వాసుదేవరావు గారు - మీ ప్రశ్న పరంపరకు విపులంగా జవాబులియ్యాలి. అది ఒక వ్యాఖ్యలో కుదరదు.
వీటన్నిటికీ జవాబులు మన సనాతనధర్మం లోనే దొరుకుతాయి. సమయంచూచుకొని ప్రయత్నిస్తాను.
భగవంతుడు అనేకమా? సృష్తికర్తలు వేరు, వేరా? ఈ ప్రపంచంలోని జీవ రాశులను వివిధ ఖండాలని, వివిధ ప్రజలని, వేరు వేరు సృష్తికర్తలు సృజించారా? అసలు, భగవంతుడికి మతమేంటి? ఏ భగవంతుడు తనకు ప్రచారం కావాలని అడిగాడు? ప్రతి మనిషిలోను భగవంతుడుని చూడమనే సనాతన ధర్మాన్ని మించినది మరోకటి కనిపించదే. భగవంతుడికి ఒక మతం అంటకట్టి ప్రచారం చేసే ఎవరు కూడా నీలోనే భగవంతుడ్ని చూడమని చెప్పరెందుకు? కేవలం ఒక మతానికి చెందిన ప్రజలే ప్రపంచమంతట ఉంటే ఆ మతమే గొప్పదన్నదే సిద్ధాంతమైతే, ఆ మతాలు లేనప్పుదు ప్రపంచం లేదా, మనుషులు లేరా, జీవనం లేదా? మంచి భగవంతుడు, చెడ్డ భగవంతుడు ఉంటారా? మా దేవుడు, మీ దేవుడు అని వేరు వేరుగా ఉన్నారా? ఈ చరా చర జగత్తులో ఉన్న 84 లక్షల జీవ రాశులలొ ఉన్న ఒకే ఒక్క తేడా ఆడ, మగ. ఆకలి, నిద్రా, భయం, మైధునం అనే లక్షణాలు జీవ కోటి అంతటికి సమానమే. ఈ 84 లక్షల జీవరాసులలొ మనిషికి మాత్రమే ఆలొచించగలగే శక్తిని, విచక్షణని, మాట్లాడగల శక్తిని అదృష్టాన్ని ప్రసాదించాడు. కాని మనిషి మాత్రం జ్ఞానసముపార్జన పేరుతో తన అజ్ఞానాన్ని పెంచుకునేందుకు మాత్రమే ప్రయత్నిస్తున్నాడు.
No comments:
Post a Comment