్రాలు వంటివి ఆయాకాలాలకి తగినట్లు విధి నిషేధాలు విధిస్తాయి. నేను మాంసాహార విషయం చదివినది మహాభారతం, అనుశాసనిక పర్వంలో. భీష్ముడు ధర్మరాజుకు చేసే బోధలో మాంసాహారం ఎందుకు వర్జించాలో చెబుతాడు. మహాభారత కాలం నాటికే పాడి పంటలు బాగా అభివృద్ధి చెందాయి. శ్రీకృష్ణుని గోసంరక్షణ, ఆయన పెరిగిన గోకులం ఇది నిరూపిస్తాయి. బలరాముని నాగలి, రోకలి అనే ఆయుధాలు ఆయన వ్యవసాయ ప్రవృత్తిని సూచిస్తాయి. ఆయన యమున సరస్వతీ నదుల మధ్య ప్రాంతంలో నీటి పారుదల ఏర్పాట్లు చేశాడు. రామాయణ కాలంలో వేట, యజ్ఞాలలో జంతు బలులు సామాన్యం. బ్రాహ్మణుడైన రావణుడు, క్షత్రియుడైన రాముడు మాంసాహారులే. వనాలలోని తాపసులు కందమూలాలు తిని బ్రతికేవారు. తరువాత పితృదేవతా పూజలో మాంసాహారం విధిగా ఉండేది. వాతాపి, ఇల్వలుడు, ఋషి అగస్త్యులకథ అప్పటిది. భీష్ముడు భారతంలో అలాంటప్పుడు మాంసాన్ని నైవేద్యం పెట్టడంలో తప్పులేదంటాడు. కలియుగంలో ఇది నిషేధం. ప్రత్యామ్నాయం గా మినపపప్పు తో చేసిన గారెలు వచ్చాయి.
Srivalli
పూజా కార్యక్రమాలు జరిపేపుడు, ఇంట శుభకార్యాలు జరిపేపుడు నీచుని ఎందుకు దూరంగా ఉంచుతారు? కొన్ని ప్రాంతాలలో ఇలాంటి పట్టింపులూ ఉండవు, ఎందువలన?
VVS
భగవదారాధన మానవుని సాత్త్విక ప్రవృత్తి. భారత కాలంనాటికే అహింస ధర్మంగా పేర్కొనబడినది. అందుకు మాంసాహారాన్ని విడువకపోయినా తగ్గించే ప్రయత్నంలో భాగమే పూజలలో పాసాన్నాదులను నైవేద్యాలు చేయడం, కొన్ని వారాలు తిథులలో మాంసం వర్జించడం వంటివి.
Srivalli
బ్రాహ్మణులు మరియూ కొన్ని ఇతర కులస్తులు సంపూర్ణ శాఖాహారులుగా ఉండాలనే నియమం ఎందుకు ఉంది?
No such rule.
"జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం" అనే మంత్రం వెనుక ఉన్న కధను ఆ మధ్య చదివాను. అందులో వాతాపి మరియు ఇల్వలుడు బ్రహ్మణ వేషధారణ ధరించి సద్బ్రాహ్మణుడికి భోజనం పెట్టదలిచాము అని బ్రాహ్మణులకు మేక మాంసం వండి వడ్డించేవారు అని ఉంది. మరి వీరి ఆథిద్యానికి విచ్చేసిన బ్రాహ్మణులు వారు వడ్డించిన మాంసన్ని ఎలా భుజించే వారు?
VVS - Ramayana Times – there was no vegetarianism.
Srivalli = ఇక్కడ నేను గమనించిన ఇంకో విషయం. బెంగాలీ బ్రహ్మణులు నీచు పధార్ధాలను భుజిస్తారు, ప్రసాదం కింద కూడా సమర్పించుకుంటారు. అలానే కొందరు అస్సామీ బ్రాహ్మణులు గోమాంసాన్ని కూడా భుజిస్తారట. ఉత్తరాధిన కాష్మీరీ పండిట్లు పూర్తి మాంసాహారులు. అలానే కొన్ని దేవాలయల్లో జంతుబలి ఇచ్చే సాంప్రదాయలు ఉంతుంటాయి. అంటే ప్రాంతీయపరంగా ఈ విషయమై హిందూ ధర్మంలో భేదాలు ఉన్నాయా?
VVS
కలియుగంలో వైదిక మతంతో పాటు బౌద్ధ జైనుల ప్రభావం వచ్చినది. వారు అహింసను పరమ ధర్మము అన్నారు. ఇది అందరికీ నచ్చినది. అనేక కులాల వారు శాకాహార నియమం ఏర్పరచుకొన్నారు. మానవ వికాస పరిణామక్రమంలో శాకాహారమే శ్రేష్ఠమైనది అని అనేకులు గుర్తించారు. Man has greater relationship to a monkey than to a tiger. He is not designed to be a carnivorous animal. There are two major classes of Brahmins - పంచ ద్రావిడులు (గుజరాత్, మహారాష్ట్ర, కన్నడ, తెలుగు, తమిళ బ్రాహ్మణులు) శాకాహారులు. పంచ గౌడులు ( ఉత్తర, తూర్పు దేశాల వారు, వంగ, కళింగ, కన్యాకుబ్జ, కాశ్మీర మత్స్యమాంసాలు పూర్తిగా వర్జింపలేదు).
Vaddadi Satyanarayana Murty IF THESE REPLIES OF SRI SARMA, CAN CATCH THE ATTN OF SRI SUBRAHMANYAM, EO,TTD, HE MAY RECOMMEND SRI SARMA TO SVBC ..THE NAME OF SRI SARMA..IN THE PROGRAMME OF DHARMA SANDEHALU..TO REPLY THE DOUBTS OF DEVOTEES...THE PAGES IN FB, TIRUMALA TIRUPATI VAIBHAVAM, TT LORD VENKATESWARA ETC MAY TAKE IT TO THE NOTICE OF TTD/SVBC..IT WILL BE TO THE ADVANTAGE OF MANY DEVOTEES........murty
Vvs Sarma I know Sri LV Subrahmanyam very well but I am not a Malladi or Chaganti, or Samavedam who are authorities on scriptures. I am just a curious enquirer into the contemporary relevance of Sanatana Dharma offering essentially my engineering view.and picking up few pearls from our Guruji Sri K Sivananda Murty garu.

No comments:

Post a Comment

The Structure of the Universe (Vedic) - Viswaroopa - K. Sivananda Murty Preface 2

https://www.facebook.com/vallury.sarma/posts/616984388338978 The Puranas speak of individuals going up and down between these proximate...